21 October 2016

ఇస్లాం పై జవహర్ లాల్ నెహ్రూ భావాలు


  

నవ భారత నిర్మాత, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ స్థాపకుడు జవహర్ లాల్ నెహ్రు భారత దేశం లోని అలహాబాద్ నగరం లో14-11-1889న మోతిలాల్ నెహ్రు,స్వరూప రాణి దంపతులకు   జన్మించాడు. నెహ్రు విదేశాలలో విద్యాబ్యాసం చేసినాడు మరియు భారత జాతీయోద్యమం లో పాల్గొన్నాడు. తన జాతీయ వాద,ఉదారవాద,సామ్యవాద భావాలచే ప్రసిద్దుడు అయినాడు. చరిత్ర, రాజకీయాలు, దేశ పరిస్థితులపై నెహ్రు భావాలు విలువైనవి. నెహ్రు తనకాలం నాటి ప్రపంచ నాయకులలో ఒకరిగా పేరుగాంచినాడు మరియు స్వాతంత్ర్య భారతావని కి ప్రధమ  ప్రధానిగా(1947) పనిచేసినాడు. అప్పటినుండి మరణించేవరకు(27-05-1964) భారత ప్రధానిగా కొనసాగినాడు.

నెహ్రు ఈజిప్ట్ అద్యక్షుడు గమల్ అబ్దెల్-నాజర్, సుకర్ణో (లేదా సుకర్ణో) మరియు జోసిప్ బ్రోజ్ టిటో తో కలసి అలీనోద్యమము స్థాపించినాడు.ఆతని కుమార్తె, ఇందిరా ప్రియదర్శిని  మహాత్మా గాంధీ ఆ తరువాత భారత ప్రధాని పదవి చెప్పట్టినది.

నెహ్రు బహు గ్రంధ కర్త. అతని రచనలలో “గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ అఫ్ ఇండియా, లెటర్స్ టూ హిస్ డాటర్” ప్రముఖమైనవి. అతను రచించిన “గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ” లో ప్రపంచ చరిత్రను వివరించాడు.

ఈ గ్రంధం లో మనము నెహ్రు ఇస్లాం విస్తరణ, దాని నాగరికత-సంస్కతి, ఇస్లాం మరియు ప్రవక్త(స)  పై వెలుబుచ్చిన భావాలను పరిశిలించవచ్చు.

ముహమ్మద్ ప్రవక్త(స) తన అందు తన దైవదౌత్యం నందు ఉంచిన విశ్వాసమును జవహర్ లాల్ నెహ్రు ప్రశంసిoచేను. నెహ్రు మాటలలో తన అనుచరులను ప్రవక్త(స)  విశ్వాసంతో, నమ్మకంతో ఉత్తేజ పరిచెను. ఎడారి ప్రజలు దైవ ప్రవక్త (స) అందు ఉంచిన నమ్మకము మరియు విశ్వాసంతో  సగము ప్రపంచమును జయించినారు. విశ్వాసం, నమ్మకము, సహోదర భావన, ప్రజాస్వామ్యము మరియు అందరు ప్రజలు సమానులు అని ఇస్లాం చాటెను. ఈ భావనను ప్రవక్త (స) పెంపొందించెను.(1)

కొందరు  ఇతర మతముల స్థాపకుల వలె, ముహమ్మద్ ప్రవక్త(స) ఆనాటి కొన్ని క్రూర సామాజిక ఆచారాలను విరోధించెను.  ఆయన భోధనల సరళత్వం, సూటిదనం,ప్రజాస్వామ్యం మరియు సమానత్వ భావన ఆనాటి అరబ్ ప్రజలను విశేషముగా ఆకర్షించెను. నాటి సమాజం అనాగరిక ఆచారాలు క్రూర పద్దతులతో విసిగి పోయి మార్పు కోసం ఎదురు చూడ సాగేను. ఇస్లాం వారికి ఆ అవకాసం ప్రసాదించెను. అనేక పురాతన వేధింపులకు తెరపడింది. "[2]

