16 November 2017

మహా సేనాని సలాహుద్దీన్ అయ్యుబి (SalahuddinAyyubi)


Image result for salahuddin
మద్య యుగాల్లో విభజించబడిన ఇస్లామిక్ ప్రపంచం క్రూసేడర్స్ కు బలహీనమైన ప్రతిఘటనను అందించింది.తూర్పు మధ్యధరా ప్రాంతంపై తమ పట్టు సాధించిన క్రైస్తవ పాలకులు ఆ ప్రాంతం పై తమ క్రూర పాలనను విధ్వంసాలను కొనసాగించారు.సెల్జూక్స్ ఆఫ్ఘన్ గజనావిడ్స్నుంచి తమ తూర్పుసరిహద్దులను  కాపాడుకోవడం లో మునిగి తేలారు. క్రూసేడర్స్ స్థానిక ఆర్థడాక్స్ మరియు అర్మేనియన్ సమాజాల నుండి విలువైన సహాయం పొందారు. 1110 లో బీరూట్ పతన మైనది.1111 లో అలెప్పో ముట్టడి కి గురికాబడింది.1124 లో టైర్ లొంగి పోయినది.మొదట్లో ముస్లిం పాలకులు  క్రూసేడర్ దండయాత్రను తీవ్రంగా తీసుకోలేదు. వారు క్రైస్తవులను  పశ్చిమ ఆసియాలో అధికారం కోసం పోటీపడే  మరొక మతపరమైన  గుంపుగా భావించారు.

అదేసమయం లో ఈజిప్టులో అంతర్గత పరిస్థితి బాగా లేదు. చాలా కాలం క్రితమే అధికారం ఫాతిమిడ్ ఖలీఫాల  నుండి పోయింది. వజిర్స్ (Viziers)నిజమైన శక్తి బ్రోకర్లుగా మారారు. వజిర్స్ కోల్పోయిన భూభాగాలను సాధించడం కన్నా కైరో అంతపుర రాజకీయాలలో మునిగి తేలారు. 1101 లో ఖలీఫా ముస్తా అలీ మరణించినప్పుడు, వజీర్ అల్ అఫర్డాల్ ఖలీఫా  శిశు కుమారుడు అబూ అలీని సింహాసనంపై కూర్చోబెట్టి ఈజిప్ట్ యొక్క వాస్తవిక పాలకుడు అయ్యాడు. అబూ అలీ పెరిగి పెద్దవాడు అయిన తరువాత అతను వజీర్ అల్ అఫ్దాల్ ను హత్య చేయించాడు ఇందుకు ప్రతిగాఅబూ అలీ స్వయంగా 1121 లో హత్యకు గురయ్యాడు.

అరాచకత్వం ఈజిప్టు లో ప్రబలింది.  అబూ ఆలీ కి మగ వారసులు లేరు. అతని బంధువు అబుల్ మైమున్ ఖలీఫా  అయ్యాడు. కానీ అతను తన సొంత వజీర్ అహ్మద్ ద్వారా తొలగించబడి జైలు పాలయ్యాడు. అబుల్ మైమున్ తన చెరసాల నుండి పన్నాగం చేసి వజీర్ అహ్మద్ ను   హత్య చేయిoచాడు. అబుల్ మైమున్ తరువాతఅతని కుమారుడు అబూ మన్సూర్ పరిపాలన స్వీకరించాడు.  అబూ మన్సూర్ కు పరిపాలన వ్యవహారాల కన్నా వైన్ మరియు స్త్రీలపట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు. అతని వజీర్ ఇబ్న్ సాలర్ పరిపాలనను నడిపించాడు కాని వజీర్ ను అతని స్వంత సవతికొడుకు  అబ్బాస్ హత్య చేసాడు.

కైరోలో ఉన్న ఫాతిమిడ్ ఖాలిఫాలు నిజమైన పాలనాధికారం కోల్పోయి వజిర్స్ చేతిలో బందిలుగా మారారు. 1154 లోవజీర్ అబ్బాస్ కుమారుడు నస్ర్, ఖలీఫా  అబూ మన్సూర్ ను  హతమార్చాడు. అబూ మన్సూర్ సోదరీమణులు నస్ర్ ను  శిక్షించడంలో సహాయం కోసం ఎగువ ఈజిప్ట్ యొక్క గవర్నర్ అయిన రుజ్జిక్ (Ruzzik)కు విజ్ఞప్తి చేశారు. వారు పాలస్తీనాలోని  ఫ్రాంక్లకు(Franks) కూడా విజ్ఞప్తి చేశారు. నాస్ర్ర్ ఫ్రాంక్స్  చేత బంధించబడి  కైరోకు పంపబడ్డాడు, అక్కడ అతను శిలువ వేయబడి మరణించాడు.

