వివాహం అనేది ఒక సామాజిక సంస్థ. ఇది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన సంస్థ. ఇస్లాం ధర్మం
ఈ సంస్థను గుర్తించి, దానిలోకి ప్రవేశించిన
చెడులన్నింటినీ ప్రక్షాళన చేసిన తరువాత దానిని మానవ సమాజానికి ఆధారం గా
అంగీకరిస్తుంది.
ఇస్లాం వివాహాన్ని లైంగిక వాంచలను సంతృప్తి పరచే కలయిక గా పరిగణించదు. ఇస్లాం
ద్రుష్టి లో వివాహం అనేది విస్తృత మరియు
వైవిధ్యమైన బాధ్యతలు మరియు కర్తవ్యాలతో కూడిన సామాజిక ఒప్పందం.
స్త్రీ పురుషుడి చేతిలో ఆటబొమ్మ కాదు, అల్లాహ్ సాక్షిగా వివాహ ప్రతిజ్ఞపై అతనికి అప్పగించబడిన ఆధ్యాత్మిక మరియు
నైతిక జీవి అని ఇస్లాం భావిస్తుంది.
భర్తకు శారీరక ఆనందo తో పాటు కుటుంబ జీవితాన్ని మరియు మొత్తం మానవాళిని
అర్ధవంతం చేయడంలో అతనితో పూర్తిగా సహకరించడం భార్య కర్తవ్యం.
పవిత్ర ఖుర్ఆన్ అనేక ఆయతులలో వివాహం యొక్క విభిన్న ప్రయోజనాలను వివరించినది.:
"ఆయన
సూచనలలో మరోకటి ఏమిటంటే; ఆయన మీ
కొరకు మీ జాతి నుంచే సృష్టించాడు.- మీరు వారివద్ద శాంతిని పొందటానికి మీ మద్య
ప్రేమనూ, కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచనాపరులకు ఇందులో ఎన్నో సూచనలు
ఉన్నాయి. ”(30: 21)
ఈ ఆయత్ ద్వారా స్త్రీ పురుషుని కంటే హీనమైనది కాదని చెప్పబడింది. స్త్రీ- పురుషుడు ఇద్దరూ ఆదమ్ యొక్క సంతానం మరియు ఇద్దరూ ఒకే ఆత్మను కలిగి ఉంటారు.
పవిత్ర ఖుర్ఆన్ ప్రకారం వివాహం రెండు ఆత్మల ఐక్యత సారాంశం. వారి ప్రత్యేక ఉనికి ఒక
అసహజ స్థితి.వారు వివాహం ద్వారా ఏకం
అయినప్పుడు సహజ స్థితిలోకి మారుతుంది.శారీరకంగా, మానసికంగా మరియు మానసికంగా ఒకరికొకరు దగ్గరకు వస్తారు.
స్త్రీపురుషులు
ఇద్దరూ సుఖమయ జీవితo యొక్క ఉమ్మడి వారసులు,
మరియు వారిలో సన్నిహిత సహవాసం లేకపోతే వారు జీవితపు నిజమైన ఆనందమును
పొందలేరు.
పవిత్ర ఖుర్ఆన్
ఇలా చెబుతోంది:
అల్లాహ్ మిమ్మల్ని
ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు, ఇంకా అదే
జాతినుండి అతనికి సహచరిని సృజించాడు. అతను
ఆమె తో ప్రశాంత జీవితం గడపటానికి.”(7:
189)
ఇస్లాంలో వివాహ సంబంధ భావన ఆధ్యాత్మిక మరియు నైతిక
ఆలోచనలతో బాటు వ్యక్తి మరియు సామాజిక జీవిత సంక్షేమం తో ముడిపడి ఉంది ఇస్లాంలో వివాహాయేతర సంభందం నిషేదించ బడినది. పవిత్ర
ఖుర్ఆన్ వివాహం చేసుకోవాలని ప్రజలను నొక్కి చెబుతుంది, ఎందుకంటే ఇది స్త్రీ-పురుషులు నైతిక మరియు సద్గుణ జీవితాన్ని గడపడానికి అత్యంత
ప్రభావవంతమైన మార్గంగా చెప్పవచ్చు.
దివ్య ఖుర్ఆన్
ఇలా చెబుతోంది:
“వారు (మీ భార్యలు) మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు.” -(ఖురాన్ 2:
187)
భార్యాభర్తలు పరస్పర మద్దతు,
పరస్పర సౌలభ్యం మరియు పరస్పర రక్షణ కోరకు దుస్తుల వలే ఒకదానికి మరొకరు సరిపోతారు.
No comments:
Post a Comment