అనేక తరాలుగా బాహ్య ప్రపంచం తో సంభంధం లేక ఒకరమైన నిద్రావస్థ లో ఉన్న అరబ్ జాతి ఒక్కసారి నిద్రావస్థ నుండి మేల్కొని ప్రపంచమును కలవర  పరిచినది. అరబ్బుల గాధ- వారు విజవంతముగా ఆఫ్రికా,ఆసియా మరియు యూరప్  లో విస్తరించిన విధానం, వారి ఉన్నత సంస్కృతి,నాగరికత, వారసత్వం ప్రపంచ ప్రజలను అబ్బుర పరిచి  ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా నిలిచినది.  ఇస్లాం అరబ్బులను మేల్కొల్పి వారిలో  ఆత్మవిశ్వాసం మరియు శక్తి తో నింపినది. [3]

విశ్వాసం,నమ్మకము, సోదరభావం,అందరు ముస్లిం లందరు సమానులే అన్న భావన  ప్రజాస్వామిక గుణాలు నాటి ప్రపంచమును ఆకర్షించినవి. నాటి క్రైస్తవ సమాజం లోని  సామాన్య ప్రజలకు  ఈ భావనలు కొత్తవి మరియు ఆకర్షనియమైనవి. మానవులు అందరు సహోదరులె అన్న భావన నాటి అరబ్ సమాజాన్ని గాకా మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించినది.  -[4]

నాటి పాలకులు ఖలీఫా అబూ బకర్ మరియు ఉమర్ అరబ్ మరియు ఇస్లామిక్ గొప్పతనమునకు  శంకుస్థాపన చేశారు.వారు ఖలిఫాలుగా  మతాధిపతులు మరియు రాజ్యాధిపతులుగా వ్యవహరించారు. -రాజు మరియు పోప్ గా ఉన్నారు. [5]

వారు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, వారి సామ్రాజ్యం విశాలమైనది అయినప్పటికీ వారు సరళ మరియు రుజుమార్గం లో జీవించారు.  విలాసవంతమైన జీవనాన్ని  తిరస్కరించారు. ఇస్లాం ప్రజాస్వామ్యబద్దం అనేదానికి ఉదాహరణగా నిలిచారు. [6]

క్రమంగా అరబ్బులు ఒక దేశం తరువాత ఒక దేశాన్ని జయిస్తూ తమ జైత్రయాత్ర కొనసాగించారు. కొన్ని దేశాలు ఎటువతి ప్రతిఘటన చూపక లొంగిపోయాయి. ప్రవక్త (స) మరణం తరువాత 25 సంవత్సరాల లోపు అరబ్బులు పర్షియా, అర్మీనియా, సిరియా, సెంట్రల్ ఆసియా లోని కొన్ని ప్రాతాలలో మరియు ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా నుంచి పడమరకు విస్తరించారు. వారి విజయాలలో ఈజిప్ట్ ఆక్రమణ ముఖ్యమైనది.
 అప్పటికే ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యo మరియు క్రైస్తవ తెగల చేతిలో దోపిడీకి గురిఅయినది. కొంతమంది వాదన ప్రకారం ఆనాటి అలెక్జాoడ్రియా నగరం లోని ప్రసిద్ద పుస్తక భాoడాగారంను ముస్లిం లు తగల బెట్టినారు. కాని ఇది అబద్దపు వాదన. ముస్లింలు జ్ఞాన ప్రియులు. వారు పుస్తకములను జాగ్రత చేసెదరు. బహుశ  కానిస్టోoటినేపుల్ ను పాలించిన దియోడియుస్  చక్రవర్తి దీనికి కారకుడు. చాలాకాలం క్రితం జూలియస్ సిజర్ దండయాత్రలో సగము పుస్తక  భాండాగారము తగుల బెట్టబడినది. మిగతా భాగం క్రైస్తవ అభిమాని అయిన చక్రవర్తి దియోడియుస్ తగుల బెట్టినాడు   [7]

మరి ఒక ముఖ్య  విషయం ప్రస్తావించి నేను నా లేఖ ను పూర్తిచేస్తాను. అరబ్బులు, ముఖ్యంగా ఇస్లాం ప్రారంభం లో పూర్తి విశ్వాసం మరియు  ఉత్సాహంతో ఉన్నారు. అయినప్పటికి  వారు మత సహనం కలిగి ఉన్నారు  మరియు వారి  మతసహనo కు  అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానిని జెరూసలేం లో ఖలీఫా ఉమర్ ప్రదర్శించినాడు.  స్పెయిన్లో మత స్వేచ్ఛ కలిగి భారీస్థాయిలో క్రైస్తవుల జనాభా ఉంది. భారతదేశం లో అరబ్బులు సింధ్ ను  తప్ప మిగతా ప్రాంతమును పాలించలేదు కాని వారికి అనాదిగా  భారత దేశం తో పరిచయాలు  మరియు స్నేహ సంబంధాలను కలిగి ఉన్నారు. నిజానికి మనము ఈ కాలం నాటి  అరబ్ వాసుల మత సహనాన్ని మరియు యూరోపియన్ క్రిస్టియన్ల  అసహన్నాని  గమనించ వచ్చు. [8]

