11 September 2015

జపాన్ లో ముస్లిం మతం


Description: http://www.aljazeera.com/Media/ver2/Images/1pximage.png
Description: http://www.aljazeera.com/Media/ver2/Images/1pximage.png

జపాన్ లో 1970 లో రెండు మసీదులు ఉండేవి కాని ఇప్పుడు 200 కంటే ఎక్కువ  కలవు జపాన్ లో ఇస్లాం పునాదులు 8 వ శతాబ్దం లో ప్రారంభమైనవి. మేఇజి కాలం లో (Meiji period 1868-1890) చురుకుగా ఇస్లామిక్ దేశాలతో ముఖ్యం గా అతోమన్ సామ్రాజ్యం మరియు మద్య ప్రాచ్య దేశాలతో వర్తక,వాణిజ్యాలు ప్రారంభం అయినవి. భారతీయ వర్తకులు మరియు ఇండో-మలై నావికులు జపాన్ రేవు పట్టణాలు అయిన యోకోహమా మరియు కొబ్ లో పనిచేసేవారు.
రష్యన్ విప్లవంనుండి  తప్పించుకున్న తతార్ ముస్లిం వలస వాదులు  1930 లో జపాన్లో అతిపెద్ద  ముస్లిం సముదాయం గా రూపొందారు  మరియు 1938 లో ఒరిజినల్ టోక్యో మసీదును  స్థాపించారు.
అనధికార లెక్కల ప్రకారం జపాన్ లో 70 వేల నుంచి ఒక లక్షా ఇరవై వేల వరకు ముస్లింలు కలరు. వారిలో 10% మంది జపాన్ వారు. జపాన్ లో ప్రవాస కార్మికులు ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లింలు అధిక సంఖ్య లో ఉన్నారు.
టోక్యో కామి (camii) లేదా టోక్యో మసీదు ఒక అద్భుతమైన కట్టడం. టర్కిష్ పద్దతిలో నిర్మితమైన ఈ కట్టడం యోయోగి ఉహర(Yoyogi Uehara) ప్రాంతం లో  నివాస అపార్ట్ మెంట్ వరుసల మద్య దాగి ఉంది.మసీదు ప్రస్తుత అవతారం నిర్మాణం 2000 లో పూర్తయ్యింది, కానీ మసీదు కు  అతి పెద్ద చరిత్ర ఉంది. 1930 లో జపాన్ గణనీయమైన నివాస ముస్లిం జనాభా ను  చవిచూసింది మరియు అనేక మసీదులను  ఏర్పాటు చేయడం  జరిగింది.
ఈ మసీదు ను జపాన్ లో అత్యంత ప్రముఖ మసీదు గా మరియు  జపాన్ ప్రభుత్వ ఆర్ధిక సహాయం లేకుండా ,జపనీస్  ఆర్ధిక కంపెనీలు, అతి ముఖ్యంగా మిట్సుబిషి ఆర్ధిక  సహాయం తో నిర్మించిన మస్జిద్ గా హన్స్ మార్టిన్ క్రామెర్, (హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో జపనీస్ స్టడీస్ ప్రొఫెసర్ మరియు జపాన్ లో మతం మీద నిపుణుడు) భావించినాడు. దాని ప్రారంభ వేడుకలకు  జపాన్ మరియు ఇస్లామిక్ వరల్డ్ నుండి ఉన్నతాధికారులు  మరియు దౌత్యవేత్తలు హాజరయ్యారు
.టోక్యో కామి(camii) కు  జపనీస్ ప్రభుత్వం మద్దతు లేదు  కాని ఇది (మసీదు ను) టర్కిష్ ప్రభుత్వం  నిధులను ఉపయోగించి పునర్నిర్మించబడింది. ఇది  మతపరమైన వేదిక మరియు దీనియందు వివాహ కార్యక్రమాలు,జాతి-సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలు నాటకాలు, ప్రదర్శనలు మరియు సమావేశాలు నిర్వహించ బడును.
నేగాయ(Nagoya)  మసీదు 1931 లో మరియు కోబే (KOBE)మసీదు 1935 లో భారతీయ ముస్లిం వలసదారులు నిర్మించారు.
టోక్యో కామి (Camii)నుండి దూరంగా ఒక చిన్న సందు లో పాలరాయితో  అలంకరించబడిన యువి (Yuai) ప్రాంతం లో  డాక్టర్ ముసా ఓమర్ ఇంటర్నేషనల్ స్కూల్  ఉంది. పాఠశాల పిల్లలు తో నిండి ఉంటుంది.  శనివారం నాడు   పాఠశాల అందు  ఉదయం  10 నుంచి రాత్రి 8 వరకు వివిధ కార్యకలాపాలు మరియు తరగతులు నిర్వహించాబడుతాయి. పాఠశాల  ప్రస్తుతం శనివారం మాత్రమే నిర్వహింపబడి కరాటే మరియు నగీషీ, ఇస్లామిక్ స్టడీస్ మరియు అరబిక్ తరగతులనిర్వహించడం జరుగుతుంది. 
పాఠశాల ను ద్వితీయ ప్రపంచయుద్దం తరువాత 1966లో  ఏర్పాటుచేయబడిన  జపాన్ ఇస్లామిక్ సెంటర్ (ICJ), నడుపుతుంది. సౌదీ రాయబారి సలహాదారు మరియు రెండుసార్లు జపాన్ లో సుడాన్ రాయబారిగా పనిచేసిన  ఓమర్ పాఠశాల ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.
అమెరికా లో సెప్టెంబర్ 11 దాడుల తరువాత అనేక దేశాల్లో వాలే జపాన్ లో కుడా ముస్లింల మీద, మస్జిద్ల మీద  నిఘా ఎక్కువైనది. పోలీసులు ఇస్లాం అనుసరించేవారిని, వారి ప్రార్ధన సంస్థల మీద నిఘా పెట్టినారు కొన్ని చోట్ల మస్జిద్లు ఇతర తాత్కాలిక ప్రార్ధన స్థలాలలో సిసి కెమరాలు కూడా పెట్టినారు. 70 వేలకు పైగా వ్యక్తుల వివరాలు సేకరించినారు.
నేడు జపాన్ లో 200 మస్జిద్లు మరియు అనేక తాత్కాలిక ఇస్లామిక్ ప్రార్ధనా మందిరాలు కలవు.   టోక్యో మస్జిద్, ఒమర్ పాఠశాల,జపాన్ ఇస్లామిక్ సెంటర్ ఆధునిక జపాన్ ఇస్లామిక్ చరిత్ర లో ముఖ్యమైన అంతర్భాగాలు.
 

 

..


..
 
No comments:

Post a Comment