21 April 2017

నాగరికత వికాసానికి ముస్లిం చేసిన సేవలు (Muslim Contributions to Civilization)

.

ఇస్లాం యొక్క ప్రముఖ విమర్శకుడు సామ్ హారిస్, ఇటీవలి వ్యాసంలో పాకిస్థాన్ విద్యా కార్యకర్త మాలాలా యూసఫ్ జాయిని "1,000 సంవత్సరాల్లో ముస్లిం ప్రపంచం నుంచి బయటకు వచ్చిన  గొప్పదనం" అని సూచించాడు. అనగా మలాలా తోటి ముస్లింలు వెనుకబడినవారు మరియు ఆమె దర్మం ఇస్లాం మార్పు లేదా పురోగతికి దోహదపడదు అని అర్ధము.

హారిస్, అతని లాంటి ఇతరుల నమ్మకాలకు విరుద్ధంగా ముస్లింలు నాగరికత అభివృద్ధి కి  విపరీతమైన కృషి చేసారు. నిజానికి ఇస్లాం ధర్మం జ్ఞానం కు అధిక ప్రాధాన్యత నిచ్చును. ప్రపంచ చరిత్రలో ప్రధాన ధోరణులను లేదా సంఘటనలను మర్చిపోయిన లేదా విస్మరించిన వ్యక్తులు "చారిత్రాత్మక స్మృతి“historical amnesia " తో  బాధపడుతున్నారని చెప్పవచ్చు. హారిస్ మరియు ఇతరుల చేత చేయబడిన కొన్ని సాధారణీకరణలు మరియు దురదృష్టాలను తొలగించాలని నేను ఆశిస్తున్నాను. ముస్లింలు శతాబ్దాల కాలం లో నాగరికతకు చేసిన సేవలను వివరిస్తాను.
1.విద్యారంగానికి చేసిన సేవలు Contributions to Education:
ప్రపంచవ్యాప్తం గా సార్వత్రిక విద్య కోసం  మాలాల చేసిన విజ్ఞప్తి వెనుక విద్య రంగంలో ముస్లింలకు   సుదీర్ఘ మరియు సగర్వమైన  చరిత్ర ఉంది. ఫాతిమా మరియు మిరియం అల్ ఫిర్హి అనే ఇద్దరు ముస్లిం మహిళలు, ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయo అల్-ఖరావయ్యిన్(Al-Qarawiyyin) ను 859 AD లో మొరాకో లోని ఫేజ్ నగరం లో స్థాపించారు. ఇక్కడ  అనేక సంవత్సరాలుగా విద్యార్థులు లౌకిక మరియు మతపరమైన అంశాలలో శిక్షణ పొందేవారు. వారి విద్యాబ్యాసం పూర్తి అయిన తరువాత   చివరిలో పరిక్షలు నిర్వహించి వారి ప్రతిభ   ఆధారంగా డిగ్రీలను ప్రదానం చేసేవారు. విద్యారంగం లో డిగ్రీలను ప్రధానం చేసే భావన ఫెజ్ నుండి అండలూసియా, స్పెయిన్ మరియు తరువాత ఇటలీ  లోని బోలోగ్నా విశ్వవిద్యాలయo మరియు ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ మరియు ఇతర ప్రదేశాలకు  వ్యాపించింది.
అండలూసియాకు చెందిన స్పానిష్ ముస్లింలు విద్యకు బలమైన మద్దతుదారులుగా ఉండేవారు  మరియు చీకటి యుగాలలో యూరప్ ను  కప్పి ఉంచిన అంధకార ముసుగును  తొలగించడానికి వీరు తోడ్పడ్డారు.  8వ మరియు 15వ శతాబ్దాల మధ్య అండలూసియా విద్య మరియు జ్ఞానాలకు ప్రపంచ కేంద్రంగా ఉంది. కార్డోబా, గ్రెనడా మరియు సెవిల్లె వంటి స్పానిష్ విశ్వవిద్యాలయాలు ముస్లిo ఆచార్యుల నుండి  విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకున్న క్రైస్తవ మరియు యూదు విద్యార్థులను కలిగి ఉన్నాయి. ముస్లిం స్పెయిన్లో అధ్యయనం చేయటానికి మహిళల ను ప్రోత్సహించారు. ఈ విద్యా వాతావరణం లేకుండా  సహనశీలత అనే భావన  నేడు "పాశ్చాత్య ప్రపంచం" ను చేరుకోనేది కాదు.  
2.తత్త్వ శాస్త్ర అభివృద్ధి కి చేసిన సేవలు (Contributions to philosophy):
8 వ శతాబ్దంలో గ్రీక్ తత్వశాస్త్రం యొక్క సంపుటాలను ముస్లిం పండితులు వారసత్వంగా పొందినప్పుడు ప్రపంచ నాగరికత అభివృద్ధి   మొదలైంది. ప్రాచీన గ్రీస్ గ్రంథాల జ్ఞానం ముస్లిం పండితులచే లాటిన్ నుండి అరబిక్ కు  అనువదించబడి  ప్రపంచ చరిత్రలో గొప్ప జ్ఞాన సంపదను  సృష్టించింది. ముస్లిం పండితులు సోక్రటీస్, అరిస్టాటిల్ మరియు ప్లాటో వంటి గొప్ప గ్రీకు తత్వవేత్తలను  ఐరోపా పండితులకు  అందుబాటులోకి తెచ్చారు.   గ్రీక్ తత్వశాస్త్రం ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించబడింది. ముస్లింలు ఐరోపా పునరుజ్జీవనోద్యమం మరియు జ్ఞానోదయం వెనుక ప్రధాన పాత్ర వహించారు. గ్రీకు తత్వశాస్త్రం ను పునరుత్థానం చేసి మత సిద్ధాంతాలతో మరియు రక్తపాత అంతర్గత విభేదాలతో నిండి ఉన్న  ఐరోపా ఖండానికి  నూతన జీవితాన్ని ఇచ్చారు.
అనేకమంది ముస్లిం పండితులు జ్ఞానం సంపాదించుట  తమ జీవిత లక్ష్యoగా  చేసుకున్నారు. 11 వ మరియు 12 వ శతాబ్దాలలో తోలి ఇస్లామిక్ తత్వశాస్త్రాన్ని విప్లవాత్మకమైనదిగా రూపొందించిన అల్-గజాలి ఒక సూఫీ ముస్లిం.  గ్రీకు తత్వశాస్త్రం యొక్క "ఆధ్యాత్మిక" లేదా "మతపరమైన" వివరణగా వర్ణించబడే నియోప్లాటోనిజం అభివృద్ధికి ఇతను  సహాయపడినాడు.  అల్-ఘజాలి రచనల  సమయంలో ముస్లిం తత్వవేత్తలు, పురాతన గ్రీస్ యొక్క ఆలోచనల గురించి చదివారు. అయితే ఈ ఆలోచనలు సాధారణంగా ఇస్లామిక్ బోధనలకు  విరుద్దo గా ఉన్నాయి. అల్-ఘజాలి అరిస్టాటిల్ తర్కం మరియు నియోప్లాటోనిక్ మార్గాల పద్ధతులను అనుసరింఛి   ఈ అంశాలను ఇస్లామిక్ తత్వం తో  సంయోగం చేసేందుకు దోహదపడినాడు.
ఇబ్న్ ఖాల్డన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ముస్లిం ఆలోచనాపరులలో ఒకరు. 14 వ మరియు 15 వ శతాబ్దాల వరకు ఉన్న గొప్ప చరిత్రకారులలో ఒకరిగా మరియు సామాజిక శాస్త్రాల స్థాపకుడిగా గుర్తింపు పొందిన ఇబ్న్ ఖాల్డన్ ముకద్దీమా రచించినాడు. ఆధునిక సుపరిపాలన మార్గం సుగమం చేశాడు.  "ప్రజల మంచి కోసం సార్వభౌమత్వం ఉంది మానవులు  కలిసి జీవించాల్సిన అవసరం నుండి  ఒక పాలకుని  యొక్క అవసరం ఏర్పడుతుంది. పాలకుడు శాంతి బద్రతలను పరిరక్షించబోతే సమాజం ముక్కలుగా విరిగిపోతుంది అని అంటాడు. ఆంగ్ల సామాజిక ఒడంబడిక వాదుల పై ప్రభావం కలిగినాడు.
3.ఆరోగ్య సంరక్షణకు కృషి Contributions to health care:
విద్య మరియు విశ్వవిద్యాలయ వ్యవస్థతోపాటు, ముస్లింలచే నాగరికతకు అందించబడిన వైవిధ్యమైన సహకారం  వైద్యం. ఈజిప్ట్ లోని కైరోలో 872 లో, అహ్మద్ ఇబ్న్ తులున్ హాస్పిటల్ స్థాపించబడినది. ఇది ఇతర ఇతర ఇస్లామిక్ ఆసుపత్రులకు మార్గదర్శకం.  ఈ వైద్యశాలలో ఎటువంటి వివక్షత లేకుండా అందరికి ప్రవేశం కల్పించబడినది.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి  కూడా  ప్రవేశం ఉంది. .
తులన్ వైద్యశాల స్థాపించబడిన  వంద సంవత్సరాలు తర్వాత. "శస్త్రచికిత్స యొక్క తండ్రి" గా పిలువబడే అల్-జహ్రావి అనే ఒక సర్జన్ మరుసటి 500 సంత్సరాల పాటు యూరోపియన్ సర్జన్లకు మార్గదర్శిగా ఉపయోగపడిన గ్రంధం రచించినాడు.  స్కాల్పెల్స్, ఎముక కోసే రంపం , మరియు ఫోర్సెప్స్ వంటి అల్-జరావి యొక్క శస్త్రచికిత్సా పరికరాలు ఇప్పటికీ ఆధునిక శస్త్రవైద్యులు ఉపయోగిస్తున్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ను  నిర్వహించిన మొట్టమొదటి శస్త్రవైద్యుడు అల్-జహ్రావి.

