12 August 2020

హజ్రత్ ఖాదీజా (ర) Hazrat Khadija (RA)


 

హజ్రత్ ఖాదీజా (ర)  ప్రవక్త (స) యొక్క మొదటి భార్య. ఆమె తండ్రి పేరు ఖువేలిద్ బిన్ అసద్ మరియు అతను ఒక ధనవంతుడు. ఆమె మక్కాలో జన్మించింది.

ఆమె తెలివైన వ్యక్తిత్వo గలది మరియు  అన్ని విషయాలను బాగా ఆకళింపుచేసుకోనేది.. ఆమె తల్లి మరియు తండ్రి ఇద్దరూ 10 సంవత్సరాల వ్యవధిలో మరణించారు హజ్రత్ ఖాదీజా (రా) కుటుంబ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లాభాలను ఆర్జించారు. ఆమె వ్యాపారాన్ని విస్తరించింది మరియు పేదలు, వితంతువులు, అనాథలు, జబ్బుపడినవారికి  మరియు మక్కా యొక్క ప్రజలకు ఎంతో సహాయపడింది.

 

ఖాదీజా (ర) బంధువులలో ఒకరు వారకా బిన్ నౌఫల్. అతను చాలా చదువుకొన్న వ్యక్తి మరియు విగ్రహారాధనను వ్యతిరేకించేవాడు. హజ్రత్ ఖాదీజా మరియు వరాకా ఎకేశ్వరపాసకులు మరియు మొదటి నుండి ఒక అల్లాహ్‌ను విశ్వసించారు.

 

ఖాదీజా (ర) అద్భుతమైన వ్యక్తిత్వం గలది. ఈ కారణంగా  ఆమెను అరబ్బులు తాహిరా (స్వచ్ఛమైనది) అని పిలిచేవారు. ఆమె తన సంపద కారణంగా మక్కా యువరాణిఅని కూడా పిలవబడేది. చాలా మంది అరబ్ ప్రముఖులు ఖాదీజా (ర) ను వివాహం చేసుకోవాలనే కోరికను చూపించారు, కాని ఆమె వారి వివాహ ప్రతిపాదనలను నిరాకరించింది.

 

క్రీ.శ 595 వ సంవత్సరంలో, హజ్రత్ ఖాదీజా(ర)కు  తన వర్తక కారవాన్‌ను సిరియాకు తీసుకువెళ్ళే వ్యక్తి కావలసి వచ్చాడు. హజ్రత్ అబూ తాలిబ్ (AS) ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆమెకు సిఫార్సు చేశారు. ఖాదీజా (ర) అప్పటికే వారి విశ్వసనీయత గురించి విన్నారు  మరియు వారికి ఎక్కువ వాణిజ్య అనుభవం లేనప్పటికీ నియమించటానికి అంగీకరించింది. ఆమె తన బానిస మయసరా Maysara ను వారికి సహాయం గా పంపినది.

 

 వర్తక  కారవాన్ విజయాన్ని సాధించినది. ఈ కారవాన్ ద్వారా, హజ్రత్ ఖాదీజా (SA) ప్రవక్త యొక్క వర్తక నైపుణ్యాలు, మన్నన మర్యాదలు మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నారు. ఈ వ్యక్తిత్వ అంశాలన్నీ తెలుసుకున్న ఆమె ముహమ్మద్ (స) ఆరాధకురాలిగా మారింది.

 కొంతకాలం తరువాత, హజ్రత్ ఖాదీజా ప్రవక్త (స) కు వివాహ ప్రతిపాదనను పంపారు, తరువాత వారి ఇరువురి వివాహం అయ్యింది. ఆ సమయంలో ప్రవక్త మొహమ్మద్ (స) వయసు 25, హజ్రత్ ఖాదీజా (ర) వయస్సు 40 సంవత్సరాలు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరఫున హజ్రత్ అబూ తాలిబ్ (ర) నికాను చదివారు, వఖారా బిన్ నౌఫల్ హజ్రత్ ఖాదీజా కోసం చదివారు. తన మేనల్లుడి మెహర్‌ను హజ్రత్ అబూ తాలిబ్ (ర) చెల్లించారు మరియు వివాహ  వేడుకల జ్ఞాపకార్థం మక్కా ప్రజలకు 3 రోజుల పాటు  విందు భోజనాలు ఏర్పాటు చేసారు.. ఈ సంతోషకరమైన సందర్భంగా హజ్రత్ ఖాదీజా (ర) తను కూడా ప్రజలకు విందు భోజనాలు ఏర్పాటు చేసారు. వారు ఇరువురిది ఆశీర్వాద వివాహం మరియు వారి మొదటి బిడ్డ ఖాసిమ్ అనే కుమారుడు, రెండవ కుమారుడు  అబ్దుల్లా బాల్యంలోనే మరణించారు. హజ్రత్ ఫాతిమా (ర) వారి మూడవ సంతానం.

 

ప్రవక్త (స) జాబెల్-ఎ-నూర్ లోని హీరా గుహకు ద్యానం కోసం ఒంటరిగా  వెళ్ళేవారు. హజ్రత్ ఖాదీజా (ర) స్వయంగా పర్వతం ఎక్కి వారికి క్రమం తప్పకుండా ఆహారం ఇచ్చేవారు. ఇస్లాంను అంగీకరించిన మొదటి వ్యక్తి ఖాదీజా (ర).

 

క్రీస్తుశకం 616 వ సంవత్సరంలో, ఖురైష్ తెగ బని హషీమ్ (ప్రవక్త కుటుంబం) ను వేరుచేసినప్పుడు  వారు షిబ్-ఎ-అబూ తాలిబ్ అనే లోయలో ఆశ్రయం పొందారు. హజ్రత్ ఖాదీజా (ర) మక్కా ప్రజలకు క్లిష్టమైన సమయం లో చేసిన సేవ మరియు ఆమె సంపద ఆ సమయంలో ముస్లింలకు వరంగా మారింది.  ఆమె తన సంపదను ఇస్లాం కోసం విరాళంగా ఇచ్చింది.

 

హిజ్రాకు 3 సంవత్సరాల ముందు హమ్రత్ ఖాదీజా (ర) క్రీస్తుశకం 619 లో రమజాన్ 10 వ తేదీన మరణించారు. ఆమె మరణించిన సమయంలో ఆమె వద్ద సంపద ఏమీ లేదు. ఇస్లాం వ్యాప్తి  కోసం ఆమె తన సంపద అంతా ఇచ్చింది.

 ఆమెను మక్కాలోని  జన్నత్  ఉల్ మాలా లో ఖననం చేశారు. హజ్రత్ అబూ తాలిబ్ (ర) అదే సంవత్సరంలో మరణించారు మరియు ప్రవక్త (స) ఆ సంవత్సరాన్ని ఆమ్-ఉల్-హుజ్న్ (Aam-ul-Huzn-the year of griefదుఖం యొక్క సంవత్సరం) అని పిలిచారు. ఖాదీజా (ర) జీవించి ఉన్నప్పుడు ప్రవక్త (స) మరొక స్త్రీని వివాహం చేసుకోలేదు. తరువాతి సంవత్సరాల్లో, ఆమె తన భార్యలలో ఉత్తమమని ప్రవక్త (స) ఎప్పుడూ అంటుoడేవారు.

 

No comments:

Post a Comment