7 March 2021

అల్-అస్మై Al-Asmaʿi (740-828 / 833 CE), 

అల్-అస్మై గా పేరుగాంచిన అబూ సయీద్ -అబ్ద్ అల్-మాలిక్ బి. ఖురైబ్ అల్-అమాస్ అల్-బాహిలి యొక్క జీవిత కాలం:740-828 / 833 CE), అల్-అస్మై 740 లో బాస్రా, ఇరాక్ లో జన్మించాడు మరియు 828లో బాస్రా లో మరణించారు

.అల్-అస్మై Al-Asmaʿi  లేదా అస్మై Asmai;అని పిలవబడే  (أبو سعيد عبد الملك ابن قريب الأصمعي, ) అబ్ద్ అల్-మాలిక్ ఇబ్న్ ఖురైబ్ అల్-అమాస్;. (740-828 / 833 CE), ప్రారంభ అరబిక్ భాషా శాస్త్రవేత్త philologist మరియు బాస్రా స్కూల్  యొక్క ముగ్గురు ప్రముఖ అరబిక్ వ్యాకరణవేత్తలలో ఒకరు. అల్-అస్మై అబ్బాసిడ్ ఖలీఫా  హారన్ అల్-రాషిద్  యొక్క ఆస్థానంలో

పనిచేసిన ప్రముఖ పాలిమత్, పండితుడు,సంకలన శాస్త్రవేత్త, భాషాశాస్త్రo , కవిత్వం, వంశవృక్షం మరియు సహజ విజ్ఞాన శాస్త్రం scholar. anthologist, philology, poetry, genealogy, and natural science, లో ప్రముఖుడిగా పేరుగాంచాడు.  జంతు-మానవ శరీర నిర్మాణ శాస్త్రం animal-human anatomical scienceలో జంతుశాస్త్రzoology అధ్యయనాలకు మార్గదర్శకత్వం వహించారు. అల్-అస్మై హ్యూమన్ అనాటమీ, బోటనీ జువాలజీ ఫిలోలజిస్ట్ (ఫిలాలజీ అనేది భాష యొక్క అధ్యయనం) ఆంథాలజిస్ట్ (ప్రచురించిన కవితల సంకలనం లేదా ఇతర రచనల ముక్కలు) నిపుణుడు, అల్-అస్మై తొలి అరబిక్ లెక్సిగ్రాఫర్లలో ఒకడు. లెక్సికోగ్రాఫర్స్ అనగా  నిఘంటువులను సంకలనం చేసే వ్యక్తి,  ఇస్లామిక్ స్కాలర్.

అల్-అస్మై ఒక ముఖ్యమైన కవితా సంకలనం, అస్మయ్యత్Asma'iyyat సంకలనం చేసాడు మరియు అంతరా ఇబ్న్ షాదాద్Antarah ibn Shaddad జీవితంపై ఒక ఇతిహాసం కంపోజ్ చేసిన ఘనత పొందాడు. అల్-ఖలీల్ ఇబ్న్ అహ్మద్ అల్-ఫరాహిది మరియు అబూ 'అమర్ ఇబ్న్ అల్-' అలా’ Al-Khalil ibn Ahmad al-Farahidi and Abu 'Amr ibn al-'Ala' ', చేత అల్-అస్మై ప్రభావితుడు అయ్యాడు మరియు అతను బస్రాన్ పాఠశాలకు Basran school చెందిన అబై-ఉబైదా మరియు సిబావేహి యొక్క సమకాలీకుడు  మరియు ప్రత్యర్థి కూడా

 

అల్-అస్మై Al-Asmaʿi  యొక్క పూర్తి పేరును అబ్దుల్-మాలిక్ ఇబ్న్ ఖురైబ్ ఇబ్న్ 'అబ్దుల్ అల్ మాలిక్ ఇబ్న్ 'అలీ ఇబ్న్ అమా'ఇబ్న్ మునాహిర్ ఇబ్న్' అమర్ ఇబ్న్ 'అబ్దుల్లాహ్ అల్-బాహిలా.' ’’‘Abd al-Malik ibn Qurayb ibn ‘Abd al-Malik ibn ‘Ali ibn Aṣma’ī ibn Muẓahhir ibn ‘Amr ibn ‘Abd Allah al-Bāhilī.’’’ అల్-అస్మై బాహిల అరబ్ తెగ సభ్యుడు

