10 October 2017

మోమిన్ లేదా విశ్వాసి విజయం లేదా విశ్వాసి లక్షణాలు



అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు: " కృంగిపొకండి మరియు దుఃఖపడకండి, మీరే ప్రాబల్యం పొందుతారు, మీరు విశ్వాసులే అయితే.(3:139).

ప్రజలు బలహీనపడుతున్నప్పుడు లేదా వారు చెడు పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు దుఃఖపడకూడదు,   వారు నిజమైన విశ్వాసి అయితే, ఎందుకంటే వారే విజయం పొందుతారు. ఒక మోమిన్(విశ్వాసి)  లక్షణాలను వర్ణించే అనేక అయతులు దివ్య ఖురాన్ లో   ఉన్నాయి. మోమిన్(విశ్వాసి)  లక్షణాలను వర్ణించే ఆయతులు (2: 285, 4: 162, 8: 2-3, 9:71, 9: 111-112, 23: 1-9, 24:51, 24:62, 27: 2-3, 33:36 మరియు 49:15).
విశ్వాసి కు సంభందించి దివ్య ఖురాన్ లో రెండు వేర్వేరు పదాలను ఉపయోగిస్తారు. 1. ముస్లిం 2. మోమిన్. ముస్లిం అనగా  అల్లాహ్ కు తన్ను తానూ సమర్పించిన వ్యక్తిగా వర్ణించారు. అతను అల్లాహ్ ఒక్కడే అని నమ్మాడు. అల్లాహ్ కొరకు ప్రార్థిస్తాడు మరియు దివ్య ఖుర్ఆన్ పఠిస్తాడు. ఏంజిల్స్ మరియు జడ్జిమెంట్ డే అందు నమ్మకం ఉంచుతాడు. ఒక ముస్లిం తన మతపరమైన విధులను నిర్లక్ష్యం చేయవచ్చు, అతను ప్రపంచానికి ప్రాముఖ్యత ఇవ్వవచ్చు, అతను తన జీవితం లో కొంత సమయం దుష్ట శక్తులకు లొంగిపోవచ్చు.
కాని విశ్వాసి అల్లాహ్ పట్ల ఉన్నత స్థాయి లో పూర్తి నమ్మకం  సాధిoచును.  విశ్వాసి యొక్క నమ్మకం ముస్లిం నమ్మకం కన్నా ఉన్నతమైనది. విశ్వాసితన విధులను నిర్లక్షం చేయడు మరియు ప్రాపంచిక అందాలు  మరియు ఆకర్షణలు అతనికి ప్రలోభపెట్టు లేవు.
ఈ విషయంలో, ప్రవక్త ముహమ్మద్ (స)ఒక సారి ఇలా అన్నారు, "బలహీనమైన  నమ్మినకల వారి కంటే బలమైన నమ్మిక గలవారు  అల్లాహ్ కు ఉత్తమమైన మరియు మరింత ప్రియమైనవారు, అయితే ఇద్దరూ మంచివారే. మీకు ప్రయోజనం కలిగించే దానిని పొందటానికి, అల్లాహ్ సహాయం పొందటoనిస్సహాయంగా భావించవద్దు.-"(ముస్లిం)
పై హదీసు బలమైన విశ్వాసి గా  ఉండటం మంచిది అని తెలుపుతుంది.
నిజమైన విశ్వాసి  యొక్క లక్షణములు:
1. నమ్మకం (దివ్య ఖురాన్ 2: 285, 4: 162, 24:62, 27: 3 మరియు 49:15)
మోమిన్ యొక్క మొదటి లక్షణo అతను అల్లాహ్, అతని దూతలలో, ఆయన పుస్తకాలలో, అతని సందేశహరులందరిలో, మరియు అల్లాహ్ యొక్క తీర్పుదినం అందు విశ్వాసం ఉంచాలి. ఇస్లాం లో విశ్వాసం యొక్క ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నవి.
ii. విధేయత (దివ్య ఖురాన్ 2: 285, 9:71, 9: 112, 24:51 మరియు 33:36)
విశ్వాసి యొక్క రెండవ లక్షణం విధేయుత. అల్లాహ్ నుండి పొందినదానిని  సంతోషంగా అంగీకరించాలి. అల్లాహ్ మరియు ప్రవక్త(స) యొక్క ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలి. 'వినంటం మరియు కట్టుబడి' వైఖరి కలిగి ఉండాలి.అల్లాహ్ ప్రవక్తలు అందరి యందు విశ్వాసం ఉంచుట, ముహమ్మద్ ప్రవక్త (స) కు  వెల్లడించిన విషయంలో విశ్వసించటం మరియు అతనికి ముందు వచ్చిన సందేశహరులలో వెల్లడించిన దానిని నమ్మవలయును.
iii. ప్రార్థన(దివ్య ఖుర్ఆన్ 4: 162, 8: 3, 9:71, 9: 112, 23: 2, 23: 9 మరియు 27: 3)
విశ్వాసి మూడవ లక్షణం రోజు కు ఐదు సార్లు సమయానికి  నమాజ్ నిర్వహించడoమరియు దానికి అవసరమైన అన్ని  జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. అల్లాహ్ ముందు నిలబడి ఉండటం ద్వారా అల్లాహ్ అందు విధేయత చూపటం  కూడా చాలా ముఖ్యమైనది. ప్రార్థనను స్థాపించడానికి, మనిషి తన విశ్రాంతి నుండి బయటకు వచ్చి, విధేయతను చూపిస్తాడు.
 1V. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం (దివ్య ఖురాన్ 4: 162, 8: 3, 9:71, 23: 4 మరియు 27: 3)
ఒక మోమిన్  యొక్క నాల్గవ లక్షణం అల్లాహ్ యొక్క మార్గంలో అతను గడుపుతాడు. అల్లాహ్ ఇచ్చిన సంపదను అల్లాహ్ కు ప్రియం కలిగించేటట్లు  ఖర్చు చేస్తాడు.మానవుడు తన సంపదను ఎక్కువగా ప్రేమిస్తాడు మరియు అల్లాహ్ యొక్క మార్గం లో తన డబ్బును ఖర్చు చేసినప్పుడు  అతను నిజమైన నమ్మిక గల  వ్యక్తిగా మారతాడు.
V. అల్లాహ్ పట్ల భయము (దివ్య ఖురాన్ 8: 2)
ఒక మోమిన్ యొక్క ఐదవ లక్షణం అతని హృదయం అల్లాహ్ యొక్క గొప్పతనo మరియు అతనిపట్ల  ప్రేమను కలుగజేయడంలో  మునిగిపోతుంది. ఈ స్థితి గౌరవ వాతావరణం మరియు చుట్టుపక్కల భయాలను కలిగి ఉండాలని కోరుతుంది. ప్రజలు అల్లాహ్ యొక్క పేరు విన్నప్పుడు వారి హృదయాలు అల్లాహ్  గొప్పతనాన్ని ఆలోచించి భయపడతాయి. అలాంటి దానిని 'తక్వా' అని పిలుస్తారు.
VI. విశ్వాసం పెరుగుదల (దివ్య ఖురాన్ 8: 2):
మోమిన్  యొక్క ఆరవ లక్షణం ఏమిటంటే, దివ్య ఖురాన్ యొక్క ఆయతులు విన్నప్పుడు వారి విశ్వాసం క్రమబద్ధతతో బలంగా పెరుగుతుంది. దివ్య ఖురాన్ యొక్క ఆయతులు అవగాహన చేసుకొని  చదివేటప్పుడువిశ్వాసం బలోపేతo అగును.
vii. అల్లాహ్ పై  విశ్వాసం (దివ్య ఖురాన్ 8: 2)
ఒక మోమిన్  యొక్క ఏడవ లక్షణం అతను అల్లాహ్ అందు సంపూర్ణం గా  విశ్వసించేవాడు. నమ్మిన అల్లాహ్,ను జీవితంలోని అన్ని పరిస్థితుల్లో కూడా పూర్తిగా స్వచ్ఛoగా, సంపూర్ణo, గా విశ్వసించాలి .
VIII.మంచి ని ఆహ్వానించుట మరియు చెడు ను నిషేదించుట: (దివ్య ఖురాన్ 9:71)
మోమిన్  యొక్క ఎనిమిదవ లక్షణం మంచిని పెంచుట  మరియు చెడును నిషేధించడం. ఇదే అంతిమ దినం వరకు కొనసాగించాలి. ఈ ప్రపంచంలో మంచి ని పెంచే మనుష్యులందరిని ఆహ్వానించడం మరియు చెడు నుండి ప్రజలను దూరం చేయాలి. ఈ ప్రపంచంలో మరియు పై లోకం లో వారు  ఇబ్బందులను  మరియు శిక్షలను  పొందకుండ చూడాలి.