విలియం హార్వే కనుగొన్న రక్త ప్రసరణ గురించి ముస్లిం మతాధికారి ఇబ్న్ నఫిస్ దాదాపు మూడు వందల సంవత్సరాల ముందు 13 వ శతాబ్దంలో వివరించినాడు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించడానికి శరీరంలో ఒక యాంటీజెనిక్ పదార్ధం తయారుచేసే టీకా పద్దతిని  ముస్లింలు మొదట రూపకల్పన చేసారు. టీకా  యొక్క పరిచయం ఇంగ్లాండ్ లో టర్కిష్ రాయబారి యొక్క భార్య 1724 లో యూరప్ కు తీసుకువచ్చింది.

శరీర శుబ్రతకు ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముస్లిం శాస్త్రవేత్తలు సోడియం హైడ్రాక్సైడ్ మరియు వేజటబుల్ నూనె ను సుగంధ ద్రవ్యాలతో కలిపి సబ్బు తయారు చేసారు. ఇంగ్లాండ్ కు షాంపూ పరిచయం చేసినది ముస్లింలే.

4.విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కి  తోడ్పాటు Contributions to science:
ఖగోళ శాస్త్రం అభివృద్ధి ముస్లిం ఖగోళ శాస్త్రవేత్తల కృషి ఎంతైనా ఉంది. 9వ శతాబ్దం ప్రారంభంలో, ఖలీఫా అల్-మౌంమ్ బాగ్దాద్ లో   మరియు డమాస్కస్ లో ఖగోళ వేధశాలను స్థాపించాడు. ఐదు వందల సంవత్సరాల తరువాత, 1420 లో ప్రిన్స్ ఉల్గ్ బే, సమార్ఖండ్ లో  ఒక భారీ వేధశాలని నిర్మించారు, తరువాత 1577 లో ఇస్తాంబుల్ లో  సుల్తాన్ మురాద్ III మరొక అబ్జర్వేటరీ నిర్మించినాడు.  
.ఒట్టోమన్లు ​​ ప్రధాన ఖగోళ వేదశాలలు కలిగి ఉన్నారు. 16వ శతాబ్దపు  ఒట్టోమన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు తక్కి అల్-దిన్ ఖగోళ పట్టికలు మరియు ఖగోళ పరిశీలనా సాధనాలను సృష్టించాడు. ఇది నక్షత్రాల అక్షాలు మరియు వాటి మధ్య ఉన్న దూరాన్ని కొలిచేందుకు సహాయపడింది.
ఆధునికకాల రసాయన శాస్త్రజ్ఞులు ఉపయోగించే అనేక ప్రాధమిక ప్రక్రియలు మరియు ఉపకరణాలను కనిపెట్టడం ద్వారా ముస్లింలు రసాయనిక  శాస్త్ర వికాసానికి తోడ్పడ్డారు.

ఆధునిక కెమిస్ట్రీ స్థాపకుడైన జబీర్ ఇబ్న్ హేయాన్, ఆండలూసియాలో 8 వ మరియు 9 వ శతాబ్దాలలో, స్వేదనం ద్వారా రసాయన శాస్త్రంలోకి రసవాదాన్ని  రూపాంతరం చెందించడం లేదా బాయలింగ్ పాయింట్స్ లో మార్పులు చేయడం ద్వార ద్రవాలను  వేరుచేయడం చేసాడు.  స్ఫటికీకరణ, ఆవిరి మరియు వడపోత ప్రక్రియలను అభివృద్ధి చేయటంతోపాటు, అతను సల్ఫ్యూరిక్ మరియు నైట్రిక్ ఆమ్లం కూడా కనుగొన్నాడు. చరిత్రకారుడు ఎరిక్ జాన్ హోల్మియార్డ్ జబీర్ ఇబ్న్ హేయన్ యొక్క పని ఆదునిక రసాయన వేత్తలైన రాబర్ట్ బోయెల్ మరియు ఆంటోయిన్ లావోయిసియర్ కంటే మిన్న అని పేర్కొన్నారు.

9 వ శతాబ్దంలో ఆండలూసియా యొక్క ఒక ముస్లిం ఇంజనీర్ ఇబ్న్ ఫిర్నాస్ ప్రపంచం లో మొట్టమొదటి విమాన చోదకుడు. 852 లో స్పెయిన్లోని కార్డోబాలోని పెద్ద మస్జిద్  యొక్క మినార్ నుండి చెక్క పట్టీలకు కట్టిన వదులైన వస్త్రాన్ని ఉపయోగింఛి దూకుతాడు. ఆవిధంగా  అతను మొదటి పారాచూట్ ను సృష్టించాడు.

ముస్లింలు ఫ్లైయింగ్ మరియు ఏవియేషన్ శాస్త్రానికి దగ్గిరగా ఉండే   భౌతిక శాస్త్ర అధ్యయనం, లో నిపుణులు. తన కృషికి 1979 నోబెల్ బహుమతిని పొందిన మొహమ్మద్ అబ్దుస్ సలాం, ఒక పాకిస్తాని సైద్ధాంతిక (theoretical) భౌతిక శాస్త్రవేత్త. అతను సైద్ధాంతిక భౌతిక శాస్త్ర రంగంలో, ప్రత్యేకంగా విద్యుదయస్కాంత మరియు బలహీనమైన శక్తులను ఏకీకృతం చేసారు.


ఇంతవరకు నేను ముస్లింలు నాగరికత అభివృద్ధికి అందించిన రచనల ఉపరితలం భాగాన్ని మాత్రమే సృజించాను.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు  ముస్లింలు వెనుకబడిన మరియు దుష్ప్రవర్తన కలవారు అన్న భావన తొలగించడానికి  ఈ రచనల గురించి నేర్పించాలి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు విద్య, ఔషధం మరియు ఇతర విజ్ఞానశాస్త్రాలలో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి.  జ్ఞానం కోసం మార్గదర్శకులుగా వారి సాంప్రదాయాన్ని కొనసాగిoచాలి.

No comments:

Post a Comment