25 July 2016

భారత ఉన్నత విద్యవ్యవస్థ నిచ్చెన అడుగు భాగాన ముస్లింలు
2010 దశాబ్దం చివరినాటికి ఉన్నత విద్యలో ముస్లిం ఎన్రోల్మెంట్ రేటు 5.2 శాతం నుండి 13.8 శాతం పెరిగింది.అయితే జాతీయసగటు శాతం మాత్రం 23.6 గా ఉంది.ఇతర వెనుకబడిన తరగతులు (22.1), షెడ్యూల్డ్ కులాల శాతం (18.5)ఉండగా, షెడ్యూల్డ్ తెగలు మాత్రం 0.5 శాతం ముస్లింల కంటే  వెనుకబడి ఉన్నారు.వారి జనాభా నిష్పత్తికి అనుకూలంగా ముస్లింలు  షెడ్యూల్డ్ కులాల (ఎస్సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) కంటే అధ్వాన్నంగా వెనకబడి ఉన్నారు.

భారతదేశపు ఉన్నత విద్య సర్వే ప్రకారం ముస్లింలలో 2014-15లో హయ్యర్ ఎడ్యుకేషన్ లో కేవలం 4.4% మంది విద్యార్ధులు  మాత్రమే  ఉన్నత విద్య కొరకు నమోదు అయినారు.కాని భారతదేశం యొక్క జనాభా లో 14శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారు.ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థాయిని పరిశీలించేందుకు 2006 లో నియమించిన   సచార్ కమిటీ నివేదిక ప్రకారం పరిస్థితి పై రంగాలలో గత అర్ధ శతాబ్దంలో ముస్లిమ్స్  పరిస్థితి మరింత దిగజారింది.

సచార్ కమిటి నివేదిక అనంతర దశాబ్దంలో, ముస్లింల స్థూల నమోదు రేటు 6.84 శాతం నుంచి 13.8 శాతానికి రెట్టింపు అయినది అయినా ఈ రేట్  జాతీయ సగటు కన్నా వెనుక బడి ఉన్నది. 2001 నుంచి ఉన్నత విద్య లో ఎస్.సి. లలో 147 శాతం పెరుగుదల మరియు ఎస్టీలలో 96% పెరుగుదల కన్పించినా అది వారి జనాభా నిష్పత్తి కన్నా తక్కువ ఉంది.  ఉన్నత విద్య లో వెనుకబడిన తరగతుల నిష్పత్తి (ఒబిసిలు) సాధారణ జనాభాలో వారి సంబంధిత నిష్పత్తికి సమానంగా ఉంది.

కాబట్టి రిజర్వేషన్లు ముస్లింలకు అందచేయవచ్చా?

సమాధానం ఇచ్చుటకు అది సులభమైన ప్రశ్న కాదు. లౌకిక దేశ  రాజ్యాంగం ప్రకారం విద్యా సంస్థలు మత ప్రాతిపదికన విద్యార్థుల మధ్య తారతమ్యం చూపరాదు. అయితే రాష్ట్రాలు మాత్రం "షెడ్యూలు కులాల, షెడ్యూల్డ్ తెగలు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభివృద్ది కోసం రాజ్యాంగబద్ధంగా శాసించిన రిజర్వేషన్ నిబంధనలు సర్దుబాటు చేయవచ్చు”.

ముస్లింలకు మరియు కొన్ని ముస్లిం కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి  కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లో వారిని  ఓబీసీ జాబితాలో చేర్చారు. పలితంగా ఉన్నత విద్య లో ఆ వర్గాల ప్రాతినిధ్యం,రిజర్వేషన్ ఇవ్వని కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కన్నా మూడు రెట్లు అధికంగా ఉంది అని ఇండియన్ ముస్లిమ్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై 2013లో జరిగిన ఉత్తర మరియు దక్షిణాది విశ్వవిద్యాలయాల తులనాత్మక విశ్లేషణ అధ్యయనం తెలుపుతుంది.

ఈ చర్య వారి మొదటి తరం వ్యక్తులను గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లుగా చూడటానికి అనేక కుటుంబాలకు దోహదపడినది.ఇక ప్రగతిశీల కుటుంబాల వారికి వారి పరిధులను పెంచడానికి దోహదపడింది.పేదరికం ఉన్నత విద్య ముస్లింలకు  దక్కకుండా చేస్తుంది, కానీ దక్షిణ భారతదేశం లో కాదు

ముస్లింలు భారతదేశం యొక్క అత్యంత ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అనుటలో ఎటువంటి సందేహం లేదు. హిందువులు మరియు మైనారితిలుగా వర్గీకరించబడని వారు సచార్ కమిటీ నివేదిక ప్రకారం, ముస్లింల కంటే 60 శాతం ఎక్కువ ఖర్చు విద్య పై బెడతున్నారు.

భారతదేశం లో అతిపెద్ద మత సమూహాలలో ఉపాధి మరియు నిరుద్యోగం పరిస్థితి పై 2010 నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక ప్రకారం పట్టణ పురుష ముస్లింలలో 81 శాతం మంది చదువుకున్నవారు ఉన్నారు. ఇతర భారతీయ మత సమూహాల లో పట్టణ మగవారిలో  అత్యల్ప అక్షరాస్యత రేటు - హిందువులు (91 శాతం), క్రైస్తవులు (94 శాతం), సిక్కులు (86 శాతం) మరియు ఇతరులు (95 శాతం) గా ఉంది.