IX.అల్లాహ్ మార్గంలో నడుచుట (దివ్య ఖురాన్ 9: 111-112 మరియు 49:15)
మోమిన్ తొమ్మిదవ లక్షణం అల్లాహ్ మార్గంలో నడుచుట. అల్లాహ్ మార్గంలో తమ ఆస్తిని మరియు తమ  జీవితాలను అర్పితం చేసిన వారే నిజమైన విశ్వాసులు. వారు అల్లాహ్ చూపిన మార్గంలో పోరాడటానికి సంకోచించరు మరియు వారు అత్యంత ధైర్యంతో పోరాడుతారు మరియు శత్రువులను నాశనం చేయటానికి పూర్తి ప్రయత్నం చేస్తారు మరియు వారు అమరత్వం పొందుతారు.

X. పశ్చాత్తాపం (దివ్య ఖురాన్ 9: 112)
మోమిన్  యొక్క పదవ లక్షణం అతనుపశ్చాత్తాపం చూపును. తప్పు చేస్తే పశ్చాత్తాపం చెందును. వారు ఏదైనా తప్పు లేదా పాపం చేసినట్లయితే, వారు దానిని క్షమించమని, అల్లాహ్ వైపు తిరగి  అతని క్షమాపణ కోసం ప్రార్థిస్తారు. ఇది అల్లాహ్ యొక్క విధేయత వైపు మరులుట.  దానితో అతను చేసిన పాపం పరిహారం అవుతుంది.

 XI.అల్లాహ్ ను  స్తుతించటం (దివ్య ఖుర్ఆన్ 9: 112)
ఒక మోమిన్  యొక్క పదకొండవ లక్షణం, అతను అల్లాహ్ ను  ఘనంగా ప్రశంసిస్తాడు. వారు అల్లాహ్ కు  కృతజ్ఞులై, అల్లాహ్ యొక్క ప్రశంసలను పాడుతూ ఉంటారు మరియు వారు ఆయనకు మాత్రమే కృతజ్ఞులై ఉంటారు.

XII. అల్లాహ్ కొరకు ప్రపంచం  అంతటా పర్యటించుట (దివ్య ఖురాన్ 9: 112)
ఒక మోమిన్  యొక్క పన్నెండవ లక్షణం అల్లాహ్ కొరకు అతను ప్రపంచం  అంతట పర్యటించును.  వారు ధర్మ ప్రచారం కోసం ప్రయాణాలను చేయుదురు  మరియు ప్రయాణం లోని కష్టాలను అధిగమిస్తారు. ధర్మ జ్ఞానం కోసం విశ్వాసపు చిహ్నాలను వెతుకుతూ, ప్రజలకుసేవ చేస్తూ, ధర్మ ప్రచారం లో తమ కాలాన్ని గడుపుతారు. 

XIII. అనాలోచిత ప్రసంగం నుండి దూరంగా ఉండుట (దివ్య ఖుర్ఆన్ 23: 3)
ఒక మోమిన్ యొక్క పదమూడవ లక్షణం వారు అనాలోచితంగా మాట్లాడకుండా ఉండటం. వారు ఫలితము లేని  మరియు విషయ  రహిత  విషయాల నుండి దూరంగా ఉంటారు. విశ్వాసులు పనికిరాని విషయాలపట్ల ఆసక్తి చూపరు మరియు అలాంటి పనులకు  వారు దూరంగా ఉంటారు. పనికి రాని విషయాలను మాట్లాడే వారితో బహు జాగ్రతగా  వ్యవహరిస్తారు.
XIV. వారి గుప్త  భాగాలను కాపాడుకొంటారు (దివ్య ఖుర్ఆన్ 23: 5)
మోమిన్ యొక్క పద్నాలుగో లక్షణం అతను తన వ్యక్తిగత శరీర  గుప్త భాగాలను కాపాడు కొంటారు.   వారు తమ శరీర కోరికలను అక్రమo గా  తృప్తి పొందరు. వారు ప్రతి కోణంలో నమ్రత కలిగి ఉంటారు మరియు వారు లైంగిక దుర్వినియోగం మరియు లైంగిక వేధింపులకు పాల్పడరు. వారు ఇతరుల ముందు తమ గుప్త శరీర  అంగాలను బహిరంగంగా ప్రదర్శించరు.

XV. సభా మర్యాదలను పాటిస్తారు. (దివ్య ఖుర్ఆన్ 24:62)
ఒక మోమిన్ యొక్క పదిహేనవ  లక్షణం అతను సమావేశం యొక్క మర్యాదను అనుసరించును. అల్లాహ్ మార్గంలో నడుచుట లేదా ఇతర మతపరమైన విషయాల్లో ఆచరించే దిశలను ఇవ్వటానికి ఒక సమావేశం పిలువబడినప్పుడు, అటువంటి సమావేశాలు అధిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. విశ్వాసి సమావేశానికి హాజరు కావాలి, అనుమతి లేకుండా సమావేశాన్ని వదిలివేయకూడదు.