 

అల్-అస్మై Al-Asmaʿi  "అరబిక్ భాష యొక్క పూర్తి మాస్టర్" మరియు "మౌఖిక చరిత్ర యొక్క అన్ని ప్రసారాలలో మరియు భాష యొక్క అరుదైన వ్యక్తీకరణలలో గొప్పవాడు". అల్-అస్మై తన కాలం నాటి అనేక సాహసాల కథలు సంకలనం చేసాడు..

 

అల్-అస్మై తండ్రి ఆశిం(Āṣim) కు చెందిన ఖురైబ్ అబే బకర్ మరియు అతని కుమారుడు సైద్Sa’īd. అతను ప్రఖ్యాత కవి అబూ ఉయైనా అల్-ముహల్లాబా Abū ‘Uyaynah al-Muhallabī కుటుంబానికి చెందినవాడు.అల్-అమా అడ్నాన్ మరియు బాహిలా తెగకు చెందిన వాడు.  ఖలీఫా  హరున్ అల్-రషీద్ తన కుమారులు అల్-అమీన్ మరియు అల్-మమున్ లకు బోధకుడిగా అల్-అస్మై ను నియమిoచినాడు.  అల్-అస్మై ఆనాటి ప్రభావవంతమైన బార్మాకిడ్ విజియర్స్ తో ప్రాచుర్యం పొందినాడు  మరియు బాస్రాలో ఆస్తి సంపాదించినాడు.. అల్-అస్మై శిష్యులు కొందరు సాహితి  పురుషులుగా ఉన్నత పదవులను  పొందారు.

 

కితాబ్ అల్-అయిన్ (అరబిక్: العين) అరబిక్ భాష యొక్క మొదటి నిఘంటువుగా పరిగణించబడుతుంది

 

అల్-అస్మై కు క్లాసికల్ అరబిక్ భాషపై అద్భుతమైన జ్ఞానం ఉంది. అతను నిర్దేశించిన సూత్రాల ఆధారంగా, ఇస్లాo పూర్వ అరబ్ కవుల సేకరణలు అతని శిష్యులు తయారుచేశారు. అల్-అస్మై అల్-అమాసియట్ Amaʿīyāt అనే సంకలనాన్ని కూడా వ్రాసాడు, ఇది సొగసైన మరియు భక్తి కవిత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. అతని పద్ధతి మరియు ప్రామాణికమైన సాంప్రదాయం పట్ల ఆయనకున్న విమర్శలు అతని కాలానికి గొప్పవిగా భావిస్తారు.

 

అల్-అస్మై పూర్తి అరబిక్ భాషను దాని స్వచ్ఛమైన రూపంలో కేటలాగ్ జాబితా చేయాలనే ఉద్దేశం తో ఎడారి బెడౌయిన్ తెగలతో తిరుగుతూ, వారి ప్రసంగ విధానాలను speech patterns గమనించి, నమోదు/రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు.

 

అల్-అస్మై గొప్ప విమర్శకుడు అయిన అబూబైదా సమకాలీనుడు.  అల్- అస్మై ప్రధానంగా. అరబ్ జాతీయవాది మరియు అరబిక్ భాష యొక్క ప్రతినిధిగా/విజేతగా అల్-అస్మై అరబిక్ పై విదేశీ భాషా మరియు సాహిత్య ప్రభావాలను తిరస్కరించారు. అల్-అస్మై మరియు అబే ఉబైదా కవిత్వం మరియు వాక్చాతుర్యం లో సమానులు కాని కాని అబే ఉబైదా వంశవృక్షం genealogy,లో రాణించగా , అల్-అస్మై వ్యాకరణంలో రాణించాడు.