ఈజిప్టు పరిస్థితి  పండిన పండు లాగా తయారు అయిoది. ఈజిప్టు నియంత్రణ ద్వారా  ఇస్లామిక్ ప్రపంచాన్ని  వినాశకరమైన దెబ్బ కొట్టగలమని  క్రూసేడర్లకు  తెలుసు. స్థానిక మారినైట్ మరియు అర్మేనియన్ కమ్యూనిటీలు వారికి సహాయ పడినవి. ఈజిప్టు పై  అనేక దండయాత్రలు ప్రారంభించబడ్డాయి. 1118 లోక్రూసేడర్లు డామిట్టాలో అడుగుపెట్టారు, ఆ నగరాన్ని  ధ్వంసo చేసి కైరో వైపు నడిచారు. ఈజిప్షియన్లు ఆక్రమణదారులను తిప్పికొట్టారు కాని పాలస్తీనాను కాపాడుకోలేక పోయారు.1143 లో పాలస్తీనా, అస్కాలోన్ లో  చివరి ఫాతిమిడ్ బలమైన స్థావరం  పడిపోయింది.జేరుసాలెం లో క్రుసేడర్ పాలన దాదాపు ఒక శతాబ్దం వరకు కొనసాగింది.

 ఉత్తర ఇరాక్ మరియు తూర్పు అనటోలియా నుండి ముస్లిమ్స్  యూరోపియన్ మిలిటరీ దండయాత్రలకు వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. నేడుఇవి టర్కీ, ఇరాక్, సిరియా మరియు పర్షియాల కుర్దిష్ రాష్ట్రాలు. మోసుల్ కు చెందిన  సెల్జుక్ అధికారి మౌదుడ్ 1113 లో జెరూసలేం రాజు బాల్డ్విన్ పై విజయం సాధించాడు.  కానీ 1127 లో ఫాతిమిడ్ హంతకులు మౌదుడ్ ను  హత్య చేశారు. ఇంకొక టర్కిష్ అధికారి జెంగి మౌదుద్ యొక్క పనిని కొనసాగించాడు. జెంగి న్యాయపాలన చేసాడు. ఒక టర్క్ మరియు టర్క్ కాని వారీ మధ్య వ్యత్యాసం తన పాలన లో  చూపలేదు. 1144 లో, జెంగి ఎడెస్సా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక కొత్త క్రూసేడ్ ను  ప్రేరేపించింది, దీనిలో జర్మనీ చక్రవర్తి కాన్రాడ్ మరియు ఫ్రాన్స్ యొక్క బెర్నార్డ్ పాల్గొన్నారు. జెంగీ ఆక్రమణదారులపై భారీ విజయాన్ని సాధించాడు జర్మన్లు ​​మరియు ఫ్రాంక్స్ యుద్ధం నుండి  ఉపసంహరించ బడిరి. 1146 లోఫాతిమిడ్ హంతకులు జెంగిని హత్య చేశారు.

జెంగి కుమారుడు నూరుద్దీన్, జెంగి పనిని మరింత శక్తితో కొనసాగించాడు. అసాధారణ సామర్ధ్యం గల నూర్బుద్దిన్ పశ్చిమ ఆసియా నుండి క్రూసేడర్స్ ను  తొలగించడానికి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని నిర్వహించాడు. అతని సైన్యం లో ఇద్దరు అధికారులు అయ్యూబ్ మరియు షిర్ఖుహ్(Ayyub and Shirkuh) పేరుగాoచినవారు. నూరుద్దిన్ సైనిక అధికారులు ఉత్తర ఇరాక్, తూర్పు సిరియా మరియు తూర్పు అనాటోలియాలను తమ నియంత్రణలో తెచ్చారు. డమాస్కస్ 1154 లోఆక్రమించబడినది. ఈ విస్తారమైన భూభాగాల వనరులతోనూరుద్దిన్ పాలస్తీనాలోని క్రూసేడర్స్ ను  సవాలు చేయడానికి మరియు ఈజిప్ట్ యొక్క నియంత్రణ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఈజిప్టు పాలస్తీనాకు కీలకమైనది. ఫాతిమిడ్స్ ఈజిప్ట్ ను  పాలించినంతకాలం, క్రూసేడర్స్ పై సైనిక చర్యలు సాధ్యం కాలేదు. 1163 లోకైరోలో రెండు ప్రత్యర్థి వజీర్లు ఉన్నారు.ఒకరు ఈజిప్టులో జోక్యం చేసుకునేందుకు ఫ్రాంక్లను ఆహ్వానించారు. మరొకరు నూరుద్దీన్ కు  విజ్ఞప్తి చేశారు. నూరిద్దిన్ షిర్కుహ్ ను కైరోకి పంపాడు. 1165 లో సెల్జూక్స్ మరియు క్రూసేడర్లు ఇద్దరూ ఈజిప్టులో స్థావరాన్ని స్థాపించలేకపోయారు.రెండు సంవత్సరాల తర్వాత షిర్కుహ్ తన మేనల్లుడు సలాహుద్దీన్ తో ఈజిప్ట్ కు  తిరిగి వచ్చాడు. ఈసారి అతను నైలు డెల్టాలో తన అధికారాన్ని స్థాపించడంలో విజయం సాధించాడు.చివరి ఫాతిమిడ్ ఖలీఫాముస్తాది, షిర్ఖున్ ను తన వజీర్ గా నియమించాడు. 1169 లో, షిర్ఖూ మరణించాడు మరియు అతని మేనల్లుడు సలాహుద్దీన్ అతని స్థానంలో నియమించబడ్డాడు
.
సలాహుద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబి ( Ṣalāḥ ad-DīnYūsufibnAyyūb) (అరబ్బీ صلاح الدين يوسف ابن أيوب ),కుర్ద్ జాతీయుడు ఇతను ఇరాక్ లోని తిక్రిత్ కోటలో, హి.శ. 532 (క్రీ.శ. 1137-38) లో జన్మించాడు.ఈజిప్టుపై క్రూసేడర్స్ చేసిన దాడులను ఎదుర్కొన్నాడు, సైన్యంలోనిఆంతరంగిక తిరుగుబాటులను అణిచివెసాడు  మరియు నిరంతర పౌర యుద్ధం నుండి ఈజిప్టు కు  ఉపశమనం ఇచ్చాడు. మూడు శతాబ్దాల ఫాతిమీడ్ పాలన లో ఈజిప్షియన్ జనాభా సున్నీగా మిగిలిపోయింది. 1171 లో, సలాహుద్దీన్ ఫాతిమిడ్ ఖలిఫాత్ ను రద్దు చేసి అబ్బాసిద్ ఖలీఫాత్ నెలకొల్పాడు.ఈజిప్టు మరియు సిరియా లలో తన అయ్యూబీ సామ్రాజ్యం స్థాపించాడు.
మక్కా, మదీనా మరియు జెరూసలేంలతో సహా ఇస్లామిక్ ప్రపంచంలో సగం కంటే ఎక్కువ ప్రాంతాలను పాలించిన ఫాతిమిడ్లు చరిత్రలో చేర్చబడ్డారు. తుర్కుల అద్వర్యం లో ఐక్య సనాతన ఇస్లాం, క్రూసేడర్స్ కు సవాలును విసిరిoది.

అలీ ఇబ్న్ అబూ తాలిబ్ (ర) తర్వాత ముస్లిం సైనికాదికారులలో  అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు సలాహుద్దీన్. పాలస్తీనా మరియు సిరియా నుండి క్రూసేడర్లను తొలగించడంలో అతను  సాఫల్యం చెందాడు. అతని విజయం  జెరూసలెo ను  తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాదు. భారతదేశంలో ఒక ఇస్లామిక్ సామ్రాజ్యానికి పునాది వేసింది మరియు కొంతకాలం స్పెయిన్ మరియు ఉత్తర ఆఫ్రికాలో క్రూసేడర్ అభివృద్ధికి ఆటoకం ఏర్పరచినది.