దివ్య ఖుర్ఆన్ లోని అనేక ఆయతులలో అల్లాహ్ విశ్వాసులకు  ఇవ్వబడే ప్రతిఫలం గురించి తెలియజేశాడు.
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా చెప్తున్నాడు: " మేము గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము." (దివ్య ఖుర్ఆన్ 4: 162)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "వాస్తవానికి వారు విశ్వాసులే. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు   కలిగి ఉన్నాయి. "(దివ్య ఖుర్ఆన్ 8: 4)

దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:" వారి పాపాలకు మన్నింపు, వారికి చక్కని ఉపాధి లబిస్తాయి. "(దివ్య ఖుర్ఆన్ 8:74)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "ఆయనే (అల్లాహ్) వారిపై కరుణిస్తాడు.నిశ్చయంగా అల్లాహ్ ప్రబలుడు, వివేకవంతుడు మరియు వివేచనాపరుడు."(దివ్య ఖుర్ఆన్ 9:71)

 అల్ ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "వారు స్వర్గానికి వారసులు, అల్-ఫిర్దాస్ వారసులు.(దివ్య ఖుర్ఆన్ 23: 10-11)

దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "వారు సత్య వంతులైన వారు" (దివ్య ఖుర్ఆన్ 49:15)

దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “వారు విజయ వంతులైన వారు" (దివ్య ఖుర్ఆన్ 24:51)

కాబట్టి, ప్రజలు మోమిన్  అయినప్పుడు, అల్లాహ్ వారికి ప్రతిఫలమిస్తాడు మరియు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో వారు విజయం సాధించగలరు.


8 October 2017

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభ్యాసన(learning) సంక్షోభం (A learning crisis in the developing world)