అరబ్బుల జైత్రయాత్ర ముందు ప్రపంచం లోని గొప్ప  గొప్ప  సైనిక దళాలు, రాజులు ఒకరి తరువాత ఒకరు పాదాక్రాంతం అయినారు.  సామాన్య ప్రజలు ఈ రాజులు, సైనిక దళాలలో విశ్వాస ముంచక మానవ సమానత్వం, సోదర భావనను  ప్రసాదించే సామాజిక విప్లవం వైపు ద్రుష్టి నిల్పినారు.  [9]

అబ్బాసీయ ఖలఫాల కింద అభివృద్ధి చేసిన బాగ్దాద్ నగరం అరేబియన్ నైట్స్ యొక్క ప్రతిబింబం గా మారింది. రాజభవనాలు, ప్రజా కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గొప్ప దుకాణాలు, ఉద్యానవనాలు మరియు తోటలను కలిగి  ఉండేది. వర్తకులు తూర్పు మరియు పశ్చిమ దేశాలతో  విస్తారమైన వాణిజ్యo కొనసాగించారు. ప్రభుత్వ అధికారులు  సామ్రాజ్య సుదూర ప్రాంతాలతో సంభంధం కలిగి  సమర్థవంతమైన తపాలా వ్యవస్థ, ఆస్పత్రులు కలిగి ఉండేది. ప్రభుత్వo అనేక శాఖలను కలిగి సందర్శకులు ప్రపంచవ్యాప్తంగా బాగ్దాద్ కు వచ్చేవారు. ముఖ్యంగా పండితులు, జ్ఞానులు, విద్యార్థులు మరియు కళాకారులను   ఖలీఫా స్వాగతించేవాడు.  [10]

ప్రాచిన కాలం లో గ్రీకు దేశం శాస్త్ర  విజ్ఞానానికి బాండాగారం. మద్య యుగాలలో అరబ్బులు శాస్త్రీయ దృక్పదం కలిగి విజ్ఞాన శాస్త్రాలను అభివ్రుద్దిచేసారు. వారిని ఆధునిక విజ్ఞాన వేత్తలు అనడం సమంజసం. వైద్యం మరియు గణితం వారు భారతదేశం నుండి గ్రహించి అభివృద్ధి చేసారు. అనేక మంది భారతీయ పండితులు,విద్వాంసులు పెద్ద సంఖ్యలో భాగ్దాద్ తరలి వచ్చారు.

అనేకమంది  అరబ్ విద్యార్ధులు ఉత్తర భారతదేశం లోని తక్షశిల మహా విశ్వవిద్యాలయానికి వెళ్లి అద్యయనం చేసి వైద్యo, గణితం  మరియు ఇతర అంశాలపై సంస్కృత పుస్తకాలను  పెద్ద సంఖ్యా లో అరబిక్ లోకి తర్జుమా చేసారు. కాగితం తయారీ - అరబ్బులు చైనా నుండి నేర్చుకున్నారు. ఇతరుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా, వారు సొంత పరిశోధనలు  చేసి అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు చేసినారు. వారు మొదటి టెలిస్కోప్ మరియు నావికులకు ఉపయోగపడే  దిక్సూచి తాయారు చేసినారు, అరబ్ వైద్యులు మరియు సర్జన్లు యూరోప్ అంతటా   వైద్యంలో ప్రసిద్ధి చెందినారు. [11]

