5 January 2022

సయ్యద్ బద్రుద్దుజా 1900-1974 Syed Badrudduja1900-1974

 

సయ్యద్ బద్రుద్దుజా (బెంగాలీ: সৈয়দ বদরুদ্দোজা; 4 జనవరి 1900 - 18 నవంబర్ 1974) ఒక భారతీయ-బెంగాలీ రాజకీయ నాయకుడు, పార్లమెంటేరియన్ మరియు కార్యకర్త. బద్రుద్దుజా పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు, భారత పార్లమెంట్ లోక్ సభ సభ్యుడు మరియు కలకత్తా మేయర్ గా పనిచేసేను. సయ్యద్ బద్రుద్దుజా ఖిలాఫత్ ఉద్యమం మరియు శాసనోల్లంఘన ఉద్యమాలలో పాల్గొన్నాడు మరియు హుసేన్ షహీద్ సుహ్రావర్ది యొక్క యునైటెడ్ బెంగాల్ ప్రతిపాదనకు సమర్ధకుడు.

సయ్యద్ బద్రుద్దుజా ముర్షిదాబాద్ జిల్లా, తాలిబ్‌పూర్ గ్రామంలో  బెంగాలీ సయ్యద్‌ల ముస్లిం కుటుంబంలో జన్మించాడు. బద్రుద్దుజా తండ్రి సయ్యద్ అబ్దుల్ గఫూర్. బద్రుద్దుజా తాలిబ్‌పూర్ ఖరేజీ మదర్సాలో చదవటానికి ముందు సలార్ H.E.స్కూల్ లో మరియు  కాగ్రామ్ H.E. స్కూల్ ముర్షిదాబాద్ లో పాఠశాలవిద్య నబ్యాసించినాడు.  తరువాత బద్రుద్దుజా కలకత్తా మదర్సాలో చదువుకున్నాడు మరియు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ మరియు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు.

బద్రుద్దుజా ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్‌లో చేరి కార్యదర్శిగా పనిచేశాడు. బద్రుద్దుజా చిత్త రంజన్ దాస్, సుభాస్ చంద్ర బోస్ మరియు హుసేన్ షాహీద్ సుహ్రావర్ది వంటి బెంగాలీ నాయకులతో కలిసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేశాడు. బద్రుద్దుజా క్రిషక్ ప్రజా పార్టీతో కూడా సంబంధం కలిగి ఉన్నాడుతరువాత, బద్రుద్దుజా ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడయ్యాడు

బద్రుద్దుజా బెంగాల్‌లోని ప్రోగ్రెసివ్ అసెంబ్లీ పార్టీ కార్యదర్శిగా మరియు బెంగాల్‌లోని ప్రోగ్రెసివ్ కూటమి పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బద్రుద్దుజా 1943 నుండి 1944 వరకు కోల్‌కతా మేయర్‌గా ఉన్నాడు. విభజన తర్వాత భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

బద్రుద్దుజా 1940-46మద్య బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 1946-47 మద్య బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, 1948-52 మరియు 1957-62 మద్య పశ్చిమ బెంగాల్ శాసనసభ లో  సభ్యుడు, 1962—67 మద్య మూడవ లోక్ సభ, మరియు 1967-70 మద్య 4వ లోక్ సభ- సబ్యునిగా పనిచేసినాడు.

బద్రుద్దుజా ప్రజా జీవితంలో చురుకుగా ఉన్నాడు మరియు కలకత్తా ముస్లిం స్టూడెంట్స్ అసోసియేషన్, అంజుమన్-ఇ-ట్రాకీ ఉర్దూ, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ సమితి, కలకత్తా ముస్లిం ఇన్స్టిట్యూట్ మరియు ఆల్ బెంగాల్ ముస్లిం యువకుల సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా (president of Calcutta Muslim Students' Association, Anjuman-i-Traqqi Urdu, West Bengal, West Bengal Relief and Rehabilitation Samity, Calcutta Muslim Institute and vice-president of All Bengal Muslim Youngmen Association) కూడా పనిచేశాడు. .

బద్రుద్దుజా రాకియా బద్రుద్దుజాను వివాహం చేసుకున్నాడు.వారికి సయ్యద్ సకీనా ఇస్లాం, సయ్యద్ మొహమ్మద్ అలీ (మ. 2010), సయ్యదా సల్మా రెహమాన్, సయ్యదా రజియా ఫైజ్ (1936-2013), సయ్యద్ హైదర్ అలీ, సయ్యదా ఐసా ఖాదర్, సయ్యద్ అష్రఫ్ అలీ (1939-2016), సయీదా ఫాతిమా ఇస్లాం, సయ్యద్ రెజా అలీ మరియు సయ్యదా జాకియా వంటి పిల్లలు ఉన్నారు. బద్రుద్దుజా 18 నవంబర్ 1974న 74 ఏళ్ల వయస్సులో మరణించారు.

 

 

No comments:

Post a Comment