30 January 2016

జికా వైరస్ గురించిన వివరాలు




. జికా(zika) వైరస్ గురించిన వివరాలు  (దోమ సంబంధ వెక్టార్ బోర్న్)మొదట 2007 మరియు 2013 లో పసిఫిక్ ప్రాంతం లో పిదప 2015లో   అమెరికా (బ్రెజిల్, కొలంబియా) మరియు ఆఫ్రికా లో వరుసగా నమోదయ్యాయి నేడు, అమెరికా ఖండం(ఉత్తర, దక్షిణ) లో చెదురుమదురుగా  సుమారు 22 కంటే ఎక్కువ దేశాలలో జికా  వైరస్ ఇన్ఫెక్షన్లు కనుగొన్నారు.
జికా  వైరస్ గురించి తెలుసుకుందాము  
1. జికా  వైరస్ ఏడిస్(Aedes) దోమల ద్వారా వ్యాపిoచును..
2. ప్రజలు సాధారణంగా స్వల్ప తీవ్రతో జ్వరం, చర్మం దద్దుర్లు (దద్దుర్లు) మరియు కండ్లకలక తో భాదపడతారు. ఈ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల పాటు ఉండును.
3. ప్రస్తుతం ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకా అందుబాటులో లేదు.
4. నివారణ కు  ఉత్తమ చికిత్స  దోమ కాటు కు  వ్యతిరేకంగా రక్షణ కలిగి ఉండటం.
5. జికా వైరస్ ఆఫ్రికా, అమెరికాలు, ఆసియా మరియు పసిఫిక్ లో వ్యాపిoచినది.
సంకేతాలు మరియు లక్షణాలు
జింకా  లక్షణాలు డెంగ్యూ వంటి ఇతర అంటువ్యాధులను  పోలి ఉంటాయి, జ్వరం, చర్మం దద్దుర్లు, కండ్లకలక, కండరాల మరియు కీళ్ళ నొప్పి మరియు తలనొప్పి కలిగి ఉండును. ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటిగా ఉండి  సుమారు 2-7 రోజుల వరకు ఉంటాయి.

ట్రాన్స్మిషన్
జికా  వైరస్ ఉష్ణ ప్రాంతాలలో ఏడిస్ (Aedes )ప్రజాతి దోమల యొక్క కాటు ద్వారా వ్యక్తులలో  వ్యాపించును. ఇది  డెంగ్యూ, చికేన్గునియా  మరియు యెల్లో ఫీవర్  వ్యాప్తి చేసే  దోమ.
డయాగ్నోసిస్
జికా వైరస్ రక్త నమూనాలను నుండి PCR (పాలీమెరేస్ చైన్ రియాక్షన్) మరియు వైరస్ ఐజోలేషణ్  ద్వారా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.
నివారణ
దోమలు మరియు అవి  పెరిగే ప్రాంతాలు  జికా  వైరస్ సంక్రమణకు  ఒక ముఖ్యమైన ఆధారం. మస్క్విటో రేపలెంట్లు,సాధ్యమైనంత వరకు శరీరం యొక్క నిండుగా తేలికపాటి రంగు  బట్టలు ధరించడం, దోమ తెరలు ఉపయోగించడం వంటి నివారణ పద్ధతులు ఉన్నాయి. నీటి తో నిండిన బక్కెట్లు,పూల కుండీలు, లేదా టైర్లు వంటి వాటిని శుబ్రం చేయుట ద్వార దోమల బ్రీడింగ్ ను  ఆరికట్టవచ్చు. కంటైనర్లు ఖాళీగా , కవర్డ్ గా  లేదా శుభ్రంగా ఉంచవలయును.WHO రికమెండ్ చేసిన పెస్టిసైడ్ వాడుట ద్వారా పెద్ద నీటి పీపాలను క్లీన్ చేయుటకు  లార్విసిడ్( larvicides) ఉపయోగిoచవచ్చు.
చికిత్స
జికా వైరస్ వ్యాధి సాధారణంగా తేలికపాటి గా  ఉండి  మరియు నిర్దిష్ట చికిత్స అనవసరమవుతుంది. జికా  వైరస్ బాధిత ప్రజలు, పుష్కలంగా తగినంతగా  ద్రవాలు త్రాగడo, మరియు సాధారణ మందులతో  నొప్పి మరియు జ్వరమునకు చికిత్స చేయాలి.లక్షణాలు హానికరం గా  ఉంటే, వైద్య సంరక్షణ మరియు సలహా వెంటనే తీసుకోవాలి. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి టీకాలు జికా వైరస్ నివారణ లేదా చికిత్స కోసం లేవు.
(మూలం: WHO)

No comments:

Post a Comment