31 October 2024

1857 దీపావళి భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మైలురాయి Diwali of 1857 was a milestone in Indian freedom struggle

 


బ్రిటిష్ సైనిక అధికారి కల్నల్ G. B. మల్లేసన్ తన పుస్తకంహిస్టరీ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ 1857-59లో క్రింది విధంగా పేర్కొన్నాడు.అసంతృప్తి చెందిన భారతీయ సిపాయిలు దీపావళి సందర్భంగా విరుచుకుపడాలని, బొంబాయిని దోచుకోవాలని, తమను ఎదిరించే వారందరినీ చంపాలని, ఆపై బొంబాయి  నుంచి బయటకు వెళ్లాలని రహస్య సమావేశం లో తీర్మానించారు. ఈ ప్రణాళిక అమలు చేయబడి ఉంటే, తిరుగుబాటు బొంబాయి ప్రెసిడెన్సీ అంతటా వ్యాపించి, చివరకు మద్రాసుకు కూడా చేరుకునేది

  1857 దీపావళి పండుగ అక్టోబర్ 15న జరుపుకోవాలి. ఆ సమయం లో బ్రిటీష్ పాలన భారతదేశంలోని చాలా ప్రాంతాలలో త్రీవ్రమైన వ్యతిరేకతను  ఎదుర్కొంటోంది.

బొంబాయి పోలీసు కమీషనర్, C. ఫోర్జెట్ అభిప్రాయం ప్రకారం బొంబాయిలో తిరుగుబాటు విజయవంతమై ఉంటే, తర్వాత  హైదరాబాద్, పూనా మరియు మరియు మద్రాసు ప్రెసిడెన్సీ కూడా సైనిక తిరుగుబాటుకు గురిఅవ్వడం ఖాయం". 

బొంబాయిలోని భారతీయ విప్లవకారులు మొదట 1857 ఆగస్టు 30న మొహర్రం రోజున తిరుగుబాటు చేయాలని ప్రణాళిక వేశారు. కాని బ్రిటిష్ వారికి భారతీయ సిపాయుల తిరుగుబాటు గురించి  సమాచారం లబించినప్పుడు విప్లవకారులు తిరుగుబాటును  భారతీయులకు పవిత్రమైన దీపావళి రోజు1857 అక్టోబర్ 15  కు  వాయిదా వేసారు.

1857సెప్టెంబర్ చివరి నాటికి తిరుగుబాటుకు సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. బ్రిటీష్ విధేయుడైన జమాదర్ సింగ్,  కెప్టెన్ మాక్‌గోవాన్‌ Macgowan కు ఇంగ్లీష్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు గురించి తెలియజేశాడు. బ్రిటీష్ వారికి తిరుగుబాటు గురించి సూచన లబించినప్పటికీ, విప్లవ ద్రోహి గంగా ప్రసాద్ లేకుంటే, తీరుగుబాటు ప్రణాళిక విజయవంతమయ్యేది. భారతీయ విప్లవకారులు గంగా ప్రసాద్‌ను విశ్వసించారు, గంగా ప్రసాద్‌ పూజారి మరియు ఆయుర్వేద వైద్యుడు మరియు గంగా ప్రసాద్‌ ఇంట్లో భారతీయ విప్లవకారులు తరచూ కలుసుకునేవాడు

బొంబాయి పోలీసు కమీషనర్, C. ఫోర్జెట్ ప్రకారం బ్రిటిష్ పోలీసులు రాత్రిపూట గుంగా పురసాద్‌ను ఇంటి నుండి బలవంతంగా పోలీసు కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ బెదిరించి  మరియు పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తామని ప్రలోభ పెట్టడం తో  గంగా ప్రసాద్ తన ఇంట్లో కలిసే సిపాయిలు పన్నిన కుట్రను బహిర్గతం చేసాడు. పూజారి మరియు ఆయుర్వేద వైద్యుడు అయిన గంగా ప్రసాద్ ను స్థానిక విప్లవకారులు విశ్వసించారు మరియు గంగా ప్రసాద్ ఇంటినుండి తరచూ రహస్య కార్యకలాపాలు నిర్వహించేవారు.

ప్రలోబానికి గురియైన విప్లవ ద్రోహి గంగా ప్రసాద్ ఆంగ్లేయ అధికారులకు తన ఇంటికి ప్రవేశం కల్పించాడు, తద్వారా ఆంగ్లేయ అధికారులు  భారతీయ విప్లవకారుల సమావేశాలను చూసేందుకు మరియు వినడానికి వీలు కల్పించాడు.

దాదాపు వారం రోజులుగా, కమిషనర్, కెప్టెన్ బారో మరియు ఇతర యూరోపియన్ అధికారులు గంగా ప్రసాద్ ఇంట్లో విప్లవకారుల రహస్య సమావేశాలను చూశారు. రహస్య సమావేశాలను వీక్షించడానికి మరియు వినడానికి గంగా ప్రసాద్ ఇంట్లోలోని హాలు గోడలకు ప్రత్యేక రంధ్రాలు చేయబడ్డాయి. అక్టోబర్ 11 నాటికి బ్రిటిష్ అధికారులవద్ద భారతీయ సైనికుల  విప్లవానికి సంబంధిచిన పూర్తి ఆధారాలు ఉన్నాయి.

బ్రిగేడియర్ J. M. ష్రోట్ అక్టోబర్ 11న అరెస్టులను ఆదేశించాడు. సుబేదార్ గూల్గర్ దూబే, జమాదార్ షేక్ రెహమాన్, డ్రిల్ హవల్దార్ సయ్యద్ హుస్సేన్ మరియు ఒక పేరుతెలియని మొఘల్ సిపాయిని అరెస్టు చేసి జైలులో ఉంచారు.

బ్రిటిష్ అధికారులు భారతీయ విప్లవకారులను 'శిక్షించే' రోజును 1857 అక్టోబర్ 15దీపావళి  రోజు గా ఎంచుకున్నారు. 1857 అక్టోబర్ 15 దీపావళి రోజున  విప్లవోద్యమ నాయకులను బ్రిటిష్ వారు  కానన్ తుపాకీలతో పేల్చివేసారు.

గొప్ప దేశభక్తులు అయిన డ్రిల్ హవల్దార్ సయ్యద్ హుస్సేన్ మరియు మొఘల్ సిపాయి (ఇతని పేరు నివేదికలలో కనుగొనబడలేదు) భారతీయులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకునే రోజుఅయిన దీపావళి రోజున అనగా 1857 అక్టోబర్ 15న బ్రిటిష్ వారు ఫిరంగి తుపాకుల తో కాల్చి చంపారు. 

గూల్గర్ దూబే, హవల్దార్ సుబా సింగ్ మరియు నాయక్ లక్ష్మణ్‌ జీవితాంతం కారాగార శిక్ష గా అండమాన్‌కు పంపబడినారు.

 

No comments:

Post a Comment