6 April 2019

భారతదేశంతో శ్రీలంక ముస్లింల సంబంధాలు (Sri Lankan Muslims’ links with India)






శ్రీ లంక లోని ఇతర జాతులు  అయిన సింహళులు మరియు తమిళుల లాగానే  శ్రీలంక ముస్లింలు కూడా భారతదేశ మూలాలను కలిగి ఉన్నారు.  భారతీయ ఉపఖండంతో ముఖ్యంగా తమిళ భాషతో వారు సంభంధాలు  కలిగి ఉన్నారు,

 శ్రీ లంక ముస్లింలు గతంలో తమిళనాడు లోని ఇస్లామిక్ సంస్థలలో దార్మిక విద్య పొందేవారు. గల్ఫ్ బూమ్ తరువాత శ్రీలంక ముస్లిం యువత సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ దేశాలలో  ఉద్యోగ అవకాశాలు పొందారు మరియు అక్కడి  ఇస్లామిక్ సంస్థలలో విద్యనబ్యసించ సాగారు.  కాని తమిళ భాష పట్ల  ఉన్న మమకారం వలన వారు ఇప్పటికి భారతదేశం తో   సంబంధాలు కలిగిఉన్నారు.

శ్రీలంక ముస్లింలను  “సిలోన్ మూర్స్” అని కూడా వ్యవరిస్తారు. వారికి  ఇండియన్ మూర్స్, బొహ్రాస్, కాచీ మమోన్స్ మరియు మలై ముస్లిమ్స్ మద్య వ్యత్యాసం కలదు. జావా నుండి వచ్చిన మలై ముస్లిమ్స్ మినహా ఇతర ముస్లింలు   భారతదేశంతో మరియు  పాకిస్తాన్తో మంచి వాణిజ్య సంభంధాలు కలిగి ఉన్నారు.

ప్రధానంగా "శ్రీలంక ముస్లింలు" లేదా "సిలోన్ మూర్స్" అరబ్ సంతతికి చెందినవారు. మొదట్లో అదికoగా  ముస్లింలు  మధ్యప్రాచ్య ప్రాంతం నుండి వచ్చినప్పటికి ప్రధానంగా ముస్లిం వలసలన్నీ మలబార్ తీరం (కేరళ) ద్వారా జరిగినవి.

 “ఎథ్నోలజికల్ సర్వే ఆఫ్ ది ముస్లిమ్స్ అఫ్ శ్రీ లంక The Ethnological Survey of the Muslims of Sri Lanka” నిర్వహించిన   మెరీనా అజీజ్ ప్రకారం "మొదటి ముస్లింల నౌకా సమూహం 636 AD లో ఖలీఫా ఉమర్  కాలo లో హిందూ మహాసముద్రం వైపుగా ప్రయాణిoచినది అప్పటినుండి ముస్లిం వ్యాపారులు భారతదేశంలోని మలబార్ తీరప్రాంతo లో స్థిరపడ్డారు. అప్పటికే అరబ్ వ్యాపారస్తులు  4వ శతాబ్దం నాటికే  అనగా ఇస్లాం కు పూర్వకాలంలోనే  మలబార్ తీరప్రాంతo లో స్థిరపడ్డారు అనటానికి  దాఖలాలు కలవు."

టెన్నెంట్ (జేమ్స్ ఎమెర్సన్ టెన్నెంట్, లండన్, 1859) ప్రకారం, ఈ స్థావరాలు వాణిజ్యం మరియు వలసల పెరుగుదలతో విస్తరించినప్పుడు, ప్రజలు శ్రీలంక తీరానికి విస్తరించారు మరియు అక్కడ స్థిరపడ్డారు. అక్కడి నుండి వారు తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించారు.

"7 వ శతాబ్దం నాటికి అరబ్ లు తమిళనాడులోని కయల పట్నం  (Kayalpatnam) లో స్థిరపడ్డారు. కయలపట్నం నుండి వారు శ్రీలంకకు విస్తరించారు.

అరబ్లు ఇస్లాంకు  పూర్వం నుండి వ్యాపారులే  అయినప్పటికి, ఇస్లాం వారికి వాణిజ్యం మరియు ప్రాదేశిక ఆస్తులను విస్తరించడానికి సహాయపడింది. వాణిజ్యం యొక్క విస్తరణ అధిక విదేశీ వలసల స్థాపనకు, స్థానిక మహిళలతో వివాహాలకు  మరియు అరబ్ కాని వర్గాల నుండి మత మార్పిడికి తోడ్పడినది.



