8 October 2016

ఇస్లాం పై స్వామి వివేకానందుడి భావాలు.
వివేకానందుడి సందేశాలు  ప్రేమ, గౌరవం మరియు విశ్వాసం, ఇతర మతాల పట్ల సహన భావం తో కూడినప్పటికి  హిందూ  సాంప్రయవాదులు ఎల్లప్పుడూ వాటిని  తప్పుగా వాఖ్యానించారు మరియు అతనిని ఒక ముస్లిం వ్యతిరేకవాదిగా చిత్రీకరించారు. నిజానికి  అతను ఒక లౌకిక వాది.    
స్వామి వివేకానందుడు  భారతీయ ముస్లింల పట్ల ఎప్పుడు వ్యతిరేక భావాలను కలిగి ఉండలేదు పైగా   అతను వారిని మెచ్చుకున్నారు మరియు భారతదేశం యొక్క వారసత్వం లో భాగంగా ఇస్లాంను గుర్తించాడు.

వివేకానంద తన ప్రసంగాలలో తరచూ "హిందూ " పదం ఉపయోగించినప్పటికీ దానిని అతడు మతపరమైన అర్ధం లో కాక  ఒక విశాలమైన బౌగోళిక-సాంస్కృతిక పరమైన అర్ధం లో  ఉపయోగించాడు.

ది స్టేట్స్మన్ పత్రిక (The Statesman) లో  ప్రచురితమైన ఒక  నివేదిక ప్రకారం, ఇస్లాం పై అతని భావాలు  అతని కుటుంభం మరియు వివేకానందుడి లో  లౌకిక ఆలోచనలు రూపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన అతని మాస్టర్ రామకృష్ణ పరమ హంసా ద్వారా  నాటబడ్డాయి. సర్వ మత ఐక్యత పై అతను తన మాస్టర్ యొక్క బోధనలు  -  “అన్ని మతాల సారం ఒకటే అని, అలాగే అన్ని మతాల  దారి ఒకటే” అన్నదానిచే ప్రభావితుడైనాడు
.
అతను ముస్లిం- హిందూ ప్రపంచాల మధ్య తేడాలను సంస్కృతీ పరంగా గమనిస్తాడు. ప్రసిద్ధ చరిత్రకారుడు తపన్ రాయ్ చౌదరి చెప్పినట్లుగా  స్వామి వివేకానంద ముస్లిం పాలకులను  బయటివారు  లేదా పరదేశియులుగా ఎన్నడు  పరిగణనించ లేదు. వివేకానంద ఇండో-మొఘల్ సాంస్కృతిక సాంప్రదాయం ను అభిమానించెను.అతను అల్వార్ ఒక ముస్లిం స్కూలు టీచర్  తోను  మరియు  హైదరాబాద్  రాష్ట్ర  నిజాం మంత్రుల తోను  మరియు కాబూల్ యొక్క ఒక   అమీర్ తోను తన స్నేహాo  ఆనందించాడు. వారితో కలసి భుజించడంలోను మరియు ముస్లింలనుండి స్వీట్స్ కొనుగోలు చేయడంలోను అతను ఎన్నడు వెనుకాడలేదు.
వివేకానంద దృష్టి లో  ముస్లింలు  ఒక "ఉదారమైన జాతి వారి హృదయం హిందువుల వలే భారతీయతత్వం తో నిండి ఉంది” అంటాడు.  అతను భారతీయ ముస్లిం పాలకులను బ్రిటిష్ వారితో పోలుస్తూ అంటాడు  “మొహమ్మదియులు భారత దేశం నిండా అందమైన ప్యాలసులు నిర్మించి వదిలి పెట్టారు”. బ్రిటిష్ వారు బ్రాంది బాటిల్స్ వదిలిపెట్టారు అంటాడు.  అతను భారతదేశం రెండు గొప్ప వ్యవస్థల మిళితం  ద్వారా కోల్పోయిన తన మహిమను తిరిగి చేజిక్కించుకోవాలని అని అంటాడు: " హిందూమతం మరియు ఇస్లాం మతం - వేదాంత మెదడు మరియు ఇస్లాం  శరీరం”.

