20 December 2020

15 వ శతాబ్దపు ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రవేత్త : అలీ అల్-కుష్జీ 1403-1474 15th-century astronomy and mathematics: Ali al-Qushji 1403-1474


 

అలీ అల్-కుష్జీ 15వ శతాబ్దపు టర్కిష్ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త మరియు భాషా శాస్త్రవేత్త. అల్-కుష్జీ అసలు పేరు అలా అల్-దిన్ అలీ ఇబ్న్ ముహమ్మద్. చారిత్రక ఆధారాల  ప్రకారం ఇతను 15 వ శతాబ్దం ప్రారంభంలో అనగా 1403CEలో సమర్కాండ్, తైమురిడ్ సామ్రాజ్యం (ఇప్పుడు ఉజ్బెకిస్తాన్)లో జన్మించినట్లు తెలుస్తుంది. అల్-కుష్జీ అనే బిరుదు టర్కిష్ పదం కుస్కు ( ఇంగ్లీషులో బర్డ్ మాన్) నుండి వచ్చింది. అతని తండ్రి స్థానిక పాలకుడు ఉలుగ్ బేగ్ యొక్క ఆస్థానంలో ప్రధాన ఫాల్కనర్.

 

అలీ కుష్జీ (ఒట్టోమన్ టర్కిష్ / పెర్షియన్ భాష: علی قوشچی (1403 - 16 డిసెంబర్ 1474) తైమురిడ్ సామ్రాజ్య   వేదాంతవేత్త, న్యాయవాది, ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త,

 సమర్కాండ్‌లో పెరిగిన అల్-కుష్జీ గణితం మరియు ఖగోళశాస్త్రం ఖాజీ జాడే అల్-రూమి, గియాత్ అల్-దిన్ జంషీద్ అల్-కషాని మరియు ఉలుగ్ బేగ్ వద్ద నేర్చుకొన్నాడు.

 ఉలుగ్ బేగ్ యొక్క శిష్యుడిగా, అల్-కుష్జీ సహజ తత్వశాస్త్రం నుండి స్వతంత్రంగా ఖగోళ భౌతికశాస్త్రం యొక్క అభివృద్ధికి ప్రసిద్ది చెందాడు మరియు భూమి యొక్క భ్రమణానికి అనుభావిక ఆధారాలను తన గ్రంథం కన్సర్నింగ్ ది సపోస్డ్ డిపెండెన్స్ ఆఫ్ ఆస్ట్రానమీ అపాన్ ఫిలాసఫీ Concerning the Supposed Dependence of Astronomy upon Philosophy లో అందించాడు,  ఉలుగ్ బేగ్ యొక్క ప్రసిద్ధ రచన జిజ్-ఇ-సుల్తానీ కి అనుభందంగా రచనలు చేసాడు  మరియు ఓటోమోన్ కాలిఫేట్‌లోని వివిధ సాంప్రదాయ ఇస్లామిక్ శాస్త్రాల అధ్యయనానికి ఏర్పాటు చేయబడిన   కేంద్రాలలో ఒకటైన సాహ్న్-సెమాన్ మెడ్రీస్ స్థాపనకు కృషి చేసాడు. అల్-కుష్జీ ఖగోళ శాస్త్రంపై అనేక శాస్త్రీయ రచనలు మరియు పాఠ్యపుస్తకాలు రచించినాడు.

 

సమర్కాండ్ నుంచి అల్-కుష్జీ ఇరాన్ (పర్షియా) లోని కర్మన్‌కు వెళ్లి అక్కడ తన విద్యను వివిధ పండితుల వద్ద కొనసాగించినాడు.  ఒమన్ సముద్రంలో తుఫానులపై కొంత పరిశోధన చేశాడు. అతను కర్మన్‌లో హాల్-ఇ ఎష్కల్-ఐ ఘమ్మర్ (చంద్రుని కాలాల వివరణలు) మరియు షార్-ఇ తాజ్రిడ్ Sharh al-Tajrid ను పూర్తి చేశాడు. ఆతరువాత హెరాత్కు వెళ్లి మోల్లా కామిMolla Camiకి ఖగోళ శాస్త్రం (1423) నేర్పించాడు. కొంతకాలం హెరాత్‌ Herat లో ఉన్న తరువాత తిరిగి సమర్‌కండ్‌కు వచ్చాడు.

 

సమర్కాండ్కు తిరిగి వచ్చినప్పుడు, అల్-కుష్జీ తన రచన హాల్-ఇ ఎష్కల్-ఐ ఘమ్మర్ (చంద్రుని కాలాలపై వివరణలు) Hall-e Eshkal-i Ghammar (Explanations on the Periods of the Moon)  తన అద్యాపకుడు  ఉలుగ్ బేగ్కు సమర్పించాడు. అల్-కుష్జీ పనిని చూసి ఉలుగ్ బేగ్ ముగ్ధుడయ్యాడు. అల్-రూమి మరణం తరువాత ఉలుగ్ బేగ్ సమర్కాండ్ అబ్జర్వేటరీకి అధిపతిగా అల్-కుష్జీని నియమించాడు.

 

అల్-కుష్జీని ఉలుగ్ బేగ్ చైనాకు పంపారు మరియు ఈ పర్యటనలో అల్-కుష్జీ మరొక రచనను సంకలనం చేశారు. ఉలుగ్ బేగ్ మరణం తరువాత, అల్-కుష్జీ ఇరాన్లోని టబ్రిజ్ వెళ్లి తుర్క్మెన్ రాజవంశం అక్ కొయున్లూ Ak Koyunlu పాలకుడు ఉజున్ హస్సార్ Uzun Hassar ను కలిశాడు.


ఉజున్ హసన్ అతన్ని మెహమెద్ ది కాంకరర్ అని పిలువబడే ఒట్టోమన్ సుల్తాన్ మెహమెద్II వద్దకు రాయబారిగా పంపాడు. మెహ్మెద్II అల్-కుష్జీని  ఇస్తాంబుల్‌లో ఉండటానికి ఒప్పించాడు. మెహ్మెద్ II అతనిని హగియా సోఫియా మదర్సాలో పండితుడిగా నియమించారు.


అలీ అల్-కుష్జీ హగియా సోఫియా మదరసా లో  ఖగోళ శాస్త్రం మరియు గణితంపై పరిశోధనలను ప్రోత్సహించాడు మరియు శాస్త్రావిజ్ఞానికి అధిక ప్రాధాన్యత నిచ్చాడు.అలీ అల్-కుష్జీ గణితం మరియు భాషాశాస్త్రంపై కూడా రచనలకు ప్రసిద్ది చెందారు.


అల్-కుష్జీ 1470 లో కాన్స్టాంటినోపుల్(ప్రస్తుత ఇస్తాంబుల్) వద్ద మెహమెద్ II కోసం పెర్షియన్ భాషలో "రిసాలా దర్ హయత్ risalah dar hay’at " అను గ్రంధంను రచిoచినాడు. అతను కాన్స్టాంటినోపుల్‌లో "షార్హ్ ఇ రిసాలీ ఫాతియేహ్ Sharh e resalye Fathiyeh ", "రిసాలే  మొహమ్మదియే resalye Mohammadiye " వ్రాసాడు. ఇవి గణితశాస్త్ర అంశంపై అరబిక్‌లో ఉన్నాయి. ఆ తరువాత అతను నాసిర్ అల్-దిన్ అల్-తుసి యొక్క "తేజ్రీద్ అల్-కలాం Tejrid al-kalam " పై "షార్ ఇ తేజ్రిడ్ Sharh e tejrid " ను పూర్తి చేశాడు. ఆ పనిని శాస్త్రీయ సమాజంలో "షార్ ఇ జాదిద్ Sharh e Jadid " అంటారు.


నాసిర్ అల్-దిన్ అల్-తుసి యొక్క గ్రహ నమూనా ను అల్ కుష్జీ మెరుగుపరిచాడు  మరియు మెర్క్యురీకి ప్రత్యామ్నాయ గ్రహ నమూనాను సమర్పించాడు. సమర్కాండ్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఉలుగ్ బేగ్ ఖగోళ శాస్త్రవేత్తలలో అతను కూడా ఒకడు మరియు అక్కడ అతను జిజ్-ఇ-సుల్తానీZij-i-Sultani సంకలనం కి తోడ్పడ్డాడు


అల్ కుష్జీ ఖగోళశాస్త్రంలో తొమ్మిది రచనలు రాశారు, వాటిలో రెండు పెర్షియన్ మరియు ఏడు అరబిక్ భాషలలో రాశారు. కుష్జీ యొక్క రెండు రచనల యొక్క లాటిన్ అనువాదం, ట్రాక్ట్ ఆన్ అర్థమెటిక్ మరియు ట్రాక్ట్ ఆన్ ఆస్ట్రానమీ Tract on Arithmetic and Tract on Astronomy, జాన్ గ్రీవ్స్ 1650 లో లాటిన్ లో ప్రచురించారు.

కుష్జీ యొక్క అతి ముఖ్యమైన ఖగోళ రచన, తత్వశాస్త్రంపై ఖగోళ శాస్త్రం ఆధారపడటం Concerning the Supposed Dependence of Astronomy upon Philosophy. కుష్జీ అరిస్టోటేలియన్ భౌతిక శాస్త్రాన్ని తిరస్కరించాడు మరియు ఇస్లామిక్ ఖగోళ శాస్త్రం నుండి సహజ తత్వాన్నిnatural philosophy పూర్తిగా వేరు చేశాడు, ఖగోళశాస్త్రం పూర్తిగా అనుభావిక మరియు గణిత శాస్త్రంగా మారడానికి వీలు కల్పించినాడు..