అల్-అస్మై 88 సంవత్సరాల వయస్సులో బస్రా లో మరణించాడు,

రచనలు:

అల్-అస్మై 60 రచనలు చేసాడు. ఇవి  ప్రధానంగా జంతువులు, మొక్కలు, ఆచారాలు మరియు వ్యాకరణ రూపాలు మరియు  ఇస్లాo పూర్వ అరబిక్ కవిత్వానికి సంబంధించినవి;

 

అల్-అస్మై యొక్క గొప్ప రచన/మ్యాగ్నం ఓపస్ magnum opus  “అస్మాయత్Asma'iyyat, ఇది ప్రారంభ అరబిక్ కవిత్వానికి ప్రాధమిక మూలం మరియు దీనిని ఆధునిక యుగంలో, జర్మన్ ఓరియంటలిస్ట్ విల్హెల్మ్ అహ్ల్వార్డ్ట్Wilhelm Ahlwardt సేకరించి తిరిగి ప్రచురించారు. ఇస్లాo  పూర్వ అరబిక్ కవిత్వానికి ముఖ్యమైన మూలం అయిన “అస్మాయత్ మరియు ముఫద్దాలియాట్ Aṣma’īyyat and Mufaddaliyyat రెండింటి ఆంగ్ల అనువాదం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. అల్-అస్మై బోధించిన సూత్రాల ఆధారంగా అల్-అస్మై యొక్క విద్యార్థులు అతని ఇతర సేకరణలను సంకలనం చేశారు.

 

అల్-అస్మై కవి,పండితుడు మరియు విమర్శకుడు. అతని అత్యంత ప్రసిద్ధ కవిత సౌటో సఫీర్ అల్ బుల్బులి Sauto Safir al bulbuli’’ అరబిక్ వ్యాకరణం మరియు పదజాలంపై అల్-అస్మై కు ఉన్న నైపుణ్యాన్ని చూపిస్తుంది. అల్-అస్మై ప్రసిద్ద గ్రంధం Fuḥūlat al-Shu‘arā అరబిక్ సాహిత్యం లో మేలైన సాహిత్య విమర్శనా గ్రంధం.   

 

అల్-అస్మై వృక్ష శాస్త్రవేత్త కూడా. అల్-అస్మై అరబిక్ ద్వీపకల్పంలో పెరిగే వివిధ మొక్కల  నామకరణం, వర్గీకరణ. నిర్మాణం, రకాలు మరియు పండ్లు ను వివరించాడు. అతను దాదాపు 276 మొక్కలు మరియు చెట్లు గురించి వివరించాడు.

అల్-అస్మై పశుసంవర్ధక జంతుశాస్త్రంలో శాస్త్రీయ అధ్యయనం చేసిన  మొదటి ముస్లిం జంతుశాస్త్రవేత్త. న్యాచురల్ సైన్స్, జూవాలజిలో మార్గదర్సకుడు.

 

అల్-అస్మై జంతువులపై 5 పుస్తకాలు రాశాడు-కితాబ్ అల్-ఖైల్ (ది బుక్ ఆఫ్ ది హార్స్), కితాబ్ అల్-ఇబిల్ (ది బుక్ ఆఫ్ ది ఒంటె), కితాబ్ అల్-షా (గొర్రెల పుస్తకం), కితాబ్ ఖలాక్ అల్-ఇన్సాన్ (ది బుక్ ఆఫ్ హ్యుమానిటీ- ఇందులో  అతను మానవ శరీర నిర్మాణ శాస్త్రం గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాడు. కితాబ్ అల్-వుహుష్ (ది బుక్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్),కితాబ్ అల్-ఫార్క్ (అరుదైన జంతువుల పుస్తకం).

అల్-అస్మై యొక్క గద్య రచనలలో అర డజను పైగా ప్రస్తుతం లబిస్తున్నాయి. వీటిలో బుక్ ఆఫ్ డిస్టింక్షన్, బుక్ ఆఫ్ ది వైల్డ్ యానిమల్స్, బుక్ ఆఫ్ ది హార్స్, మరియు బుక్ ఆఫ్ ది షీప్ మరియు అరబిక్ సాహిత్య విమర్శ యొక్క మార్గదర్శక రచన pioneering work of Arabic literary criticism అయిన ఫ్యూలాత్ అల్-షుయారా Book of Distinction, the Book of the Wild Animals, the Book of the Horse, and the Book of the Sheep, and Fuḥūlat al-Shu‘arā  ఉన్నాయి.

 

 

 

 

No comments:

Post a Comment