25 November 2015

భారతదేశం లో శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చేసిన మొట్ట మొదటి ప్రధాన మంత్రి, నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రు.
భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు బలమైన ప్రజాస్వామ్య సౌధం నిర్మాణo/అభివృద్ధి చేయుటకు శాస్త్రీయ దృక్పథం ను అభివృద్ధి చేసినారు.

మొదటి ప్రధాన మంత్రి పండిట్ నెహ్రు తన  డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంధం లో  శాస్త్రీయ దృక్పథం ఆలోచన ను అభివృద్ధి పరిచినారు. శాస్త్రీయ దృక్పదం అనునది  200 సంవత్సరాల క్రిందటే యూరోప్ లో ఉన్నప్పటికి అది అంతగా ప్రజాదరణ పొందలేదు. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు  శాస్త్రీయ కమ్యూనిటీ అందులో  ఒక ప్రధాన పాత్ర కొనసాగిస్తుదని నెహ్రు నమ్మేను. నెహ్రూ, స్వాతంత్ర్యానికి ముందు ఈ భావన మరియు దాని అనుభంద వాదనలు  ప్రవేశ పెట్టినప్పటికీ అవి   పరిపక్వం పొందుటకు వంద సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. శాస్త్రం మరియు సాంకేతికత రూపొందించడంలో సైద్ధాంతిక ఆధారాన్ని అందించింది. ప్రజలు మానవ  సమానత్వం, లింగ సమానత్వం, అందరికీ విద్య, ఉపాధి సమాన అవకాశం, వంటి భావాలను, ఆలోచనలను  ప్రజలు వారి జ్ఞానం ఆధారంగా చర్చించడటం  ప్రారంభించారు. 

1857 లో   భారతీయులు బ్రిటిష్ వారి నుంచి  మనం చిన్న గుర్తిoపులం కాబట్టి వారిని ఎదుర్కొన లేము అన్న విషయాన్నీ గ్రహించాము. కాబట్టి కొత్త గుర్తింపు “ఇండియన్ గుర్తింపు" యొక్క అవసరం తెలుసుకొన్నాము. ఈ గుర్తింపుకు అవసరమయిన అంశములు నాలుగు దశల్లో  ప్రారంభమైనవి. రాజా రామ్ మోహన్ రాయ్ మరియు రాజేంద్రలాల్ మిట్టల్ వంటి సంస్కర్తలు ప్రారంభించిన దశ, ఆ తరువాతి దశలో JC బోస్, ప్రఫుల్ల చంద్ర రే వంటి వ్యక్తులు ఉద్భవిoచారు. ఈ సమయం లో  శాస్త్రీయ దృక్పథం పేరు వినిపించినది కాని అది పూర్తిగా అభివృద్ధి దశ లోకి రాలేదు. శాస్త్రవేత్తలు హేతుబద్దంగా   ప్రశ్నించడం ప్రారంభించగానే, యువత రాజకీయ విముక్తి మరియు  దేశం యొక్క శాస్త్రీయ మనస్సు కొరకు ఆందోళన ప్రారంభించారు. దేశ చరిత్ర లో 1948 ఒక మైలురాయి గా ఉంది. మహాత్మా గాంధీ మనం  అంటరానితనం పాటించుతాము  కాబట్టి దేవుడు మనలను శిక్షించడానికి   భూకంపం పంపాడని  బీహార్లో చెప్పినప్పుడు ఠాగూర్ దానికి వ్యతిరేకంగా ప్రతిస్పదించారు. వారు  విభిన్న దృక్పధాలు కలిగి ఉన్నప్పటికీ, మహాత్మా గాంధీ మరియు ఠాగూర్ వంటి వ్యక్తులు భారత ఆధునికత యొక్క గొప్పతనానికి పునాది వేసారు. ఈ దశ లోనే  నెహ్రూ ప్రాముఖ్యత పొందారు.

1958 సైంటిఫిక్ పాలసీ బిల్ నెహ్రూ పార్లమెంటులో ఉంచారు. అప్పటిదాకా ఏ దేశం ఏ అలాంటి తీర్మానం చేసింది లేదు అని  శాస్త్రవేత్తలు  చెప్పారు. మొత్తం రిజల్యూషన్, నెహ్రూ చదివారు  అది సంపూర్ణంగా  చర్చించబడింది మరియు పార్లమెంట్ లో ఏఒక్క సభ్యుడు దానిని వ్యతిరేకించి లేదు పైగా అది ఎందుకు ఆలస్యమైంది అని  ప్రశ్నించారు. 

మత విశ్వాసాలలో అశాస్త్రియత ఉన్నాదని నేడు ఎవరైనా అంటే శాసన సభలు  స్థoభించి పోతాయి.   దశాబ్దాలపాటు నిర్మించిన  ఏకాభిప్రాయం మరియు నిగ్రహాన్ని మనం నేడు పాటించుట  లెదు. ఈ రోజు మనం ప్రజాస్వామ్య నిర్మాణాలను నాశనం చేస్తున్నాము  మరియు శాస్త్రీయ దృక్పద భావన పై   రాజకీయ నాయకత్వం దాడి చేసే  పరిస్థితిలో ఉన్నాము. మనం ఏకాభిప్రాయన్ని  తిరిగి నిర్మించాల్సిన  లేదా తిరిగి రూపొందించాల్సిన  పరిస్థితిలో ఉన్నాము. దేశంలో ప్రతి మేదావి  నిర్భయంగా  మానవులుగా మన హక్కుల కోసం ఒక స్వతంత్ర ప్రజాస్వామిక దేశం లో పోరాడటానికి మరియు శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చేయడానికి  సిద్దంగా ఉండాలి.

Top of Form
నెహ్రూ కాలంలో భారతదేశం యొక్క పాలన రూపు రేఖలు మారిపోయాయి ఒక ఆధునిక పద్ధతిలో వలసవాదం యొక్క 200 సంవత్సరాల గతం ను అనుసంధించడం జరిగింది. సైన్స్, సాంకేతిక, చారిత్రక మరియు కళా సంస్థలను  నెహ్రూ పరిపాలన విభాగాలుగా  ఏర్పాటు చేసారు. భారతదేశ జాతీయ విముక్తి పోరాటం నుండి వచ్చిన సంప్రదాయం కొనసాగించారు.

నేడు చరిత్రను తిరిగి చీకటి పరిస్థితిల లోనికి తీసుకు వెళ్లే  ప్రయత్నాలు జరుగు తున్నాయి.  శాస్త్రీయ దృక్పదం పై విమర్శలు వేలు బడుతున్నాయి. వాటిని ఎదుర్కొని భారత దేశాన్ని నూతన శాస్త్రీయ మార్గం  లో నడిపించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. ప్రజలో శాస్త్రీయ దృక్పదం పెరగాలి  అందుకు గాను సమాజం లో ఉన్న మూడ నమ్మకాలను విడనాడాలి. ప్రాధమిక విధులలో భాగంగా ఉన్న శాస్త్రీయ వైఖరిని, ఆలోచనలను ప్రజలు పాటించాలి మరియు అభివృద్ధి పరచాలి. 
Top of Form

No comments:

Post a Comment