27 May 2019

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ముస్లిం సహకారం (Muslim Contribution to India’s Economy)


ఒక దేశం యొక్క నిర్మాణంలో ఒక మత మైనారిటీ వర్గ  సహకారం విశ్లేషించడం లో మనకు  సాధారణంగా ముందు నివేదికలు, అనుభావిక డేటా మరియు  ఆ వర్గం యొక్క యొక్క మొత్తం సాంఘిక-ఆర్ధిక స్థితి కూడా సహకరిస్తుంది. సాధారణంగా మీడియా అత్యధిక 100 మంది ధనవంతులైన భారతీయులలో కనిపించే కొద్దిమంది మైనారిటీ వర్గ ప్రముఖ వ్యక్తులను ఎన్నుకొని   ఆ వర్గ సమాజం దేశ  ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో అందించిన బహుముఖ సహకారం ను  పూర్తిగా విస్మరిస్తుంది. ఈ ధోరణి భారతదేశం యొక్క తయారీలో అద్భుత పాత్ర పోషించిన మైనారిటీ వర్గానికి చెందన లక్షలాది  మంది వ్యక్తుల అద్భుతమైన భాగస్వామ్యం కు పూర్తి న్యాయం చేయదు.

ముస్లిం ఆధిపత్య పరిశ్రమలు (Industries dominated by Muslim:
ఒక నిర్దిష్ట పరిశ్రమ ఒక ప్రత్యేక మత సమాజానికి మాత్రమే ప్రత్యేకమైనది కాదని చెప్పకపోయినా, కొన్ని వర్గాలు, నైపుణ్యాలు మరియు కళలతో  సంబంధం కలిగి ఉండటం మనం గమనిస్తాము.
 భారతీయ ముస్లిం సమాజం లో ఒక  పెద్ద విభాగం చారిత్రాత్మకంగా కళాకారులు మరియు నైపుణ్యం కలిగిన కార్మికులుగా ఉన్నారు. వీటిలో కొన్ని నైపుణ్యాలు ఇప్పటికి  వివిధ పరిశ్రమల్లోకి కనిపిస్తాయి. ఉదాహరణకు, ఇత్తడి పరిశ్రమ, తోలు పరిశ్రమ, మాంసం మరియు గొడ్డు మాంసం పరిశ్రమ, చేనేత పరిశ్రమ, చేతితో ఎంబ్రాయిడరీ పరిశ్రమ, తాళాల /లాక్ పరిశ్రమ మరియు బేకరీ మరియు మిఠాయి పరిశ్రమలు అనేవి  ముస్లింల ఆధిపత్యం కలిగి ఉంటాయి. కొన్ని వర్తకాలు మరియు నైపుణ్యాలు భారతదేశం లో ముస్లింలకు  పర్యాయపదంగా మారాయి, ఇవి వాహన మెకానిక్, మాంస వంటక పని, సౌందర్య ఉపకరణాలు, మొదలైనవి.


భారతదేశంలోని అత్యుత్తమ ముస్లిం వ్యాపారవేత్తలు (Outstanding Muslim businessmen of India):

భారతదేశ స్వాతంత్ర్యం మరియు తదుపరి విభజన సమయంలో భారతీయ ముస్లింలలో  ఉన్నత మేధో, ప్రభావవంతమైన మరియు సంపన్న వర్గo పాకిస్థాన్కు వలస పోగా భారత దేశం లో ఉన్నవారు తమ  కృషి మరియు పట్టుదల, కటోర పరిశ్రమ వలన ఆర్ధికంగా ఉన్నత స్థితి కి చేరుకొన్నారు. కొందరు ముస్లింలు వ్యాపార ప్రపంచంలోని ప్రముఖ పేర్లలో మరియు తరచూ ఫోర్బ్స్ మరియు ఫార్చ్యూన్ జాబితాలో,  భారతీయ కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు: అజీమ్ ప్రేమ్జీ (విప్రో), యూసఫ్ హమీద్ (సిప్లా), హబీల్ ఖొరాకివాలా (వోఖార్డ్ట్), యూసఫ్ అలీ (లూలు / ఎమ్కే గ్రూప్ Lulu /Emke Group ) మరియు ఇర్ఫాన్ రజాక్ (ప్రెస్టీజ్ గ్రూప్).

