9 September 2019

శారీరక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత






Short and Long Questions with answers, Physical Fitness, Wellness and Lifestyle, Physical education


ఆరోగ్యమే మహా భాగ్యం అన్నది ఆర్యోక్తి. శారీరక ఆరోగ్యం మన జీవితంలో ఒక ప్రధాన భాగం. శారీరకంగా చురుకుగా ఉండటం, పోషక సమతుల్యతను కాపాడుకోవడం, మంచి విశ్రాంతి మరియు మంచి నిద్ర అనేవి శారీరక ఆరోగ్యo లో  కొన్ని భాగాలు. శారీరక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వలన  మన జీవితంలోని అన్ని స్థాయిలలో ప్రయోజనాలను పొందవచ్చును.

మంచి శారీరక ఆరోగ్యం విజయవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదం చేస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం క్యాన్సర్, డయాబెటిస్, కార్డియాక్ మరియు శ్వాసకోశ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. నిశ్చల జీవనశైలి (sedentary lifestyle), గాడ్జెట్లలో సాంకేతిక పురోగతి మొదలైన వాటి కారణంగా నిష్క్రియాత్మకత (Inactivity) పెరుగుతోంది.


.
నిష్క్రియాత్మక(inactive) వ్యక్తులను చురుకుగా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

అవి:మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను చిన్న చార్ట్ ద్వారా రూపకల్పన చేయడం. లక్ష్యాలు చిన్నవిగా మరియు వాస్తవికంగా ఉండాలి మరియు సాధ్యమైనంతవరకు వాటికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. లక్ష్యాలను సాధించిన తర్వాత, మీరు వాటిని మార్చవచ్చు మరియు మీ కార్యాచరణ / ఫిట్‌నెస్‌ను పెంచుకోవచ్చు.


మీ రాకపోకలకు ఫిట్‌నెస్ జోడించడానికి వీలుగా  మెట్రో లేదా రైల్వే స్టేషన్‌కు నడవoడి, మీ కార్యాలయం కు దూరంగా కారును పార్కింగ్ చేయడం వలన మీరు ఎక్కువసేపు  నడుస్తారు.

ఇన్ డోర్స్ లో మొబైల్ ఫోన్ కాల్స్ చేసే సమయంలో నడవండి మరియు మాట్లాడండి: మీ మొబైల్ ఫోన్‌లో మీకు కాల్ వచ్చిన ప్రతిసారీ నడవడం చేయండి.  డెస్క్ వద్ద ఎక్కువసేపు కూర్చోవకుండా మద్యలో కొంచం సేపు  అటు-ఇటు పచార్లు చేయండి.


ప్రతి ఉదయం 10 నిమిషాల లోతైన శ్వాస / ప్రాణాయామం సాధన చేయoడి. పని గంటల మధ్య లేదా పడుకునే ముందు రిలాక్స్ గా ఉండటం బరువు తగ్గడం మరియు ఆరోగ్యంగా ఉండటo లో  చాలా ప్రభావకారిగా గా ఉంటుంది.


మరింతగా వాకింగ్ చేయండి. ప్రతి 30 నిమిషాలకు 200 నుండి 300 కేలరీల కంటే ఎక్కువ బర్న్ చేయడానికి డ్యాన్స్ సహాయపడుతుంది. ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాలు నవ్వడం ద్వారా సంవత్సరానికి 2 నుండి 3 కిలోల వరకు బరువు కోల్పోవచ్చు.


వర్క్ స్టేషన్ / డెస్క్ వద్ద నిర్వహించే  వర్క్ స్టేషన్ వ్యాయామాలు పనిలో శారీరక నిష్క్రియాత్మకతను తగ్గించడానికి సహాయపడును.

జిమ్, ఏరోబిక్స్ క్లాస్, యోగా క్లాస్ మొదలైన వాటిలో చెమటలు పట్టేదాక శారీరక శ్రమ చేయండి,

శారీరకంగా చురుకైన జీవితాన్ని గడపడం వలన ఒత్తిడి తగ్గుతుంది.  మెరుగైన నిద్ర, మరియు మానసిక స్థితి మెరుగుపడుతుంది., పనిలో ఉత్సాహం, ఉత్పాదకత పెరుగుతుంది.

సాధారణoగా అందరు అడిగే  ప్రశ్న ఏమిటంటే, మనం ఎంత శారీరక శ్రమ చేయాలి?

పెద్దలందరూ (19 నుండి 64సం. వరకు) ప్రతి వారం కనీసం 150 నిమిషాల శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోవాలి, ప్రతి రోజు కనీసం  20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ శారిరిక శ్రమ చేయాలి. పెద్దలందరూ కండరాల బలోపేత కార్యకలాపాలను చేపట్టాలి: వారానికి కనీసం 4 రోజులు బరువుతో వ్యాయామం, యోగా చేయడం, నడక, నృత్యం, సైక్లింగ్, ఈత మరియు తోటపని మొదలగునవి చేయాలి.

నిశ్చలoగా (కూర్చొని) గడిపే సమయాన్ని తగ్గించండి. మనలో చాలామంది రోజుకు 7 గంటలకు మించి నిశ్చలంగా గడుపుతారు. వీడియో గేమ్స్ ఆడటం, కంప్యూటర్ వాడటం లేదా టీవీ చూడటం వంటి వాటి సమయాన్ని తగ్గించoడి.

శారీరక శ్రమ లేదా వ్యాయామం ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం చిన్న పెట్టుబడి వంటిది. జీవితంలో సమస్యలకు దారితీసే నిష్క్రియాత్మకత యొక్క ప్రభావాలను గుర్తుంచుకోవాలి. శారీరక నిష్క్రియాత్మకత కొన్ని రకాల క్యాన్సర్లు, ఆందోళన, నిరాశ, హృదయ సంబంధ వ్యాధులు, బకాయం, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారి తీస్తుంది.


నిష్క్రియాత్మక వ్యక్తులను (inactive people) చురుకుగా చేసి మేరుగైన,చురుకైన   శారీరక ఆరోగ్యాన్ని సాధించాలి..

No comments:

Post a Comment