24 December 2018

ప్రాచిన భారత-అరబ్ ప్రపంచం మద్య సాహిత్య, కళ. శాస్తీయ రంగాలలో సహకారం (SCIENTIFIC AND ACADEMIC INTERACTION BETWEEN INDIA AND THE ARAB WORLD)


.

అరబ్ ప్రపంచానికి  భారతదేశానికి మద్య పురాతన కాలం నుండి అనగా  5000 సంవత్సరాల నుండి మంచి సంభంధాలు  కొనసాగుతున్నాయి. హరప్పా మరియు మొహెంజొదారో నాగరికతలతో అరేబియాకు  సన్నిహిత సముద్ర మరియు వ్యాపార సంబంధాలు ఉన్నాయని పురావస్తు త్రవ్వకాల ద్వారా తెలుస్తున్నది.


హరప్పా సివిలైజేషన్ కు మరియు దిల్మున్ సొసైటీ కు మద్య వ్యాపార సంభందాలు ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి. ఇస్లాం ఆవిర్భవించక  పూర్వం అరబ్ వ్యాపారులు అలెగ్జాండ్రియా ద్వారా గుజరాత్లోని బరూచ్,  దక్షిణాదిలోని పాండిచేరి మరియు మధ్యధరా సముద్రంలోని పలు ప్రాంతాలతో   వ్యాపారాలు చేసేవారు.


దక్షిణ భారతదేశం తో కన్నా ఉత్తర భారత దేశం తో అరబ్ సంబంధాలు బిన్నమైనవి. ఉత్తరాదిన అరబ్బులు దండయాత్రదారులుగా ఉన్నారు.  దక్షిణాన ప్రయాణికులు, వర్తకులు, మత ప్రచారకులు  గా వారు వచ్చారు దక్షిణాదిన ఇండో-అరబ్ సంబంధాలు స్నేహపూరితoగా కొనసాగినవి.  ఈ స్నేహపూర్వక వర్తక సంభందాలు  సాంస్కృతిక మరియు  మేధో సంబంధాల వికాసానికి దారితిసినవి.  ఇరు  వైపుల  నుండి పండితులు మరియు సాంస్కృతిక వస్తువుల మారక ఉద్యమం కొనసాగినది. కొంతమంది భారతీయ విద్వాంసులు హదీథుల అధ్యయనo ప్రారంభాన్ని ప్రారంభించారు.7 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో మరియు ఉత్తర భారతదేశం లో  లో 8వ శతాబ్దంలో హదీసుల అధ్యయనం ప్రారంభ మైనది. 


క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి అల్-బెరూని (AL-Beruni (d.1048 A.D.) కాలం వరకు ఇస్లామిక్ పండితులు వారి రచనలలో, భారతీయ-అరబ్ సాంస్కృతిక సంబంధాలు గురించి ప్రస్తావించారు. అరబ్ రాజకీయ తత్వ విచారం  మరియు సంస్కృతి పురోభివ్రుద్దికి కి భారతీయ సహకారాన్ని  అక్షర రూపం ఇచ్చారు. భారతదేశం మరియు అరబ్ ప్రపంచం మధ్య ప్రయాణాలు కేవలం ప్రయాణీకుల మార్పిడి కోసం కాకుండా సాంస్కృతిపరం గా  కొనసాగినవి.  అరబ్లు మరియు భారతీయుల మధ్య ప్రత్యక్ష మరియు లోతైన సాంస్కృతిక, శాస్త్రీయ  సంబంధాలు ముఖ్యంగా 8 వ శతాబ్దం మధ్యభాగంలో అబ్బాసీడ్ కాలిఫేట్ కాలం లో గట్టి పునాదులతో  బలపడినవి.


