6 February 2018

స్వీయ శుద్దీకరణ: పవిత్ర హజ్ యొక్క ఉద్దేశం (Self-purification: Purpose of Holy Hajj)



Image result for kaaba.

పవిత్ర రమదాన్ సమయంలో ఉపవాసం లాగా  హజ్ స్వీయ శుద్దీకరణ సాధించడానికి చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయత్నం. ప్రతి ముస్లిం పరలోక జీవితం కోసం మరణం ముందు పవిత్ర హజ్ యాత్ర  చేయవలసి ఉంటుంది. ఇది ప్రపంచంలోని ప్రతి ముస్లిం యొక్క బాధ్యత. ముస్లింలు హజ్ జరుపడం లో  చాలా జాగ్రత్త వహించాలి. అనేకమంది ముస్లింలు ప్రతి సంవత్సరం పవిత్ర హజ్ చేస్తారు. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితాన్ని అనుసరించే ముస్లింలు జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ చేస్తారు.

ముస్లింలు ఉమ్రాను అనేక సార్లు చేయవచ్చు.  హజ్ ను ఒక సారికే   పరిమితం చేయాలి. అలా చేయటం వల్ల ఇతర ముస్లింలు కూడా హజ్ చేయగలుగుతారు మరియు  అల్లాహ్ ఆశీర్వాదాలను సంపాదిoచగలరు. ఛారిటీ(దాతృత్వం) ఇస్లాం లో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లాహ్ అనంత  కరుణామయుడు,ఆపార కృపాశీలి.

పవిత్ర హజ్ యాత్ర:
తగిన ఆర్థిక స్తోమత కలిగిన ముస్లింలు తమ జీవితంలో ఒకసారి హజ్ నిర్వహించాల్సిన విధి ఉంది. హజ్ అనేది ఇస్లాం ధర్మం యొక్క నాలుగు మూల స్తంభాలలో ఒకటి. ప్రవక్త ముహమ్మద్ (స) తన జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ నిర్వహించారు.

ప్రపంచమంతా ఉన్న ముస్లింలు ముఖ్యమైన హజ్ యాత్రా ప్రక్రియను  తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. హాజ్ తర్వాత వారు ఆదర్శ ముస్లింలుగా, ఉత్తమమైన మానవులుగా జీవించడానికి మరియు ముస్లిం సమాజానికి ప్రయోజనకరంగా ఉండటానికి ఇది సహాయ పడుతుంది.

పవిత్ర హజ్ అనేది మతపరమైన ప్రయోజనాల కోసం భూమిపై జరిగే అతిపెద్ద మానవ సమావేశం. ముప్పై  లక్షల మంది నమోదిత యాత్రికులు ప్రతి సంవత్సరం ఈ యాత్రలో పాల్గొంటారు. మక్కా లో ముస్లింలు ప్రతి సంవత్సరం హజ్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది ముస్లిం యాత్రికులు మినా లోయలో హజ్ యాత్ర తుది దశలో నిర్ణిత రోజున సైతాన్ పై రాళ్ళు విసురుతారు.

ప్రపంచం లోని 189 దేశాల నుండి వివిధ వయస్సు గల యాత్రికులు, సాతానుకు ప్రాతినిధ్యం వహించే రాతి స్తంభాల పై  గులకరాళ్ళను, "అల్లాహు అక్బర్ (దేవుడు గొప్పవాడు) అని విసురుతారు. వారు ఒక స్తంభము నుండి తరువాతి స్తoభం వరకు తమ దేశ జాతీయ జండాలతో  వరుసలో కదులుతారు. సాతానుకు ప్రాతినిధ్యం వహించే మూడు స్తంభాల వద్ద భద్రతా దళాలు మరియు ప్రథమ చికిత్స బృందాలు అప్రమతం గా ఉంటాయి. ఈ సంవత్సరం హజ్ యాత్ర కోసం 1,68,000 పోలీసు అధికారులు మరియు పౌర రక్షణ సిబ్బంది పనిచేస్తున్నారు.  రాళ్ళ విసరటం కోసం యాత్రికుల బృందాలకు నిర్దిష్ట సమయాలను కేటాయించారు.

