2 December 2017

ప్రపంచ బాష గా అరబిక్ బాష - 18,డిసెంబర్ UNESCO ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవoImage result for world arabic day ముస్లిం నాగరికత స్వర్ణ  యుగం లో, అరబిక్ భాష సైన్స్, కవిత్వం, సాహిత్యం, పరిపాలన మరియు కళ భాష మొదలగు రంగాలలో అనుసంధాన భాష గా అవతరించినది. గ్రీకు, రోమన్ మరియు ఇతర ప్రాచీన విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం మరియు సాహిత్యం అరబిక్ భాషలోకి అనువదించబడి అరబిక్ బాష  ప్రపంచ సాహిత్యం లో అగ్రగామిగా నిలచినది.  
 'హిస్టరీ ఆఫ్ సైన్స్ ' లో జార్జ్ సార్టన్ అంటాడు : “ఎనిమిదవ శతాబ్దం రెండవ అర్ధభాగం నుంచి 11 వ శతాబ్దo అంతం వరకు అరబిక్  మానవాళి యొక్క శాస్త్రీయ, ప్రగతిశీల భాషగా చెప్పవచ్చు ...పడమటి దేశాలు  లోతైన జ్ఞానం అనుభవించటానికి తగినంతగా పరిపక్వం చెందినప్పుడు, వాటి దృష్టి మొదట అరబిక్ భాష వైపు ప్రసరించినది.”
18,డిసెంబర్ ను UNESCO ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవ దినం గా గుర్తించినప్పుడు అరబిక్ భాష ముస్లిం స్వర్ణయుగం సమయంలో సార్వజనీన భాషగా మారిన విధానం ను గుర్తు చేసుకొందాము..

1. సైన్స్ భాషగా అరబిక్ Arabic as the Language of Science
 ముస్లిం  స్వర్ణ యుగం లేదా  యూరోపియన్ మధ్యయుగ కాలంలో శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు  జ్ఞానం కోసం తృప్తి చెందని దాహం ప్రదర్శించారు. ఆ సమయం లో గ్రీస్, రోమ్, చైనా, పెర్షియా, భారతదేశం మరియు ఆఫ్రికాల నుండి ప్రాచీన విజ్ఞానం సేకరించడం మరియు వాటిని  అరబిక్ లోనికి  అనువాదాలు ఆరంభించడం ద్వారా బాగ్దాద్ పాలకులు విజ్ఞాన వికాసం లో కీలక పాత్రను పోషించినారు.  అ సమయంలో, బాగ్దాద్ లోని బైతుల్-హిక్మ్ ఒక శాస్త్రీయ సేకరణ అకాడమీ గా  విజ్ఞాన శాస్త్ర విద్వాంసులు, ప్రసిద్ధ అనువాదకులు, రచయితలు, శాస్త్రవేత్తలు మరియు కళలు మరియు నైపుణ్యాల్లో నిపుణులతో నిండి ఉండే స్థలంగా మారింది.
బ్రియాన్ విట్టేకర్ గార్డియన్ వార్తాపత్రికలో ఇలా రాశాడు: బాగ్దాద్ హౌస్ ఆఫ్ విజ్డమ్, హ్యుమానిటీస్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఖగోళ శాస్త్రం, మెడిసిన్, కెమిస్ట్రీ, జూలాజీ మరియు భూగోళ శాస్త్రం, పెర్షియన్, ఇండియన్ మరియు గ్రీక్ గ్రంథాల సేకరణ అనువాద స్థలం  గా  మారింది.
ఇబ్న్ అల్-హేథం, అల్ సుఫీ, ఇబ్న్ సినా, అల్-రజి, అల్-ఖవర్జీమి, అల్-కింది, అల్-జహిజ్, అల్-మహమమియ వంటి ప్రసిద్ధ పరిశోధకులు ఈ సృజనాత్మక స్వర్ణయుగ ప్రముఖులు , మరియు వారి కృషి రాబోయే తరాలపై శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంది.
 2.ఖగోళ శాస్త్ర అభివృద్ధి  లో అరబిక్ బాష:  
ముస్లిం నాగరికత స్వర్ణ యుగం లో భారీ పురోగతి సాధించిన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రజ్ఞులు మన  సొంత గెలాక్సీ వెలుపల స్టార్ సిస్టమ్ యొక్క మొట్టమొదటి రికార్డు మరియు చంద్రుని యొక్క చలనం యొక్క మూడవ అసమానత్వం (third inequality of the moon’s motion), కనుగొన్నారు మరియు వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేసే సాధనాలను అభివృద్ధి చేశారు
 9 వ శతాబ్దంలో టోలెమి యొక్క అల్మాగేస్ట్ అరబిక్ లోనికి  అనువదించబడినప్పుడు, అనేక అరబిక్-భాషా వర్ణ వివరణలు నక్షత్రాలకు పేర్లుగా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. స్వర్ణయుగం మరియు తర్వాత అరబిక్ పేర్లను నక్షత్రాలకు ఇచ్చే సాంప్రదాయం కొనసాగింది. ఈనాటికి అనేక ప్రముఖ నక్షత్రాలు  ముస్లిం నాగరికత యొక్క స్వర్ణయుగం సమయంలో వాటికిచ్చిన  అరబిక్ మూలాల పేర్లను కలిగి ఉన్నవి.
3. కళ మరియు సౌందర్య  భాషగా అరబిక్ (Arabic as the Language of Art and Beauty)