ఈ కాలం లో  బలపడిన    సాంస్కృతిక సంబంధాలు  అనేక శతాబ్దాలు కొనసాగినవి. సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ పరస్పరం కొనసాగినది మరియు శాస్త్రాలు, కళలు, మతం, తత్త్వ శాస్త్రంలో గరిష్ట పరిజ్ఞానం వ్యాప్తి మరియు సామాజిక మరియు సాంస్కృతిక ఆలోచనలు మరియు విలువలు విస్తరణ చెందినవి. బాగ్దాద్ లోని అబ్బాసిడ్ కాలిఫేట్ కాలంలో  ప్రత్యేకించబడి హరూన్ అల్-రషీద్, కాలం లో అనేక భారతీయ గ్రంధాలు ప్రత్యేకించి  గణితశాస్త్రం మరియు ఖగోళశాస్త్రo, ఔషధ విజ్ఞాన శాస్త్రం  అరబిక్లోకి అనువదించబడ్డాయి.


పురాతన కాలం లో భారతదేశం విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం మరియు సాహిత్యంలో మిగతా ప్రపంచం కన్నా చాలా ముందు ఉంది. చదరంగం భారతియులచే ముందు  కని పెట్టబడినది. భారతదేశం మరియు అరబ్ ప్రపంచం మధ్య సంబంధాల ఫలితంగా గొప్ప మేధో వారసత్వం అరబ్బులకు  పరిచయం అయినది.  భారతదేశం పట్ల అరబ్బులకు  అత్యంత అదిక గౌరవ అభిప్రాయం ఉంది.  ఇస్లాం ధర్మం పెరుగుదల తరువాత మేధో ఉత్సుకత మరియు   విజ్ఞాన శాస్త్రాల అభ్యాసన ఆసక్తి   అరబ్బులలో సహజంగానే  పెరిగినది. వారు భారతదేశ మేధో వారసత్వం ముఖ్యంగా ఖగోళ శాస్త్రం, గణితం, ఔషధం, తత్వశాస్త్రం, జ్ఞానం మరియు సాహిత్యం అబ్యాసనం చేయదలిచారు.


భారతదేశం ఇండస్ లోయ సంస్కృతి కాలం నుండి దాదాపు 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. శతాబ్దాలుగా విజ్ఞానం ఇక్కడ వికసించినది. 11 వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన అల్-బరూని విజ్ఞానం యొక్క వివిధ శాఖలు అనగా తత్వశాస్త్రం, వైద్యం, గణితం,ఖగోళశాస్త్రం, తర్కశాస్త్రం, పదకోశం, నాటకం, కల్పన, కవిత్వం, పరిపాలన మరియు వివాహం గురించి తన రచనలలో ప్రస్తావించాడు.  8 వ శతాబ్దం ఆరంభం నుండి ముస్లింలు వీటి అన్నింటియందు ఆసక్తి చూపారు.


ప్రముఖ  అబ్బాసిద్ ఖలీఫాలు, హరూన్ అల్-రషీద్ మరియు మమున్, గత వారసత్వం ముఖ్యంగా భారతీయుల మరియు గ్రీకుల గురించి తెలుసుకోవడానికి అకాడమీ(బైతుల్-హిక్మా) ని ఏర్పాటు చేశాడు.వారు భారత్ నుండి గణితం, ఔషధం, ఖగోళ శాస్త్ర పండితులను ఆహ్వానించారు మరియు వాటి అధ్యయనంలో ఆసక్తి చూపించారు. నేడు ప్రపంచానికి తెలిసిన అరబిక్ అంకెలు భారతీయ మూలాలను కలిగి ఉన్నవి. భారతీయ తత్వశాస్త్రం నుండి జైమిని మీమాంస, లోకాయుత, చార్వాక వాదాలను  మరియు ఉపనిషత్తులలోని  వేదాంత సారాన్నిఅరబ్బులు  గ్రహించారు.


