21 January 2023

వార్షిక విద్యా స్థితి నివేదిక 2022 అభ్యాస అంతరాలను విస్తృతం చేస్తోంది Annual Status of Education Report 2022 flags widening learning gaps

 

వార్షిక విద్యా స్థితి నివేదిక 2022 నివేదిక ప్రకారం, 16 సంవత్సరాలలో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు/ఎన్రోల్మెంట్  గణనీయంగా పెరిగింది. పిల్లల ప్రాథమిక అక్షరాస్యత స్థాయిలు పెరిగాయి. పిల్లల పఠన సామర్థ్యంతో పోలిస్తే సంఖ్యా నైపుణ్యాలు మరింత క్షీణించాయి మరియు 2012కి ముందు స్థాయికి పడిపోయాయి.

వార్షిక విద్యా స్థితి నివేదిక అనేది 616 గ్రామీణ జిల్లాల్లో నిర్వహించబడిన గృహ సర్వే మరియు 3 నుండి 16 సంవత్సరాల వయస్సు గల 6.9 లక్షల మంది పిల్లలను వారి పాఠశాల స్థితిని రికార్డ్ చేయడానికి మరియు వారి ప్రాథమిక పఠనం మరియు గణిత నైపుణ్యాలను అంచనా వేయడాన్ని  కవర్ చేస్తుంది.

COVID-19 కారణంగా మూసివేసిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభించబడినందున, విద్యార్థుల నమోదులు మహమ్మారి కంటే ముందు స్థాయికి పెరిగాయి, అయితే పఠనం మరియు అంకగణితంలో ప్రాథమిక నైపుణ్యాల  అభ్యాస అంతరం పెరిగింది, అనేక సంవత్సరాల అభివృద్ధి వెనుకబడినది అని, వార్షిక విద్యా స్థితిని నివేదిక కనుగొoది.  

(ASER) 2022, ను NGO ప్రథమ్ విడుదల చేసింది.

మహమ్మారి సమయంలో పాఠశాలలు మూసివేయబడినప్పటికీ, 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారి నమోదు గణాoకాలు  2018లో 97.2% ఉండగా 2022లో 98.4%కి పెరిగాయని జాతీయ స్థాయి అధ్యయనం చూపిస్తుంది.  

ASER అనేది 616 గ్రామీణ జిల్లాల్లో నిర్వహించబడిన గృహ సర్వే మరియు 3 నుండి 16 సంవత్సరాల వయస్సు గల 6.9 లక్షల మంది పిల్లలను వారి పాఠశాల స్థితిని రికార్డ్ చేయడానికి మరియు వారి ప్రాథమిక పఠనం మరియు అంకగణిత నైపుణ్యాలను అంచనా వేయడాన్ని  కవర్ చేస్తుంది. నివేదిక నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకురాబడింది మరియు 2020 మరియు 2021లో పాఠశాలల మూసివేత ప్రభావం, అలాగే 2022లో పిల్లల పాఠశాలలకు తిరిగి రావడం వంటి వాటిని నమోదు చేసింది. (3-16 ఏళ్లు) వయస్సు గల పిల్లల నిష్పత్తి (ప్రస్తుతం నమోదు చేసుకున్న వారు కూడా) 2018లో చివరి పూర్తి స్థాయి ASER సర్వే నిర్వహించినప్పుడు ఉన్న 2.8% నుండి 1.6%కి కనిష్ట స్థాయికి పడిపోయింది.

73.4%. ప్రభుత్వ పాఠశాలల్లో 2018లో 65.6% ఉన్న పిల్లల సంఖ్య 2022లో 72.9%కి పెరిగింది, ఇది 2006 నుండి 73.4% వద్ద ఉన్న విద్యార్థుల నమోదులో స్థిరమైన తగ్గుదల ను అధిగమించినది.

పాఠశాలల పట్ల తల్లిదండ్రులు మరియు విద్యార్థులలో ఉత్సాహం కనిపించినప్పటికీ, పిల్లల ప్రాథమిక అక్షరాస్యత స్థాయిలు పెద్దగా దెబ్బతిన్నాయి, వారి పఠన సామర్థ్యంతో పోలిస్తే సంఖ్యా నైపుణ్యాలు మరింత తీవ్రంగా క్షీణించాయి మరియు 2012కి ముందు స్థాయికి పడిపోయాయి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో 3వ తరగతిలో,  2వ తరగతి స్థాయిలో చదవగలిగిన పిల్లల శాతం 2018లో 27.3% నుండి 2022లో 20.5%కి పడిపోయింది. ఈ క్షీణత ప్రతి రాష్ట్రంలోనూ, అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు రెండింటిలోనూ కనిపిస్తుంది.

