13 March 2021

రుఫైదా అల్-అస్లామియా Rufaida Al-Aslamia (620--)


 

 

Rufaida Al-Aslamia



رفيدة الأسلمية


రుఫైదా అల్-అస్లామియా లేదా రుఫాయిదా బిన్తె  సాద్ (అరబిక్: رفيدة الأسلمية జననం సుమారుగా 620 AD; 2 BH) ఇస్లామిక్ వైద్య మరియు సామాజిక కార్యకర్త, రుఫైదా మొదటి ముస్లిం మహిళా నర్సు మరియు మొదటి ముస్లిం మహిళా సర్జన్,

 

ఇస్లాంను అంగీకరించిన మదీనాలోని  మొట్టమొదటి వ్యక్తులలో రుషైదా ఒకరు.

రుఫైదా అల్-అస్లామియా మదీనాలోని కజ్రాజ్ గిరిజన సమాఖ్య లోని బోని అస్లెం తెగలో జన్మించారు మరియు మదీనా కు ప్రవక్త ముహమ్మద్(స) వచ్చినప్పుడు  స్వాగతం పలికిన అన్సార్ మహిళలలో ఆమె ఒకరు.

 

రుఫైదా అల్-అస్లామియా ఒక దయ గల నర్సు మరియు మంచి నిర్వాహకురాలు. ఆమె తన క్లినికల్ నైపుణ్యాలతో ఆయేషా(ర) తో సహా  ప్రవక్త ముహమ్మద్(స)  యొక్క ప్రసిద్ధ మహిళా సహచరులకు   నర్సులుగా ఉండటానికి మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేయడానికి శిక్షణ ఇచ్చింది. ఆమె ఒక సామాజిక కార్యకర్తగా కూడా పనిచేసింది మరియు  వ్యాదులకు  సంబంధించిన సామాజిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడింది. ఆమె పిల్లలకు, అనాథలకు మరియు పేదలకు సహాయం చేసేది.

 

వైద్య కుటుంబంలో జన్మించిన రుఫైదా తన తండ్రి సాద్ అల్ అస్లామీ నుంచి వైద్యo, నర్సింగ్ లో మరియు మరియు అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకోవడం లో శిక్షణ పొందారు.  తండ్రి శిక్షణ లో రుఫైదా అల్-అస్లామియా యుద్ధ సమయంలో గుడారం క్షేత్ర ఆసుపత్రుల(Field Hospitals in Tents)  నిర్వహణ లో నైపుణ్యాలను అభ్యసించింది, ప్రవక్త ముహమ్మద్(స)  యుద్ద సమయం లో జరిగే ప్రాణనష్టాలను నివారించడానికి గాయపడిన సైనికులను తక్షణమే గుడారాల లో గల క్షేత్ర ఆసుపత్రుల(Field Hospitals in Tents) కి తీసుకెళ్లమని ఆదేశించేవారు. రుఫైదా అల్-అస్లామియా తన వైద్య నైపుణ్యం తో గాయపడిన వారికి చికిత్స చేసేది. జిహాద్ సమయంలో గాయపడిన సైనికులకు రుఫైదా వైద్యం చేసేది మరియు ఎడారి వేడి గాలుల నుంచి కఠినమైన ఎడారి వేడి నుండి వారికి తక్షణ వైద్య సహాయం, ఉపచారాలు అందించేది.

 

ఇస్లామిక్ పూర్వ కాలంలో నర్సింగ్ చరిత్రకు సంబంధించి చాలా తక్కువ సమాచారం ఉన్నప్పటికీ, ముహమ్మద్ ప్రవక్త (స) పాలనలో నర్సుల పాత్ర వారు నిర్వహించిన విధులపై గణనీయమైన అవగాహన కలదు. ముహమ్మద్ ప్రవక్త(స)కాలంలో వైద్య చికిత్స ఎక్కువగా వైద్యులు మాత్రమే చేశారు, వారు సాధారణంగా రోగ నిర్ధారణ చేయడానికి మరియు అవసరమైన వారికి మందులు అందించడానికి రోగిని వ్యక్తిగతంగా సందర్శిoచే వారు.. నర్సులు రోగి యొక్క శారీరక సౌకర్యం మరియు భావోద్వేగ సహాయాన్ని అందించడo వంటి విధులను నిర్వహించేవారు.