కైరోలో ఫాతిమిడ్ ఖలిఫాత్  రద్దు మరియు సిరియా మరియు ఈజిప్టుపై సలాహుద్దీన్ సంఘటిత అధికారం, తూర్పు మధ్యధరా ప్రాంతం పై అధికార సమతుల్యత ముస్లింలకు అనుకూలంగా ఉంది. అరేబియా, యెమెన్ మరియు ఉత్తర ఇరాక్ మరియు తూర్పు అనటోలియా సలాహుద్దీన్ యొక్క ప్రాంతాలకు చేర్చబడ్డాయి. యుద్దానికి సిద్దంగా క్రూసేడర్లు మరియు ముస్లిమ్స్ ఉన్నారు. యుద్ధానికి లాటిన్ నాయకులలో ఒకరైన రెనాడ్ డే చాటెల్సన్(Renaud de Chatellon) కారణం అయ్యాడు. రెనాడే పాలస్తీనా మరియు లెబనాన్ తీర ప్రాంతాల రాజు. అతను ముస్లింల ఒక వ్యాపార కారవాన్ ను ఆక్రమంగా నిర్భందించి హింసించినాడు. సలాహుద్దీన్ ఈ వార్త విన్నప్పుడు, “తన చేతులతోరెనాడ్ డే చాటెల్సన్ చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు. "

రాజు అమౌరీ కుమార్తె సైబిల్లా మరియు ఆమె భర్త గైడి లుసిగ్నన్ ఆ సమయంలో పాలస్తీనా ఫ్రాంకిష్ రాజ్యమును పాలించారు. గైడి లిసిగ్నాన్ నుండి కారవాన్ నిర్భందానికి పరిహారం సలాహుద్దీన్ కోరారు. గైడి లిసిగ్నాన్ దానిని నిరాకరించాడు. రేనాడే ను లొంగ దీసుకోనేందుకు సలాహుద్దీన్ తన కుమారుడు అల్అఫ్దాల్ ను  పంపించాడు. రేనాడేరాజధాని కరాక్ ను ముస్లింలు ముట్టడి చేశారు. ఫ్రాంక్లుఐక్యమై అల్ అఫ్దాల్ ను ఎదుర్కొన్నారు.  సలాహుద్దీన్ తన కుమారునికి సహాయపడటానికి వెళ్లారు. ఈ రెండు సైన్యాలు 1187 జూలై నెల హిట్టిన్  దగ్గర ఉన్న లేక్ టిబెరియాస్ సరస్సు ఒడ్డున కలుసుకున్నాయి. సలాహుద్దీన్ క్రూసేడర్స్ మరియు సరస్సుల మధ్య నిలిచి క్రూసేడర్స్ కు త్రాగు నీటిని నిరాకరించాడు.

సలాహుద్దీన్ యొక్క దళాలు ఫ్రాంక్లను నాశనం చేశాయి. వారి నాయకులు చాలామంది పట్టుబడ్డారు లేదా చంపబడ్డారు. ఖైదీలలో గైడి లిసిగ్నన్, జెరూసలేం రాజు మరియు రెనాడ్తీరప్రాంత పట్టణాల యొక్క రాజు రేనుడ్ ఉన్నారు. సలాహుద్దీన్ గైడి లిసిగ్నన్ తో  మర్యాదతో వ్యవహరించాడు కానీ రెనాడ్ ను  చంపివేశాడు.

తిరోగమించే ఫ్రాంక్స్ ట్రిపోలి వైపు మరిలారు.  సలాహుద్దీన్ వారికి ఉపశమనం కలిగించలేదు. ట్రిపోలిని ముట్టడించాడు.మొదట ఎక్రా తదుపరి నబ్లూస్, రామల్లా, జాఫ్ఫా మరియు బీరూట్ అక్రమించాడు.  ట్రిపులీ మరియు టైర్ ఫ్రాంక్స్ చే ఆక్రమించబడ్డాయి. సలాహుద్దీన్ ఇప్పుడు తన దృష్టిని యెరూషలేముకు మార్చాడు.దీనిని ముస్లింలకు అల్ ఖుద్స్ అని పిలుస్తారు. 60,000 క్రూసేడర్ సైనికులు ఈ నగరాన్నిరక్షిస్తున్నారు.శాంతియుతoగా  లొంగిపోవడానికి వారికి సలాఉద్దిన్  అవకాశం ఇచ్చాడు. ఆఫర్ తిరస్కరించబడింది. సలాఉద్దిన్ సుల్తాన్ నగరముట్టడిని ఆదేశించాడు.

