12 September 2015

చైనా లో ఇస్లాం మతం యొక్క చరిత్ర.
ఒక హదీసు ప్రకారం “జ్ఞానం సంపాదించడానికి అవసరమైతే చైనా అయిన వెళ్ళండి”. ఇది జ్ఞానాన్ని సంపాదించటం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది, చైనాను   సమయంలో అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన దేశంగా భావించారు.
చైనా లో ఇస్లాం మతం ఉత్మన్ ఇబ్న్ అఫ్ఫాన్ (ర) మూడవ ఖలీఫా సమయంలో ప్రారంభమైంది. బైజాంటైన్, రోమన్ ​​మరియు పర్షియన్ జైత్ర యాత్రలు ముగిసిన తరువాత  'ఉత్మన్ ఇబ్న్ అఫ్ఫాన్,  సాద్  ఇబ్న్ అబి వకాస్ నాయకత్వంలో (29 AH (650 CE), లో  ప్రవక్త(స)యొక్క మరణం తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు)  చైనా కు తన ప్రతినిధులను పంపినాడు. ప్రవక్త ముహమ్మద్(స) మేనమామ సాద్  ఇబ్న్ అబి వకాస్    చైనీస్ చక్రవర్తిని ఇస్లాం స్వికరించమని  ఆహ్వానించాడు.

అప్పటికే ప్రవక్త (స) సమయంలో అరబ్ వ్యాపారులు చైనా కు ఇస్లాం మతం తీసుకువచ్చిన, అది వ్యవస్థీకృత ప్రయత్నం కాదు, అది కేవలం సిల్క్ మార్గం వెంట వారి ప్రయాణం (భూ మరియు సముద్ర మార్గం)లో ఒక భాగం మాత్రమే. అరబ్ చరిత్రలో ఈ సంఘటన యొక్క అక్కడక్కడ రికార్డులు ఉన్నాయి మరియు  చైనీస్ చరిత్రలో దిని యొక్క  సంక్షిప్త వివరణ కలదు. టాంగ్ రాజవంశం యొక్క పురాతన రికార్డ్ ఈ మైలురాయి పర్యటన ను వివరిస్తుంది. చైనీస్ ముస్లింలకు  ఈ కార్యక్రమం చైనా లో ఇస్లాం మతం యొక్క పుట్టుక గా పరిగణించబడుతుంది.


ఇస్లాం మతం పట్ల తన ఆకర్షణను చూపించడానికి, చక్రవర్తి యుంగ్ వెయి చైనా యొక్క మొదటి మసీదు స్థాపనకు  ఆదేశించినాడు. అద్భుతమైన క్యాన్టన్ సిటీ (Canton సిటీ)మసీదు 'మెమోరియల్ మసీద్.' ఇప్పటికీ పద్నాలుగు శతాబ్దాల తర్వాత, కుడా నేడు సగర్వంగా  నిలుస్తుంది.

చైనా లో మొదటి ముస్లిం మత ఆవాసాo  కాంటన్  రేవు  నగరం లో స్థాపించబడింది. ఉమ్మయాడ్స్ (Umayyads) మరియు అబ్బాసీయ వంశస్తులు చైనాకు  ఆరు ప్రతినిధులు వర్గాలు  పంపారు. ఇవన్నీ చైనీస్ ద్వారా ఆదరంగా ఆహ్వానింప బడినవి.
చైనా వలస వచ్చిన ముస్లింలు  చైనా పై గొప్ప ఆర్థిక ప్రభావం చూపారు. వారు వాస్తవంగా సుంగ్ వంశస్తుల పరిపాలనా  సమయానికి(960- 1279 CE )  దిగుమతి / ఎగుమతి వ్యాపారoలో  ఆధిపత్యంచూపారు. నిజానికి, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ముస్లిం అద్వర్యం లో జరిగింది. మింగ్ రాజవంశం పాలన (1368 1644 CE),  చైనా లో ఇస్లాం మతం యొక్క స్వర్ణ యుగం గా  పరిగణించబడుతుంది ముస్లింలు క్రమంగా పూర్తిగా హాన్ సమాజంలో కలిసిపోయారు..