2010 లోఉన్నత విద్యలో అన్ని ప్రధాన వర్గాల స్థూల నమోదు రేటు లో ముస్లింలు (13.8 శాతం) తో అత్యంత వెనుకబడి ఉన్నారు.  హిందువులు (24.2 శాతం), క్రైస్తవులు (36.9 శాతం) మరియు ఇతరులు (జైనులు, సిక్కులు మొదలైనవారు) (28 శాతం) గా ఉన్నారు.

ఎన్ఎస్ఎస్ఓ(NSSO)2010 నివేదిక ప్రకారం సామాజిక-ఆర్థిక శ్రేయస్సు యొక్క మరొక కీలక నిర్ణాయకం ముస్లింలలో శ్రామిక ప్రాతినిధ్యం ప్రతి 1000 మంది జనాభాకు 536 గా అతి తక్కువు గా ఉంది. ఇతర ప్రధాన సమూహాలలో  సిక్కులు  (568), క్రైస్తవులు (540), హిందువులు ( 563) మరియు ఇతరులలో (573)గా ఉంది.

ఉత్తర భారత దేశం లో పాఠశాలలు లేకపోవడం ఉన్నత విద్య ముస్లింలను దక్కకుండా చేస్తుంది.
కాలికట్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ మరియు అమెరికన్ స్తిమ్సన్ సెంటర్ యొక్క  ప్రముఖ విజిటింగ్ ఫెలో సయ్యద్ ఇక్బాల్ హుస్సియన్ 2009లో రచించిన పుస్తకంMuslims in North India: Frozen in the Pastలో ఒక అద్భుతమైన 'డిజిటల్ విభజన' దక్షిణ మరియు ఉత్తర భారత ముస్లింల మధ్య విద్యా మరియు రాజకీయ సాధికారత విషయం లో ఉంది అన్నారు.
బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా లోని ముస్లిమ్స్ తో పోలిస్తే"దక్షిణ భారత ముస్లింలు, ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ముస్లిమ్స్ ఉన్నత విద్యలో ఆకట్టుకొనే రీతి లో  పురోగతి, చూపించారు" అని హుస్సియన్ తన పుస్తకం లో  రాశారు
దక్షిణ భారతదేశం లో విద్య విషయం లో నిశ్చయాత్మక చర్య  ఈ విభజనకు  ఒక ముఖ్య కారణం.దక్షిణ భారతదేశం  లో ముఖ్యంగా స్థానిక నేతలు అన్ని స్థాయిలలో చదువు కు చేయూత నివ్వడం అభివృద్ధి మార్గాన్ని చూపుతోంది.దీనికి విరుద్ధంగాఉత్తర భారతదేశం లో ముస్లింలు చదువు కోవడానికి  తక్కువ పాఠశాలలు ఉన్నాయి.

ముస్లిం లలో  పాఠశాల మానేయడం(డ్రాప్- అవుట్స్): ఉన్నత విద్య ప్రవేశానికి పెద్ద అవరోధం.

సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశం అంతటా మిడిల్ స్కూల్ పూర్తి చేసిన ముస్లిం విద్యార్ధులలో సగం మంది సెకండరీ స్కూల్ స్థాయి కి వెళ్ళకుoడా డ్రాప్-అవుట్ అవుతున్నారు. 2005-06 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHFS) గణాంకాల మీద ఆధారపడిన 2014 అధ్యయనం ప్రకారం, ముస్లింలలో డ్రాప్-అవుట్ రేట్ 17.6 శాతం గా ఉంది. అఖిల భారతదేశ డ్రాప్-అవుట్ రేట్ సగటున 13.2 శాతం గా ఉంది.

రాజస్థాన్లో ముస్లిం ప్రాధమిక పాఠశాల(primary) విద్యార్థులలో 18.5శాతం డ్రాప్-అవుట్ గా ఉండగా, ప్రాథమికోన్నత (upper primary)విద్యార్థులలో 20.6 శాతం డ్రాప్-అవుట్ గా ఉన్నది. ఈ విషయం లో రాష్ట్ర సగటు వరుసగా 8.4 శాతం మరియు ఆరు శాతం గా ఉంది. విద్య మరియు స్వతంత్ర సంస్థల కోసం రాష్ట్రం యొక్క జిల్లా సమాచార వ్యవస్థ ద్వారా 2013-14 లో నిర్వహించిన సర్వే లో  ఈ  విషయం నిర్ధారించ బడినది.


"ముస్లింలలో అధిక డ్రాప్-అవుట్ రేట్ ముఖ్యంగా మాధ్యమిక పాఠశాల(middle school) తర్వాత ఉండటానికి ప్రధాన కారణం, ఉన్నత విద్య కోసం అర్హత ఉన్న యువత  సంఖ్య తక్కువుగా ఉండటం అందువలన ఉన్నత విద్య లో వారి నమోదు శాతం తక్కువుగా ఉంది అని రాకేశ్ బసంత్, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్,అహ్మదాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్-మరియు సచార్ కమిటీ సభ్యుడు చెప్పారు. ప్రొఫెసర్ బసంత్ ముస్లిం  పిల్లలు మరింతమంది ఉన్నత విద్య చదివేందుకు స్కాలర్ షిప్లు మరియు మంచి పొరుగు పాఠశాలు కావాలి అని అంటున్నారు. 

No comments:

Post a Comment