తన వ్యాసం "భారత దేశ  భవిష్యత్తు, On the future of Bharat " లో స్వామి వివేకానంద రాశారు: "మహమ్మదీయ పాలన పేదలు  మరియు అణగద్రొక్కబడినవారికి  విముక్తి ప్రసాదించినది. అందువలన దేశ ప్రజలలో ఐదు వంతు ముహమ్మదీయులుగా మారారు. వారందరూ బలవంతం గా మత మార్పిడి కి లోనుయ్యారు అనుట శుద్ధ అబద్దం మరియు నిరాశాపూరితం. భారతీయ ముస్లింలలో ఉన్న మతసహన భావం  వారిని ఇతర దేశాల ముస్లింల నుంచి వేరుపరిచినది.

ప్రవక్త (స) యొక్క  ఉత్కృష్టమైన సందేశం, "ఇన్ ది నేమ్ అఫ్ లార్డ్ -  ప్రభువు పేరట” అనేది ప్రపంచాన్ని మరియు వివేకానందుడిని ఆకర్షిoచినది. ఏవిధమైన ఆర్భాటాలు లేని  ప్రవక్త (స) యొక్క  సూటి మరియు సరళ సందేశం చే  అతను ప్రభావితుడు అయినాడు.

ప్రవక్త (PBUH) మరియు అతని బోధనలు ప్రస్తావిస్తూ ఆయన అన్నారు - "మహమ్మద్ ప్రవక్త(స) - సమానత్వం యొక్క సందేశహరుడు. మీరు 'ఏం మంచి అతని మతంలో ఉంది? అని ప్రశ్నించ వచ్చు. 'ఏమి మంచి లేక పోతే అది ఇంతకాలం ఎలా నిలిచి ఉంది? మంచిని  పెంపొందించే వారే నిలుస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స) ఇంతకాలం ఎలా నిలిచాడు? అతని భోధనలలో మంచి లేకపోతే? అని అంటాడు. 
వివేకానందుడు  ప్రవక్త ముహమ్మద్ (స) లో సమానత్వం మరియు మానవ సోదర భావం చూస్తాడు. "ముహమ్మద్ (స) సమానత్వం యొక్క  ప్రవక్త.  మానవ సహోదరభావం పెంచాడు.సర్వ ముస్లింల మద్య  సోదర భావం పెంచాడు అని అంటాడు. అతను ఇస్లాం లోని సమానత్వం మరియు  సోదరభావమును మేచ్చుకోనేను.

వివేకానందుడు తన సర్వ మత విశ్వాసం లో భాగంగా ఇస్లాం ధర్మము పట్ల అభిమానాన్ని చాటినాడు. ఇస్లాంపై  వివేకానందుడి గౌరవం కేవలం దేశభక్తి ఆదర్శవాదం యొక్క మూలం కాదు.ప్రవక్త ముహమ్మద్(స) గొప్పతనము "దేవుని నుండి వచ్చింది” అని నమ్మినాడు.

ప్రవక్త(స) అనేక వివాహాలు కలిగి ఉండటం గురించి వ్యాఖ్యానిస్తూ  వివేకానందుడు సాధారణ మానవులు వారి ప్రవర్తన యొక్క ప్రమాణాలను అమలు చేయడం ద్వారా అసాధారణమైన  వ్యక్తుల ఉన్నతమైన గొప్పతనాన్ని నిర్ధారించడం జరగదు  అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.

