27 February 2019

సచార్ కమిటి రిపోర్టు తరువాత భారతీయ ముస్లింల పరిస్థితులలో పెద్దగా మార్పు రాలేదు. Post Sachar Report, Condition of Indian Muslims Unchanged'
2006 లో భారత  దేశంలోని  ముస్లింల సాంఘిక, ఆర్థిక మరియు విద్యా హోదా ను గుర్తించటానికి జస్టిస్ సచార్ కమిటీ ని కేంద్ర ప్రభుత్వం నియనించినది.  కమిటి నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ముస్లింలు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారు. వారి పరిస్థితి ఎస్.సి./ఎస్.టి. ల కన్నా హీనంగా ఉంది. అనేక రాష్టాల ముస్లింలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. అన్ని స్థాయిల్లో మరియు అన్ని రంగాలలోనూ ముస్లింలు అణగారి ఉన్నారు. కమ్యూనిటీ పరంగా  సామాజిక-రాజకీయ పరిధుల విషయంలో భారతదేశంలోని  ముస్లింల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. భారతదేశపు రిపబ్లిక్ ఏర్పడిన తరువాత కూడా ముస్లింలు సామాజిక-రాజకీయ వెనుకబాటుకు లోనై ఉన్నారు.

ఇటీవలి కాలంలో, ముస్లింలలో అణగారినతనం మరియు అభద్రత పెరిగింది. లవ్ జిహాద్, మత కలహాలు  మరియు గౌ రక్షణ పట్ల అనేక మంది అమాయక ముస్లింలు బలి అయినారు. గౌ విజిలెంట్స్ పేరుతో జరిగిన అల్లర్ల సంఘటనల వలన ఉత్తరాది రాష్ట్రాలలోని ముస్లిమ్స్ ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారి వ్యాపారాలు, ఆర్ధిక శక్తీ పూర్తిగా చిన్నా బిన్నం అయినది.. దేశం యొక్క వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా  ముస్లిమేతర ప్రాంతాలలో ముస్లింలకు గృహవసతి లబించుట లేదు.  పలితంగా ముస్లిం కమ్యూనిటీ లో ఘెట్టోటైజ్షాన్  ప్రక్రియ మరింత తీవ్రతరం అయినది.  

అంతేకాక, 2014 తర్వాత భారతీయ పార్లమెంటులో ముస్లిం మైనారిటీల ప్రాతినిధ్యం తక్కువ గా ఉంది. అక్షరాస్యత రేట్లు, పాఠశాలలు, పట్టభద్రుల శాతం, విషయంలో  ముస్లింలు, ఉన్నత వర్గ హిందువులు, హిందూ ఓబీసీలు మరియు ఇతర మత మైనారిటీల కన్నా వెనకబడి ఉన్నారు.  .

ఇతర సామాజిక సమూహాల కంటే ముస్లింలు  అధిక సంఖ్యలో భూములు కలిగి లేరు. చిన్న కమతాల విషయం లో  ముస్లింలు దళితుల తరువాత రెండవ స్థానంలో ఉన్నారు. భూమి యాజమాన్యం, సగటు భూమిని కలిగి ఉండటం మరియు సగటు భూమి సాగు వంటి వాటిలో ముస్లింలు ఇతర వర్గాల కన్నా  వెనుకబడి ఉన్నారు.

అంతేగాక, ధనవంతులైన భారతీయులలో ముస్లింల  ఉనికి నామ మాత్రంగా ఉంది.  ముస్లింలు అధికంగా అనధికారిక రంగం(informal sector) లో  కార్మిక శక్తి, చిన్న రైతాంగం, శిల్పకళా పరిశ్రమలు, చిన్న ఉత్పత్తి మరియు చిన్న వర్తకంలో labour force, small peasantry, artisanal industries, petty production and small trade ఉన్నారు. నిరుద్యోగం మరియు నెలవారీ తలసరి వినియోగ వ్యయం విషయంలో ముస్లిమ్స్ ఇతర సామాజిక సమూహాల కన్నా వెనుకబడి ఉన్నారు.

పోస్ట్ సచార్ ఎవాల్యుయేషన్ కమిటీ రిపోర్ట్ (2014), వైవిద్యం ఇండెక్స్ (2008) పై ఎక్స్పీట్ గ్రూప్ నివేదిక, ఇండియా మినహాయింపు నివేదిక India Exclusion Report (2013-14), 2011 సెన్సస్ మరియు తాజా ఎన్ఎస్ఎస్ఓ NSSO నివేదికలు  అందించిన సమాచారం ప్రకారం భారతీయ ముస్లింలు ఒక సాంఘిక - ఆర్థికంగా వెనుకబడిన సమాజం.

ముస్లింల సాంఘిక-రాజకీయ అణగారినతనం మరియు ఇస్లామోఫోబియా పెరుగుతున్న సందర్భంలో వారి సామాజిక-ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో, భారతీయ ముస్లిం సమాజం  కూడా సాంఘిక-ఆర్ధిక సమస్యలపై నిరంతర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ  ఉంది.

ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న  సమస్యలను  ప్రభుత్వ ఏజెన్సీలు మరియు రాజకీయ నాయకత్వం సరిగా అవగాహన చేసుకోలేదు.  తత్ఫలితంగా, ప్రభుత్వాలు ముస్లింల యొక్క నిజమైన సమస్యలను పట్టించుకోలేదు లేదా వాటిని తాత్కాలిక ఉపశమన మార్గాలు చూపటానికి ప్రయత్నిస్తున్నవి.
  
భారతీయ ముస్లింలు ఎదుర్కొంటున్న మరొక సమస్య  ప్రగతిశీల నాయకత్వం లేకపోవడం. సాంప్రదాయకంగా భారతీయ ముస్లింల సమస్యలు గుర్తింపుకు సంబంధించిన అంశాలకు (ఉదాహరణకు, ముస్లిం వ్యక్తిగత చట్టాలు, అల్పసంఖ్యాక విద్యా సంస్థలు, వివాదాస్పద రచయితల పట్ల ఫత్వాస్,) మరియు భద్రత (మత హింస నుండి నిరోధకత) కు మాత్రమె పరిమితం అయినవి.

వాస్తవానికి, భారత ముస్లింలలో కనిపించే సంప్రదాయక నాయకత్వం, సమానత్వం  ఆధునిక విద్య, ఆరోగ్యం, ఆదాయం, ఉపాధి మొదలైన డిమాండ్లను పరిష్కరించడానికి తగినంత మక్కువ చూపుటలేదు

ముస్లిం మైనారిటీల వాస్తవ సమస్యలను చూపటంలో మీడియా కూడా విఫలమైనది. భారతీయ ముస్లింల గుర్తింపును తప్పుగా చిత్రీకరించారు. తత్ఫలితంగా, ముస్లింలకు సంబంధించిన తప్పుడు అభిప్రాయాలు, దురభిప్రాయాలు, ముస్లిమేతరులలో ప్రభలినవి.


భద్రతాదళాలలో  ముస్లింల ప్రాతినిద్యం అతి తక్కువుగా ఉంది.  వాస్తవానికి భారతీయ ముస్లింలు సాపేక్షంగా పట్టణ సమాజం. కొన్ని పార్టిలు ముస్లింల పాలిట సంతృప్తి పరిచే విధానం అవలబిస్తున్నాయి అనే నిందిపూరితమైన  ప్రచారం ఉంది.
 
భారతీయ ముస్లింల యొక్క సామాజిక-సామాజిక పరిస్థితులు అలాంటి ప్రచారంలో పూర్తిగా నిజం లేదని తెల్పుతున్నాయి.

దళితులు మరియు ఆదివాసీలు కంటే చాలా విద్యాపరంగా మరియు ఆర్ధికంగా వెనుకబడిన సమూహాలలో భారతీయ ముస్లింలు ఒకరు. ప్రభుత్వo-నియమించిన కమిటీ నివేదికలు, సెన్సస్ డేటా, జాతీయ నమూనా సర్వేలు మరియు విద్యాసంబంధ అధ్యయనాలు దీనిని ధ్రువ పరుస్తున్నాయి.

భారతీయ ముస్లింలు పేదరిక సామాజిక-ఆర్ధిక గ్రూపుగా  గుర్తించగలిగినప్పటికీ, భారతదేశంలో ముస్లింల సామాజిక-ఆర్ధిక వెనుకుబాటు గురించి సమకాలీన రాజకీయలలో చర్చ లేదు.
ప్రాథమిక విద్య విషయం లో ముస్లింలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కన్నా వెనుక బడి ఉన్నారు మరియు ఉన్నత విద్యలో హిందూ ఉన్నత కులాలు  మరియు హిందూ OBC లకన్నా  వెనుకబడి ఉన్నారు.మరోవైపు, షెడ్యూల్డ్ కులాల కంటే ముస్లింలలో పేదరిక స్థాయిలు ఎక్కువగా ఉన్నవి.


అయితే గత పది సంవత్సరాలలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లిం ప్రాతినిధ్యం నెమ్మదిగా మరియు స్థిరమైన మెరుగుదలగా  ఉంది. 2006 సచార్ రిపోర్టులో, ముస్లింలు సగటున ఉద్యోగాలలో 3.4% మాత్రమే ఉన్నారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పధకం,మైనారిటీ  సంక్షేమ  శాఖ ప్రకటించిన పధకాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న రిజర్వేషన్స్  నెమ్మదిగా ముస్లింల స్థితిగతులను మేరుగు పరచడం లో కొంతవరకు విజయం సాధిoచినవి. ముస్లిం మైనారిటీల నిర్మాణాత్మక సమస్యల పరిష్కారం కోసం భారతియులందరూ శ్రద్ధ వహించాలి.  ముస్లింల సంతులిత వికాసంలో ప్రబుత్వం, అన్ని రాజకీయ పక్షాలు, పౌర సమాజం మరియు భారతీయులందరూ సహకారం అందించగలరని ఆశిద్దాము.

No comments:

Post a Comment