భారతదేశం లో
అత్యంత ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీర్ శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒక పండితుడు, రాజనీతిజ్ఞుడు మరియు విద్యావేత్త. భారత దేశపు
సువర్ణ భవిష్యత్ కోసం అనుక్షణం పాటుపడిన పాలనావేత్త.
ఈ సంవత్సరం(2016) శ్రీ విశ్వేశ్వరయ్య యొక్క 155వ పుట్టిన
వార్షికోత్సవంగా జరపబడుతుంది మరియు భారతదేశం లో 48 వ ఇంజనీర్స్ డే వేడుకలుగా దీనిని గుర్తిస్తారు.
విశ్వేశ్వరయ్య
మైసూర్ (ప్రస్తుతం కర్నాటకలో) రాజ్యములో ముద్దెనహళ్ళి గ్రామంలో 15 సెప్టెంబర్ 1861న జన్మించారు. విశ్వేశ్వరయ్య 15 సంవత్సరాల వయసులో తన తండ్రి శ్రీనివాస
శాస్త్రి ని కోల్పోయారు మరియు ఆయన
మరణానంతరం విశ్వేశ్వరయ్య తన తల్లి వెంకట లక్ష్మమ్మ తో కలసి బెంగుళూర్ లోని మేనమామ హెచ్ రామయ్య ఇంటి వద్ద నివసించారు.
1875 లో ఆయన బెంగళూరులోని వెస్లీ మిషన్ హై స్కూల్ లో
చేరినారు. పిదప సెంట్రల్ కాలేజ్ నుండి పట్టా పొందినాడు.ఆ తరువాత ఇంజనీరింగ్ అబ్యసించుటకు 1883 లో పూనా లోని సైన్స్ కళాశాలలో చేరి అక్కడ ఇంజినీరింగ్ పట్టా ప్రధమ
శ్రేణి లో ఉత్తీర్ణుడు అయినాడు. సివిల్ ఇంజినీరింగ్ లో ప్రత్యెక నైపుణ్యం
వహించినాడు.
విశ్వేశ్వరయ్య
బాంబే (ప్రస్తుతం ముంబై) పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) లో ఉద్యోగములో చేరినాడు తదుపరి భారతీయ ఇరిగేషన్ కమిషన్ లో చేరడానికి
ఆహ్వానింపబడినాడు.
తన పని లో భాగంగా
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో విశ్వేశ్వరయ్య అనేక ముఖ్యమైన పట్టణాల్లో, రోడ్డు నిర్మాణం, ప్రజా భవనాలు నిర్వహణ మరియు నగర అభివృద్ధి కోసం
ప్రణాళికలు వెయ్యటo లో పాలుపంచుకున్నాడు.
విశ్వేశ్వరయ్య
తయారుచేసిన “బ్లాక్ ఇరిగేషన్” పధకం అనునది ఒక పెద్ద విజయం
పొందినది. ఆ పథకం భారత నీటిపారుదల కమిషన్ అధ్యక్షుని కోరికపై రూపొందినది. బొంబాయి
ప్రెసిడెన్సీలో నీటిపారుదల పనులు ఎక్కువ జనాదరణ పొందేటట్లు మరియు లాభదాయకంగా ఉండేటట్లు మరియు ప్రభుత్వం
వాటిపై వ్యయము సహేతుకమైన తిరిగివచ్చేటట్లు ఈ పధకం రూపొందించబడినది.
బాంబే
ప్రెసిడెన్సీ లో ఉన్నప్పుడు శ్రీ విశ్వేశ్వరయ్య కు ఆనాటి జాతీయ నాయకులు మహదేవ్
గోవింద్ రనడే, గోపాల్ క్రిష్ణ
గోఖలే (1866-1915) మరియు బాలగంగాధర్ తిలక్ వంటి వారితో పరిచయం ఏర్పడినది.
1903 లో అతను పూనే సమీపంలోని ఖడక్వాశలా జలాశయం వద్ద
ఆటోమేటిక్ వీర్ నీటి వరద గేట్లను రూపొందింఛి పేటెంట్ పొందినాడు. ఈవరద గేట్స్ ను పూనే
గుండా వెళ్ళే “మూత” కెనాల్ వరద నియంత్రణ కు మొదట ఖడక్వాశలా డ్యామ్ లో ఉపయోగించారు. విశ్వేశ్వరయ్య రూపొందించిన గేట్లను
తరువాత గ్వాలియర్ లోని “తగరా ఆనకట్ట” మరియు మైసూర్ లోని “కృష్ణసాగర్ ఆనకట్ట” మరియు ఇతర పెద్ద నీటి నిల్వ
ఆనకట్టలలో ఉపయోగించారు.
1909 లో హైదరాబాద్ నిజాం రాజ్యం లో చీఫ్ ఇంజనీర్ గా
నియమించ బడినాడు. వరదల నుండి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు ఒక వరద రక్షణ వ్యవస్థ ను రూపకల్పన చేసి ప్రసిద్దుడు
అయినాడు.
తర్వాత అదే సంవత్సరంలో విశ్వేశ్వరయ్య
చీఫ్ ఇంజనీర్ గా మైసూర్ ప్రభుత్వ సర్వీస్ లో చేరారు. చీఫ్ ఇంజనీర్ గా తన సేవలు అందిoచిన మూడు
సంవత్సరాల తర్వాత, విశ్వేశ్వరయ్య మైసూర్ పాలకుడు
క్రిష్ణరాజేంద్ర వోడియార్ ద్వారా మైసూర్ రాష్ట్ర
దివాన్ గా నియమించబడ్డాడు. విశ్వేశ్వరయ్య ఆరు సంవత్సరాలు దివాన్ గా పనిచేశారు
విశ్వేశ్వరయ్య 1955 లో భారతదేశం యొక్క
అత్యున్నత పురస్కారం “భారతరత్న”ను అందుకున్నారు మరియు తన పౌర సేవలకు ఇంగ్లాండ్ రాజు కింగ్
జార్జ్ V ద్వారా “ఇండియన్
ఎంపైర్ కమాండర్” గా బిరుదాంకితుడైనాడు.
No comments:
Post a Comment