30 December 2016

ఉర్దూ, ముస్లింలు, మరియు రాజకీయాలు (Urdu, Muslims and Politics)
ఉర్దూ ను రక్షించు కొందాము గంగా జమునా సంస్కృతిని  (గంగ-జమున తెహ్జిబ్ ) కాపాడుకొందాము.
ఉర్దూ లౌకిక బాష సామాన్యుల బాష – దాని పురోభివృద్ది కి తోడ్పడుదాము.

భారతదేశం లో నేడు ఉర్దూ బాష  అదిక మంది ప్రజల మరియు ప్రభుత్వం ఆదరణ పొందలేక పోయినది.  ఉర్దూ దేశ ప్రజల ప్రేమ,  భావోద్వేగల,సహజీవన బాష మరియు  సజీవ బాషభారతదేశం లో ఉర్దూ బాష దేశ మత రాజకీయాలలో  చిక్కుకొoది. ఉర్దూ ముస్లింల బాష గా పిలవబడింది మరియు క్రమంగా ఆ బాష నుండి  అనేక మంది ప్రజలు  దూరం అయినారు.  నిజానికి ఇతర దేశాల నుండి వచ్చిన  మధ్య యుగ ముస్లిం పాలకవర్గం తమతో పాటు పెర్షియన్ మరియు టర్కిష్ తెచ్చింది. ఉర్దూ అనేక శతాబ్దాలుగా దేశంలోని  వివిధ భాషల మరియు మాండలికాల కలయిక భాషగా అభివృద్ధి చెందినది మరియు ఉత్తర భారతం, దేశంలోని దక్కన్ ప్రాంతంలో కమ్యూనికేషన్ కోసం ప్రజల బాష గా మారింది.

ప్రభుత్వo  ఉర్దూ బాషా అభివృద్ధి కి తగిన సహకారం అందించటం  లేదు. ప్రస్తుత ప్రపంచం లో ఉర్దూ అధికార కార్యకలాపాలలో ఉపయోగించే  బాష ప్రతిపత్తిని కోల్పోయినది.  వ్యాపార వర్గాలు ప్రపంచ వ్యాప్తంగా  ఇంగీష్ ను ఉపయోగించ సాగారు. కేవలం దిగువ, మద్య తరగతి ముస్లిమ్స్ మాత్రామే తమ పిల్లలను ఉర్దూ మీడియం లో చదివించ సాగినారు. ఉన్నత వర్గాల వారు ఉన్నత మధ్యతరగతి వారు తమ పిల్లలను ఆంగ్లములో చదివించ సాగినారు.

దేశంలో ముస్లింల సాంఘిక-ఆర్ధిక పరిస్థితులను దృష్తి లో పెట్టుకొని ముస్లిమ్స్ వాణిజ్యపరంగా మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆంగ్లమును  అబ్యసిoచ వలయును అని కొంతమంది వాదిస్తారు. ఉర్దూ లో ముస్లిం మత గ్రంధాలు  మరియు ముస్లిం సంస్కృతి లేదా పవిత్ర భారతదేశ గంగా-జమునా తెహ్జిబ్  పొందుపరచబడ్డాయి కాబట్టి ఉర్దూ భాష ను ప్రోత్సహించి  రక్షించ వలయును అని కొందరు అంటారు.

ఉర్దూ భారతదేశం యొక్క ఒక ప్రాంతీయ భాష కాదు అది మాట్లేడే వారు ఉత్తరభారతం మరియు  దక్కన్ ప్రాంతo వరకు   దేశవ్యాప్తముగా వ్యాపించి ఉన్నారు.   ఉర్దూ భాష కాశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్, కర్నాటక వరకు ప్రజలు అధిక సంఖ్యలో మాట్లాడుతుంటారు కానీ, కేవలం కాశ్మీర్ లో మాత్రమే అది మొదటి అధికార భాష  మరియు ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ భాష హోదా పొందింది.

దేశ విభజన ఉర్దూ బాష అభివృద్దికి ప్రతిబంధక మైనది. విభజన తరువాత ఉర్దూ మూడు దేశాలలో అనగా   భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో  విభజించబడింది.  బంగ్లాదేశ్ ఉర్దూలో మాట్లాడేవారు శరణార్థులు అయినారు  మరియు పాకిస్తాన్ లో ఉర్దూ ముహాజిర్ ల బాష గా మారింది.

పాకిస్తాన్ లో ఉర్దూ జాతీయ భాష ప్రతిపత్తి పొందినప్పటికీ దాని పరిస్థితి ఇండియా లో ప్రత్యేకించి   దక్షిణ భారతదేశం లో హిందీ లాగ తయారు అయినది.  భారతదేశం లో ఉర్దూ  ముస్లింల బాష గా గుర్తించ బడి సామాజికంగా ప్రతికూల  స్థితి ని పొందినది. 

భారతదేశం లో ఉర్దూ భాదిత బాషగా మారింది. వాణిజ్య, ప్రభుత్వ రంగం లో తన ప్రతిపత్తిని కోల్పోయినది. ఉర్దూ స్థానాన్ని విద్యా సంస్థల్లో ప్రాంతీయ బాషలు మరియు ఆంగ్లము సాదిoచగా ఉర్దూ అనాధగా మిగిలింది.