హజ్ యాత్ర పూర్వాపరాలు :
630 CE లో, ఇస్లాం ధర్మ ప్రవక్త ముహమ్మద్ (స) మదీనా  నుండి తన అనుచరులతో  మక్కాకు హజ్ యాత్ర చేసారు. ఇది ముస్లింలు చేసిన మొట్టమొదటి హజ్ మరియు మొహమ్మద్ ప్రవక్త (SAW) చేత నిర్వహించబడిన ఏకైక హజ్. వారు కాబాను శుద్ధి చేసి, దాని లోపలి  విగ్రహాలను నాశనం చేసారు  మరియు దానిని అల్లాహ్ మందిరంగా పునర్నిర్మించారు. అప్పటినుండి హజ్ ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో ఒకటిగా మారింది

ప్రవక్త ముహమ్మద్ (స)దైవ వాణి ని పొందక పూర్వం తన జీవితం లో ఉమ్రాః అనేక సార్లు చేసారు.  చారిత్రాత్మకంగా చూస్తే ముస్లింలు అనేక ఇతర గొప్ప నగరాల్లో సమావేశమయి, ఆ తర్వాత మక్కా వైపు సామూహికంగా హజ్ యాత్రకు  వెళ్లటం ఆచారం. కైరో మరియు డమాస్కస్ అటువంటి  అత్యంత ప్రసిద్ధ సమావేశ స్థలాలు. కైరోలో, సుల్తాన్ ప్రముఖ గేట్ బాబ్ జువెల యొక్క వేదికపై నిలబడి, ఈజిప్ట్ నుండి అధికారికంగా వార్షిక హజ్ ను యాత్రను ప్రారంభిస్తాడు.

యాత్రికులు హజ్ యాత్రా సమయంలో ఉన్న ప్రత్యేక ఆధ్యాత్మిక స్థితికి ఇహ్రాం (Ihram)  అని పేరు పెట్టబడింది. హజ్ సమయంలో, పురుష యాత్రికులు ఇహ్రంలో తెల్లటి  రెండు షీట్లను కలిగి ఉండే వస్త్రం, ఒక జత చెప్పులు ధరిస్తారు.  మహిళలు  హిజబ్ తో సాధారణ నమ్రత కలిగిన దుస్తులు ధరిస్తారు.

ఇహ్రం అల్లాహ్  ముందు అందరి  భక్తుల సమానత్వం చూపించడానికి ఉద్దేశించబడింది: ఇహ్రం పూర్వపు పాపముల నుండి క్షమాపణకు చిహ్నంగా ఉంది. ఇహ్రంలోకి మారడానికి నియమించబడిన ప్రదేశంను  మిఖత్ అని పిలుస్తారు. ఇహ్రాం  ధరించినప్పుడు, యాత్రికులు క్షౌరo,  గోళ్ళను కత్తిరించుట , పరిమళం, కలహా పడుట, లైంగిక సంబంధాలు నేరుపుట, మొక్కలను నరికివేత లేదా నష్టపరచటం, అడవి జంతువులను చంపడం లేదా హాని చేయడం ఆయుదాలు ధరించటం మొదలైన పనులు చేయరాదు. 

సాతాను పై రాళ్ళూ రువ్వే ఆచారం సాధారణంగా నిర్జనమయిన మినా లోయలో వార్షిక హజ్  సమయంలో మాత్రమే ఉంటుంది.  ఈద్ అల్-అదా సెలవు దినoన  విశ్వాసకులు అతిపెద్ద స్తంభము, జమత్త్ అల్-అకాబా (Jamrat al-Aqaba) పై  గులకరాళ్ళు రువ్వటం ద్వారా ప్రారంభిస్తారు.