 తన జీవితంద్వారా  ముహమ్మద్ ప్రవక్త (స) ముస్లింల మధ్య పరిపూర్ణ సమానత్వం మరియు సోదర భావం చూపించాడు. ఇస్లాం లో జాతి, కులం, మతం, వర్ణం లేదా లింగ భేదం  లేదు. ఇస్లాం లోని సమానత్వం గురించి చెబుతు స్వామి వివేకానందా “టర్కీసుల్తాన్ వద్ద బానిస గా ఉన్న వ్యక్తి  ఆతరువాత ఒక మహమ్మదీయుడిగా మారి  తగినంత శక్తీ సామర్ధ్యాలు తెలివి తేటలు కలిగి ఉంటె అతను  సుల్తాన్ కుమార్తెను  కూడా వివాహ మాడవచ్చు. హిందువులు ఏమి చేస్తారు? మిషనరీలు ద్వారా  ఒక  సనాతన వ్యక్తి  ఆహారo తాకితే అతడు దానిని పారవేస్తాడు.  ఇస్లాం జాతి,కులం  లేదా వర్ణం యొక్కతేడా లేకుండా  పరిపూర్ణ సమానత్వం చూపుతుoదని” అంటాడు. ఇస్లాం తన అనుచరులను సమానంగా చూస్తుంది.  మొహమ్మద్ (స) భోదనలు  ఆచరణాత్మక సోదరభావం ను కలిగి ఉన్నవి.

నవీన హిందూ సిద్దాంత కర్త స్వామి వివేకానంద కూడా ఇలా అన్నారు: వాస్తవికంగా నిత్య జీవన విధానంలో ఏమాత్రం ప్రశంసనీయమైన స్థాయిలో నైనా సమానాత్వాన్ని, ఏ మతమైన పాటిస్తుదంటే అది ఇస్లాం ...... కేవలం ఇస్లాం మాత్రమే”(బి.ఎన్. గంగూలీ 1975 పేజ్ న.120)

"ఆచరణాత్మక సోదరభావం మరియు ఎక్యత  లేని వేదాంత బోధనలు విశ్వ మానవాళి కి ఫలితమివ్వవని వివేకానందుడు భావించును. క్రైస్తవుల ద్వారా ముస్లిం మహిళలకు ఆత్మ లేదనే ప్రచారంను వివేకానందుడు  నిరసించెను. దివ్య ఖురాన్  మహిళలకు ఆత్మ ఉన్నదని తెలిపెను అని అన్నాడు. అన్ని మతాలు ఆదరణీయాలని అతను నమ్మేను. అన్ని మతాలు మానవుల నిర్దిష్ట అవసరాలను తీర్చడంలో ప్రావీణ్యతను కలిగి ఉన్నవి అనుట వాస్తవం అనెను. 

అతను హిందూ -ముస్లిం ఐక్యత భారతదేశం యొక్క అభివృద్ధి కోసం అవసరమని అనెను. అందుకే అతను హిందువులు మరియు ముస్లింల మధ్య అంతరాన్ని తగ్గించ ప్రయత్నించాడు. ఇస్లాం మతం యొక్క సానుకూల లక్షణాలను చూపిస్తూ రెండు వర్గాల మధ్య స్థిరముగా ఉన్న  అపనమ్మకం తొలగించ ప్రయత్నించాడు.

"మనము అహంకారం, రక్తపాతం మరియు అనాగరికతలను ఆపకుండా సంస్కరణలను  అభివృద్ధి చేయలేము. సంస్కరణలను అభివృద్ధి చేయుటకు  పరస్పర నమ్మకం అవసరం.  అందుకు గాను ఇతర మతాలను ప్రేమ తో ఉదారంగా చూడవలయును. మన ఆదర్శాలు ఆలోచనలు కన్న భిన్నంగా ఉన్న ఇతర మతస్తులకు సహాయం చేయవలయును. మనం భారతదేశం లో చేస్తున్నది అదే.  భారతదేశం లో హిందువులు,  ముస్లింలు మరియు క్రైస్తవుల కోసం మసీదులు, చర్చిలను నిర్మించారు. అదే మనం చేయవలసినది.” అని స్వామి వివేకానంద అంటారు.

దేశంలో మతపరమైన అసహనo, ద్వేషo మరియు హింస ప్రబలుతున్నప్పుడు వివేకానందుడి లౌకిక ఆలోచనలు భారతదేశాన్ని కుల,మత రహితమైన   ఒక సురక్షితమైన స్వర్గంగా  రుపొందిoచునుNo comments:

Post a Comment