చైనీస్ ముస్లింలు  తమ పేర్లను మార్చుకున్నారు. హాన్ మహిళలను వివాహం చేసుకున్నారు పలువురు ముస్లింలు తమ  భార్య పేరును గ్రహించారు.  “ముహమ్మద్, ముస్తఫా, మరియు మసూద్”  పేర్లు -  చైనీస్ పేర్లు “మో, మై, మరియు ము” గా మారినవి. ఇతరులు హసన్ బదులు హా, హుస్సేయిన్ బదులు హు, సయీద్ బదులు సాయి, గా తమ పేర్లను  మార్చుకొన్నారు.
.
పేర్లకు తోడూ  దుస్తులు మరియు ఆహారo, ముస్లిం మతం ఆచారాలు కూడా చైనీస్ సంస్కృతితో విలినమైనవి. అయితే  దుస్తులు మరియు ఆహార పరిమితుల విషయం లో  రాజీ పడ లేదు. కాలం గడిచే కొద్ది ముస్లింలు హాన్ మాండలీకాలు మాట్లాడటం మరియు చైనీస్ చదవడం ప్రారంభించారు.   మింగ్ శకంలో, ముస్లింలకు చైనియులకు తేడా లేదు కేవలం వారి మతపరమైన ఆచారాలు తప్ప.   ఆర్థిక విజయాలు సాదించినప్పటికీ  ముస్లింలను చైనీస్ వేరు చేయలేదు వారిని  చట్టాన్ని గౌరవించే, మరియు స్వీయ క్రమశిక్షణ గల వారుగా గుర్తించారు. ఈ కారణంగానే  ముస్లిం లకు  చైనీస్ కు  మధ్య స్వల్ప ఘర్షణ కుడా చోటుచేసుకోలేదు.


క్రమంగా   ముస్లింలు మసీదులు,పాఠశాలలు మరియు మదర్సాలు  స్థాపించారు.  రష్యా మరియు భారతదేశం నుండి విద్యార్థులు చాలా మంది  హాజరయ్యారు. 1790 లో 30,000 మంది  ఇస్లామిక్ విద్యార్థులు ఉన్నారు.  అనేక హదీసుల సంకలన కర్త ఇమామ్ బుఖారి స్వస్థలం బుఖారా నగరo అప్పట్లో  చైనా లో భాగంగా ఉండేది మరియు అది  "ఇస్లాం మతం యొక్క పిల్లర్."
గా పిలవబడేది.
 
చింగ్ రాజవంశం యొక్క పెరుగుదల (1644 - 1911 CE), ఈ మార్పుకు అడ్డు కట్ట వేసింది. చింగ్ వంశం  మంచు ( హాన్ కాదు )  చైనా లో ఒక మైనారిటీ గా ఉన్నారు. వారు ఒకరితో ఒకరు పోరాటాలలో ముస్లింలు, హాన్ టిబెటన్లను మంగోలియన్ లను ఉంచాలని విభజించి, విజయం  సాదించాలనే  వ్యూహాలు పన్నారు. ముఖ్యంగా, చైనా అంతటా వ్యతిరేక ముస్లిం మతంవ్యతిరేక భావన పెంచినారు , మరియు దేశం యొక్క ముస్లిం ప్రాంతాలలో ముస్లింలను   అణచివేయడానికి హాన్ సైనికులను  ఉపయోగించారు. మంచు రాజవంశం 1911 లో పతనం చెందినప్పుడు చైనా రిపబ్లిక్ సన్ యట్ సేన్ చేత స్థాపించబడింది. వెంటనే దేశం హాన్, హుయ్ (ముస్లిం మతం), మాన్ (మంచు), మెంగ్ (మంగోల్), మరియు త్సాంగ్ (టిబెటన్) కు సమానంగా చెందినది అని ప్రకటించినారు. అతని పాలన లో ఈ సమూహాల మధ్య సంబంధాలు కొంత మెరుగుదలకు  దారితీసింది.

చైనా పీపుల్స్ రిపబ్లిక్ 1949 లో స్థాపించబడింది.  విపరీతమైన తిరుగుబాట్ల అనంతరం  సాంస్కృతిక విప్లవం  చైనా అంతటా సంభవించింది. అన్ని చైనీస్ జనాభాతో  పాటు ముస్లింలు బాధపడ్డారు.  11 వ కేంద్ర కమిటీ మూడవ మహాసభ తరువాత, ప్రభుత్వం ఇస్లాం మతం మరియు ముస్లింల వైపు దాని విధానాలు సరళీకృతం చేసింది.  మత స్వేచ్ఛ 1978 లో ప్రకటించారు అప్పటినుండి చైనీస్ ముస్లింలు వారి భావాలు వ్యక్తం చేయటం లో సమయం వృధా కానియ్యలేదు.
చైనా యొక్క ప్రస్తుత నాయకత్వంలో, ఇస్లాం మతం యొక్క  నిరాడంబరమైన పునరుద్ధరణ కనిపిస్తుంది. ఇప్పుడు  మతం చైనాలో అనుమతిoచబడటం తో    ముస్లిం ప్రజలకు  విదేశీ ముస్లింలతో మరింత పరిచయాలు ఏర్పడి  మరియు మసీదుల పునర్నిర్మించబడినాయి. ప్రజలు ఇప్పుడు మతం పట్ల గొప్ప ఆసక్తిని  కలిగి మరియు ప్రార్థన మరియు మసీదులకు వెళ్ళడం వంటి ముస్లిం మతం సంప్రదాయాలను అనుసరిస్తున్నారు
మత నాయకులు మరింతగా ఇప్పుడు యువతలో మతంపట్ల   ఆసక్తి పెంచుతున్నారు. చైనా లో ఒక ప్రచురణ (1998 ఎడిషన్) ప్రకారం, జిన్జియాంగ్ ప్రావిన్స్ లో మసీదులు 23,000 తో చైనా పీపుల్స్ రిపబ్లిక్ లో మొత్తం  32.749 మసీదులు, ఇప్పుడు ఉన్నాయి. చైనా లో ఇస్లామిక్ వ్యక్తీకరణ లో బాగా పెరిగినది. దేశవ్యాప్తంగా అనేక ఇస్లామిక్ సంఘాలు ముస్లింలలో అంతర్- జాతి కార్యకలాపాలను సమన్వయపరుస్తున్నవి. ప్రస్తుతం ఇస్లామిక్ సాహిత్యం చాలా సులభంగా దొరుకుతుంది  మరియు ఎనిమిది వేర్వేరు చైనీస్ భాషలో ఖుర్ఆన్  అనువాదాలు అలాగే ఉగైర్  మరియు ఇతర టర్కిక్ భాషలలో  అనువాదాలు ఉన్నాయి
ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో, నాన్-ముస్లింలచే  పందుల పెంపకం నిషేధించబడింది. ఇస్లామిక్ నమ్మకాలు, గౌరవం, ముస్లిం మతం కమ్యూనిటీలు, ప్రత్యేక సమాధుల స్థలాలు అనుమతించబడినాయి; ముస్లిం జంటలు ఒక ఇమామ్ ద్వారా వారి వివాహం జరిపించుకోవచ్చు మరియు ముస్లిం  కార్మికులుకు  ప్రధాన ముస్లిం పండుగల సమయంలో సెలవులు అనుమతిస్తారు. చైనా యొక్క ముస్లింలను కూడా మక్కా హజ్ చేయడానికి దాదాపు అనియంత్రిత భత్యం ఇవ్వడం జరిగింది. చైనా యొక్క ముస్లింలు కూడా దేశం యొక్క అంతర్గత రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.

 ప్రస్తుతం చైనా లో 20-30 మిలియన్ల ముస్లింలు ఉన్నారు. దేశంలో బుద్దిజం,క్రైస్తవం తరువాత మూడో ముఖ్య మతం ఇస్లాం. మొత్తం జనాభా లో ముస్లిం లు 2% ఉన్నారు ఇస్లాం మతం పాటు, కాథలిక్కులు,  ప్రొటెస్టంటు, బౌద్ధమతం మరియు టావోయిజం చైనా ఇతర అధికారికంగా గుర్తింపు మతాలు.
ముస్లిం జాతి వర్గాలు, ముఖ్యంగా ఆధునిక చైనా లోని  యున్నన్, టిబెట్, జిన్జియాంగ్, గన్సు ప్రావిన్స్ మరియు హెనాన్ ప్రావిన్స్ లో ఉన్నారు. చైనాలోని  55 లేదా మైనారిటీ సమూహాలలో  పది బృందాలు ముస్లిం మతస్తులవలె  వర్గీకరించబడ్డాయి. సుమారు 10 మిలియన్ల ఉన్న ఉఘైర్స్(Uighurs) జిన్జియాంగ్ లో నివసించే అతి పెద్ద ముస్లిం మత వర్గమే. వారు సుమారు 400 లేదా 500 సంవత్సరాల క్రితం ముస్లిం మతంగా మారారు.  రెండవ అతిపెద్ద సమూహం కజఖ్ ఉన్నాయి. సుమారు 2 మిలియన్ మంది వారిలో జిన్జియాంగ్ లో నివసిస్తున్నారు.

