27 January 2020

హుస్సేన్ అహ్మద్ మదాని Hussain Ahmed Madani



Image result for husain ahmad madani




సయ్యద్ హుస్సేన్ అహ్మద్ మదాని (6 అక్టోబర్ 1879 - 5 డిసెంబర్ 1957) భారతీయ ఇస్లామిక్ పండితుడు. హదీసులు మరియు ఫిఖాలలో అతని ప్రతిభను  గుర్తించిన  అతని అనుచరులు అతన్ని షేక్ అల్ ఇస్లాం, షేక్ అల్-అరబ్ వాల్ అజామ్ అని పిలిచేవారు. అతను 1954 లో పద్మ భూషణ్ గౌరవం పొందిన మొదటి గ్రహీతలలో ఒకడు.

1920 లలో కాంగ్రెస్-ఖిలాఫత్ ఒప్పందాన్ని సుస్థిరం చేయడంలో మదాని కీలక పాత్ర పోషించారు మరియు "1920 మరియు 1930లలో ఉపన్యాసాలు మరియు కరపత్రాల ద్వారా, మదానీ భారత జాతీయ కాంగ్రెస్‌తో భారత ఉలామా సహకారం సిద్ధం చేశారు."

అతని రచన “ముత్తహిదా కౌమియత్  ర్ ఇస్లాంMuttahida Qaumiyat Aur Islam 1938 లో ప్రచురించబడింది మరియు ఆయన భారతదేశ విభజనకు వ్యతిరేకి.

మౌలానా హుస్సేన్ అహ్మద్ మదాని ఉత్తరప్రదేశ్‌లో ఉన్నవో జిల్లాలోని బంగార్‌మౌ అనే పట్టణంలో జన్మించారు. అతని కుటుంబం మొదట ఫైజాబాద్ జిల్లాలోని తాండాకు చెందినది. అతని తండ్రి పేరు సయ్యద్ హబీబుల్లా, అతను ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క వారసుడు.

విద్య మరియు ఆధ్యాత్మిక శిక్షణ 1892 లో, తన పదమూడేళ్ళ వయసులో, అతను దారుల్ ఉలూమ్ డియోబంద్‌కు వెళ్లాడు, అక్కడ మెహమూద్ హసన్ దగ్గిర చదువుకున్నాడు. అక్కడ సూఫీ వాదం చే ప్రభావితుడయ్యాడు. మెహమూద్ హసన్ యొక్క పిర్ ( ఆధ్యాత్మిక గురువు) రషీద్ అహ్మద్ గంగోహి. మెహమూద్ హసన్ కోరిక మేరకు మదని తరువాత రషీద్ అహ్మద్ గంగోహి యొక్క శిష్యుడయ్యాడు..మదని  రషీద్ అహ్మద్ గంగోహి యొక్క సీనియర్ ఖులాఫా (లేదా వారసులలో)ఒకడుగా పరిగణిoచబడినాడు..

హుస్సేన్ అహ్మద్ నక్ష్బబంది మరియు చిస్టి క్రమం రెండింటికీ అనుసంధానించబడినాడు. ఒక సూఫీ ఉత్తర్వు నిశ్శబ్ద ప్రార్థనను నొక్కిచెప్పగా, రెండోది ఇస్లాం మతం యొక్క మరింత రహస్య అంశాలపై దృష్టి పెట్టింది. హుస్సేన్ అహ్మద్ మదని చిస్టి-సబిరి క్రమం కు ప్రాతినిద్యం వహించాడు.

దారుల్ ఉలూమ్ డియోబంద్ నుండి పట్టా పొందిన తరువాత, అతను తన కుటుంబంతో మదీనాకు వలస వచ్చారు. వారు అక్కడ అరబిక్ వ్యాకరణం, ఉసుల్ అల్-ఫిఖ్, ఉసుల్ అల్-హదీస్ మరియు ఖురాన్ వివరణ/ఎక్సెజెసిస్(Quranic exegesis) బోధించడం ప్రారంభించారు. మదీనాలో ఈ వివిధ ఇస్లామిక్ శాస్త్రాలను బోధించడానికి 18 సంవత్సరాలు గడిపారు. ఆ తర్వాత ఆయనను ప్రధాన ఉపాధ్యాయునిగా, దారుల్ ఉలూమ్ డియోబంద్ యొక్క "షేఖుల్ హదీసు" గా నియమించారు. అతను సుమారు 28 సంవత్సరాలు ఈ పదవిలో పనిచేశారు.

మాల్టా ద్వీపంలోని జైలుకు సిల్క్ లెటర్ కుట్రలో పాత్ర ఉన్నందుకు అతని గురువు మెహమూద్ హసన్‌కు బ్రిటిష్ వారు శిక్ష విధించిన తరువాత, మదాని స్వచ్ఛందంగా అతనితో పాటు మాల్ట జైలు కు వెళ్లారు. మెహమూద్ మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఇస్లామిక్ రంజాన్ మాసం వచ్చింది మరియు మెహమూద్ హసన్ లేదా మదాని ఇరువురు ఖురాన్ యొక్క హఫీజ్ కారు. ఈ సందర్భంలో, మెహమూద్ హసన్ తన విద్యార్థి (మదాని) తో మాట్లాడుతూ రంజాన్ నెలలో తారావిహ్ అని పిలువబడే ప్రత్యేక రాత్రి ప్రార్థనలలో పూర్తి ఖురాన్ వినకుండా అతను ఎన్నడు లేడు” అని అన్నాడు.


