22 September 2016

సమకాలిన సమయం లో గాంధేయ విలువల ఔచిత్యం."మీ నమ్మకాలు,మీ ఆలోచనలు. మీ ఆలోచనలు, మీ పదాలు.మీ పదాలు, మీ చర్యలు.
మీ చర్యలు, మీ అలవాట్లు. మీ అలవాట్లు,మీ విలువలు.మీ విలువలు,మీ విధి గా మారును.” -మహాత్మా గాంధీ.

అహింస, సత్యం మరియు సామాజిక న్యాయం పై మహాత్మా మహాత్మా గాంధీ యొక్క భావాలు  ప్రపంచానికి అనుసరించవలసిన  ఒక నమూనా గా మారినివి. గతంలో భారతదేశం పాశ్చాత్య ప్రపంచo ప్రత్యేకించి ఐరోపావాసుల దృష్టి లో   సంగీతకారుల మరియు పాములను ఆడించేవారి దేశం గా ఉoడేది.

క్రమoగా మహాత్మా గాంధీ ప్రచారం చేస్తున్న విలువలు ప్రపంచ దృష్టిని ఆకర్షించినవి  మరియు హింస మరియు ద్వేషం నిండిన సమాజం లో సమానత్వo మరియు అత్యుతమ నైతిక విలువలు పెంపొందేంచేoదుకు కావలసిన నైతిక శక్తీ ని అందించినవి.

ప్రపంచదేశాలలో మారుతున్న ఈ గుర్తింపును  ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహాత్మా గాంధీని  శ్లాఘించడం  లో గుర్తించవచ్చు. 1939 లోఐన్స్టీన్ మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం 70 వ వార్షికోత్సవoలో అన్నారు: "రాబోయే తరాల వారు ఇటువంటి ఒక సాధారణ నిరాడంబర మనిషి ఒకరు ఈ భూమి మీద నడిచారు అని ప్రగాడం గా విశ్వసిస్తారు”

యువతరానికి మహాత్మా గాంధీ యొక్క సందేశం “సత్యం మరియు అహింస” అనే  రెండు ప్రధానమైన నియమాల చుట్టూ నిర్మించబడింది. అతని నినాదం "నిర్భయo గా  ఉండు" అనునది యువతకు  ఒక ప్రేరణ అయినది. అతను తన తోటి సహోదరుల కొరకు త్యాగం, కరుణ మరియు అంగీకారం అనే  విలువలను తన దేశ వాసులకు  బోధించాడు.

మహాత్మా గాంధీ సామాజిక మార్పు తీసుకురావటం లో యువ శక్తి  యొక్క ప్రాముఖ్యతను  అర్థం చేసుకోనినాడు  మరియు వారి  శక్తిసామార్ధ్యాలను అతను స్వాతంత్ర్యోద్యమo లో సమర్థవంతంగా వినియోగించుకొన్నాడు.

యువత సహజంగా తోటి మానవుల పట్ల  కారుణ్యo ప్రదర్శిస్తుంది మరియు సామాజిక మార్పు కోసం సాధన చేస్తుంది. మహాత్మా గాంధీ సాధారణ పురుషులు మరియు మహిళల నుండి  గొప్ప నాయకులను    రూపొందించాడు  మరియు హింస చూపే వారికి తన ఆదర్సలలో చోటు నివ్వలేదు. మహాత్మా గాంధీ కార్మిక గౌరవాన్ని   మరియు మానవతా  విలువలను   నొక్కి వక్కాణించారు. దురదృష్టవశాత్తు మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలు మరియు ఆలోచనలు పూర్తిగా వినియోగించబడలేదు. గాంధీతత్వాన్ని సార్వత్రికంగా అందరికి  ముఖ్యంగా  యువకులలో ప్రచారం చేయవలనసిన ఆవసరం ఉంది.

నేడు మహాత్మా గాంధీ పేరు జాతి, ప్రాంతం మరియు మతం యొక్క పరిధులను దాటి విస్తరించి ప్రస్తుత కాల భవిష్య వాణిగా ఉద్భవించింది. అతను అహింస మరియు మానవతావాదం యొక్క చిహ్నం గా పేరుగాంచాడు.  పూర్వం బుద్ధ భగవానుడు మరియు  మహావీర జైనుడు కుడా  “అహింస” ను ప్రతిపాదించారు కాని దానిని సామాజిక మార్పు కోసం ఒక సమర్థవంతమైన సాధనంగా ఎలా ఉపయోగించవచ్చో  మహాత్మా గాంధీ చూపారు.

తన పుస్తకం "సత్యా అన్వేషణ లో నా ప్రయోగాలు” లో మహాత్మా గాంధీ అన్నారు: "నేను ఈ ప్రపంచంలో “సత్యం” అంటూ  కొత్తదానిని  ఏమీ బోధించలేదు. సత్యం మరియు అహింసా అనునవి వృక్షాలు మరియు పర్వతాలు అంత ప్రాచీనమైనవి". అతను ప్రపంచానికి సత్యం మరియు అహింస యొక్క ప్రాముఖ్యతను చూపించటం లో విజయం పొందాడు.

