27 May 2019

2019 లోక్ సభ ఎన్నికలలో మహిళా అభ్యర్ధుల ఎన్నిక - విశేషాలు










Ø 2019 ఎన్నికలు మహిళా పరంగా మిశ్రమ పలితాలను ఇచ్చాయి.ఈ ఎన్నికలలో  కొందరు ప్రముఖ మహిళలు పోటిచేసిన తమ స్థానాలలో పరాజయం పొందగా  మరి కొందరు విజయం సాధించారు.
Ø 2019 ఎన్నికలలో అన్ని రాజకీయ  పక్షాల నుండి మొత్తం 71 మహిళలు పోటిచేయగా 7,334 పురుష అబ్యర్ధులు పోటిచేసినారు.
Ø 2019 ఎన్నికలు మహిళా పరంగా మిశ్రమ పలితాలను ఇచ్చాయి.
Ø పోటి చేసిన మహిళలలో 78 విజయం పొందారు.  2014లో 62 మహిళలు  విజయం సాధించారు.
Ø లోక్ సభ లో మహిళల ప్రాతినిద్యం నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ అది ప్రపంచ ప్రమాణాల దృష్ట్యా మరింత తక్కువ. మొదటి లోక్ సభ లో మహిళా ప్రాతినిద్యం 5% ఉండగా ప్రస్తతం అది 14% కు పెరిగింది.
Ø రువాండా లో మహిళా ప్రాతినిద్యం 61% ఉండగా  సౌత్ ఆఫ్రికా లో 43% బ్రిటన్ లో 32% అమెరికా లో 24% బంగ్లాదేశ్ లో 21% ఉంది.
Ø మహిళలలో  విజయం సాధించిన వారిలో ప్రముఖురాలు స్మ్రితి ఈరాని. ఈమె బి.జే.పి. అబ్యర్ధిగా కాంగ్రెస్ అద్యక్షుడు శ్రి రాహుల్ గాంధీని యూ.పి.లోని అమేతి నియోజకవర్గం లో 52వేల మేజార్తి తో ఓడించారు.
Ø యూ.పి. లోని మధుర నియోజిక  వర్గం నుండి మరొక బి.జే.పి. ప్రముఖురాలు సిని నటిమణి హేమా మాలిని విజయం సాధించారు.  
Ø బిజెపి నుంచి 16 మంది తిరిగి ఎన్నికైనారు.
Ø బిజెపి నుండి తిరిగి గెలిచిన మహిళా ఎంపీలలో ప్రముఖురాళ్ళు. వీరిలో  సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, చండీగఢ్ నుంచి కిరణ్ ఖేర్, న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లెకి ఉన్నారు.
Ø సోనియా గాంధీ కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ. తిరిగి ఎన్నికయ్యారు. ఎన్సిపి నాయకురాలు  సుప్రియ సులే బారామతి నుంచి తన స్థానాన్ని తిరిగి పొందారు.  
Ø పంజాబ్ నుంచి  ఎన్నికైన ప్రముఖ మహిళామణులు  - ప్రణెత్ కౌర్ ఈమె పంజాబ్ ముఖ్య మంత్రి  కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య - పాటియాలా సీటును 1.60 లక్షల ఓట్లతో గెలిచారు.
Ø పంజాబ్ లోని  బటిండా నియోజకవర్గం నుంచి 21 వేల ఓట్ల మెజారిటీ తో తేడాతో ఎస్ఎడి అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ భార్య మంత్రి హరిప్రీత్  కౌర్ బాదల్ గెలిచారు.
Ø వెస్ట్ బెంగాల్ లోని  42 సీట్లలో 17 మంది మహిళా అభ్యర్థులకు తృణమూల్ కాంగ్రెస్ నేత దిది మమత బెనెర్జీ టిక్కట్ పంపిణీ చేశారు.
Ø వారిలో నస్రాట్ జహాన్, మిమి చక్రవర్తి, సతబ్దీ రాయ్, మూన్ మూన్ సేన్ ప్రముఖులు.
Ø నస్రత్ జహాన్ బషిరత్ నియోజకవర్గం నుంచి  3.5 లక్షల మెజారిటీతో గెలిచింది. మిమీ చక్రవర్తి జాదవ్ పూర్  నుంచి 2.9 లక్షల తేడాతో విజయం సాధించగా సతబ్డి రాయ్లతో 88,924 ఓట్లతో గెలుపొందారు.
Ø మరో ప్రముఖ నటిమణి మూన్ మూన్ సేన్ ఈ ఎన్నికలలో పరాజయం సాధించారు.
Ø బెంగాలీ నటి లాకట్ చటర్జీ బెంగాల్ లో బిజెపి తరుపున హుగ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
Ø ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బి..జే.డి.తరుపున ఈ ఎన్నికలలో మహిళలకు 1/3వంతు స్థానాలు కేటాయించగా వారిలో ఆరుగురు  గెలిచారు. వారిలో ప్రముఖురాలు 2వ తరగతి డ్రాప్-అవుట్  70 సంవత్సరాల వయస్సు గల ప్రమమియా బిసోయి. ఆమె ప్రతిష్టాత్మక అస్కా నియోజకవర్గం నుంచి గెలిచారు.
Ø అయితే బిజెపి అబ్యర్దులు  అందరిలో అత్యంత వివాదస్పదురాలు భోపాల్ లో ముగ్గురు లక్షల ఓట్ల తేడాతో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్  ను ఓడించిన ప్రగ్యా ఠాకూర్.  
Ø అయితే మరి  కొంత మంది పరాజయం సాధించారు.
Ø వీరిలో తెలంగాణా ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఒకరు. ఈమె  నిజామాబాద్ నుంచి పరాజయం పొందారు.  ఈ నియోజకవర్గం నుంచి 185 అభ్యర్థులు పోటీ చేయగా వారిలో  178 మంది రైతులు ఉన్నారు.
Ø పరాజయం పొందిన మరో ప్రముఖ మహిళా అభ్యర్థి అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గం పోటిచేసిన మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మరియు పిడిపి అధ్యక్షురాలు  మెహబూబా ముప్తి.
Ø పరాజయం పొందిన మరొక ప్రముఖురాలు తెలుగు, హిందీ సినినటిమణి జయప్రద.
Ø మహారాష్ట్ర నుంచి పరాజయం పొందిన మరొక బాలివుడ్ నటిమణి ఊర్మిళ మాతోంద్కర్.
Ø మహారాష్ట్ర నుంచి ప్రియాదత్ కూడా పరాజయం పొందారు.
Ø యూ.పి. లక్నో నుంచి పూనం సింగ్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతిలో ఒడి పోయారు. అలాగే అఖిలేష్ యాదవ్ భార్య  డింపుల్ యాదవ్ కూడా పరాజయం పొందారు.
Ø కర్ణాటక నుంచి సిని నటిమణి సుమలత విజయం సాధించారు.














No comments:

Post a Comment