ఇస్లాం యొక్క పెరుగుదల తర్వాత క్రమంగా అరబ్బు పండితులు  అరబిక్ లోనికి  శాస్త్రీయ ఆలోచనలను మరియు జ్ఞానాన్ని అనువదించడం ప్రారంభించారు, అయితే ఇది తఫ్సిర్, హదీసులు, ఫిఖ్ మరియు చరిత్రకు  మాత్రమె పరిమితం అయినది. ఈ కాలంలో ఔషధం మరియు కెమిస్ట్రీ అందు ఆసక్తి చూపిన  ఏకైక పాలకుడు ఖాలిద్ బిన్ యజీద్ బిన్ మువాయీ. బాగ్దాద్లో అబ్బాసీడ్ ఖలిఫాత్ స్థాపించిన తరువాత  అబ్బాసిద్ ఖలిఫా మన్సూర్ విజ్ఞాన శాస్త్రాలలో విశేష ఆసక్తిని ప్రదర్శించినాడు.


ఒక పండితుని  నాయకత్వంలో గణిత శాస్త్రవేత్తల బృందo బాగ్దాద్ చేరునది. వారు  సంస్కృత పుస్తకం “సూర్య సిద్ధాంతo” తమ వెంట తెచ్చారు. వారిని ఖలిఫా  సగౌరవంగా ఆహ్వానించినాడు. ఖలీఫ్ ఒక గణిత శాస్త్రజ్ఞుడు, ఇబ్రహీం అల్-ఫజారీ సహాయంతో ఈ గ్రంధ  అనువాదంను పరిశీలించాడు. ఖలీఫా మన్సూర్ సింధ్ నుండి వచ్చిన ఒక దౌత్యబృందాన్ని  ఆదరించాడు వారిలో గణిత శాస్త్రం మరియు ఖగోళశాస్త్రంపై నిష్ణాతులైన అనేక భారతీయ  పండితులు కలరు.వారు గణిత శాస్త్రం మరియు ఖగోళశాస్త్రంపై , అనేక పుస్తకాలు ఖలీఫా కు అందించిరి.


ఈ రచనలు ఖలీఫా ఆదేశాల పై తరువాత పండితుల సహాయంతో అరబిక్లోకి అనువదించబడ్డాయి. ఈ క్రమంలో ఎనిమిదవ శతాబ్దం మధ్య నుండి, ఇండో-అరబ్ శాస్త్రీయ సహకార యుగం ప్రారంభమైనదని  చెప్పబడింది.  వాస్తవానికి బాగ్దాద్లో ప్రవేశపెట్టిన భారత శాస్త్రీయ సాహిత్యం మౌర్యల మరియు గుప్తుల  కాలానికి చెందినది.

భారత సంస్కృత శాస్త్రీయ సాహిత్యం బాగ్దాద్ లో అందుబాటులోకి వచ్చింది.  ప్రముఖ అరబ్ రచయిత అల్ జహీజ్ ప్రకారం అనేక పండితులు మరియు మన్కా, బల్లా, బాజ్గార్, ఫల్బర్ఫాల్ మరియు సింధ్బాద్ లాంటి వైద్య వేత్తలు  యాహ్యా బిన్ ఖాలిద్ ఖాలిద్ అల్ బర్మాకీ ద్వారా బాగ్దాద్ కు  ఆహ్వానించబడ్డారు


అబ్బాసిడ్ ఖలీఫాలు  బాగ్దాద్ లో  బైతుల్ హిక్మాను స్థాపించిరి. దానిలో పనిచేసే విద్వాంసులు ప్రపంచం లోని అన్ని ప్రాంతాల  గ్రంధాలను, ఆలోచనలను మరియు శాస్త్రీయ విజ్ఞానాన్ని  అరబిక్ లోకి అనువదించసాగారు. పురాతనమైన అనేక భారతీయ, గ్రీక్ మరియు చైనీస్ క్లాసిక్ గ్రంధాలూ అరబిక్లోకి అనువదించబడినవి.