మహాత్మా గాంధీ ని అధ్యయనం చేసిన ఆర్నాల్డ్ టోయిన్బి అనే ప్రసిద్ధ చరిత్రకారుడు, ఒకసారి అన్నారు: “నేను జన్మించిన తరం లో   రష్యాలో స్టాలిన్ మరియు యూరప్  లో హిట్లర్ మరియు భారతదేశం లో మహాత్మా గాంధీ జన్మించారు. వీరందరి కన్నా మానవ చరిత్రపై మహాత్మా గాంధీ యొక్క ప్రభావము ఎక్కువ అని  విశ్వాసం తో చెప్పాగలను”.

ఒకానొక సందర్భంలో, మహాత్మా గాంధీ ఇలా అన్నారు "అహింస అనునది నెమ్మదిగా వృద్ధి చెందే వృక్షం. ఇది నెమ్మదిగా కానీ తప్పనిసరిగా పెరుగుతుoది". అతను సార్వత్రిక మానవ విలువల కోసం కృషి చేసాడు మరియు అతని జీవితం 21 వ శతాబ్దంలో మనకు మార్గదర్శకం. మహాత్మా గాంధీ భారతదేశం కోసం ఒక కల గన్నాడు కాని నేడు ఆ కల  ఒక పీడకలగా  మారింది.

నేడు మనం మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఒకరకమైన సర్దుబాట్లతో కూడిన  జీవితం కొనసాగించున్నాము.  ప్రజాస్వామ్య విలువలు చెక్కుచెదరకుండా చూడవలసిన బాద్యత మన భుజస్కందాలపై ఉంది. దీని  కొరకు  మనం సామాజిక న్యాయం మరియు లింగ సమానత్వం సాదించాలి. మత సామరస్యాన్ని మరియు మిశ్రమ సంస్కృతిని పరిరక్షించాలి. మనము ఇవి  సాధించగలిగితే  మహాత్మా గాంధీ కల ను నెరవేర్చడం  లో సహాయ పడినట్లే.

మహాత్మా గాంధీ గారి వదిలి పెట్టిన అసంపూర్తి పని మన  ముందు ఉన్న  ఒక పెద్ద సవాలు. గాంధీజీ కి మార్పు కోసం  వ్యక్తి యొక్క సామర్థ్యo లో అనంత విశ్వాసం ఉంది. అతను మానవ స్వభావం రాడికల్ రియోరియంటేషన్ కలిగి ఉందని నమ్ముతాడు అందుకు కావలసింది తనను తానూ స్వయంగా విశ్లేశించుకొనే సామర్థ్యం కలిగి ఉండటమే అని నమ్ముతాడు.

ఆధ్యాత్మిక మరియు నైతిక వృద్ధి మార్గం లో మానవత్వం ను తీసుకోవాలని మహాత్మా గాంధీ తన జీవితమంతా ప్రయత్నించారు. అనేక యుగాలుగా అభివృద్ధి చెందిన మానవ  నాగరికత పురోగతి మానవ స్వభావం  మంచి కోసం మార్పు చెందగలదు అనే దానికి ఒక  సాక్ష్యం గా చెప్పవచ్చు.
సమకాలీన సంక్షోభానికి కారణాలను విశ్లేషించేప్పుడు సామాజిక రుగ్మత మరియు ప్రస్తుత హింసాత్మక విధానాల  మూలాలను జాగ్రత్తగా విశ్లేషణ చేయవలన అవసరం ఉందని గుర్తుంచుకోండి.అలాగే మన జీవిత శైలి మరియు సామాజిక ఆర్ధిక సంస్థల పునర్నిర్మాణo  రాడికల్ నైతిక విధానాల మీద ఆధార పడి ఉందని గుర్తుంచుకోండి.

మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలు వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనలకు  లక్ష్యం దిశగా మానవ సమాజం ను ముందుకు తీసుకొనివెళ్ళే  బలం ఉంది. ప్రపంచంలో పాలకులు కన్నా సామాన్య  మానవుని  ఆలోచనలు   వ్యక్తిగతంగా శక్తివంతమైనవి అని చెబుతారు.

మహాత్మా గాంధీ ప్రపంచంలోని  కూడలి వద్ద శాంతి కి చిహ్నంగా మారారు. మనం మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఈనాడు  చాలా  ఉంది. 1937 మరియు 1948 మధ్య నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేయబడిన మహాత్మా గాంధీ కి ఆ అవార్డు రాలేదు, అందుకు భగవంతునికి ధన్యవాదాలు కారణం ఆ జాబితా లో హిట్లర్ పేరు ఉండటమే.


No comments:

Post a Comment