ఉర్దూ భాషకు మద్దతు ముస్లింలకు మద్దతుగా బావించబడినది. ఉర్దూ కు ప్రభుత్వ మద్దత్తు  రాజకీయాలతో జతచేయబడింది. ముస్లింల ఓటు పొందే లక్ష్యం తో ఉర్దూ ప్రోత్సహింప బడినది. ఇంగ్లీష్ మరియు ఉర్దూ రెండూ కొన్ని సార్లు జయించిన లేదా దేశద్రోహుల భాషగా చిత్రీకరించబడినవి. కానీ ఇంగ్లీష్ సంపన్న భాషగా పరిగణిస్తారు, ఉర్దూ ఇప్పుడు ముఖ్యంగా పేద ముస్లింలు మరియు  పేదల ప్రాథమిక భాషగా భావించబడుతుంది.

ముస్లింలు ఉర్దూను తమ సొంత భాష గా పరిగణిoచడం తప్పు అని కొంతమంది అంటారు. భారతదేశం లో మితవాద రాజకీయాలు ముస్లింలను  లక్ష్యంగా చేసుకొన్నవి మరియు ఉర్దూ దానితో  అనుసంధానింప బడి ప్రగతి పొందలేదు.

ఉర్దూ ప్రమోషన్ కొరకు ప్రచారం తరచుగా దేశం లో ముస్లిం కమ్యూనిటీ మరియు రాజకీయ నాయకత్వం మధ్య ప్రతికూల సంబంధాన్ని సృష్టించింది. ఉత్తర భారతదేశం లో  జాతీయ ఉద్యమం సమయంలో మతతత్వం ప్రబలింది  మరియు దానివలన  దక్షిణ భారతదేశం లో హిందూ -ముస్లిం సంబంధాలు ప్రభావితం అయినాయి. ఉర్దూ ప్రచారం ఉత్తర భారతదేశం బయట రెండు ప్రతికూల పరిణామాలను సృష్టించింది. మొదటిది ముస్లిమ్స్- ముస్లిమేతరులు వేరు అయినారు. రెండవది,  ఉర్దూ బాష కు సహాయం చేయడం  ముస్లిమ్స్ ను సంతృప్తి పరచటం గా హిందువులు ఆరోపించినారు. అందువలన, ఉర్దూ, ముస్లింలు రెండు ప్రతికూలాలను ఎదుర్కోవాల్సి వచ్చినది. ఉర్దూ ముస్లిమ్స్ బాష గా ముద్ర పడి సమాజం మతతత్వ పూరిరితం అయినది. దీనితో ముస్లింలు వివక్ష, మత హింస ఎదుర్కోసాగారు.

నిజానికి, సంస్కృతం పరిరక్షించేoదుకు ఉర్దూ ఉత్తరాది రాష్ట్రాల్లో మూడు భాషా సూత్రం కింద బలి అయినది.  భారతదేశం యొక్క పురాతన భాష గా హిందీని మరియు తల్లిబాష గా  ఒక ఆధునిక భాషగా ఆంగ్ల మరియు సంస్కృతoను  తీసుకువచ్చారు. ముస్లింలకు  ఉర్దూ మాతృబాష కాని  సెన్సెస్ సిబ్బంది వారిని సంప్రదించకుండా వారి మాతృభాషగా  హిందీ గుర్తించారు. తమిళనాడు మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో ప్రాంతీయ భాష మరియు ఆంగ్లము స్థానం పొందినవి.  హిందీ ద్వి  భాషా సూత్రం ప్రకారం బయటకు వెళ్ళిపోయిoది మరియు ఈ రాష్ట్రాల్లో ఉర్దూ అవకాశాలను  బాగా ప్రభావితం చేసింది.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉర్దూ దేశం యొక్క భాష మరియు అది అద్భుతమైన సంస్కృతి మరియు చరిత్ర కలిగి ఉంది మరియు ఉర్దూ  ముస్లిమ్స్ భాష కాదు అని గుర్తించటం  ముఖ్యం. ఉర్దూ కు లౌకిక మూలం ఉంది మరియు  భాషకు మతపరమైన గుర్తింపు ఉండకూడదు. దాని ప్రమోషన్ కోసం ముస్లింలు  మరింతగా పట్టుబట్టిన కొద్ది  ఉర్దూ మత రాజకీయాలు ద్వారా అణిచి వేయబడుతుంది. ఉర్దూ దాని పెరుగుదల మరియు వ్యాప్తి కోసం ఇతర స్క్రిప్ట్స్ అవలంబించవలసిన  అవసరం కూడా ఉంది. భారతదేశం లోని ప్రజలలో అధికశాతం మంది  పెర్సో-అరబిక్ లిపి లో ఉర్దూ ను  చదువలేరు. ఉర్దూ మనుగడకు మరియు వ్యాప్తికి ప్రభుత్వం తోడ్పడాలి.

దేశంలో ఉర్దూ మాటడే ప్రజలు అనేక ప్రాంతాల్లో ఉర్దూ మాట్లేడే చివరి తరం గా మిగలవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో పేదలు ముఖ్యంగా  ముస్లింలు తమ పిల్లలను ఉర్దూ పాఠశాలల్లో చదివించటం విద్యాపరంగా మరియు ఆర్థికంగా లాభదాయకం కాదు అని తెలుసుకోటానికి రెండు తరాల సమయం పట్టవచ్చు. అది ఒక అద్భుతమైన సంస్కృతి మరియు చరిత్ర గల ఉర్దూ బాష కు భారతదేశం లో బహుశా ముగింపు దశ కావచ్చు.
No comments:

Post a Comment