"9 వ శతాబ్దం AD నాటికి యూరప్ మరియు తూర్పు మధ్య ఉన్న నావికా వ్యాపారం పై అరబ్బులు అధిపత్యం వహించారు మరియు 14 వ శతాబ్దం AD నాటికి వారు పెర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రం, మాలే ద్వీపసమూహం మరియు చైనా ప్రాంతంలో వాణిజ్యం నిర్వహిస్తున్నారు” అని అజీజ్ అన్నారు. 

మలబార్ మరియు కయలపట్నం నుండి అరబ్-ఇండియన్ మూలాలు కలిగిన ముస్లింలు ఇతర అరబ్ భూముల నుండి వచ్చిన వారితో  కలసి కొలంబో మరియు బెరువెలాలో స్థిరపడ్డారు. 1024 లో బెరూవాలా   లో మొట్టమొదటి ముస్లిం వలసదారుల ఆగమనం జరిగింది.  కయలపట్నం నుండి వలస వచ్చినవారు నేత కళను బేవరూలాలో ప్రవేశపెట్టారు.

అరబ్ ముస్లింలు మరియు మిశ్రమ అరబ్-ఇండియన్ సంతతివారు, శ్రీలంకలోని  స్థానిక మహిళలను అనగా తమిళ మహిళలను  వివాహం చేసుకున్నారు. ఎందుకంటే తీరప్రాంతo మరియు వాణిజ్యo లో తమిళులు అధికంగా ఉన్నారు.  కానీ త్వరలోనే  ముస్లింలు తమ “తవలామా” కారవాన్లతో  (ఎడ్ల బండి రవాణా వ్యవస్థతో) లోతట్టు  ప్రాంతాలకు విస్తరించారు.  శ్రీలంకలోని అనేక లోతట్టు/ఇంటేరియర్ ప్రాంతాలలో వారు స్థిరపడ్డారు. డాక్టర్ అమేర్ అలీ అభిప్రాయం ప్రకారం, తవలామా రవాణా వ్యవస్థలో ఎక్కువ మంది దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఇండో-అరబ్ ముస్లింలు.

కేరళతో సంభందాలు(Links With Kerala)

కేరళతో ముస్లింల సంబంధాలు స్పష్టంగా తూర్పు ప్రాంతాలలో కనిపిస్తాయి. బట్టికోలా ప్రాంతంలో, అరబ్బులు మరియు అరబ్-ఇండియన్ సంతతికి చెందిన వారు మలబార్ తీర ప్రాంతానికి వలస వచ్చిన స్థానిక ముకువర్ కుల మహిళలను వివాహం చేసుకున్నారు. వారు 4 వ శతాబ్దంలో మన్నార్ మరియు జాఫ్నా ద్వారా తూర్పు శ్రీలంకకు వచ్చారు. బట్టికోల లోని ముస్లింలు మరియు ముకువర్లు   మాతృస్వామిక వ్యవస్థ (తల్లి వరుస) ద్వారా గుర్తించబడుతున్నారు. కేరళలో మాదిరిగానే వారు  మాతృస్వామిక "కుడీస్" లేదా వంశాలుగా ఏర్పడతారు
అరబిక్ తమిళం లేదా అరవి (Arabic Tamil)

ఇండియన్ మూర్స్ నుండి శ్రీలంక ముస్లింలను వేరుపరిచే ఒక అంశం అరబిక్ తమిళం అని పిలువబడే తమిళ బాష  యొక్క ఒక రూపం. అరబిక్ తమిళం అరబిక్ పదాలను మరియు వ్యక్తీకరణలను ఉపయోగిస్తుంది మరియు అరబిక్ లిపిలో రాయ బడుతుంది.  కొలoబో  నౌకాశ్రయంలో, ముస్లింలు అరబిక్ మరియు తమిళ్ల మిశ్రమాన్ని మాట్లాడేవారు మరియు తమిళాన్ని రాయడానికి అరబిక్ లిపిని   ఉపయోగించేవారు అని 16 వ శతాబ్దపు పోర్చుగీసు చరిత్రకారుడు డ్యుయార్స్ బార్బోసా అన్నాడు. అంతకుముందు, శ్రీలంక ముస్లింలు అరబిక్-తమిళ భాషలో సాహిత్యాన్ని వెలువరించారు. అరబిక్ మరియు తమిళ లిపులను రచయితలు,కవులు  ఉపయోగించారు.

అరబిక్-తమిళ  సాహిత్యం కాలక్రమేణా క్షీణించినది. నేడు శ్రీలంక ముస్లింలు తమ రచనలలో మరియు అధికారిక ప్రసంగాలలో తమిళo యొక్క స్వచ్ఛమైన రూపాన్ని ఉపయోగిస్తారు, అయితే వారి రోజు మాట్లాడే తమిళం లో  అరబిక్ పదాలు మరియు వ్యక్తీకరణలు ఉండవచ్చు. భారతీయ మూర్స్, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంతో నిరంతర సంబంధాలు కలిగి ఉన్న వారు తమిళనాడులో మాట్లాడే విధంగా తమిళo మాట్లాడతారు.

సింహళ ప్రాంతాలలో తమిళ బాష  మనుగడకు ఆ  ప్రాంతాలలో నివసిస్తున్న ముస్లింలు ప్రధాన కారణం. ప్రొఫెసర్ కార్తిగూసు శివతంబిప్రకారం : "నేడు సింహళ దేశంలో ఉన్న లోతట్టు గ్రామాల్లో తమిళo వినబడటానికి  ప్రధాన కారణం ముస్లింలు. వారు లేకపోతే తమిళం సింహళ  ప్రాంతాల నుంచి అదృశ్యమయ్యేది . "

ప్రదర్సక కళలు Performing Arts
ప్రదర్శక కళల రంగంలో తమిళనాడు, కేరళల ప్రభావం స్పష్టంగా ఉంది. MMM మహోరూఫ్ "పెర్ఫార్మింగ్ అండ్ అదర్ ఆర్ట్స్ ఆఫ్ ది ముస్లింస్" అనే తన పేపరులో “సిలంబం లేదా సిలంబట్టం” ను వర్ణించాడు.  ఇది "అరబ్ ఆర్ట్" గా గుర్తించబడి  కర్రలను నిర్వహించడంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. “సిలంబం” కేరళ మరియు తమిళనాడు లోని తిరునెల్వేలి జిల్లా లో ప్రాచుర్యం పొందినది.
“కాళి కంబు” నృత్యం, చిన్న కర్రలతో పురుషులు చేసే  నృత్యం అరబ్ మూలం ను కలిగి ఉంది. కానీ ఇది మిశ్రమ అరబ్-మలయాళీ మూలం కలిగిన కేరళలోని మోప్లలలో  కూడా కనబడుతుంది.  తమిళ సంగీత రూపం అయిన “విలు పట్టు” ముస్లిం జానపద కళలలో భాగమైనది.



తమిళనాడు మరియు కేరళలతో గల ఈ సంబంధాలు కాలక్రమేణా లేదా ఆధునికీకరణ లేదా 1980 ప్రారంబం నుండి శ్రీలంక ముస్లింల ఇస్లామీకరణకు వలన అంతరించిపోయాయి.
పోర్చుగీస్ రూల్ ప్రభావంImpact of Portuguese Rule
1505 లో శ్రీలంకలో పోర్చుగీస్ వారి రాక ముస్లింలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. పోర్చుగీసు వారు మలబార్ తీర  మరియు శ్రీలంక  ముస్లింలపై సైనిక శక్తి ప్రయోగించారు.. శ్రీలంక యొక్క పడమటి సముద్ర తీరప్రాంత నుండి ముస్లింలను పారద్రోలేందుకు సైనిక శక్తీ ఉపయోగించబడింది.
శ్రీలంక ముస్లింల దీనస్థితి కి చలించిన అప్పటి సింహళ క్యాండి ప్రాంత  రాజు “సేనారత్”   తూర్పు తీరంలోని బట్టికోల  జిల్లాలో పండించటానికి ముస్లింలకు సాగు భూమిని ఇచ్చారు. ముస్లింలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది ఎందుకంటే ధైర్యవంతులైన వ్యాపారులు కొద్దికాలంలోనే  విజయవంతమైన రైతులుగా మారారు.
బ్రిటీష్ రూల్ British Rule

పోర్చుగీసు మరియు డచ్ పాలన తరువాత, 18 వ శతాబ్దం చివరికి ప్రారంభమైన బ్రిటీష్ పాలనలో మళ్ళి ముస్లింలు బలపడ్డారు.1815 నుండి మొత్తం దీవిలో సంఘటితమయ్యారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలించిన కారణంగా భారతీయ ప్రభావం మళ్ళీ శ్రీలంక ముస్లింలపై పడినది.. కోరమాండల్ ప్రాంతం, మలబార్ మరియు పడమటి భారతీయ తీరాలు వాణిజ్యం తో వికసించాయి. భారత మూర్స్ సహజంగా బ్రిటీష్ పాలనకు అనుకూలురు. బ్రిటీష్ పాలన లో తమిళ ముస్లింల తో పాటు  తమిళం మాట్లాడని బోహ్రాస్, కాచీ మమోన్స్, ఉత్తర భారతదేశం నుండి ఉర్దూ మాట్లాడే ముస్లింలు మరియు బెంగాలి ముస్లిమ్స్ శ్రీలంక లో వలస ఏర్పరచుకొన్నారు.  

No comments:

Post a Comment