విద్యను అభ్యసిస్తున్నప్పటికీ కనీస నైపుణ్యత స్థాయిలను సాధించటంలో పిల్లలు విఫలమవడం ఆర్థిక, నైతిక సంక్షోభన్ని సూచిన్తుంది.
గ్రామీణ భారతదేశంలోఅసిర్ యొక్క తాజా ఎడిషన్ నివేదిక  ప్రకారం, 5వ తరగతి విద్యార్ధులలో కేవలం 47.8% మాత్రమే తరగతి IIవ తరగతి స్థాయి పాఠాన్ని చదవగలరు మరియు 8 వ తరగతి విద్యార్థుల్లో 43%మాత్రమే Vవతరగతి స్థాయి అంకగణితం చేయగలరు.
కొంతకాలంగా భారతీయ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు హాజరవడం జరుగుతుంది  కానీ తగినంతగా నేర్చుకోవడం లేదని మనకు  తెలుసు. కాని ఇప్పుడు, అది  కేవలం భారతీయ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక తక్కువ- మరియు మధ్య-ఆదాయం కలిగిన దేశాలని చుట్టుముడుతున్న  ప్రపంచ అంటువ్యాధి. యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ (UIS) కొత్త అంచనాల ప్రకారం  సుమారు 617 మిలియన్ పిల్లలు లేదా ప్రతి 10 మందిలో ఆరుగురు  చదివటం మరియు గణితంలో కనీస నైపుణ్యత స్థాయిలను సాధించుట లేదు.
యుఐఎస్ డాటా ప్రకారం, సబ్-సహారా ఆఫ్రికాకు చెందిన దేశాల విద్యా గణాoకాలు పరమ చెత్తగా ఉన్నాయి, దాదాపు 88% పిల్లలు సరిగా చదివలేరు లేదా వారు మిడిల్ స్కూల్ ముగిసే సమయానికి సాధారణ గణితాన్ని చేయలేరు. దక్షిణ మరియు మధ్య ఆసియా రెండవ స్థానం లో ఉంది, ఆ దేశాల పిల్లలు ప్రాధమిక విద్యలో  కనీస ప్రమాణాలు కలిగి లేరు.
అసిర్ యొక్క తాజా ఎడిషన్ నివేదిక  ప్రకారం, గ్రామీణ భారతదేశపు 5వ తరగతి విద్యార్ధులలో కేవలం 47.8% మాత్రమే తరగతి IIవ తరగతి స్థాయి పాఠాన్ని చదవగలరు మరియు 8 వ తరగతి విద్యార్థుల్లో 43%మాత్రమే Vవతరగతి స్థాయి అంకగణితం చేయగలరు. గత నెల చివరిలో విడుదలైన వార్షిక "వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్" లోప్రపంచ బ్యాంకు దీనిని "అభ్యాస సంక్షోభంlearning crisis" గా కాకుండా "నైతిక సంక్షోభం"“moral crisis గా వర్ణించింది మరియు దేశాల మధ్య మరియు దేశం లోపల అసమానతలను పెంచడం గా భావించినది.
అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం యొక్క అంతర్జాతీయ అంచనాలు తక్కువ ఆదాయం కలిగిన దేశాల నుండి వచ్చిన విద్యార్ధులు అధిక ఆదాయం కలిగిన దేశాల వారి కంటే దారుణంగా వెనుకబడి  ఉన్నారు అని తెలుపుతున్నాయి. బలమైన మధ్య-ఆదాయ దేశాల నుండి వచ్చిన అగ్రశ్రేణి విద్యార్ధులు  కూడా అధిక ఆదాయం కలిగిన దేశాల విద్యార్ధుల కంటే  క్రింద స్థాయి లో ఉంటారుమరియు వారితో సమాన స్థాయి సంపాదించడానికి  కష్టపడుతున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఇండోనేషియాగత 10-15 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (పిఐఎస్ఏ) లో తన పనితీరును గణనీయంగా మెరుగుపరిచిందిమరియు దాని 2003-15 రేటు ప్రకారం దాని విద్యార్ధులు అభివృద్ధి చెందిన దేశాల విద్యార్ధుల గణిత శాస్త్ర స్థాయిని చేరడానికి ఇంకా ఐదు దశాబ్దాలు మరియు చదవడానికి మరో ఏడు దశాబ్దాలు పట్టవచ్చు.
ముఖ్యంగాఈ అభ్యాస సంక్షోభం దేశం అంతా  నమోదు స్థాయిలు పెరగినప్పుడు రావటం విచారకరం గా  ఉంది. సార్వత్రిక నమోదును భారత్ సాధించింది మరియు ప్రపంచవ్యాప్తంగా, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాఠశాలకు వెళ్ళే పిల్లల మధ్య అంతరం తక్కువ అవుతున్నది. అనగా విద్యఅందరికి అందుబాటులోనికి వచ్చింది  కానీ విద్య నాణ్యతలు క్షిణిoచినవి. దీనిని మనం వనరుల లేమి అనుకోవచ్చు కాని దక్షిణ కొరియా, వియత్నాం, పెరూ, మలేషియా మరియు టాంజానియాల లెర్నింగ్ (అబ్యాసన) రంగం లో సాదించిన విజయగాథలను మర్చిపోరాదు.
ఎందుకు కొన్ని వ్యవస్థలు విజయవంతం అవుతున్నవి? కొన్ని వ్యవస్థలు ఎందుకు విఫలమౌతున్నాయి? ముఖ్యంగావిఫలమౌతున్న వ్యవస్థలు  తమ కీలక అంశాలని సమర్థవంతంగా ఏకీకృతం చేయలేవు. ప్రపంచ బ్యాంకు నాలుగు అటువంటి అంశాలను-విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ మరియు పాఠశాల అవస్థాపనలగా (school administration and school infrastructure) సూచించినది.ఇందులో ఎఒక్క దానిలోనైనా  దోషాలు ఉంటే, మొత్తం వ్యవస్థ పాడవుతుంది. పర్యావరణ వ్యవస్థను సరిచేసుకోవడమంటే, ప్రతి అంశాన్నీ ఒక్కొక్కటిగానూ మరియు సమిష్టిగానూ తీర్చడం.
విద్యార్థులతో ప్రారంభించండి. పిల్లలు అనారోగ్యం లేదా ఆకలితో పాఠశాలకు వచ్చినా వారి అభ్యాస స్థాయిలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనికి గర్భిణీ స్త్రీలు, కొత్త తల్లులు మరియు వారి శిశువులను లక్ష్యంగా చేసుకునే  ప్రారంభ జోక్యం(early interventions) ప్రభావవంతంగా ఉంటుంది. భారతదేశం యొక్క ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం మరియు మధ్యాహ్న భోజన పథకం వీటికి మంచి ఉదాహరణలు.
ఉపాధ్యాయుల వైపు మరలండి. ఉపాధ్యాయుల నైపుణ్యాలు మరియు సామర్థ్యాల ప్రాముఖ్యత గురించి  ఎటువంటి విశదీకరణ అవసరం లేదు. అయినప్పటికీ, వారి పట్ల  తక్కువ శ్రద్ధ తీసుకుంటాము. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు వారి పాఠశాలలకు ఉత్తమమైన మరియు ఆకర్షణీయమైన టీచర్స్ ను  ఆకర్షించడానికి మంచి జీతం చూపుతున్నాయి. ఉపాధ్యాయులు, ఒకసారి నియమించబడిన తరువాత వారికి శిక్షణ ఇవ్వడం లేదా వారి వృత్తిపరమైన అభివృద్ధి కి మద్దతు ఇవ్వడం లేదు, దీనితో వీరు తరగతి గదిలో సరిఅయిన  నైపుణ్యం కలిగి ఉండరు.
విద్య వ్యవస్థలు అరుదుగా బోధన నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ప్రోత్సాహకాలను అందిస్తాయి మరియు బోధనకు  బదులుగా బోధన-కాని విదులను  జతచేస్తాయి. ఇథియోపియా మరియు గ్వాటెమాలలో బోధన కోసం పూర్తి బోధన సమయాలలో మూడవ వంతు మాత్రమే ఉపయోగించబడింది. భారతదేశంలోప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సెన్సస్ కార్మికులుగా మరియు ఎన్నికల అధికారులుగా  ఉపయోగపడుతున్నారు. 
స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు పాఠశాల యాజమాన్యాలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2015 లో భారతదేశంతో సహా ఎనిమిది దేశాల్లోని 1,800 ఉన్నత పాఠశాలపై స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ యొక్క నికోలస్ బ్లూమ్ చేసిన అధ్యయనం ప్రకారం మెరుగైన స్కూల్ నిర్వహణ మంచి ఫలితాలను అందించింది, మరియు ఎక్కువ స్వయంప్రతిపత్తి కలిగిన పాఠశాలలు ప్రత్యేకించి బాగా విజయవంతం అయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాఠశాల నిర్వహణలు, అభ్యాసన ఫలితాలను మెరుగుపర్చడానికి అరుదుగా అధికారం లేదా ప్రోత్సాహకరంగా ఉంటాయి.