ఈ కాలంలో ముస్లిం ప్రపంచం పురాతన మెసొపొటేమియన్, రోమన్, చైనీస్, ఇండియన్, పెర్షియన్, ఈజిప్షియన్, నార్త్ఆఫ్రికన్, గ్రీకు మరియు బైజాంటైన్ నాగరికతల  నుంచి సేకరించిన జ్ఞానాన్ని సంగ్రహించి, గణనీయంగా అభివృద్ధి చేసింది.
అల్-మమున్ బైతుల్ హిక్మా (వివేకం యొక్క హౌస్)ను స్థాపించాడు.
ఇది లైబ్రరీ, అకాడమీ మరియు అనువాద బ్యూరో గా పనిచేసినది. ఇది  క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దం మొదటి సగం లో స్థాపిచిన అలెగ్జాండ్రియన్ మ్యూజియం  లాంటి చాలా ముఖ్యమైన విద్యాసంస్థ.

బాగ్దాద్ కు సమాంతరంగా, మక్కా నగరం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా పనిచేసింది సంప్రదాయం గా అరేబియాలో మక్కా తీర్థయాత్ర ఆలోచనలు మరియు వస్తువుల మార్పిడి కి సంబంధించి ఒక స్థావరంగా మారింది. ముస్లిం వ్యాపారుల ప్రభావం ఆఫ్రికన్-అరేబియా మరియు అరేబియా-ఆసియా వాణిజ్య మార్గాల్లో అపారం. అరబ్-ఇస్లామిక్ నాగరికత వారి నౌకాయాన మార్గం చుట్టూ అభివృద్ధి చెంది  విస్తరించింది. 8వ శతాబ్దం చివరిలో భారత సంస్కృత గ్రంధం సిద్ధాంత ద్వారా ఖగోళ శాస్త్రం అరబ్ ప్రపంచంలో ప్రవేశపెట్టబడినది. ఈ పుస్తక అనువాదంతో, అరబ్ శాస్త్రవేత్తలు ఖగోళశాస్త్ర  పరిణామాల గురించి తెలుసుకున్నారు.

భారతీయ ఖగోళ శాస్త్రంను  అరబ్బులు ఎక్కువ కృషి మరియు ఆసక్తితో అధ్యయనం చేశారు. ఆ సమయంలో అరబ్ ప్రపంచంలో ప్రవేశపెట్టిన ఇతర సంస్కృత ఖగోళ రచనలు: ఆర్యబట్టు(అరబిక్ లో  అర్జభద్);  చేత రచింపబడిన ఆర్యబట్టియం,  బ్రహ్మగుప్తుని (అరబిక్ లో అల్-అర్ఖండ్) ఖండఖద్యక. అరబ్ యాత్రికుడు అల్-బరూని భారతీయు ఖగోళ శాస్త్రం లో అత్యంత జనాదరణ గురించి కొన్ని గణనీయమైన వివరణలను అందించాడు.


అబ్బాసిద్ ఖలీఫా  మన్సూర్ కాలంలో ఖగోళ శాస్త్రం అరబ్ ప్రపంచం లో బాగా ప్రాచుర్యం పొందింది. అతను బాగ్దాద్ నగరాన్ని ఖగోళశాస్త్ర నియమాల ప్రకారం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు


అనేక మంది అరబ్ ఖగోళ శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రంలో భారతీయ రచనల అధ్యయనం చేసారు మరియు అనువాదం చేశారు. వారి సొంత పరిశీలనల ఆధారంగా వాటిని అభివృద్ధి చేసారు. కితాబ్-అల్-జిజ్ (Kitab al-Zij) అనే గ్రంధాన్ని ఇబ్రహీం బిన్ హబీబ్
అల్-ఫజారీ, సూర్య సిద్ధాంతం ఆధారంగా రచించినాడు.  మొహమ్మద్ బిన్ ముసా అల్ ఖవారిజ్మి మరియు హబాష్ బిన్ అబ్దుల్లా అల్-మర్వాజీ అనేక ఖగోళ శాస్త్రవేత్తలను  తయారు చేసారు. అరబ్ ఖగోళశాస్త్రం యొక్క అభివృద్ధిలో భారతదేశం యొక్క సహకారం గణనీయం. అనేక సంస్కృత ఖగోళశాస్త్ర పదాలను  అరబ్ ఖగోళ శాస్త్రవేత్తలు అరబిక్ లోనికి అనువదించారు మరియు  తమ రచనలలో విరివిగా ఉపయోగించారు:


ఖగోళశాస్త్రం వలె, భారతీయ గణిత శాస్త్రం కూడా 8 వ శతాబ్దం చివరలో అరబ్లకు పరిచయం చేయబడింది. ఇబ్రహీం బిన్ హబీబ్ అల్-ఫజరి స్వయంగా అనేక సంస్కృత గణిత గ్రంధాలను అనువదించాడు. ఈ రచనల ద్వారా, భారతీయ సంఖ్యా వ్యవస్థ మరియు సున్నా భావన అరబ్ ప్రపంచంలోకి ప్రసిద్ధి చెందింది.

అరబ్బులు భారతీయుల నుండి అంకెలు నేర్చుకున్నారు మరియు వాటిని యూరోపియన్ల కు పరిచయం చేసారు.  అనేక గణితవిజ్ఞాన ఆవిష్కరణలను అరబ్బులనుండి యురోపియన్లు నేర్చుకున్నారు. అరబిక్ లో అనువదింపబడిన సూర్య  సిద్ధాంతం మరియు  దానిలోని  13 వ మరియు 24 వ అధ్యాయాలలో గల సంఖ్యల ప్రస్తావన కలదు అవి  అరబ్ గణిత శాస్త్రoలో తొలిసారిగా  సంఖ్యలను ప్రవేశపెట్టినవి.


భారతీయ ఔషధ విజ్ఞానం తో అరబ్బులకు తోలి నుండి పరిచయం ఉంది.  ప్రారంభం నుండి మక్కా యొక్క ఖురేష్ తెగ ఔషధ మరియు మసాలా దినుసుల వ్యాపారాలను  నిర్వహించెది. వారికి భారతదేశం మరియు పర్షియాతో తరచుగా వర్తక  సంబంధాలు ఉండేవి.  అరబ్ వ్యాపారులకు బహుశా మందుల వాడకం  వైద్య, ఔషధ, మరియు వాటి బొటానికల్ మరియు ఖనిజ వివరణలు కూడా తెలుసు.
 

గ్రీకు భాష నుండి అరబిక్ బాష లోనికి  కొన్ని వైద్య పుస్తకాల అనువాదం జరిగింది
ఇది 8 వ శతాబ్దం ప్రారంభంలో ఉమయ్యద్ కాలంలో ప్రారంభమై బాగ్దాద్ లోని అబ్బాసిడ్ ఖలిఫాత్  కాలంలో పూర్తిగా అభివృద్ధి చెందింది. భారతీయ వైద్య శాస్త్రం (ఆయుర్వేదం) అబ్బాసిద్ ఖలీఫాల మద్దతుతో అరబిక్లోకి అనువదించబడింది.


అరబ్ ప్రపంచంలో భారతీయ ఔషధం యొక్క పరిచయం కు సంబంధించి ఒక కథ కలదు
ఖలీఫా  హరున్ రషీద్ తీవ్రంగా అనారోగ్యం పాలైనప్పుడు మనకా Mankaఅనే  ఒక భారతీయ వైద్యుడు ఖలీఫాకు  చికిత్స చేశాడు మరియు అతని వ్యాధిని  నయం చేశాడు. బహుమతిగా అతను ఆనాటి ప్రసిద్ద బారమిక హాస్పిటల్ లో నియమించబడినాడు. అతను ఆ సమయంలో చాలా ప్రసిద్ధ వైద్యుడు, అతను అనేక వైద్య గ్రంధాలను అరబిక్లోకి అనువదించాడు  

అరబ్ ప్రపంచంలో విస్తృతమైన ప్రశంసలు పొందిన ఇతర భారతీయు వైద్యులు ఇబ్న్ దహ్న్, సాలిహ్. అరబిక్లోకి అనువదించబడిన ప్రసిద్ధ భారతీయ రచనలు చరక
సంహిత, శుసృత, ఆస్తాంకా హ్రిద్య, సింధ్సన్  (సిద్ధియోగ), నిదాన్ మరియు కితబ్
అల్-సుమ్న్(Charaka Samhita, Susrud, Astanka Hridya, Sindhsan (Siddhyoga), Nidan and Kitab al-Summ).

ఈ అనువాదాల్లో, రెండు ప్రత్యేకoగా  ప్రస్తావించవలసిన  అవసరం ఉంది.
ఒకటి శుసృద్ Susrud (అరబ్స్ దీనిని సస్రు అని పిలుస్తారు(Arabs called it Sasru)   ఇది 10 అధ్యాయాలను కలిగి ఉంది- ఇందులో అనారోగ్యం యొక్క లక్షణాలు మరియు దాని చికిత్స కోసం ఔషధ వివరాలు ఉన్నవి. మరొకటి భారతీయ వైద్యుడు చరకుని చేత రచింపబడిన   చరకా సంహిత. చరకా సంహిత మొదటి పెర్షియన్ లోకి అనువదించబడింది మరియు తర్వాత అబ్దుల్లా ఇబ్న్ ఆలీచే అరబిక్ లోనికి అనువదించబడింది.




నిడాన్ (Nidan) పుస్తకo 404 రోగ లక్షణాలు మాత్రమే వివరిస్తోoది కాని వాటి  చికిత్స కాదు.  వివిధ రకాల పాములు మరియు వాటి విషాలు, మందులు, గర్భిణీ స్త్రీలకు చికిత్స,
మత్తుపదార్థాలు, వ్యాధి మరియు ఔషధాలు, ఉన్మాదం మరియు హిస్టీరియా ప్రభావాలు మొదలగు వాటిపై రచనలు అరబిక్ లోనికి అనువదించబడినవి. మహిళల వ్యాధులపై  ఒక భారతీయ స్త్రీ వైద్యురాలు రుసా (Rusa) రచనలు కూడా అరబిక్లోకి అనువదించబడినవి


రిఫరెన్స్:

Ø వోహ్రా,  ఎన్ఎన్. హిస్టరీ, కల్చర్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా అండ్ వెస్ట్ ఆసియా, షిప్రా పబ్లికేషన్స్, ఢిల్లీ, 2003, పే. 2

Ø  అహ్మద్, మక్బుల్.Ø ఇండో అరబ్ రిలేషన్స్, ICCR, పాపులర్ ప్రకాషన్, బాంబే, 1969, p.16.

Ø నద్వి,  సయ్యద్ సులైమాన్. అరబ్-ఓ-హింద్ కే తాలెకాత్ (ఇండో-అరబ్ రిలేషన్స్), దర్ల్ ముసాఫిన్ అజమ్గర్, పే. 148.


Ø అహ్మద్, మక్బుల్.Ø ఇండో అరబ్ రిలేషన్స్, ICCR, పాపులర్ ప్రకాషన్, బాంబే, 1969, p-17
Ø నద్వి,  సయ్యద్ సులైమాన్. అరబ్-ఓ-హింద్ కే తాలెకాత్ (ఇండో-అరబ్ రిలేషన్స్), దర్ల్ ముసాఫిన్ అజమ్గర్, పే. 153.

Ø హిట్టి, P. K. హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, పాల్గ్రేవ్ మక్మిలాన్, న్యూయార్క్, 2002, పే. 310.


Ø అహ్మద్, మక్బుల్.Ø ఇండో అరబ్ రిలేషన్స్, ICCR, పాపులర్ ప్రకాషన్, బాంబే, 1969, పే. 10.

Ø నద్వి, సయ్యద్ సులైమాన్. అరబ్-ఓ-హింద్ కే తాలెకాత్ (ఇండో-అరబ్ రిలేషన్స్), దరుల్ ముసంఫ్ఫిన్, అజమ్గఢ్, pp. 130-131.


Ø అభయాంకర్, రాజేంద్ర M. వెస్ట్ ఆసియా అండ్ ది రీజియన్: డిఫైనింగ్ ఇండియాస్ రోల్, అకాడెమిక్ ఫౌండేషన్, న్యూఢిల్లీ, 2008, పే. 225





No comments:

Post a Comment