మరి కొందరు తమ కృషి, పరిశ్రమ  తో  పేరు సంపాదించారు. ఉదాహరణకు, సిరాజుద్దీన్ ఖురేషి (హింద్ ఇండస్ట్రీస్), మేరాజ్ మనాల్ (హిమాలయ హెర్బల్ హెల్త్ కేర్), హకీం హఫీజ్ అబ్దుల్ మజీద్ కుటుంబం (హమ్దార్డ్ లాబోరేటరీస్), షానజ్ హుస్సేన్ (షానజ్ హుస్సేన్ గ్రూప్), పర్వేజ్ ఖాదర్ (లిబర్టీ గ్రూప్), అబ్దుల్ రజ్జాక్ అల్లానా (అల్లానా గ్రూప్), బిఎస్ అబ్దుర్ రెహ్మాన్ కుటుంబం (ETA స్టార్ గ్రూప్ మరియు బుహారీ గ్రూప్), ఒస్మాన్ తలాబ్ (తాలాబ్ గ్రూప్), డాక్టర్ అబ్దుల్ ఖాదీర్ (షాహీన్ గ్రూప్) మరియు బద్రుద్దిన్ అజ్మల్ (అజ్మల్ పెర్ఫ్యూమ్స్).

ప్రవాస ముస్లింలు   Muslim expatriates
భారతీయ ప్రవాసులు సాలీనా 80 బిలియన్ డాలర్ల సొమ్ము ఇండియా కి పంపుతారు. విదేశి రెమిటెన్స్ (remittances) విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆ సొమ్ము ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (26.9%), యునైటెడ్ స్టేట్స్ (22.9%), సౌదీ అరేబియా (11.6%), కతర్ (6.5%), కువైట్ (5.5%) మరియు ఒమన్ (3.0%) నుండి చేరుతుంది. కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు కలిసి మొత్తం 58.7 శాతం ఆదాయం పొందుతున్నాయి. ఈ చెల్లింపులలో  ముస్లింలు  సింహం భాగాన్ని కలిగి ఉంటారని భావించవచ్చు. విదేశీ మారక ద్రవ్యం  మంచి అవకాశాలు మరియు భారతీయుల జీవన నాణ్యతను పెంచడం లో మరియు  లక్షలాది మంది భారతీయులకు ఉపాధి కల్పిస్తుంది.


కమ్యూనిటీకి సవాలు Challenge to the community:
నిస్సందేహంగా, భారతదేశం యొక్క ఆర్ధిక వ్యవస్థకు ముస్లింల సహకారం అసాధారణమైనది. దాదాపు 15% మంది కల ముస్లిం సమాజ౦ దేశం లోని దాదాపు అన్ని రంగాల్లో పరిశ్రమలు మరియు వర్తక కార్యకలాపాల రంగం లో దేశానికి సేవలు అందిస్తుంది.  నిర్మాణ రంగo, ఐటీ, బిపిఓ పరిశ్రమ, వస్త్ర మరియు వస్త్ర కర్మాగారాల నుండి చిత్రం, టీవీ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమల రంగం వరకు  ముస్లింలు వారి సంబంధిత డొమైన్లలో సమర్థత సాధించగలరు.

ఇవన్నీ ఉన్నప్పటికీ, ముస్లింలకు నైతికత, సచ్చిలత అనేవి బలీయమైన సవాలుగా మిగిలిపోయినవి. ప్రతి ముస్లిం ఇస్లాం కోసం ఒక రాయబారి మరియు అతని/ఆమె రోజువారీ ప్రవర్తన మరియు తోటి దేశస్థులతో అతని లావాదేవీలు ఉన్నత ప్రమాణాలలో ఉండాలి. అరబ్ మరియు ముస్లిం వర్తకులు తమ వ్యాపార లావాదేవీలను  నిజాయితీగా నిర్వహించడం ద్వారా భారతదేశం యొక్క తీరప్రాంతాలలో మరియు దూర తూర్పు మరియు ఆఫ్రికాలోని వివిధ దేశాలలో ఇస్లాం వ్యాప్తి చెందిందని చెపుతారు.


ముస్లిం సమాజం ఇస్లాం బోధనలు  మరియు ఉన్నత నైతిక ప్రమాణాలకు అనుగుణంగా తమ  వ్యాపార మరియు వాణిజ్యం నిర్వహించాలి. వారి వ్యాపార పద్ధతుల్లో నిజాయితీ నాణ్యత మరియు నమ్మకం ఉండాలి. ఇది ముస్లిం సమాజం పట్ల దేశ ప్రజలకు మంచి భావం ఏర్పరుస్తుంది మరియు దీనివలన ముస్లిమ్స్ తమ స్వంత డొమైన్లలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించ గలరు.

దివ్య ఖుర్ఆన్ క్రయ, విక్రయాలలో, తూకం లో  మోసానికి పాల్పడరాదని విశ్వాసులను హెచ్చరించినది. “కొలతలు, తూనికలలో న్యాయ సమ్మతంగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తవులను తగ్గించి ఇవ్వకండి. ధరణిలో కల్లోలాన్ని వ్యాపింప జేయకండి”. 9-85.
లెక్కల దినమున మానవులందరూ సర్వలోకాల ప్రభువు ముందు నిలబడవలసి ఉంది?.

No comments:

Post a Comment