అతని ముందున్న అల్-తుసి భావనకు విరుద్దంగా కుష్జీ "ఖగోళ శాస్త్రవేత్తకు అరిస్టోటేలియన్ భౌతికశాస్త్రం అవసరం లేదు మరియు వాస్తవానికి సహజ తత్వవేత్తలు స్వతంత్రంగా తమ భౌతిక సూత్రాలను స్థాపించాలి" అని ప్రతిపాదించాడు. అరిస్టాటిల్ యొక్క స్థిరమైన భూమి యొక్క భావనను తిరస్కరించడంతో పాటు కుష్జీ ఖగోళ శాస్త్రవేత్తలు స్వర్గపు శరీరాలు ఏకరీతి వృత్తాకార కదలికలో కదులుతాయి అన్న  heavenly bodies moving in uniform circular motion అరిస్టోటేలియన్ భావనను అనుసరించాల్సిన అవసరం లేదని సూచించారు.

అరిస్టోటేలియన్ స్థిరమైన భూమి యొక్క భావనకు బదులు అతను కదిలే భూమి moving Earth ఆలోచనను అన్వేషించాడు (అయినప్పటికీ సావేజ్-స్మిత్ Savage-Smith ఇస్లామిక్ ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య కేంద్రక విశ్వాన్ని ప్రతిపాదించలేదని వాదించారు). అతను కామెట్లcometsపై తన పరిశీలన ద్వారా భూమి యొక్క భ్రమణానికి అనుభావిక ఆధారాలను కనుగొన్నాడు మరియు హాజనిత తత్వశాస్త్రం speculative philosophy కంటే అనుభావిక సాక్ష్యాల ఆధారంగా, స్థిరమైన భూమి సిద్ధాంతం కంటే కదిలే భూమి సిద్ధాంతం నిజమని తేల్చిచెప్పాడు.

కుష్జీ యొక్క పని అరిస్టోటేలియన్ భౌతికశాస్త్రం నుండి మరియు స్వతంత్ర ఖగోళ భౌతికశాస్త్రం వైపు ఒక ముఖ్యమైన అడుగు. భూమి యొక్క కదలికపై కుష్జీ యొక్క అభిప్రాయం నికోలస్ కోపర్నికస్ యొక్క అభిప్రాయాలతో సమానంగా ఉంది.

 అతను ఇస్తాంబుల్ యొక్క రేఖాంశాన్ని 60 నుండి 59 డిగ్రీల వరకు సరిచేశాడు మరియు నగరం యొక్క అక్షాంశాన్ని 41 డిగ్రీల 14 నిమిషాలుగా నిర్ణయించాడు. అక్కడి ఫతే మస్జిద్ లో సూర్య గడియారాన్ని నిర్మించాడు.

అతని రచనలను ఖగోళ శాస్త్రం-గణితం, కలాం,ఫిఖ్, మరియు భాషాశాస్త్రం అనే మూడు వర్గాల క్రింద విభజించవచ్చు.

అల్-కుష్జీ డిసెంబర్ 16, 1474 న ఇస్తాంబుల్‌లో మరణించాడు. అలీ కుష్జీ యొక్క సమాధి ఇస్తాంబుల్ లోని ఐప్సుల్తాన్ మసీదు Eyüpsultan Mosque శ్మశానంలో ఉంది

అతని రచనలు His works:

1.ఖగోళ శాస్త్రం Astronomy:

·         Sharḥ e Zîj e Ulugh Beg (In Persian)

·         Risāla fī Halle Eshkale Moadeleye Ghamar lil-Masir (Arabic)

·         Risāla fī aṣl al-Hâric yumkin fī al-sufliyyeyn (Arabic)

·         Sharḥ ʿalā al-tuḥfat al-shāhiyya fī al-hayāt (Arabic)

·         Risāla dar elm-i ḥeyāt (In Persian)

·         Al-Fatḥīya fī ʿilm al-hayʾa (in Arabic)

·         Risāla fi Hall-e Eshkal-i Ghammar (in Persian)

Concerning the Supposed Dependence of Astronomy upon Philosophy (Arabic)

2.గణితం Mathematics:

Risāla al-muḥhammadiyya fi-ḥisāb (In Arabic)

·         Risāla dār ʿilm al-ḥisāb: Suleymaniye (Arabic)

 

౩.కలాం మరియు ఫిక్Kalam and Fiqh:

Sharh e Jadid ale't-Tejrîd

·         Hashiye ale't-Telvîh

·         Unkud-üz-Zevahir fi Nazm-al-Javaher

 

4.మెకానిక్స్ Mechanics:

Tazkare fi Âlâti'r-Ruhâniyye

 

5.భాష శాస్త్రం Linguistics

·         Sharh Risâleti'l-Vadiyye

·         El-Ifsâh

·         El-Unkûdu'z-Zevâhir fî Nazmi'l-Javâher

·         Sharh e'Sh-Shâfiye

·         Resale fî Beyâni Vadi'l-Mufredât

·         Fâ'ide li-Tahkîki Lâmi't-Ta'rîf

·         Resale mâ Ene Kultu

·         Resale fî'l-Hamd

·         Resale fî Ilmi'l-Me'ânî

·         Resale fî Bahsi'l-Mufred

·         Resale fî'l-Fenni's-Sânî min Ilmihal-Beyân

·         Tafsir e-Bakara ve Âli Imrân

·         Risâle fî'l-İstişâre

·         Mahbub-al-Hamail fi kashf-al-mesail

·         Tajrid-al-Kalam

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment