14 September 2017

సోషల్ మీడియా ప్రభావంతో పెరుగుతున్నఆత్మహత్యలు (Social Media Influence Increasing Suicides)





సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం

 సోషల్ మీడియా,  స్నేహితుల ఒత్తిడి, ఆల్కహాల్ మరియు మాదక ద్రవ్యాల   వాడక ప్రభావం కారణంగా నేడు  యువ తరoలో ఆత్మహత్యలు    పెరుగుతున్నవి.

"ఆత్మహత్య" అనేది "స్వీయ హత్య" అనే  లాటిన్ పదం నుండి తీసుకోబడింది. మరణించే వ్యక్తి యొక్క అంతిమ చర్యను ఇది సూచిస్తుంది. ఆత్మహత్య గురించి ఆలోచించడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి మధ్య కొంత అంతరం ఉంటుంది. కొందరు వ్యక్తులు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనను కలిగి ఉంటారు, కానీ వారు ఆత్మహత్య చేసుకోరు. కొంతమంది లో అది కార్యరూపం దాల్చడానికి  రోజులు, వారాలు లేదా కొన్నిసంవత్సరాలు పట్టవచ్చుకొందరు ముందు ఆలోచన, ప్రణాళిక  లేకుండాహటాత్తుగా ఆత్మహత్య చేసుకొంటారు. కొంతమంది నిర్వచించడానికి వీలులేని విధంగా  అనగా  మద్యం మరియు ఇతర మత్తు పదార్థలకు బానిస కావడం, డయాబెటిస్, ఊబకాయం &రక్తపోటు మొదలగు ప్రాణాంతక వ్యాదుల తీవ్రత కారణం గా,జీవితం పై విరక్తి తో  ఆత్మహత్య కు పాల్పడేదరు.

పురుషులు తరచుగా మహిళలు కన్నా  నాలుగు రెట్లు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించే మహిళలుపురుషుల కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటారు. మారణాయుధాలు, ఉరి, ఎత్తు నుంచి ఎగరడం లేదా  దూకడం వంటివి   పూర్తి ఆత్మహత్య చేసుకొనే  పురుషులు అధికంగా  ఉపయోగించే పద్ధతులు. మహిళలు సాధారణంగా మానసిక మందులు ఎక్కువ డోస్ తీసుకోవడం  లేదా విషంను ఎక్కువ మోతాదు లో  తీసుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా, ఆత్మహత్య యొక్క అత్యంత సాధారణ పద్ధతి ఉరి వేసుకోవడం. ఆత్మహత్య రేటు వయస్సుతో పాటు పెరుగుతుంది మరియు మధ్యవయస్సు లో సంక్షోభం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పురుషులలో, 45 సంవత్సరాల తరువాత ఆత్మహత్యలు మరియు మహిళల్లో 55 సంవత్సరాల తరువాత ఆత్మహత్యలు పెరిగాయి. అయితే మద్య తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా 15-25 మధ్య వయస్సున్న యువకులలో  మరియు యువతులలోఆత్మహత్య రేటు వేగంగా పెరుగుతోంది

ఒంటరిగా ఉండేవారు, విడాకులు తీసుకున్నవారు, దీర్ఘ కాలం గా వివాహం చేసుకోనివారు , విడాకులు తీసుకొన్న మగవారు మరియు వితంతువులు  ఆత్మహత్యకు పాల్పడే ఎక్కువ అవకాశం ఉంది. "వార్షికోత్సవ ఆత్మహత్యలు" గా  పిలవబడే ఆత్మహత్యలు కొందరు వ్యక్తులు తమ జీవితాన్ని ఒక కుటుంబ సభ్యుడు మరణించిన రోజున తీసుకుంటారు. నిరుద్యోగం మరొక ప్రమాదమైన కారణం. . వైద్యులలో అనస్తిషియన్స్ మరియు మానసిక వైద్యులు అధికంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.   శీతోష్ణస్థితి/వాతావరణం  కూడా ప్రభావాన్ని చూపుతుంది: అందు వల్లే  ఆత్మహత్యలు ఎక్కువగా స్కాండివియన్ దేశాలలో జరుగును.

క్యాన్సర్ మరియు హెచ్ఐవి లాంటి రోగాలు ఆత్మహత్యలను  పెంచుతాయి. ఆత్మహత్య అనేదిమానసిక అనారోగ్యాలలో అనగా  స్కిజోఫ్రేనియా, డిప్రెషన్, మానసిక చిత్తవైకల్యం మరియు మద్యం మరియు ఔషధాలకు అలవాటు పడినవారిలో ఎక్కువగా ఉంటుంది.

వ్యక్తిత్వ క్రమరాహిత్యాలలో(personality disorders) ఆత్మహత్య ప్రయత్నాలు సాధారణం. స్నేహితుల  ఒత్తిడి, నీలి తిమింగలం సవాలు(Blue Whale challenge)మరియు ఒత్తిడి వంటివి సామాజిక కారకాలుగా ఉండును.    . సున్నితమైన మనసత్వం కలిగిన వారు, తమను తాము నియంత్రించలేని వ్యక్తులు మరియు యుక్తవయస్కులలో మద్య నీలం తిమింగలం సవాలు వలన మానసిక వత్తిడి కి లోనైన వారు ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది.

ఆత్మహత్య వంశపరంపర్యం గా (జన్యు కారకంకూడా నడుస్తుంది. "పారా-ఆత్మహత్య" అనేది స్వీయ-వినాశనం ద్వారా తమను తామే గాయపరచుకునే  రోగులను వివరించడానికి ఉపయోగించే  ఒక పదం, కానీ సాధారణంగా వీరు  చనిపోవాలని కోరుకోరు.

సమాజంలో ఆత్మహత్యలను నివారించడానికి, అందరూ వారి కుటుంబ సభ్యుల, సహచరులు, సహోద్యోగి యొక్క ప్రవర్తన మార్పులను గమనించాలి. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎల్లప్పుడూ వారి దగ్గరిఅనగా తమ కుటుంబ సబ్యులుమరియు తనకు ప్రియమైన వారికి ముందు సూచనలు ఇస్తారు. విధంగా గమనించినప్పుడు, మనం వారితో  మాట్లాడటం మరియు ముఖ్యంగా తక్షణం మనోరోగ వైద్యుడిని సంప్రదించడం చేయాలి. తీవ్రంగా డిప్రెషన్ గురి అయిన వ్యక్తులకు  యాంటీ డిప్రెసెంట్స్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోథెరపీ అండ్ ఎలక్ట్రో-కన్వల్సివ్ థెరపీ (షాక్ ట్రీట్మెంట్) తో చికిత్స చేయవచ్చు.











No comments:

Post a Comment