 "బాగ్దాద్ నగరం ఈ మేధో కార్యకలాపాల గొప్ప కేంద్రంగా ఉండేది. పశ్చిమంలో, కార్డోబా అరబ్ స్పెయిన్ రాజధాని, మరొక కేంద్రంగా ఉంది. కైరో లేదా అల్- ఖాహిరా, బస్రా మరియు కూఫా ప్రపంచ ప్రసిద్ద విద్యాలయాలను కలిగి పండితులకు నెలవుగా ఉండేవి. కాని వీటన్నింటికన్నా బాగ్దాద్ నగరం  "ఇస్లాం సామ్రాజ్య రాజధానిగా, ఇరాక్ యొక్క కన్నుగా, సామ్రాజ్య ప్రధాన నిలయంగా, అందం, సంస్కృతి మరియు కళల కేంద్రంగా ఉండేది.", అని ఒక అరబ్ చరిత్రకారుడు వివరిస్తున్నారు. ఇది 20,00,000 మంది జనాభా ను కలిగి  ఆధునిక కలకత్తా లేదా ముంబై కంటే పెద్దదిగా ఉండేది. "[12]

స్పెయిన్ ప్రాంతాల్లో అరబ్ పాలన దాదాపు 700 సంవత్సరాల పాటు సాగింది. అక్కడ స్పెయిన్ అరబ్బులు లేదా మూర్స్ గొప్ప నాగరికత మరియు సంస్కృతిని  అభివృద్ధి చేసారు.
మూర్స్ కార్డోబా నగరం ను ఆధునికతకు మారుపేరుగా తీర్చిదిద్దినారు. ఆ కాలంలో  ఐరోపా మొరటు అజ్ఞానం మరియు కలహాల తో నిండి ఉండేది. కార్డోబా నగరం మాత్రమే చదువు, విజ్ఞానము, ప్రకాశవంతమైన నాగరికతకు కలిగి పాశ్చాత్య ప్రపంచం ముందు మెరుస్తూ ఉండేది.
కార్డోబ కేవలం 500 సంవత్సరాలపాటు అరబ్ స్పెయిన్ కు  రాజధానిగా ఉంది.  ఆ కాలం లో  అది మిలియనల నివాసులను కలిగిన   ఒక గొప్ప నగరం. ఈ గార్డెన్ సిటీ పొడవు పది మైళ్ళ ఉండి దాని శివార్లు  ఇరవై నాలుగు మైళ్ళను కలిగి ఉండేది. 60,000 రాజభవనాలు మరియు భవంతులను, 2,00,000 చిన్న ఇళ్ళు, 80,000 దుకాణాలు, 3,800 మసీదులు మరియు 700 బహిరంగ స్నానవసతులు  కలిగి ఉండేది. అనేక గ్రంధాలయాలను ముఖ్యం గా చీఫ్ ఎమిర్ ఇంపీరియల్ లైబ్రరీ 400,000 పుస్తకాలు గలిగి ఉండెది. కార్డోబ విశ్వవిద్యాలయం ఐరోపా మరియు కూడా పశ్చిమ ఆసియాలో ప్రసిద్ధి చెందింది. పేదలకు ఉచిత ప్రాథమిక పాఠశాలలు స్థాపించబడినవి.

ఒక చరిత్రకారుడి అభిప్రాయం లో "ముస్లిం స్పెయిన్ లో దాదాపు అందరూ చదువు నేర్చినారు  కాని క్రైస్తవ యూరప్ లో మతాధికారులను  తప్పించి అత్యధిక వ్యక్తులు  నిరక్షరాస్యులు” ఈవిధంగా కార్డోబా నగరం బాగ్దాద్ కు పోటాపోటీగా ఉండేది.  కార్డోబా నగర కీర్తి  యూరోప్ అంతటా వ్యాపించి ఒక జర్మన్ రచయిత దానిని "ప్రపంచంలోని ఆభరణం" అని పలికినాడు. కార్డోబా  విశ్వవిద్యాలయమునకు   సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు మరియు  అరబ్ తత్వశాస్త్రం ఐరోపాలోని ఇతర గొప్ప విశ్వవిద్యాలయాలకు విస్తరించినది.. [13]

రిఫెరేన్సేస్(References):

[1] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 144.
[2] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 145.
[3] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 143.
[4] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 144.
[5]  ఖలీఫా యూరప్ లోని పోప్ అంతా మతాదికారి కాదు )The caliph in Islam was not of such religious authority as known in Europe).
[6] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 144.
[7] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 145.
[8] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 148.
[9] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 151.
[10] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 151.
[11] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 151.
[12]  నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 151.
[13] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 189-190.


  

No comments:

Post a Comment