13 October 2017

ప్రవక్త (స) ముహమ్మద్ పై వ్రాయబడిన ఉత్తమ ఆంగ్ల జీవిత చరిత్రలు (సీరతుల్ నబి) Best Biographies of the Prophet Muhammad.



నేడు ప్రపంచంలో అనేక మందికి ముహమ్మద్ ప్రవక్త(స) గురించి తెలియదు. ప్రపంచం లోని అధిక శాతం  మంది ప్రజలు ముహమ్మద్ ప్రవక్త(స) గురించి తెలుసుకోవాలి అనుకొంటున్నారు. శాంతి మరియు సత్యాన్ని చాటిన ముహమ్మద్ ప్రవక్త(స)  గురించి సత్యాన్ని తెలిపే బుక్స్ అతి తక్కువ గా  ఉన్నాయి. నా ద్రుష్టి లో ప్రవక్త (స)గురించి సరిఅయిన  అవగాహన మరియు సత్యాన్ని తెలపడం  లో క్రింది  పుస్తకాలు సఫలం అయినాయి.
ప్రవక్త (స) జీవితo పై ఆంగ్లములో వ్రాయబడిన  ఉత్తమమైన జీవిత చరిత్రలలో(seerah - biography of the Prophet)  కొన్నింటిని మీ ముందు ఉంచుతాను. వాటిలో కొన్ని ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి.

1.ముహమ్మద్: హిస్ లైఫ్ బేస్డ్ ఆన్ ది ఎర్లిస్ట్ సోర్సెస్– మార్టిన్ లింగ్స్
(Muhammad: His Life Based on the Earliest Sources by late Dr. Martin Lings)
ఇది ప్రవక్త (స) మీద వ్రాయబడిన ఉత్తమ జీవిత చరిత్ర. ఈ పుస్తకం నవల లాగా వేగంగా, ఉత్సహంగా, ఆసక్తికరం గా  నడుస్తుంది. అదే సమయం లో డాక్టర్ లింగ్స్ ప్రాచిన ఆధారాలతో ప్రవక్త(స) జీవిత చరిత్రను వివరించడానికి ప్రయత్ని౦చారు. ప్రవక్త (స) గురించి తెలుసుకోవాలనుకొనే నాన్ –ముస్లిములు అందరు  తప్పక చదవవలసిన గ్రంథం ఇది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే డాక్టర్ హింగస్ ఈ జీవిత చరిత్ర  ను రచించే సమయం లో ప్రభావితులై ఇస్లాం స్వీకరించారు.

2. ముహమ్మద్ ది ప్రోఫెట్ – మౌలానా ముహమ్మద్ అలీ
(Muhammad the Prophet by Maulana Muhammad Ali)
ఇది పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిక్ పండితుడు మౌలానా మహమ్మద్ అలీ చే వ్రాయబడినది. ఇది చాలా చిన్న పుస్తకం కాని అందులో చాలా సమాచారం ఉంది. ఇందులో మౌలానా,    ప్రవక్త (స) జీవితం లో ఎదురైన ముఖ్య సంఘటనలను వివరణాత్మకం గా విశ్లేసించారు.    దైవదూతలు  ప్రవక్త(స) హృదయాన్ని శుబ్రపర్చడం, దివ్య కొరాన్ అవతరణ వంటి వాటి వివరణ వివరంగా ఉంది.   ప్రవక్త (స) కాలం లో సంభవించిన మిరకిల్స్ వాటిని మౌలానా  వర్ణించిన విధానం  పుస్తకానికి వన్నెతెచ్చాయి.

3. ది లైఫ్ అండ్ వర్క్ అఫ్ ముహమ్మద్ – యహ్యా ఎమేరిక్
(The Life and Work of Muhammad  by Yahiya Emerick)

అమెరికా లో ఒక ఇస్లామిక్ స్కూల్ వైస్-ప్రిన్సిపాల్ మరియు నార్త్ అమెరికా  ఇస్లామిక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయిన యహ్య ఎమేరిక్ ఒక నవ ముస్లిం. ఈ పుస్తకం లో ఇస్లాం గురించి సాంప్రదాయ, ