5 January 2023

ఒక భారతీయ ముస్లిం సైనికుడు యూనస్ ఖాన్ పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో తన తమ్ముడు యాకూబ్ ఖాన్ ను కాల్చిగాయపరిచినప్పుడు!

 


గతం లో పాక్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన సాహిబ్జాదా యాకూబ్ ఖాన్ బ్రిటిష్ ఇండియా లోని రాంపూర్‌లో నవాబ్ కుటుంబంలో జన్మించాడు యాకూబ్ ఖాన్ మరియు అతని అన్నయ్య యూనస్ ఖాన్ దేశ విభజనకు ముందు రోజులలో బ్రిటిష్ సైన్యంలో చేరారు. దేశ విభజన జరిగినప్పుడు, యాకూబ్ ఖాన్ పాకిస్తాన్ వైపు మరియు యూనస్ ఖాన్ భారత సైన్యం చేరారు.

 

1948 ఇండో-పాక్ యుద్ధంలో, కాశ్మీర్ సరిహద్దులో మేజర్లుగా తమ బెటాలియన్‌లకు నాయకత్వం వహిస్తున్న సోదరులు ముఖాముఖి తలపడ్డారు. భారత దేశానికి చెందిన యూనస్ ఖాన్, పాకిస్తాన్ కు చెందిన  యాకూబ్ ఖాన్‌పై కాల్పులు జరిపి గాయపరిచాడు. గాయపడిన సైనికుడు మరెవరో కాదు, తన సొంత సోదరుడే అని తెలుసుకున్నప్పుడు యూనస్ ఖాన్ ఇలా అరిచాడు: 'ఛోటే,  దుఃఖించకు. మనము సైనికులం. మనం మన బాధ్యతను నిర్వర్తించాము.

 

ఇండియన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన కల్నల్ మానెక్‌ షా  ఈ సంఘటన గురించి తెలుసుకున్నప్పుడు, యూనస్ ఖాన్‌ను మెచ్చుకున్నాడు మరియు అతని సోదరుడి పట్ల విచారం వెలుబుచ్చాడు.  

 

యాకూబ్ ఖాన్ పెళ్లిలో 36 ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరులు కలకత్తాలో కలుసుకున్నారు.

ఒకరినొకరు కౌగిలించుకుని విలపించారు.

 

మేజర్ యూనస్ ఖాన్, బ్రిగేడియర్ ఉస్మాన్ మరియు హవల్దార్ అబ్దుల్ హమీద్ నుండి కార్గిల్ అమరవీరుల వరకు భారతీయ ముస్లింల త్యాగాలు వారి దేశభక్తికి నిదర్శనాలు.

 

-మూలం: ది సియాసత్ డైలీ,  డిసెంబర్ 31, 2022

No comments:

Post a Comment