21 January 2024

ప్రొ. సయ్యద్ నూరుల్ హసన్ 1921–1993: సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన హీరో Prof. Saiyid Nurul Hasan: an unsung crusader against social injustice

 




ప్రోఫెసర్ సయ్యద్ నూరుల్ హసన్ (26 డిసెంబర్ 1921 - 12 జూలై 1993) ఒక భారతీయ చరిత్రకారుడు మరియు రాజనీతివేత్త. సయ్యద్ నూరుల్ హసన్ 1969 నుండి 1978 వరకు రాజ్యసభ సభ్యుడు మరియు భారత ప్రభుత్వం కేంద్ర విద్య, సాంఘిక సంక్షేమం మరియు సంస్కృతి యొక్క సహాయ మంత్రిగా(1971–1977) (స్వతంత్ర బాధ్యతలతో) పనిచేసారు.

ప్రొఫెసర్ నూరుల్ హసన్ 1983 నుండి 1986 వరకు సోవియట్ యూనియన్‌కు భారత రాయబారిగా పనిచేశాడు.

సయ్యద్ నూరుల్ హసన్ పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా గవర్నర్ (1986–1993)గా కూడా పనిచేసారు.

సయ్యద్ నూరుల్ హసన్ అలహాబాద్‌లోని ముయిర్ Muir సెంట్రల్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు, తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లోని న్యూ కాలేజీ నుండి M.A. మరియు D.Phil పూర్తి చేశాడు.

నూరుల్ హసన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు మరియు అలీఘర్‌లో చరిత్ర విభాగ  అభివృద్ధికి తోడ్పడ్డాడు. ప్రొఫెసర్ నూరుల్ హసన్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షుడిగా పనిచేసాడు. . ప్రొఫెసర్ నూరుల్ హసన్ లండన్‌లోని రాయల్ హిస్టారికల్ సొసైటీ మరియు రాయల్ ఏషియాటిక్ సొసైటీలో  ఫెలో గా వ్యవరించాడు..

ప్రొఫెసర్ నూరుల్ హసన్ వామపక్ష భావాలున్న  లౌకికవాది. భారత దేశం లో హైస్కూల్, జూనియర్ కాలేజీ మరియు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో 10+2+3 విద్యా విధానాన్ని ప్రారంభించడంలో ప్రొఫెసర్ నూరుల్ హసన్ కీలక పాత్ర పోషించాడు.

“1972 మే 23న పార్లమెంట్ వేదికగా అప్పటి కేంద్ర విద్యా, సాంఘిక సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రొఫేసర్  నూరుల్ హసన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హరిజనులకు తగిన రక్షణ కల్పించేందుకు కలెక్టర్లు మరియు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని, అంటరానితనం తమ దృష్టికి వచ్చిన అన్ని సందర్భాలలో కలెక్టర్లు మరియు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లు వారు సూ-మోటుగా సత్వర చర్య తీసుకోవాలి. అని అన్నారు."

ప్రొఫేసర్  నూరుల్ హసన్ సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడే వ్యక్తి. కేంద్ర మంత్రి  గా  ప్రొఫెసర్  నూరుల్ హసన్ అంటరానితనం (నేరాల) చట్టం, 1955కి సవరణను ప్రతిపాదించాడు.

 ప్రొఫెసర్ నూరుల్ హసన్ ఉన్నత కుటుంబం నుండి వచ్చినప్పటికీ, కుల ఆధారిత సమాజంలోని దుష్పరిణామాలను గ్రహించారు. కుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చట్టాన్ని ప్రతిపాదిస్తున్నప్పటికీ, ఈ చట్టం ఈ దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించి సామాజిక సమానత్వాన్ని తీసుకురాలేకపోయిందని అన్నారు.

ప్రొఫెసర్ నూరుల్ హసన్ మాట్లాడుతూ మనకు సామాజిక విప్లవం కావాలి. మన దృక్పథంలో ప్రాథమిక మార్పు అవసరం. సామాజిక మరియు రాజకీయ కార్యకర్తలు అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలి.

