11 July 2023

సౌదీ అరేబియా యొక్క ప్రారంభ అభివృద్ధికి భారతీయు ముస్లిముల ఆర్థిక సహాయం Indian Muslims financed the early development of Saudi Arabia

 


 “భారతీయ ముస్లింలు హెజాజ్ (సౌదీ అరేబియా) రైల్వే ఫండ్‌కు 5,00,000 రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు, హైదరాబాద్ స్టేట్ లోని ముస్లిం నివాసులు తమ మొత్తం సంపదలో 6.5% పన్ను విధించాలని ప్రతిపాదించారు. ” 15 డిసెంబర్ 1903న టర్కీలోని బ్రిటిష్ రాయబారి అధికారిక నివేదిక.


సౌదీ అరేబియా నేడు చాలా అధునాతన మౌలిక సదుపాయాలతో ఆసియాలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కిష్ ఒట్టోమన్ పాలన నుండి విడిపోయిన తర్వాత సౌదీ అరేబియా దేశ ఆర్థిక వ్యవస్థ విపరీతంగా అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దం ప్రారంభంలో, సౌదీ అరేబియా ఆధునిక రవాణా, కమ్యూనికేషన్ మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.

 

సౌదీ అరేబియా ఆర్ధిక అభివృద్ధిలో భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషించారని మీకు తెలుసా? భారతీయులు కేవలం మానవ వనరుల రూపంలో మాత్రమే కాదు, సౌదీ అరేబియాకి మూలధనాన్ని మరియు సాంకేతికతను భారతీయులు అందించారు.

 

1910లో, సౌదీ అరేబియాను టర్కీ పాలించినప్పుడు, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇలా పేర్కొంది, “లాహోర్‌లోని వతన్ పత్రికా  సంపాదకుడు మౌల్వీ ఇన్షి-ఉల్లా, కాన్స్టాంటినోపుల్‌లోని హెడ్జాజ్ రైల్వే ఫండ్‌కు ముప్పై-నాల్గవ విడతగా రూ.  1,120 గత రెండున్నర నెలల్లో పాఠకుల నుండి సేకరించబడింది పంపాడు. ప్రస్తుత విడతలో ప్రధాన దాత బులంద్‌షహర్ జిల్లాకు చెందిన ఒక ముస్లిం మహిళ. ఈ విరాళం తో  సహా, వతన్ పత్రిక ఎడిటర్ దాదాపు రూ.98,000 విరాళంగా పంపాడు.


ఇంకా  టర్కీ అధికారులు నిధుల దుర్వినియోగంపై భారతీయులు ఆగ్రహంతో ఉన్నారని కూడానివేదిక పేర్కొంది. హేజాజ్ రైల్వే పనులు సక్రమంగా జరగకుంటే నిధులు పంపడం మానేస్తామని కూడా బెదిరించారు.

 

1906లో, మౌల్వీ అబ్దుల్ ఖయ్యూమ్ హైదరాబాద్‌లో, సౌదీ అరేబియాలో రైల్వేల కోసం పెద్ద మొత్తంలో డబ్బును సేకరించి  హెడ్జాజ్ రైల్వే ఫండ్ Hedjaz Railway Fund కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్టేట్ 1901లో హెడ్జాజ్ రైల్వేల కోసం నిధుల సేకరణను ప్రారంభించింది.డబ్బుతో పాటు, సౌదీ అరేబియాలో రైల్వే ట్రాక్‌లను వేయడానికి భారతీయ పాలకులు తమ ఆర్మీ బెటాలియన్లు, ఇంజనీర్లు మరియు సాంకేతికతను పంపారు. ఇంజనీర్లతో సహా హైదరాబాద్ నుండి 5,000 మందికి పైగా సైనికులు రైల్వే అభివృద్ధికి తమ విధులను అందించారు.

 

రైల్వేలు 1910లో జెడ్డా మరియు మదీనా మధ్య ప్రయాణీకులను తీసుకువెళ్లడం ప్రారంభించాయి, అయితే మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా కార్యకలాపాలను కొనసాగించలేకపోయింది. కొత్త సౌదీ ప్రభుత్వం పాలనను చేపట్టిన తర్వాత 1930లలో దాని రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేసింది. మరోసారి భారతీయులు ముందుకు వచ్చారు.

 

జెడ్డా-మక్కా రైల్వేలను అభివృద్ధి చేసేందుకు చెన్నైకి చెందిన S.A.K జీలానీ ఒక ప్రణాళికను ప్రతిపాదించారు. కింగ్ ఇబ్న్ సౌద్ ఈ సహకారం కోసం చాలా సంతోషించాడు కానీ సౌదీ మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రత్యర్థులు జీలానీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా అడ్డుపడ్డారు.

 

సాయుధ పోరాటాలతో అస్తవ్యస్తమైన సౌదీ అరేబియా దేశాన్ని రాజు ఇబ్న్ సౌద్ స్వాధీనం చేసుకున్నాడు. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రెండు పవిత్ర మసీదులు ఉన్న దేశానికి సహాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఆయన కోరారు.

 

సౌదీ అరేబియా స్థాపన తర్వాత కొన్ని నెలల వ్యవధిలో, డిసెంబర్ 1932లో డాక్టర్ మోయిన్ ఉద్ దిన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని కొంతమంది ప్రముఖులు సౌది రాజు ఇబ్న్ సౌద్ పిలుపుకు స్పందించారు. వారు మదీనాలో ఒక గుడ్డ మిల్లును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు, అక్కడ భారతీయ నేత కార్మికులు అరబ్బులకు వస్త్రం నేయడంలో నైపుణ్యాన్ని నేర్పుతారు. మూలధనం, యంత్రాలు భారతీయులే సమకూర్చుకోవాల్సి వచ్చింది. సౌదీ అరేబియాలో బట్టల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. లాభాలన్నీ సౌదీ రాజ్యానికే చెందుతాయి.

 

సౌది రాజు ఇబ్న్ సౌద్ ఈ ఆలోచనను అంగీకరించాడు మరియు జూలై 1933లో, యంత్రాలు మరియు నేత కార్మికులు జెడ్డా ఓడరేవుకు చేరుకున్నారు. డాక్టర్ మోయిన్ మదీనాలో ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించారు, ఇక్కడ ప్రారంభంలో 20 మంది పనిచేశారు. ఈ వస్త్రం పవిత్రమైన వస్తువుగా విక్రయించబడింది మరియు ముస్లింలు హజ్ చేసిన తర్వాత వారి బంధువులు మరియు స్నేహితులకు బహుమతిగా తీసుకోవచ్చు. మదీనాలోని అల్ ఫక్రియా స్కూల్‌లో కూడా ఒక దుకాణాన్ని తెరిచారు.


భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహకారంపై ఆధారపడి ఉన్నాయి.

 


No comments:

Post a Comment