పాఠశాల అవస్థాపన పరంగా, అభ్యాసన  స్థాయిలు మరియుఅభ్యాసన సాధనలు  అనగా  ల్యాప్ టాప్లు  మరియు ప్రయోగశాలలు మధ్య సంబంధాలు తరచూ అధిక ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. వనరులను ఎలా ఉపయోగించాలో అనేదాని మీద ఆధారపడి, ఇలాంటి వనరులు చాలా భిన్నమైన ఫలితాలను ఇస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, బ్రెజిల్ యొక్క  ల్యాప్టాప్ పర్ చైల్డ్ పథకం.  ఒక అంచనా ప్రకారం అక్కడ 40% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు తరగతి గదిలో అబ్యాసన పరికరాలను అరుదుగా ఉపయోగించారు.

భారత దేశ విద్యా హక్కు  చట్టం సమర్ధవంతంగా పనిచేయుట లేదు. విధానం మరియు ఆచరణలో మార్పు కోసం, ఫలితాలను అంచనా వేయడం ప్రారంభించాలి. విద్యా వ్యవస్థలను మరింత ప్రభావవంతంగా చేయడానికి ఇది ప్రపంచ బ్యాంకు యొక్క ఉత్తమ సిఫార్సు. భారతదేశంలో అస్సర్ సర్వే భారతదేశంలో జాగురుకతను మేల్కొల్పినది కానీ చాలా ముందుకు వెళ్ళవలసి ఉంది.  భారతదేశం అరుదుగా అంతర్జాతీయ అంచనాలలోinternational assessments పాల్గొంటున్నదిమరియు అది ఎప్పుడైతే పాల్గోoటదో అప్పుడు దాని స్థానం  దిగువ భాగంలో ఉంటుందని  తెలుస్తుంది.


పనితీరు అంచనా, కొలవటం మరియు బెంచ్ మార్కింగ్ మొదటి అడుగు. చివరికి, తక్కువ అభ్యాసం ఉచ్చు నుండి బయటపడటానికి  నిర్మాణాత్మక చర్య మరియు సాక్ష్యం-ఆధారిత విధానం అవసరం అవుతుంది.

ఇస్లామిక్ సాహిత్యం లో సైన్స్ ఫిక్షన్ మరియు ఉహాకల్పన సాహిత్యం. (Sci-Fi and Speculative Fiction in the Muslim Tradition).



అదృశ్య పురుషులు, కాలవేగంతో    ప్రయాణం, ఎగురుతున్న యంత్రాలు మరియు అంతరిక్ష ప్రయాణాలను మనం పూర్తిగా యూరోపియన్ ఆలోచనలుగా అర్థం చేసుకుంటాము, కానీ అవి  ఇస్లామిక్ సంస్కృతిలో కూడా గొప్ప మూలాలను కలిగి ఉన్నాయి.అదృశ్య పురుషులు, కాలం తో సమాన  ప్రయాణం, ఎగిరే యంత్రాలు మరియు ఇతర గ్రహాల ప్రయాణాల వర్ణన మనం సాధారణం గా  యూరోపియన్ లేదా 'పాశ్చాత్య' కల్పన యొక్క ఉత్పత్తిగా భావిస్తాము? “వెయ్యి నొక రాత్రి(1001) ఇస్లామిక్ స్వర్ణయుగం(8 వ నుండి 13 వ శతాబ్దాలు)లో సమయంలో సంకలనం చేయబడిన జానపద కథల సముదాయం లో పై వర్ణనలు అన్ని కనిపిస్తాయి.
పాశ్చాత్య పాఠకులు/విమర్శకులు ముస్లిం సాహిత్యం లో ఉన్న సైన్స్ ఫిక్షన్ మరియు ఉహాకల్పన సాహిత్యం ను పూర్తిగా నిర్లక్షం చేసినారు. ముస్లిం స్వర్ణ యుగం లో వికసించిన   కథా సాహిత్యం లో  వాటి ఛాయలు మనకు కనిపిoచును. అరేబియా ద్వీపకల్పం నుంచి స్పెయిన్ వరకు  మరియు భారతదేశం వరకు విస్తరించిన విశాల ఇస్లామిక్ సామ్రాజ్యం లో  విబిన్న సంస్కృతులు మరియు బిన్న వర్గాల ప్రజలను సమన్వయ పరిచి సామ్రాజ్య సమగ్రతను కాపాడటానికి ఆనాటి సాహిత్యం ప్రయత్నించినది.
9 వ శతాబ్దంనాటి ఇస్లామిక్ మహా పండితుడు అల్-ఫరాబి చే వ్రాయబడిన ది వర్త్యువస్  సిటీ The Virtuous City  (అల్-మదీనా అల్-ఫదిలా), ముస్లిం ముస్లిం నాగరికతచే రూపొందించబడిన మొట్టమొదటి గొప్ప గ్రంథాలలో ఒకటి. ఇది ప్లాటో రిపబ్లిక్ యొక్క ప్రభావంతో వ్రాయబడింది. ఇందులో పరిపూర్ణమైన సమాజం ఊహించబడింది  మరియు ముస్లిం తత్వవేత్తలచే అది పరిపాలించబడుతుంది.  ఇది ఇస్లామిక్ ప్రపంచంలో సుపరిపాలన మీద వ్రాయబడిన ఒక ఆదర్శ గ్రంధం.
అలాగే రాజకీయ తత్వశాస్త్రం, డిబెట్స్ మరియు హేతువు/కారణం(reason) గురించి చర్చలు ఆనాటి  ముస్లిం సార్వస్వతం యొక్క ముఖ్య లక్షణం. మొట్టమొదటి అరబిక్ నవలThe Self-Taught Philosopher స్వీయ-బోధించిన తత్వవేత్త (హేయ్ ఇబ్న్ యక్జాన్, సాహిత్యపరంగా అలైవ్,  సన్ ఆఫ్ అవేక్) 12 వ శతాబ్దపు స్పెయిన్ నివాసి ఇబ్న్ తుఫైల్ అనే ముస్లిం వైద్యుడు స్వరపరిచాడు. ఇంగ్లీష్ రాబిన్సన్ క్రూసో నవలను పోలి ఏమాత్రం  బాహ్య ప్రపంచం తో సంభంధం  లేని ఒక వ్యక్తి విశ్వం గురించి తెలుసుకోవడానికి ఎలా హేతుబద్ధoగా ఆలోచిస్తాడు అనే దానిపై  ప్రయోగంగా దీనిని చదవవచ్చు. ఇది ఒక ఒంటరి పిల్లవాడికి సంబంధించినది. అతను  ఒక మారుమూల  ద్వీపంలో వన్య ప్రాణులతో  పెంచబడుతాడు. అతనికి మానవ సంస్కృతి లేదా మతం తో ఎటువంటి పరిచయం  ఉండదు, అక్కడ అతను మానవ సమాజం చే  తిరస్కరించబడిన ఒక వ్యక్తి తో కలుస్తాడు. మానవ స్వభావం, అనుభవవాదం, జీవితం యొక్క అర్ధం, సమాజంలో వ్యక్తి పాత్ర - ఈ పుస్తకంలోని అనేక ఇతివృత్తాలు. జాన్ లాకే మరియు ఇమ్మాన్యువల్ కాంట్ వంటి  ఆధునిక కాల తత్వవేత్తల భావాలు వారికంటే ముందే ఇతని రచనలలో ప్రతిధ్వనించినవి.
