5 November 2020

శతాబ్ది సంవత్సరం/సెంటెనరీలో, జామియా మిలియా ఇస్లామియా అన్ని రంగాలలో లౌకిక విద్యకు చిహ్నంగా నిలుస్తుంది At Centenary, Jamia Millia Islamia Stands as a Symbol of Inclusive, Secular Education

 


 “జామియా అంటే విశ్వవిద్యాలయం, మరియుమిలియా దాని జాతీయ లక్షణాన్ని సూచిస్తుంది. విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులకు గాంధీ మద్దతు ఇచ్చారు. విశ్వవిద్యాలయ పేరు జామియా మిలియా ఇస్లామియాగా ఉండాలని మరియు జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయంగా మార్చకూడదని పట్టుబట్టారు. వ్యవస్థాపకులు జామియాను "రాయి రాయి కలిపి నిర్మించారు. సరోజిని నాయుడు,  అది ఎన్నో  త్యాగాల పలితం " అన్నారు. హిందూ-ముస్లిం సోదరబావాన్ని, స్నేహాన్ని ప్రోత్సహించడానికి జామియా మిలియా ఏర్పడింది.

 

హిందూ పిల్లలు  ఇస్లాం గురించి, ముస్లిం పిల్లలు  హిందూ ధర్మం నేర్చుకోవాలని జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకరైన హకీమ్ అజ్మల్ ఖాన్ భావించారు. ఈ జ్ఞానం నుండి ఐక్య భారతీయ జాతీయవాదంఉద్భవిస్తుందని వ్యవస్థాపకులు భావించారు విశ్వవిద్యాలయం జాతీయవాదం, ఆచరణాత్మక మరియు నాన్-సెక్టారియన్ కు గుర్తుగా  విరాజిల్లాలని భావించారు.

జామియా మిలియా ఇస్లామియా తన శతాబ్దిని అక్టోబర్ 29, 2020 న పూర్తిచేసినప్పుడు, 'జామియా ఆలోచన'ను ప్రతిబింబించడం సముచితం. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి తన స్వంత ప్రయాణాన్ని అది  ఎలా కొనసాగించిందో మరియు 'ఐడియా ఆఫ్ ఇండియా Idea of India’ 'ను  కలుపుకొని బహుళ సాంస్కృతిక, లౌకిక ఉన్నత విద్యాలయంగా  గా ఎలా రుపొందిoచబడిందో తెలుసుకొందాము.

 

అక్టోబర్ 12, 1920, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని సిడాన్స్ యూనియన్ క్లబ్‌లో సమావేశమైన విద్యార్థుల బృందాన్ని ఉద్దేశించి మహాత్మా గాంధీ మీరు బ్రిటిష్ యూనియన్‌తో కలిసి ఉండవలసిన బాధ్యత కలిగిన ఒక సంస్థలో ఒక గంట కూడా ఎలా ఉండగలరు? అని అడిగారు.

బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలను పూర్తిగా బహిష్కరించాలని గాంధీ పిలుపు కొంతమంది యువ విప్లవకారులలో తీవ్ర ఆలోచనకు దారి తీసింది.  ఈ తరుణంలోనే 'జామియా ఆలోచన' 'ఒక జాతీయ సంస్థలో జాతీయ విద్య' అనే పిలుపుతో పుట్టింది. నైపుణ్యం-ఆధారిత విద్య మరియు బోధనా మాధ్యమంగా హిందూస్థానీకి ప్రాధాన్యత కలిగిన నయీ-తలీమ్ భావన ఈ ఆలోచనను మరింత సుసంపన్నం చేసింది.

ఆలీగర్ వద్ద వినయపూర్వకమైన ప్రారంభంతో, జామియా మిలియా ఇస్లామియా 1925 లో డిల్లికి మారింది. "జామియా యొక్క లక్ష్యం  “ముస్లిం” మునుపటి స్థిర మార్గాన్ని గుడ్డిగా అనుసరించకూడదు. జామియా ప్రతి విద్యార్థి హృదయంలో (ముస్లిం లేదా హిందువు కావచ్చు) - విదేశీ శక్తుల అధీనానికి వ్యతిరేకంగా జాతీయ భావాన్ని పెంచుతుంది. ఇది భేదబావ రహితంగా ఉంటుంది. ఈ కారణాల వల్లే  జామియా,  జామియా మిలియా ఇస్లామియా మరియు జాతీయ విశ్వవిద్యాలయం అయింది. "

 

ప్రముఖ విద్యావేత్త మార్తా సి. నస్బామ్ మాటలో   “జామియా మార్పుకు చిహ్నం. దాని పాఠ్యాంశాలు జాతీయత మరియు ఇస్లామిక్ చరిత్ర అధ్యయనం కు ప్రాధాన్యం ఇచ్చును..  దాని ప్రవేశ విధానం యువతీ-యువకులను, హిందూ, ముస్లింలను ఒకే రీతిన స్వాగతించింది; దాని బోధన అన్ని విషయాల బోధనలో చర్చ మరియు పోటీని నొక్కి చెప్పింది. "

 

1962లో, JMI కి ' డీమ్డ్ విశ్వవిద్యాలయం ' ప్రతిపత్తి లబించినది. చివరగా 1988లో భారత పార్లమెంటు రూపొందించిన చట్టం  ద్వారా, జామియా మిలియా ఇస్లామియా  కేంద్ర విశ్వవిద్యాలయంగా మారింది.

 

తన పేరులో ఇస్లామియాఅనే పదం ఉన్నప్పటికీ, జామియా మిలియా ఇస్లామియా ఎప్పుడూ ముస్లిం విశ్వవిద్యాలయం కాదు. 2011లో నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీ విద్యాసంస్థలు National Commission for Minority Educational institutions జామియాను మైనారిటీ విశ్వవిద్యాలయంగా ప్రకటించే   వరకు అది మైనారిటీ సంస్థ కూడా కాదు. ప్రస్తుతం జామియా మిలియా ఇస్లామియా కేంద్ర విశ్వవిద్యాలయ హోదాను కొనసాగిస్తోంది.

 

జామియా మిలియా ఇస్లామియా ముస్లిం సమాజానికి ఒక వరం.జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, సమాజానికి మేధో దీపంగా ఉపయోగపడుతుంది మరియు దేశవ్యాప్తంగా దాని ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కోసం ఉన్న దాని లెర్నర్ సపోర్ట్ సెంటర్స్ పేద, గ్రామీణ విద్యార్ధులకు ఎంతో సేవ చేస్తున్నాయి.


దాని శతాబ్ది సంవత్సరంలో, జామియా మిల్లియా ఇస్లామియా ఎన్నో అపూర్వమైన విజయాలను సాధించినది. ముషిరుల్ హసన్ మరియు రక్షందా జలీల్ అభిప్రాయం లో “జామియా ఇతర విద్యా సంస్థల నుండి వేరుగా ఉండే గతం కలిగి ఉంది. జామియా ప్రత్యేకంగా తన స్వంత గుర్తింపును కలిగి ఉంది. మరీ ముఖ్యంగా, జామియాకి గొప్ప వారసత్వం ఉంది. "

 


No comments:

Post a Comment