25 January 2024

ఖలీఫా ఉమర్ మరియు చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్‌ Caliph Umar & the Church of the Holy Sepulchre

 జెరూసలేంను ముస్లిములు స్వాధీనం చేసుకోవడం ఇస్లామిక్ చరిత్రలో ఒక సువర్ణ అక్షరం. ఖలీఫా  ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ జెరూసలేంను ముస్లిములు స్వాధీనం చేసుకోన్నతరువాత  యూదులను జెరూసలేం నగరంలో నివసించడానికి అనుమతించాడు మరియు  ఇతర విశ్వాసాల ఆరాధన ప్రదేశాలను గౌరవించడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాడు..

 

హజ్రత్ ఖలీద్ ఇబ్న్ అల్-వాలిద్, మరియు హజ్రత్ అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ వంటి సైనిక జనరల్‌లు కల  ముస్లిం దళాలు హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ నేతృత్వంలో నవంబర్ 636లో జెరూసలేంను ముట్టడించారు.

సుమారు నాలుగు నెలల ముట్టడి తరువాత అప్పుటి  జెరూసలేం ఇన్‌ఛార్జ్ లేదా గవర్నర్ మరియు బైజాంటైన్ ప్రభుత్వ ప్రతినిధి, క్రైస్తవ చర్చి నాయకుడు గా ఉన్న పాట్రియార్క్ సోఫ్రోనియస్ చివరకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు.  

హజ్రత్ అబూ ఉబైదా ఖలీఫా ఉమర్‌కు జెరూసలేం పరిస్థితి గురించి వ్రాసారు మరియు జెరూసలేం నగరం యొక్క లొంగిపోవడాన్ని అంగీకరించడానికి జెరూసలేంకు రావాలని ఆహ్వానించారు. లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేయడానికి మరియు లొంగిపోవడాన్ని అంగీకరించడానికి ఖలీఫా ఉమర్ జెరూసలేంకు వచ్చాడు.

ఖలీఫా ఉమర్ జెరూసలేంకు వచ్చినప్పుడు, ఖలీఫా ఉమర్ జెరూసలేం గవర్నర్, క్రైస్తవ చర్చి నాయకుడు పాట్రియార్క్ సోఫ్రోనియస్ చేత స్వాగతించబడ్డాడు. చారిత్రక రికార్డుల ప్రకారం, ఖలీఫా ఉమర్  ఏప్రిల్ 637 ప్రారంభంలో పాలస్తీనాకు చేరుకున్నాడు. ఖలీఫా ఉమర్  మొదట ఓల్డ్ జెరూసలేం సిటీలోని జబియాకు వెళ్లాడు, అక్కడ హజ్రత్ అబూ ఉబైదా, హజ్రత్ ఖలీద్ మరియు ఇతరులు ఖలీఫా ఉమర్  కు స్వాగతం పలికారు. తరువాత ఖలీఫా ఉమర్ యొక్క హామీ అని పిలువబడే ఒక ఒప్పందం రూపొందించబడింది. ఈ ఒప్పందంపై ఖలీఫా ఉమర్ మరియు పాట్రియార్క్ సోఫ్రోనియస్, ముస్లిం సైన్యానికి చెందిన కొంతమంది జనరల్స్‌లు సంతకం చేశారు.

ఉమర్ ఒప్పందం చరిత్రలో అత్యంత ప్రగతిశీల ఒప్పందాలలో ఒకటి.

కేవలం 23 సంవత్సరాల క్రితం బైజాంటైన్ల నుండి పర్షియన్లు జెరూసలేంను స్వాధీనం చేసుకున్నప్పుడు, ఊచకోతకి ఆదేశించబడింది.

1099లో జెరూసలేంను ముస్లింల నుండి క్రూసేడర్లు స్వాధీనం చేసుకున్నప్పుడు మరొక ఊచకోత జరిగింది.

ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం సూక్తులలో నిర్దేశించినట్లుగా ఉమర్ ఒప్పందం జెరూసలేంలోని క్రైస్తవులకు మత స్వేచ్ఛను అనుమతించింది. ఇది చరిత్రలో మత స్వేచ్ఛకు సంబంధించిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన హామీలలో ఒకటి.

జెరూసలేంలో టెంపుల్ మౌంట్ మరియు వైలింగ్ వాల్‌పై యూదులను పూజించడానికి ఉమర్ అనుమతించాడు,

ప్రొఫెసర్ మైఖేల్ జాంక్ ఇలా పేర్కొన్నారు: "జూలియన్ పాలన (361-363) మరియు పెర్షియన్ పాలన (614-17) యొక్క క్లుప్త విరామం మినహా, యూదులు ఇస్లాం ఆవిర్భావం వరకు జెరూసలేం నగరంలోకి ప్రవేశించకుండా నిషేధించబడ్డారు, ఒమర్ ఒప్పందం తో వారు తిరిగి అంగీకరించబడ్డారు."

 

జెరూసలేం ఒక్క చుక్క రక్తం కూడా చిందించబడకుండా ముస్లిం కాలిఫేట్ పాలన కిందకు వచ్చింది. పవిత్ర నగరం జెరూసలేం యొక్క సుదీర్ఘ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే జెరూసలేం 52 సార్లు దాడి చేయబడింది, 44 సార్లు స్వాధీనం చేసుకోబడినది  మరియు తిరిగి స్వాధీనం కాబడినది, 23 సార్లు ముట్టడి చేయబడింది మరియు రెండుసార్లు నాశనం చేయబడింది.

ఖలీఫా ఉమర్ చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్‌తో సహా జెరూసలేం నగర పర్యటన చేసారు.  మధ్యాహ్నం ప్రార్థన సమయం Zuhr  వచ్చినప్పుడు, పాట్రియార్క్ సోఫ్రోనియస్ ఖలీఫా ఉమర్‌ను ది హోలీ సెపల్చర్‌ చర్చి లోపల ప్రార్థన చేయమని ఆహ్వానించాడు, కానీ దానిని ఖలీఫా ఉమర్‌ సున్నితంగా  నిరాకరిస్తారు.

చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్, దీనిని చర్చ్ ఆఫ్ ది రిసరెక్షన్ అని కూడా పిలుస్తారు, ఇది పాత జెరూసలేంలోని క్రిస్టియన్ క్వార్టర్‌లోని 4వ శతాబ్దపు చర్చి. ఇది ప్రపంచంలోని క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. చర్చ్ ఆఫ్ ది రిసరెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు పవిత్రమైనదిగా పరిగణించబడే రెండు ప్రదేశాలను నిర్వహిస్తుంది - కల్వరి లేదా గోల్గోథా అని పిలువబడే ప్రదేశంలో యేసు (ఈసా ప్రవక్త) సిలువ వేయబడిన ప్రదేశం మరియు యేసు యొక్క ఖాళీ సమాధి, ఇక్కడే క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు ఖననం చేయబడినాడు  మరియు యేసు పునరుత్థానం జరిగింది..

ఖలీఫా ఉమర్ తాను చర్చ్ ఆఫ్ ది రిసరెక్షన్ లోపల ప్రార్థన చేస్తే, తరువాత ముస్లింలు దానిని మసీదుగా మార్చడానికి ఒక సాకుగా ఉపయోగించుకుంటారని అన్నారు. బదులుగా, ఖలీఫా చర్చ్ ఆఫ్ ది రిసరెక్షన్ వెలుపల ప్రార్థించారు, అక్కడ ఒక మసీదు - మస్జిద్ ఉమర్, ఉమర్ యొక్క మసీదు అని పిలుస్తారు  తరువాత నిర్మించబడింది

జెరూసలేం నగర పర్యటనలో ఉన్నప్పుడు, ఖలీఫా  ఉమర్ టెంపుల్ మౌంట్ మరియు వైలింగ్ వాల్ పేలవమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. యూదులను కించపరిచేందుకు క్రైస్తవులు ఈ ప్రాంతాన్ని చెత్త కుప్పగా ఉపయోగించుకున్నారని ఖలీఫా ఉమర్‌కు సమాచారం అందించబడినది..

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గానికి ఎక్కిన ప్రదేశం కూడా ఇదే. ఖలీఫా ఉమర్ మరియు muslim సైన్యం (కొందరు యూదులతో కలిసి) వ్యక్తిగతంగా దానిని శుభ్రం చేసి అక్కడ ఒక చెక్క మసీదు - మస్జిద్ అల్-అక్సాను నిర్మించారు.

ముస్లిములు జెరూసలేం స్వాధీనం చేసుకున్న అర్ధ శతాబ్దానికి పైగా, ఉమయ్యద్ ఖలీఫ్ అబ్ద్ అల్-మాలిక్ 691లో టెంపుల్ మౌంట్‌పై ఉన్న పెద్ద రాతిపై డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మాణాన్ని ప్రారంభించాడు

మాజీ బైజాంటైన్ సామ్రాజ్యం అంతటా ముస్లిం-క్రైస్తవ సంబంధాలకు ఒమర్ ఒప్పందం ప్రమాణంగా మారింది, జయించబడిన ప్రజల హక్కులు అన్ని పరిస్థితులలో రక్షించబడతాయి మరియు బలవంతపు మతమార్పిడులు ఎప్పుడూ ఆమోదించబడిన చర్య కాదు.

20వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం వరకు ముస్లిం పాలకులు ఈ ఒప్పందాన్ని గౌరవించారు. 

 

 

No comments:

Post a Comment