జమీందారీ రద్దు మరియు కుల ఆధారిత అణచివేతలకు వ్యతిరేకంగా చట్టాన్ని ప్రత్యేక వర్గాలు హింసాత్మకంగా ప్రతిఘటిస్తాయని ప్రొఫెసర్ నూరుల్ హసన్ అర్థం చేసుకున్నాడు. ప్రొఫెసర్ నూరుల్ హసన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, “వివిధ రాష్ట్రాలలో భూ చట్టాన్ని అమలు చేయబోతున్నందున సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయి మరియు హరిజనులపై హింస పెరిగింది.హరిజనులకు రక్షణ కల్పించడం అన్ని రాజకీయ పార్టీలు మరియు అన్ని సామాజిక సంస్థల కర్తవ్యం, అయితే ప్రభుత్వ కర్తవ్యం సామాజిక కార్యకర్తలు మరియు రాజకీయ నాయకుల కంటే చాలా ఎక్కువ.

ప్రొఫెసర్ నూరుల్ హసన్ పాఠశాల పాఠ్యపుస్తకాలు కులతత్వం మరియు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా బోధించేలా చూడటం తన కర్తవ్యంగా భావించారు.

ప్రొఫెసర్ నూరుల్ హసన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, “పాఠశాలలకు ఉద్దేశించిన పాఠ్యపుస్తకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యావ్యవస్థలో భోదించే అంశాలు అంటరానితనాన్ని సహించే విలువలు కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు,

భారత ప్రభుత్వం నియమించిన కమిటీచే సమర్పించబడిన "సమానత్వం వైపు: భారతదేశంలో మహిళల స్థితిగతులపై కమిటీ నివేదిక (1974-75) "Towards Equality: The Report of the Committee on the Status of Women in India (1974-75)" "ను పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో ప్రొఫెసర్ నూరుల్ హసన్ ప్రధాన పాత్ర పోషించాడు. కమిటి సబ్యులుగా ఫుల్రేణు గుహ, మణిబెన్ కారా, సావిత్రి శ్యామ్, నీరా డోగ్రా, విక్రమ్ మహాజన్, లీలా దూబే, సకీనా ఎ. హసన్, ఊర్మిలా హక్సర్, లోతికా సర్కార్ మరియు వినా మజుందార్ కలరు.

"సమానత్వం వైపు: భారతదేశంలో మహిళల స్థితిగతులపై కమిటీ నివేదిక (1974-75) "Towards Equality: The Report of the Committee on the Status of Women in India (1974-75)" కమిటి నివేదికను 1975లో పార్లమెంటు ముందుంచారు. 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ఐక్య రాజ్య సమితి చే ప్రకటించబడినది.

ఈ నివేదిక స్వతంత్ర భారతదేశంలో మహిళా ఉద్యమానికి పునాది వేసింది. వివక్షాపూరిత సామాజిక సాంస్కృతిక పద్ధతులు, రాజకీయ మరియు ఆర్థిక ప్రక్రియలను ఎత్తిచూపిందిఅని చాలామంది నమ్ముతున్నారు.

నివేదిక దేశంలో అనేక సామాజిక మరియు రాజకీయ ఉద్యమాలకు దారితీసింది.ఈ నివేదిక యొక్క ఫలితాలు ఢిల్లీలోని మహిళా అభివృద్ధి అధ్యయనాల కేంద్రం Centre for Women's Development Studies స్థాపనకు ఆధారం..

ప్రొఫెసర్ నూరుల్ హసన్ 1993లో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో 71 సంవత్సరాల వయస్సులో గవర్నర్‌గా కొనసాగుతున్నప్పుడు మూత్రపిండ వైఫల్యంతో మరణించాడు.

లెగసె:

ప్రొఫెసర్ సయ్యద్ నూరుల్ హసన్ కళాశాల, ఫరక్కా కు నూరుల్ హసన్ పేరు పెట్టారు.

నూరుల్ హసన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నూరుల్ హసన్ పేర స్థాపించబడినది.

కలకత్తా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నూరుల్ హసన్ చైర్ ప్రొఫెసర్‌షిప్ నూరుల్ హసన్ పేరు  పెట్టబడింది.

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment