14 January 2017

ఆహార పదార్ధాలు హాలాల్ మరియు హారాం








ఆహారం మానవుల మరియు జంతువుల ప్రాథమిక అవసరాలలో ఒకటి మరియు  ఆహారం లేకుండా  ఏ జీవి జీవించడం  అసాధ్యం. కానీ ఆహార వినియోగం లో మానవులకు  మరియు జంతువులకు  మధ్య భారీ వ్యత్యాసం ఉంది.  జంతువుల వలే కాక   మానవులు ఆహారాన్ని భుజించడం లో కొన్ని నియమాలు, నిబంధనలు మరియు పరిమితులు అనుసరిస్తారు. ఇస్లాం దానిని నమ్మిన విశ్వాసుల  కోరకు ఆహార వినియోగం కొరకు కొన్ని నియమాలు, నిబంధనలు మరియు పరిమితులు ఏర్పరిచింది. నిషిద్ధం కానివి  (హలాల్) మరియు నిషిద్ధమైనవి  (హరం ) మద్య ఒక స్పష్టమైన వ్యత్యాసం ను ఏర్పరిచింది.  కానీ ఆహార పదార్దాలు విక్రయించే దుకాణాలు ప్రస్తుత మార్కెట్లో ఇస్లాం ద్వారా ఏర్పరచిన నియమాలు, నిబంధనలు మరియు పరిమితులు నిర్వహించుట  లేదు. ఇస్లామిక్ బోధనలు యొక్క కాంతి లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆహార వస్తువులను  విశ్లేషించుదాము.

మీరు  వినియోగించే పదార్ధాలు ఏమిటి? అవి  ఎలా ఉత్పత్తి అవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం  ప్రయత్నిద్దాము. వినియోగదారులకు కర్మాగారాలు మరియు సంస్థలు అందించిన ఆహార వస్తువుల గురించి ప్రజలకు అవగాహన కల్పించటానికి ఒక మంచి ప్రయత్నం చేద్దాము. ఆహార పదార్ధాలు ఉత్పత్తి మరియు తయారీ లోకి వెళ్ళి పరిశిలించుదాము. ఆహార పదార్ధాలలో మిక్కిలి గా వాడబడే ఆగ్రిగేత్స్ అండ్ అడ్డిటీస్ (aggregates and additives) పరిశీలించుదాము. కొన్ని ఆహార పదార్ధాల ఉత్పత్తిలో  నిషిద్దం మరియు దాగి ఉండి వస్తువుల గురించి  వినియోగదారులకు జ్ఞానం కల్పించుదాము.

వినియోగించే వస్తువుల ఉత్పత్తిలో ఇస్లామిక్ బోధనలు ద్వారా రుపొందించబడిన నియమాలు మరియు నిబంధనలు తెలుసు కొందాము. వినియోగ వస్తువుల తయారీ లో వాడబడే అక్రమాలను  అన్-ఇస్లామిక్ మరియు అనైతిక మార్గాలను తెలుసుకొందాము. ఇస్లాం ఆహార ప్రయోజనం కోసం వినియోగించే  ఒక జంతువు ఖుర్బానీ కోసం కొన్ని నిబంధనలను విధించింది. కానీ కొన్నిసార్లు ఈ నియమాలు పెద్ద హోటళ్లు అనుసరించటలేదు లేదా ఇస్లాం చే నిషేధించబడిన వాటిని ఆహార వస్తువుల ఉత్పత్తి మరియు వినియోగం లో ఉపయోగిస్తారు. ఉడా:చూయింగ్ గమ్, మిఠాయి, జామ్, పండు రసం, ఐస్ క్రీమ్, గుళికలు మరియు ప్రోటీన్ షాంపూ, మొదలైన వాటిని  జెలటిన్ తో తయారవుతాయి. "జెలటిన్ పందులు, ఇతర పశువుల చర్మం మరియు స్నాయువుల నుంచి ఉత్పత్తి చేస్తారు. కాబట్టి అవి ఇస్లాం దృష్ట్యా హరం.

ఇస్లామిక్ బోధనల ప్రకారం వినియోగ వస్తువులు మూడు రకాలు: 1.అనుమతించబడినవి  (హలాల్), 2. నిషేదింపబడినవి (హరం ) మరియు 3.అనుమానాస్పదంగా ఉన్నవి. పవిత్ర ఖురాన్ ఆదేశాల ప్రకారం హలాల్ మరియు హరామ్ అల్లాహ్ ప్రకటించారు. ఎవరికి అందులో  జోక్యం చేసుకొనే  హక్కు లేదు. కొన్ని సందేహాస్పద అంశాలు ఉన్నాయి. అవి హరం లేదా హలాల్ అని స్పష్టం కాదు. ఈ అంశాలను గురించి కొన్ని పరిశోధనలు  మరియు అధ్యయనం అవసరం.

ఇస్లాం హరం అని ప్రకటించిన ఆహార వస్తువుల లో ఆధ్యాత్మిక మరియు హేతుబద్ధ కోణం ఉంది. ఉదాహరణకు పంది ని హరం అని నిర్ణయిoచేందుకు శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు ఉన్నవి. అదేవిధంగా ఆరోగ్యానికి మంచివి కానివి మరియు హాని కల్గించి మానవుల మరణానికి కారణం అవుతున్న కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇస్లామిక్ బోధనల ప్రకారం వాటిని హరం గా ప్రకటించి వాటి వినియోగం వలన కలిగే దుష్పరిణామాలను పేర్కొనాలి.

మనం తినే వాటిని గురించి తెలుసుకోవడం  అవసరం.  స్వచ్ఛమైనదా లేదా? హలాల్ లేదా హారామా? అది ఆరోగ్యానికి మంచిదా లేదా? మన ఆరోగ్యాన్ని మన ఆత్మ ప్రభావితం ను ప్రభావితం చేస్తుందా" మనం తినే ఆహార శుభ్రత పై మన  శరీరం మనస్సు మరియు ఆత్మ యొక్క పరిశుభ్రత ఆధారపడి ఉంటుంది." వినియోగించే ఆహార పదార్ధాల గురించి సునిశిత మరింత అధ్యయనం చేయాలి.


హలాల్ గా నిర్ణయిoచబడిన ఆహార పదార్ధలనే తినాలి, హారం వస్తువులను వదిలి పెట్టాలి. 

No comments:

Post a Comment