సలాహుద్దీన్, శత్రువు లొంగిపోవటానికి అత్యంత ఉదార షరతులు విదిoచాడు.  పాలస్తీనాలో నివసిసిస్తున్న  ఫ్రాంక్పురుషులు మరియు మహిళలు స్వేచ్చగా ఉండటానికి  అనుమతించబడతారు. బయటకి పోవాలనే వారు సుల్తాన్ యొక్క పూర్తి రక్షణలో వారి ఇళ్లకు తమ వస్తువులతో సహా  బయలుదేరడానికి అనుమతించబడతారు. ఈస్టరన్ గ్రీకులు మరియు అర్మేనియన్లు పౌరసత్వం యొక్క పూర్తి హక్కులతో ఉండటానికి అనుమతించబడినారు. జెరూసలేం రాణి సిబిల్లా ఆమె భర్త, కుమారులు వారి కుటుంబాలతో సహా స్వేచ్చ  గా బయటకి పోవటానికి ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించాడు.1099 లో జెరూసలేం జయించిన సలాహుద్దీన్ క్రుసేడర్స్ పట్ల దాతృత్వం మరియు దయతో వ్యవరించాడు.

జెరూసలేం పతనం ఐరోపానుకలవర పరిచినది.  పోప్ క్లెమెంట్ III ఒక కొత్త క్రూసేడ్ కోసం ఇంగ్లాండ్ రాజురిచర్డ్,జర్మనీ రాజుబర్బరోసామరియుఫ్రాన్స్ రాజుఅగస్టస్ను ఏక పరిచాడు. సిరియాలోని సైనిక అధికారులు  సలాహుద్దీన్ కు సహకారం అందించారు.  పశ్చిమ మధ్యధరాన్ని అడ్డుకోవటానికి మగగ్రి యొక్క ప్రభువు యాకోబ్ అల్ మన్సూర్ తో సలాహుద్దీన్ సంధిని కోరినాడు. కాని స్నేహం కుదరలేదు. క్రూసేడర్లు సముద్రం పై ఆధిపత్యం సాగించారు.

మూడవ క్రూసేడ్ (1188-1191) పాలస్తీనాలోని అన్ని క్రూసేడ్స్ లలో అత్యంత ప్రధాన క్రూసేడ్. ఐరోపా సైన్యాలు సముద్రం ద్వారా కదిలిరి. టైర్ వారి ప్రధాన సైనిక రేవు గా మారింది. యెరూషలేముకు ముందుగా ఎకెర్(Acre)ను  స్వాధీన పరుచుకోవాలి. ముగ్గురు  యూరోపియన్ చక్రవర్తులు జెరూసలేం నగరానికి ముట్టడి వేశారుఅయితే నగరాన్ని రక్షించడానికి సలాహుద్దీన్ ప్రయత్నించాడు. ముట్టడి రెండు సంవత్సరాల పాటు కొనసాగింది.

క్రూసేడర్ల క్రాస్ మరియు ముస్లిం నెలవంక సైన్యాల  మధ్య ఒక ఐతిహాసం సాయుధ పోరాటం జరిగింది. సలాహుద్దీన్ సైన్యాలు సిరియన్ తీరంలో అంతటా వ్యాపించి భూభాగం ద్వారా అదనపు క్రూసేడర్ దాడుల నుంచి  రక్షణ కల్పించాయి. బార్బోరాసాజర్మనీ చక్రవర్తిఅనటోలియా ద్వారా ముందడుగు వేసాడు. తుర్కుల నుండి ప్రతిఘటన నామమాత్రం గా ఉంది. బార్బరొసా ఈ ప్రతిఘటనను ఎదుర్కొని చివరకు  అత్యంత విషాదం గా సరఫా నదిలో మునిగి మరణించాడు. అతని మరణం తరువాత, జర్మన్ సైన్యాలు మూడో క్రూసేడ్లో ఒక చిన్న పాత్ర పోషించాయి. ఎరిక్ లో రక్షకులు వీరోచితంగా ప్రతిఘటన ఇచ్చారుకాని దీర్ఘకాల ముట్టడి అనంతరం అలసిపోయి 1191 లో లొంగిపోయారు.

విజయo సాధించిన  క్రూసేడర్లు అక్కడి వారిని ఊచ కొత్త కోశారు. క్రూసేడర్లు ఆక్రే (Acre)లో కొంతకాలం విశ్రాంతి తీసుకోని ఆ తర్వాత జెరూసలేం వైపు మరిలారు. సలాహుద్దీన్ వారిని గమనిస్తూ వెన్నడినాడు. క్రూసేడర్లు అస్కాల్(Ascalon)వద్దకు చేరుకున్నప్పుడు, సలాహుద్దీన్ ఆ పట్టణాన్ని ఖాళీ చేసినాడు. క్రూసేడర్లు ఆ నగరాన్ని నేలమట్టం చేసినారు.