స్త్రీవాద వైజ్ఞానిక కల్పన యొక్క మొదటి రచనలలో ఒకటిగా బెంగాల్ రచయిత్రి  రోకియా సఖవత్ హుస్సేన్ రచించిన 'సుల్తానాస్ డ్రీం' (1905) అనే చిన్న కథ పరిగణిoచబడుతుంది.ఇది లేడీలాండ్(స్త్రీ రాజ్యం)అనబడే రాజ్యంలో జరుగుతుంది. ఇందులో స్త్రీ-పురుషులు నిర్వహించే పాత్రలు/విధులు  తలక్రిందులవుతున్నాయి మరియు పరిపాలన మహిళలచే నిర్వహించబడుతుoది. ఇందులో మహిళలు తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ఉపయోగింఛి పురుషులపై విజయం సాధిస్తారు. వారి ప్రపంచమంతా చాలా ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం తో నిండి ఉంటుంది.
20 వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం ప్రపంచం నుండి ఊహాజనిత కల్పనా సాహిత్యం  పాశ్చాత్య వలసవాదం యొక్క తీవ్రత కు నిరోధక రూపంగా మారింది. ఉదాహరణకు, నైజీరియన్ హౌసా రచయిత అయిన ముహమ్మూ బెల్లో కగర, వెస్ట్ ఆఫ్రికా ఇతివృతం తో “గండోకి Ganďoki (1934), అనే నవలను  రచించాడు; కథలోస్థానికులు బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటారు. వారి ప్రపంచం  జిన్స్ ఇతర అదృశ్య జీవులతో (jinns and other mystical creatures )కూడి ఉంటుంది.
తరువాతి దశాబ్దాల్లోపాశ్చాత్య  రాజ్యాల వలస వాదం అంతరించటం ప్రారంభమైనది.రాజకీయ వ్యoగం తో కూడిన రచనలు చేయబడినవి. మొరాకో రచయిత ముహమ్మద్ అజీజ్ లాబాబి నవల “ది ఎలిక్సిర్  ఆఫ్ లైఫ్The Elixir of Life (Iksir al-Hayat) (1974 (ఇక్సిర్ అల్-హయత్)” (1974), లో చిరాయువు ప్రసాదించే ఒక పానీయం ప్రస్తావించబడుతుంది. కానీ అది శాంతి సౌఖ్యలకు బదులుగా, అది వర్గ విభేదాలు, అల్లర్లు, ప్రేరేపించి సామాజిక విచ్ఛిన్నతలను పెంచుతుంది.
ముస్లిం సంస్కృతుల నుండి నేడు కల్పిత భయానక/బీబత్స సాహిత్యం కూడా ఉద్భవించింది. అహ్మద్ సాడావి “ఫ్రాంకెన్స్టైయిన్ ఇన్ బాగ్దాద్Frankenstein in Baghdad (2013)” అనే నవలలో 2001 ఆక్రమణ తరువాత ఆధునిక ఇరాక్ లో  ఫ్రాంకెన్స్టైయిన్ తరహ కృత్యాలను  ను చిత్రీకరించాడు. ఈ నవలలో జాతి మరియు మతపరమైన హింస కారణంగా మరణించిన వివిధ వ్యక్తుల శరీర భాగాల నుండి ఒక  రాక్షసుడు సృష్టించబడ్డాడు.  చివరకు ఆ రాక్షసుడు  సొంత వినాశనం పొందుతాడు.  ఈ నవల ప్రక్రియలో యుద్ధం యొక్క అనాలోచితత్వం మరియు అమాయక ప్రజల మరణాల వ్యధ ఉంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నౌరా అల్ నోమన్ యొక్క యువ వయోజన నవల “అజవాన్Ajwan (2012) లో యువ, ఉభయచర గ్రహాంతరవాసి తో ఒక  ఆమె కిడ్నాప్డ్ అయిన తన  కొడుకును తిరిగి పొందేందుకు చేసిన పోరాట వివరణ ఉంటుంది. ఈ నవల తరువాత ఒక TV సిరీయల్ గా రూపొందించ బడింది మరియు శరణార్థులు మరియు రాజకీయలు దానిలో ప్రస్తావించబడినవి.