తన ఉపాధ్యాయుడి కోరిక మేరకు హుస్సేన్ అహ్మద్ మదాని, జైలులో ఉన్నప్పుడు ఖురాన్ ను కంఠస్థం చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ, మదాని ఖురాన్ లోని ఒక జుజ్ (భాగాన్ని) కంఠస్థం చేసి తారావిహ్ లో పఠించేవారు. అలా కొనసాగిస్తూ, అతను రంజాన్ 30 రోజులలో మొత్తం ఖురాన్ ను కంఠస్థం చేశాడు, తద్వారా తన గురువు మెహమూద్ హసన్ కోరిక తీర్చారు.


విడుదలైన తరువాత, అతను భారతదేశానికి తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ముస్లింలలో తూర్పు ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్‌కు చెందిన ఒక వర్గంపై ఆయన గణనీయమైన ప్రభావాన్ని చూపారు, వారిలో ముఖ్యంగా  న్యూ డిల్లి లోని జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపక సభ్యులలో మౌలానా మదాని ఒకరు. అతను 29 అక్టోబర్ 1929 న సమావేశమైన షేఖుల్-హింద్ మౌలానా మహమూద్ హసన్ నేతృత్వంలోని ఫౌండేషన్ కమిటీ (జామియా మిలియా ఇస్లామియా పునాది కోసం) సభ్యుడు.

 మౌలానా మహమూద్ హసన్ రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకి. అయన ప్రభావం చే తూర్పు యు.పి, బీహార్ నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు. భారత విభజన సమయంలో పాకిస్తాన్కు వలస వెళ్ళడానికి నిరాకరించినారు.. అతను 1957 లో మరణించే సమయానికి జమియాట్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడయ్యాడు. (అతను చనిపోయే వరకు దారుల్ ఉలూమ్ డియోబంద్ లో  షేఖుల్ హదీసు పదవిని కూడా కలిగి ఉన్నాడు).
.
హుస్సేన్ అహ్మద్ మదాని పాకిస్తాన్ ప్రారంభానికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రస్తుత కాలంలో, దేశాలు మాతృభూమి (భౌగోళిక ప్రాతిపదికన) ఆధారంగా ఏర్పడతాయని, జాతి మరియు మతం మీద కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దేశం యొక్క గుర్తింపు దాని భూమి లేదా మతం మీద ఆధారపడి ఉందా అనే అంశంపై, హుస్సేన్ అహ్మద్ మదాని మరియు అల్లామా ఇక్బాల్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

 పరస్పర మిత్రుని జోక్యంతో ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోన్నారు. ఇక్బాల్ మదని కి రాసిన వ్యక్తగత లేఖలో  ఇద్దరి మద్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మౌలానా హుస్సేన్ అహ్మద్ మదాని సేవ మరియు ఇస్లాం పట్ల అతని భక్తిని గౌరవిస్తున్నానని అన్నారు.

"హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు మరియు పార్సీలు చేర్చబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అందరూ సంయుక్తంగా ప్రయత్నించాలి. అలాంటి స్వేచ్ఛ ఇస్లాంకు అనుగుణంగా ఉంది" ముస్లింలు మతపరంగా బహళ సమాజంలో జీవించగలుగుతారు, అక్కడ వారు స్వతంత్ర, లౌకిక భారతదేశం యొక్క పూర్తి పౌరులుగా ఉంటారు." అని హుస్సేన్ అహ్మద్ మదాని స్వయంగా పేర్కొన్నారు.

ది నేషన్ (వార్తాపత్రిక) లో ప్రచురితమైన ఒక కథనాన్ని ఉటంకిస్తూ, "భారత స్వాతంత్ర్య చరిత్ర చర్చించినప్పుడల్లా, ధైర్యవంతులైన  డియోబంద్ పండితుల పేరు ఎంతో గౌరవంతో తీసుకోబడుతుంది."

.సాహిత్య రచనలు:
*కాంపోజిట్ నేషనలిజం అండ్ ఇస్లాం
నక్ష్-ఎ-హయత్ (మౌలానా మదని యొక్క ఆత్మకథ).
యాష్-షిహాబస్ సాకిబ్ (Ash-Shihabus Saqib) 
మక్తుబత్ షేక్ అల్-ఇస్లాం (2000 పేజీల గ్రంధం)
సఫర్ నామా షేఖుల్ హింద్ మహమూద్ అల్-హసన్ (సిల్క్ లెటర్ ఉద్యమానికి సంబంధించినది).
తసావూర్-ఎ-షేక్ (తసావుఫ్‌కు సంబంధించినది)

అవార్డులు మరియు గుర్తింపు
*1954 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు
* ఇండియా పోస్ట్ 2012 లో అతని గౌరవార్థం స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది
మదాని చత్తర్, బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో అతని పేరు మీద గల నిర్మాణం.

మౌలానా మదని  5 డిసెంబర్ 1957 న మరణించారు. అతని అంత్యక్రియల ప్రార్థనకు ముహమ్మద్ జకారియా కంధ్లావి నాయకత్వం వహించారు. ఉర్దూ రచయిత మౌలానా నిజాముద్దీన్ ఆసిర్ అడ్రావి తన జీవిత చరిత్ర మాస్ర్ షేక్ అల్ ఇస్లాం Ma'asr Shaykh al-Islam ను రాశారు, దీనిని దియోబంద్ దారుల్ ముఅల్లిఫీన్ వారు ప్రచురించారు.

No comments:

Post a Comment