2018 స్థాయిల నుండి 10 శాతం పాయింట్ల కంటే ఎక్కువ క్షీణతను చూపుతున్న రాష్ట్రాల్లో కేరళ (2018లో 52.1% నుండి 2022లో 38.7%కి), హిమాచల్ ప్రదేశ్ (47.7% నుండి 28.4%కి), హర్యానా (46.4% నుండి 31.5% వరకు). ఆంధ్రప్రదేశ్ (22.6% నుండి 10.3% వరకు) మరియు తెలంగాణలో (18.1% నుండి 5.2% వరకు) ఉన్నాయి, ఈ రాష్ట్రాలు 2018లో ఎక్కువ పఠన స్థాయిలు కలిగి  ఉన్నాయి.

జాతీయంగా, కనీసం 2వ తరగతి పాఠ్యాంశాన్ని చదవగలిగే ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతిలో చేరిన పిల్లల నిష్పత్తి 2018లో 50.5% నుండి 2022లో 42.8%కి పడిపోయింది. 15 శాతం పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ తగ్గుదలని చూపుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రాప్రదేశ్ (2018లో 59.7% నుండి 2022లో 36.3%కి), గుజరాత్ (53.8% నుండి 34.2%కి), మరియు హిమాచల్ ప్రదేశ్ (76.9% నుండి 61.3%కి) ఉన్నాయి. 

8వ తరగతి విద్యార్థులకు ప్రాథమిక పఠన సామర్థ్యం తక్కువగా ఉంటుంది, 2022లో కనీస ప్రాథమిక వచనాన్ని basic text చదవగలిగే 69.6% మంది పిల్లలు 2018లో 73%కి పడిపోయారు.

ASER పఠన పరీక్ష పిల్లలు క్లాస్1 స్థాయి లో అక్షరాలు, పదాలు, సాధారణ పేరా మరియు  క్లాస్ 2 స్థాయిలో  కద(స్టొరీ) ని చదవగలరో లేదో అంచనా వేస్తుంది.

3వ తరగతి విద్యార్థులు కనీసం వ్యవకలనం subtract చేయగలిగిన వారు 2018లో 28.2% నుండి 2022లో 25.9%కి పడిపోయారు. జమ్మూ & కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ 2018 స్థాయిల కంటే కొంచెం మెయింటెయిన్ లేదా మెరుగ్గా ఉన్నప్పటికీ, 10 శాతం కంటే ఎక్కువ పాయింట్లు తమిళనాడులో పడిపోవటం కనిపిస్తుంది. భారతదేశం అంతటా 5వ తరగతిలో విభజనను division చేయ గల పిల్లల నిష్పత్తి కూడా 2018లో 27.9% నుండి 2022లో 25.6%కి కొద్దిగా తగ్గింది.

ప్రాథమిక అంకగణితం basic arithmetic లో 8వ తరగతి విద్యార్థుల పనితీరు మరింత వైవిధ్యంగా ఉంటుంది. జాతీయంగా, విభజన division చేయగల పిల్లల నిష్పత్తి కొద్దిగా పెరిగింది, 2018లో 44.1% నుండి 2022లో 44.7%కి పెరిగింది. ఈ పెరుగుదల బాలికలు,పిల్లలు చేరిన  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుగా ఉండగా,  అయితే బాలురు మరియు పిల్లలు చేరిన ప్రైవేట్ పాఠశాలలు మాత్రం 2018 స్థాయిల కంటే క్షీణతను చూపుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి పిల్లలు 2018లో ఉత్తరప్రదేశ్ (32% నుండి 41.8% వరకు) మరియు ఛత్తీస్‌గఢ్ (28% నుండి 38.6% వరకు) కంటే 2022లో గణనీయంగా మెరుగ్గా ఉన్నారు, అయితే పంజాబ్‌లో (58.4% నుండి 44.5%)మాత్రం  గణనీయంగా అధ్వాన్నంగా ఉన్నారు..

ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్ పొందే విద్యార్థుల నిష్పత్తి 2018లో 26.4% నుండి 2022లో 30.5%కి పెరిగింది.  విద్యార్ధులు సాధారణంగా ట్యూషన్ క్లాసులలో గణితం మరియు సైన్స్ చదవడానికి ఎంచుకుంటారు

11-14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల బడి బయట out of school ఉన్న వారి శాతం 4.1% నుండి 2%కి తగ్గినట్లు కనుగొంది. 2018లో 13.5%తో పోలిస్తే 2022లో 7.9%గా ఉన్న 15-16 సంవత్సరాల వయస్సు గల బాలికలలో పాఠశాలలో నమోదు చేసుకోని not enrolled బాలికల నిష్పత్తిలో తగ్గుదల ఉంది. 

ది హిందూ పత్రిక సౌజన్యం తో

 

 

No comments:

Post a Comment