ముస్లిం నాగరికత వికాసం లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందన మరొక రంగం  కళ. ఇస్లామిక్ ప్రపంచం యొక్క కళాకారులు తమ సృజనాత్మకతకు  ఒక విలక్షణ రూపo ఇచ్చి  అద్భుతమైన కళాకృతులను సృష్టించారు. ఇస్లామిక్ సంస్కృతిలో విస్తృతంగా అభివృద్ధి చెందిన కళల్లో కాలిగ్రఫీ ఒకటి అది కొన్నిసార్లు జ్యామితీయ మరియు సహజ రూపాలతో కలిపి ఉంటుంది. ఇస్లాంలో అరబిక్ భాష యొక్క ప్రాముఖ్యత మరియు అరబిక్ సాంప్రదాయం లో రాయడం చేతివ్రాత కాలిగ్రఫీ అభివృద్ధికి కారణమైంది.
4. కవిత్వం యొక్క భాషగా అరబిక్(Arabic as the Language of Poetry)
సాంప్రదాయకంగా, కవిత్వం అరబ్ వారసత్వంలో ఒక బలమైన మరియు అనర్గళమైన  వ్యక్తీకరణ రూపంగా ఉంది. ముస్లిం నాగరికత యొక్క స్వర్ణ యుగంలో సంభవిస్తున్న తీవ్రమైన శాస్త్రీయ ఉద్యమం మానవీయ శాస్త్రాలు మరియు సహజ విజ్ఞాన శాస్త్రాల మధ్య వివాదానికి దారి తీయలేదు. భాష అనేది మానవాళి యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడే నూతన మార్గాలకు అనుగుణంగా శక్తి వంతమైన సామర్ధ్యం కలిగివుంది.
ఆ సమయంలో వివిధ శాస్త్రాల పునరుజ్జీవనానికి కట్టుబడి, నూతన వైజ్ఞానిక కవిత్వం ప్రముఖ వైద్యుడు ఇబ్న్ సినా, మరియు ప్రముఖ నావికుడు ఇబ్న్ మాజిద్ వంటి శాస్త్రీయ విద్వాంసులు విద్యలో ఉపయోగానికి రూపొందించిన పద్యాల యొక్క సంప్రదాయంతో వర్ధిల్లింది. అరబిక్ కవిత్వం శాస్త్రాల యొక్క నైతిక, సామాజిక మరియు మానవతావాద అంశాలను మరియు  వైద్య సంరక్షణ కూడా నిర్వహించింది

  5. సాహిత్య భాషగా అరబిక్ (Arabic as the Language of Literature)

దివ్య ఖుర్ఆన్ మరియు తరువాత సాహిత్య కళాఖండాలను  అరబ్బులు సుదీర్ఘకాలం సున్నితమైన ఖచ్చితత్వం, స్పష్టత మరియు వాగ్ధాటి యొక్క ఖచ్చితమైన సాధనంగా భావించారు. దివ్య ఖుర్ఆన్ స్థిర ప్రమాణంగా విస్తారమైన మరియు గొప్ప సాహిత్యం పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో సేకరించబడింది.

కవిత్వంతో పాటు, గద్యo అబ్బాసైడ్ల క్రింద వృద్ధి చెందింది. ఆ సమయంలో అరబిక్ గద్య ప్రముఖులలో అల్ జహిజ్ ఒకరు. (8 వ / 9 వ శతాబ్దం బాగ్దాద్లో నివసించారు). అతను తన కాలంలోని ప్రముఖ మేధావులలో ఒకడు అయ్యాడు. అతను తన బుక్ అల్ బుఖారారా (బుక్ ఆఫ్ ది మిజర్స్ Book of the Misers) కు ప్రఖ్యాతి గాంచాడు, ఇది మానవ మనస్తత్వశాస్త్రం యొక్క చమత్కారమైన మరియు తెలివైన అధ్యయనం. ఆ కలం లో లెక్కలేనన్ని ఇతర రచయితలు మరియు కవులు చాలా ప్రఖ్యాతి గాంచారు మరియు అల్ మత్తాబిబ్, అల్ మఆర్రి, యాకుత్ అల్ హమ్వి, బాడీ అల్ జమాన్ అల్ హమాతానీ, ఇబ్న్ హజిం అల్ అండలూసి, ఇబ్న్ తుఫైల్ మరియు అనేక మంది ఇతరులు ఇప్పటికీ ప్రసిద్ది చెందారు.


యునెస్కో ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం:

190 వ సెషన్ లో  యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రతి సంవత్సరం 18 డిసెంబర్ ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయం తీసుకుంది. మొరాకో మరియు సౌదీ అరేబియా ప్రతిపాదించిన ఈ ప్రతిపాదన, బహుభాషిత సాంస్కృతిక వైవిధ్యo మరియు మానవ నాగరికత మరియు సంస్కృతి యొక్క భద్రత మరియు వ్యాప్తి లొ అరబిక్ భాష యొక్క పాత్రను తెలుపుతుంది. ఈ నిర్ణయం సాంస్కృతిక సంతృప్తి మరియు నాగరికతల మధ్య సంభాషణల ద్వారా ప్రజల మధ్య మరింత విస్తృతమైన సహకారంను అమలు చేయవలసిన అవసరాన్ని గుర్తించింది
...

No comments:

Post a Comment