సాతాను రాయి తో అనుబంధం కలిగిన మీనా  హుజ్ యాత్ర లో అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యంత సమస్యాత్మకమైన దశ. అక్కడ జరిగే తోక్కుసలాటలను, నివారించటానికి రాళ్ళు విసరే  ప్రాంతం విస్తరించబడింది. సౌదీ అథారిటీ మూడు స్టోనింగ్ సైట్ల చుట్టూ ఒక ఐదు అంతస్తుల స్థాయి నిర్మాణం నిర్మించారు. రద్దీ నివారించేందుకు ఒక  దిశలో కదలటానికి మాత్రమే యాత్రికులకు అనుమతి ఉంటుంది. హజ్ సమయంలో అలసిపోవటం లో  ఒక తీపి అనుభూతి ఉందని యాత్రికులు ఒప్పుకుంటారు. అరాఫత్  పర్వతంపై నిలబడి ప్రవక్త మొహమ్మద్ (స) తన చివరి ఉపన్యాసం ఇచ్చారు.

హజ్ అనేది ముస్లిం ప్రజల సంఘీభావం మరియు అల్లాహ్ కు తమను తాము  సమర్పణ చేయడం చూపుతుంది. ఇస్లామీయ క్యాలెండర్ యొక్క 12 వ మరియు చివరి నెల ధు అల్-హిజ్జా యొక్క 8 నుండి 12 వ రోజు వరకు హజ్ జరుగుతుంది. ఐక్యత యొక్క చిహ్నం గా హజ్ యాత్రికులు సాధారణంగా సమూహాలలో ప్రయాణిస్తారు.

ప్రతి హజ్ యాత్రికుడు కాబా చుట్టూ ఏడు సార్లు అపసవ్య దశలో ప్రదక్షిణ చేస్తారు. అల్-సఫా మరియు అల్-మర్వా కొండల మధ్య ముందుకు-వెనుకకు పరిగిడతారు.  జమ్-జం బావి నీరు త్రాగుతారు,  అరాఫత్ పర్వతం యొక్క మైదానాలకు వెళ్లతారు  మరియు మీనాలో  సైతాన్ పై  రాళ్ళు విసురుతారు. ఆ పై యాత్రికులు వారి తలలు గొరిగించుకొంటారు, జంతు బలి యొక్క ఆచారాన్ని నెరవేరుస్తారు మరియు ఈద్ అల్ అధా యొక్క మూడు రోజుల పండుగను జరుపుకుంటారు.

హజ్ ఇస్లాం యొక్క చివరి మూలస్తంభం మరియు ముస్లింలకు తప్పనిసరి. ఈ భౌతిక ప్రపంచంలో  హజ్ చేసేటప్పుడు ముస్లింలు హృదయపూర్వకంగా, భయభక్తులతో  చాలా జాగ్రత్తగా ఉండాలి. హజ్ అనేది భౌతిక ప్రపంచం ను ఆకట్టుకోవడానికి ఒక ప్రదర్శన కారాదు. పవిత్ర హజ్ యాత్రికులు, యాత్రకు ముందు మరియు తరువాత మతపరమయిన  ఆధ్యాత్మికత కలిగి ఉండాలి. హజ్ అనేది  సంపద యొక్క ప్రదర్శన కాదు.

హజ్ నిర్వహించిన ముస్లింల ప్రవర్తన సద్ప్రవర్తనగా ఉందాలి అది   ఇస్లాం మరియు ముస్లిం సమాజానికి మంచి చేసేటట్లు ఉండాలి. ఇస్లాం మరియు ముస్లిం సమాజానికి ప్రేరణ కావాలి. ముస్లింలు పవిత్ర హజ్ కోసం డబ్బు సరిగ్గా సంపాదించాలి. సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ మనల్ని రక్షించి, ఆశీర్వదించుగాక !

No comments:

Post a Comment