క్రూసేడర్స్ ముస్లింల మద్య గంభీర వాతావరణం నెలకొంది. రిచర్డ్ మరియుసలాహుద్దీన్ సోదరుడైన సైఫుద్దిన్ల మధ్య సమావేశాలు జరిగాయి. రిచర్డ్ జెరూసలేం మరియు హిట్టిన్ యుద్ధం నుంచి విముక్తి పొందిన అన్ని భూభాగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు డిమాండ్లు ఆమోదయోగ్యం కానివి మరియు అవి నిరాకరించబడ్డాయి.

ఈ పరిస్థితిలోజెరూసలేంకు శాంతి తీసుకురావాలని రిచర్డ్ తన చారిత్రాత్మక ప్రతిపాదనలనుచేసాడు. దాని ప్రకారం, రిచర్డ్ సోదరి సలాహుద్దీన్ సోదరుడు సైఫుద్దీన్ ను  వివాహం చేసుకుంటది. వధువు కు కట్నం వలె తీర ప్రాంతాన్ని క్రూసేడర్లు   ఇస్తారు. సలాహుద్దీన్ యెరూషలేమును  తన సోదరునికి ఇస్తాడు. వధువు మరియు వరుడు తమ రాజధానిగా యెరూషలేము రాజ్యమును పాలించును. సలాహుద్దీన్ ఈ ప్రతిపాదనలను స్వాగతించారు. కానీ ఫ్రాంక్స్ లో పూజారులు మరియు చాలామంది వ్యతిరేకించారు. కింగ్ రిచర్డ్ చికాకు తో ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నాడు. చివరగా రిచర్డ్ మరియు సలాహుద్దీన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దాని ప్రకారం, జెరూసలేం సుల్తాన్ కింద ఉండిపోతుంది, కానీ అన్ని విశ్వాసాల యాత్రికులకు తలుపులు  తెరిచి ఉంటుంది. ప్రార్థనా స్వేచ్ఛ హామీ ఉంటుంది. ఫ్రాంక్స్  జాఫ్యా నుండి టైర్ వరకు విస్తరించిన తీరం వెంట ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారుఅయితే సిరియా మరియు పాలస్తీనాల్లో ఎక్కువ భాగం ముస్లిం చేతుల్లోనే ఉంటుంది.
సలాఉద్దిన్ డమాస్కస్ కు తిరిగి వచ్చాడు. తన శేషకాలాన్ని అల్లాహ్ ఆరాధనలోను, దానధర్మాలలోను పరిపాలన నిర్వహణ లో గడిపాడు. ఆ మహాయోధుడు చివరకు 1193 మార్చ్ 4నడెమాస్కస్ లో మరణించాడు ఉమయ్యద్ మస్జిద్,  సిరియాడమాస్కస్ లో సమాధి చేయబడినాడు.
కుప్తంగా
సలాఉద్దిన్ లేదా సలాదిన్ గా పిలువబడే అల్ నాసిర్ సలహ ఆద్-దిన్ యూసఫ్ ఇబ్న్ అయ్యుబ్ (Al-Nasir Salah ad-Din Yusuf ibnAyyub, known as Salah ad-Din or Saladin).ఇతను 1138 లో తిక్రిత్ ఇరాక్ లో జన్మించాడు.ఇతని తండ్రి నజ్ముద్దిన్ అయ్యుబ్. ఇతని భార్య పేరు ఇస్మత్ అద్-దిన్ ఖతూన్ (Ismat ad-Din Khatun)ఇతని పిల్లలలో ప్రముఖులు అల్-అజీజ్ ఉత్మన్, అల్-అఫ్దాల్ ఇబ్న్ సలాఉద్దిన్Al-Aziz UthmanAl-Afdalibn Salah ad-Din). ఇతను ఈజిప్టు మరియు సిరియా లలో తన అయ్యూబీసామ్రాజ్యం స్థాపించాడు. ఈజిప్టుసిరియాఇరాక్హిజాజ్ మరియు యెమన్ లను పరిపాలించాడు. క్రైస్తవులు జరిపిన మతయుద్ధాలు (క్రుసేడులను) వీరోచితంగా ఎదుర్కొని జెరూసలేం కు విముక్తి కల్పించాడు.






No comments:

Post a Comment