సౌదీ అరేబియా కు చెందిన ఇబ్రహీం అబ్బాస్ మరియు యాస్సర్ బహజత్(Ibraheem Abbas and Yasser Bahjatt’s) యొక్క ప్రారంభ విజ్ఞాన కల్పిత నవల హ్వజ్న్HWJN (2013)స్త్రీ-పురుష (లింగ) సంబంధాలు, మత ద్వేషం  మరియు అజ్ఞానం గురించి విశ్లేషిస్తుంది మరియు దినిలో  జిన్ల(jinn’s) ప్రస్తావన కనిపిస్తుంది.

ఈజిప్షియన్ రచయిత అహ్మద్ టౌఫీక్ యొక్క నవల “ఉటోపియా (2008), లో 2023నాటి ఒక గేటెడ్ కమ్యూనిటీ వర్ణన ఉంటుంది. దేశ ఆర్థిక మరియు సాంఘిక పతనం తరువాత ఈజిప్టు సమాజంలోని ఉన్నత వర్గ ప్రజల పరిస్థితి దీనిలో  వివరించబడినది.  అరబ్ స్ప్రింగ్ తరువాత ఈజిప్ట్ నవలాకారుడు బస్మ అబ్దేల్ అజీజ్ Basma Abdel Aziz రచించిన “క్యూ (2016) నవలలో ఒక విజయవంతo కాని విప్లవం తరువాత సామాన్య ప్రజలు ఒక నిరంకుశ, వికృత నియంత పాలనలో పడే ఇబ్బందులను వర్ణించినది.

ఊహాత్మక కల్పన తరచుగా యూరోప్ రొమాంటిసిజమ్ తో  కలసి పారిశ్రామిక విప్లవానికి ప్రతిస్పందనగా చదువబడుతుంది. కాని ముస్లింలు ఈ రంగం లో విజయవంతమైన రచనలు ముస్లిం స్వర్ణ యుగ ప్రారంభం నుండే ప్రారంబించారు.