దేశం లో నివసించే 2 వ ప్రధాన ముస్లిం వర్గం హుయ్ ప్రజలు. వీరు   చైనా లో  సుమారు 12 మిలియన్ మందిఉండవచ్చు. వీరు  దేశవ్యాప్తం గా వ్యాపించి ఉన్నారు. వీరు రేస్టారెంట్లను నడుపుతారు. ప్రభుత్వం హుయ్ ముస్లిం లను ఒక జాతి సమూహంగా పరిగణిస్తుంది. వారు బహుశా మంగోల్ లేదా విదేశీ వ్యాపారుల మరియు అధికారుల సంతతి వారు అయి ఉండవచ్చు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరియు వివిధ జాతులలో  అనేక ముస్లిం మత శాఖలు  లేదా సమూహాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సమూహాలు తమలోతాము  పోరాడారు, మరియు కొన్ని అదృశ్యమైనవి. వీటిలో కొన్ని సూఫీ ఉన్నాయి. ఇస్లాం మత ఒక శాఖ 19 వ శతాబ్దం లో  దావోయిజం లో మిళీతమైనది. చైనా లో  సున్ని ముస్లిం మతస్తులు ఎక్కువ.గత రెండు దశాబ్దాల్లో, ఇతర దేశాల వారు  ముఖ్యంగా టర్క్స్ మరియు అరబ్బులు సున్ని ఇస్లాం మతం యొక్క బోధన పద్దతులను  వ్యాప్తిచేయడానికి  ప్రయత్నించారు.
విద్య మరియు హజ్ కొరకు ఇస్లామిక్ దేశాలకు చైనీస్ ప్రయాణo చేస్తున్నారు.  హజ్ ఇస్లాం మతం యొక్క మూల స్తంభాలలో ఒకటి. సాంస్కృతిక విప్లవం సందర్భంగా, చైనీస్ అక్కడ వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ 1979 తర్వాత ఇప్పుడు చరిత్రలో మొదటి సారి, చైనీస్ పెద్ద సంఖ్యలో సులభంగా మక్కా ప్రయాణించగలరు.. ఇటీవల సంవత్సరాలలో 50,000 చైనీస్ హజ్ చేసారు. అనేకమంది చైనా ముస్లిం విద్యార్ధులు చదువు కోసం అరబ్ దేశాలలోని కాలేజిలు, యూనివర్సిటి లకు వెళ్లారు. ధనవంతులైన ముస్లిం లు తమ పిల్లలను మత విద్య కొరకు ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాన్ పంపుతున్నారు.
ఒక కొత్త సర్వే ప్రకారం ఇస్లాం మతం, చైనా యువతరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన  మతం. బీజింగ్ రెన్మిన్ విశ్వవిద్యాలయo  పరిశోధనా కేంద్రం నిర్వహించింన సర్వే ప్రకారం  ప్రభుత్వ గుర్తింపు ఐదు మతాలలో యువతరం లో అనగా 30 సంవత్సరాల లోపు వారిలో ఇస్లాం బాగా ప్రాచుర్యం పొందినది. చైనా ముస్లింలలో22.4% ఈ వర్గం  క్రిందకు వస్తారు. 23.3 మిలియన్ లేదా మొత్తం జనాభాలో 1.8% ముస్లింలు చైనా లో నివసిస్తున్నారు మరియు   2030వరకు వీరి సంఖ్య 30 మిలియన్ వరకు పెరగవచ్చని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా.
వెయి దేదొంగ్ , రెన్మిన్ విశ్వవిద్యాలయం  బుద్ధిస్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ప్రకారం యువ చైనీస్ లో  ఇస్లాం మత వృద్ధి కి ప్రాథమిక కారణం జనాభా అని చెప్పారు.
"ఇస్లాం మతం ను నమ్మిన వారు మైనారిటీ జాతి గ్రూపులు మరియు ఈ జాతులలో ఒక మహిళ అనేక మంది పిల్లలకు జన్మ ఇవ్వడం  చాలా సాధారణము. వారి పిల్లలు కుడా ఇస్లాం అనుసరిస్తారు అని చెప్పారు.
ప్యూ ప్రకారం, ముస్లింల సంతానోత్పత్తి రేటు  1.7 జాతీయ సగటు 1.4 గా ఉంది. చైనీస్ ముస్లింల అధిక సంతాన రేట్ కు, సాధారణంగా తక్కువ చదువుకోవటం  మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసిoచడం ప్రధాన కారణం అని  చెప్పబడింది.
 ఉఘైర్స్ ఆందోళన:
దేశంలో ఎక్కువగా ముస్లిం లు ఉఘైర్స్ (Uighurs). వీరు, జిన్జియాంగ్ యొక్క వాయువ్య ప్రాంతం లో  నివసిస్తారు. వారు  చైనీస్ కంటే కేంద్ర ఆసియా దేశాలకు తాము సాంస్కృతికంగా దగ్గర అని భావిస్తారు.
జిన్జియాంగ్ 18 వ శతాబ్దంలో చైనా యొక్క భాగంగా మారింది మరియు ఈ  ప్రాంతంలో తూర్పు తుర్కిస్తాన్ ఏర్పడింది దానిని స్వాతంత్ర్య ఉద్యమంలో, 1949 లో చైనీస్ అధికారులు అణిచివేశారు
ఇటివల కాలం లో జిన్జియాంగ్ ప్రాంతం లో  జరిగిన ఘర్షణలలో వందల కొద్ది  ఉయ్ఘుర్ (Uighurs-, చైనా ఇస్లామిస్ట్ తీవ్రవాద గ్రూపులు)  మరణించారని తెలుస్తున్నది.. వేల సంవత్సరాలు గా ఈ  ప్రాంతంలో నివసించిన ఉయ్ఘుర్ జనాభా అమెరికన్ ఉయ్ఘుర్ అసోసియేషన్ 15 మిలియన్ కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేసింది అయితే తాజా చైనీస్ జనగణన, ప్రకారం 11 మిలియన్ లు ఉంటుంది.
రంజాన్ ఇస్లామిక్ పవిత్ర నెల రమదాన్ లో  కమ్యూనిస్ట్ పార్టీ నివేదిక ప్రకారం జిన్జియాంగ్ ప్రాంతం లో  ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు  ఉపవాసం ఉండటాన్ని  నిషేధించారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం  చైనా యొక్క పాలనా ప్రాంతాలలో అతి పెద్దది మరియు మెజారిటీ ఉయ్ఘుర్ ముస్లిం జనాభా కలిగిన జిన్జియాంగ్ లో "మత తీవ్రవాదాన్ని" పోరాడేందుకు మద్యం మరియు సిగరెట్లు అమ్మమని  ముస్లిం  రెస్టారెంట్ యజమానులను  ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చైనీస్ అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. ఇటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ, సర్వే 60% ప్రజలు మత స్వేచ్ఛపై ప్రభుత్వ నియంత్రణలు ఉండాలని భావిస్తున్నారు
 ఉఘైర్ల అణిచివేతకు వ్యతిరేకంగా అంకారా లో చైనా కు వ్యతిరేక ప్రదర్సనలు జరిగినవి. ఉఘైర్ల పై రమదాన్ ఆంక్షలకు వ్యతిరేకంగా టర్కీ ప్రతిస్పందించి తన పౌరులను చైనా వెళ్ళవద్దని సూచించినది. 
కొన్నిసార్లు అసమానతలకు గురి అయిన  ఇస్లాం మతం సజీవంగా ఏడవ శతాబ్దం నుంచి చైనా లో ఉంది
.

.


No comments:

Post a Comment