2 June 2019

డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 - ముస్లిమ్స్ మరియు మదరసాలు.

ఇటివల ట్విట్టర్ లో  డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2019 మొత్తం దేశం కోసం సిఫార్సు చేసిన మూడు భాషాల  ఫార్ములా కు వ్యతిరేకంగా దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడున  నిరసనలు  వ్యక్తమవుతున్నాయి. మూడు బాషల ఫార్ములా ఇంగ్లీష్, హిందీ మరియు ప్రాంతీయ భాషను  కలిగి ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు హిందీ భాషకు వ్యతిరేకంగా ఉన్నారు.  ప్రస్తుతం మనం డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2019 ముస్లింలు, ఉర్దూ మరియు మదరసాల పట్ల చేసిన  సూచనలను పరిశీలిద్దాము.


"ముస్లింలు మరియు ఇతర విద్యాపరంగా తక్కువ ప్రాతినిధ్యం కల మైనారిటీలు  పాఠశాల విద్యను పూర్తి చేయడానికి ప్రోత్సహించే " ఉద్దేశ్యంతో డ్రాఫ్ట్ పాలసీ సిఫార్సుల  ప్రకారం : "ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలలో నాణ్యత గల పాఠశాలలు ఏర్పాటు చేయబడతాయి, ఉర్దూ లేదా ఇతర స్థానిక భాషలను మాట్లాడటం మరియు రాయడం వచ్చిన వారిని వాటిలో ఉపాధ్యాయులుగా  నియమించడం జరుగుతుంది.ముస్లిం కమ్యునిటీ  మరియు ఉన్నత విద్యలో తక్కువ ప్రాతినిధ్యం కల ఇతర మైనారిటీల విద్యార్థుల సంఖ్య పెరగడానికి విజ్ఞానశాస్త్రం, గణితం మరియు కళ నేపథ్యాలతో పాటు, మూడు భాషాల  ఫార్ములా ప్రకారం, ఫౌండేషన్ అక్షరాస్యత మరియు సంఖ్యాతను (foundational literacy and numeracy) కల్పించడానికి బలమైన ప్రయత్నాలు చేయబడతాయి. అధిక సాంద్రత ప్రాంతాలలో   ఉన్న అన్ని భాషా మరియు మైనారిటీ గ్రూపులకు  మరియు విద్యాపరంగా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వర్గాల విద్యా పరిస్థితి మెరుగు పరచటానికి చర్యలు తిసుకోబడతాయి. ప్రత్యేకించి, ముస్లిం కమ్యూనిటి నుండి మరియు తక్కువ ప్రాతినిద్యం గల ఇతర మైనారిటీ వర్గ విద్యార్ధులందరికి ఉన్నత విద్యను ప్రోత్సహించటానికి గాను  నేషనల్ టెస్టింగ్ సర్వీస్ స్కోర్ల ఆధారంగా స్కాలర్షిప్లు  ఇవ్వబడతాయి. "


డిసెంబరు 15, 2018 న అప్పటి HRD మంత్రి ప్రకాష్ జవదేకర్  కు  డ్రాఫ్ట్ జాతీయ విద్యా విధానం-2019 సమర్పించబడింది.


" మా వివేచనలో ఉత్తమమైన ఒక విధానాన్ని సిద్ధం చేసేందుకు మేము ప్రయత్నించాము, ఇది విద్యాసంబంధ దృక్పదాన్ని మారుస్తుంది, తద్వారా మన యువతకు ప్రస్తుత మరియు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాము. మన దేశం యొక్క పెద్ద విద్యా సినారియో లో వివిధ అంశాలని కలుపుకోవటానికి బృందం లోని  సభ్యులు  ప్రతి ఒక్కరూ, వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా పనిచేసినాము. యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, ఎఫ్ఫోర్డ్బిలిటీ మరియు అకౌంటబిలిటీ( Access, Equity, Quality, Affordability and Accountability) మొదలగు మార్గదర్శక లక్ష్యాలపై ఈ పాలసీ స్థాపించబడింది. ప్రీస్కూల్ నుండి ఉన్నత విద్యా రంగం వైపు ద్రుష్టి సారించాము  మరియు ఒక పెద్ద చిత్రంలో భాగమైన సంబంధిత విభాగాలపై కూడా ద్రుష్టి పెట్టాము "అని డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఛైర్మన్, ఇస్రో మాజీ ఛైర్మన్ కె. కస్తూరిరoగన్, తన ముసాయిదా విధాన నివేదికను సమర్పించినప్పుడు మానవ వనరుల శాఖ మంత్రికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు.


కమిటీలోని  ఇతర సభ్యులు:  ప్రొఫెసర్ వసుధ కామత్, మాజీ VC, SNDTWU, ముంబై ఉన్నారు; ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, గణితశాస్త్ర విభాగం, ప్రిన్స్టన్ Princeton విశ్వవిద్యాలయం, USA; డాక్టర్ రామ్ శంకర్ కురీల్, మాజీ వ్యవస్థాపకుడు VC, బాబా సాహెబ్ అంబేద్కర్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్; మజ్హర్ ఆసిఫ్, డీన్, పెర్షియన్ అండ్ సెంట్రల్ ఆసియన్ స్టడీస్ సెంటర్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్, JNU, న్యూఢిల్లీ.


 డ్రాఫ్ట్ విద్యా విధానం మదరసా, మక్తబ్స్ మరియు ఇతర సంప్రదాయ లేదా మత పాఠశాలలను బలపరచటానికి  మరియు వాటి పాఠ్య ప్రణాళికను ఆధునికీకరించడం గురించి కూడా వివరిస్తుంది.


"హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మరియు ఇతర సాంప్రదాయాలలో ఉన్న ప్రస్తుత మదరసాలు, మక్తబ్స్, గురుకులాలు, పాఠశాలలు మరియు మతపరమైన పాఠశాలలు వంటి సంప్రదాయ లేదా మత పాఠశాలలు వాటి  సంప్రదాయ మరియు బోధనా శైలులను కలిగి ఉండటానికి ప్రోత్సహించబడవచ్చు. అయితే అదే సమయంలో జాతీయ విద్యాప్రణాళిక ముసాయిదా లో  సూచించిన విధంగా వాటి పాఠ్యాంశాలలో విషయం మరియు అభ్యాస ప్రాంతాలను  కూడా సమగ్రపరచడం మరియు ఈ విద్యాలయాల నుండి ఉన్నత విద్యకు వచ్చే  పిల్లల అల్ప ప్రాతినిద్యం  ను తగ్గించటానికి సహాయపడతాము  "అని వివరించటమైనది.


సాంప్రదాయ లేదా మత సంస్థలు తమ  పాఠ్యాంశాలను ఆధునీకరించడానికి ప్రోత్సహించే కార్యక్రమాలు విస్తరించబడతాయి మరియు బలోపేతం చేయబడతాయి:a).సాంప్రదాయ సాంస్కృతిక లేదా మత పాఠశాలల్లో గల పిల్లల 1-12 తరగతులు కోసం నిర్వచించిన అభ్యాస ఫలితాలను సాధించటానికి వీలు కల్పించే  విజ్ఞాన శాస్త్రం, గణితం, సాంఘిక అధ్యయనాలు, హిందీ, ఇంగ్లీష్ లేదా ఇతర సంబంధిత భాషలను వారి పాఠ్య ప్రణాళికలో అందించడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది.

బి). మదరసాలు, మక్తబ్లు  మరియు ఇతర సాంప్రదాయ లేదా మతపరమైన సంస్థలైన బౌద్ధ ఆరామాలు, మొదలగు  పాఠశాలలు నుండి వచ్చే  విద్యార్ధులు ఉన్నత విద్యా సంస్థలలో చేరడానికి వీలుగా స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ మరియు అసెస్మెంట్ కోసం జాతీయ పరీక్షా ఏజెన్సీ నిర్వహించే పరిక్షలకు  హాజరు కావటానికి  ప్రోత్సహిస్తారు.

c). సైన్స్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్, సోషల్ స్టడీస్ బోధనలో ఉపాధ్యాయుల సామర్థ్యాలు అభివృద్ధి చేయబడతాయి, వీటిలో కొత్త బోధనకు సంబంధించిన పద్ధతులు ఉంటాయి.

 d).గ్రంథాలయాలు మరియు ప్రయోగశాలలు బలోపేతం చేయబడతాయి మరియు తగినంత బోధనా సామగ్రి అందుబాటులోకి తీసుకు రాబడతాయి
.


No comments:

Post a Comment