 



మొరాకోలోని సాలె యొక్క పురాతన ఆసుపత్రి ముందు తలుపు

Front door of ancient hospital of Salé in Morocco

 

ప్రవక్త ముహమ్మద్ (స) పాలనలో అనేక కొత్త ఆసుపత్రుల నిర్మాణం మరియు రోగులకు చికిత్స చేసే పద్ధతులు ఏర్పడ్డాయి. కాలంలో నర్సులు రోగులకు ఆహారాన్ని వడ్డించడం మరియు షధ ద్రవాలను అందించడం వంటి విధులను నిర్వహించేవారు. లింగం ఆధారంగా ఆసుపత్రి వార్డులను వేరుచేయడం జరిగింది  పురుష మరియు స్త్రీ డాక్టర్స్ వేరు-వేరుగా ఉండేవారు.

 

రుఫైదా అల్-అస్లామియా తన క్లినికల్ నైపుణ్యాలను మరియు వైద్య అనుభవాన్ని ఉపయోగించి ముస్లిం సమాజపు  వైద్య అవసరాలను తీర్చగలిగే మొట్టమొదటి మొబైల్ కేర్ యూనిట్లను అభివృద్ధి చేసింది. ఆమె పని ఆస్పత్రి పరిశుభ్రత మరియు రోగులను సంరక్షణ అందించడం.

సైనిక యాత్రల సమయంలో, రుఫైదా అల్-అస్లామియా స్వచ్ఛంద నర్సుల బృందాలకు నాయకత్వం వహించారు, వారు యుద్ధభూమికి వెళ్లి క్షతగాత్రులకు చికిత్స చేసేవారు. ఆమె ఖండక్, ఖైబర్ మరియు ఇతర యుద్ధాలలో (Khandaq, Khaibar, and other) పాల్గొంది.

 



సలామాన్ వద్ద ఉన్న మసీదు-ది ట్రెంచ్(కందక) యుద్ధం జరిగిన ప్రదేశం Battle of The Trench, లో రుఫైదా అల్-అస్లామియా గాయపడినవారికి చికిత్స చేసింది.The Mosque at Salaman, location of the Battle of The Trench where Al-Aslamia treated the injured

 

శాంతి కాలంలో, రుఫైదా అల్-అస్లామియా ముస్లింలకు అవసరమైన సహాయం అందించడం ద్వారా మానవతా కార్యకలాపాలలో  తన ప్రమేయాన్ని కొనసాగించారు.

 

రుఫైదా మహిళా సహచరుల బృందానికి నర్సులుగా శిక్షణ ఇచ్చారు. ఖైబర్ యుద్ధానికి (battle of Khaibar) ముహమ్మద్(స) సైన్యం సిద్ధమవుతున్నప్పుడు, రుఫైదా మరియు స్వచ్ఛంద నర్సుల బృందం ముహమ్మద్(స) వద్దకు వెళ్ళి "అల్లాహ్ యొక్క దూత, మేము మీతో యుద్ధానికి వెళ్లి గాయపడినవారికి చికిత్స చేసి, ముస్లింలకు సాధ్యమైనంత సహాయం చేయాలనుకుంటున్నాము" అని ప్రవక్త(స)అనుమతి కోరారు. ప్రవక్త ముహమ్మద్(స) వారికి యుద్దరంగానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నర్సు వాలంటీర్లు తమ విధులను చక్కగా నిర్వహించారు, వారి కృషి కి ప్రవక్త ముహమ్మద్ (స) మెచ్చి అనుగ్రహంలో కొంత భాగాన్ని రుఫైదాకు కేటాయించారు. ఆమె వాటా వాస్తవానికి పోరాడిన సైనికులకు సమానం. ఇది ఆమె వైద్య మరియు నర్సింగ్ పనికి గుర్తింపుగా ఉంది.

 లెగసి:

ప్రవక్త ముహమ్మద్ (స) సమయంలో ప్రాక్టీస్ చేసిన రుఫైదా అల్-అస్లామియా మొదటి ముస్లిం నర్సు అని రికార్డులు సాక్ష్యమిస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలు మొట్టమొదటి నర్సు మరియు మహిళా ముస్లిం సర్జన్ హోదాను రుఫైదాకు ఆపాదించాయి.

 

ప్రతి సంవత్సరం ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ద్వారా   బహ్రెయిన్ విశ్వవిద్యాలయంలోని  ఒక విద్యార్థికి నర్సింగ్‌లో గౌరవనీయమైన మరియు ప్రతిష్టాత్మక రుఫైదా అల్-అస్లామియా అవార్డు ఇవ్వబడుతుంది. అవార్డు గ్రహీత ను సీనియర్ క్లినికల్ మెడికల్ స్టాఫ్ సభ్యుల బృందం నిర్ణయించును., నర్సింగ్‌లో రుఫైదా అల్-అస్లామియా ప్రైజ్ రోగులకు అద్భుతమైన నర్సింగ్ సంరక్షణను అందించడంలో స్థిరంగా రాణించే విద్యార్థికి ఇవ్వబడుతుంది.

 


No comments:

Post a Comment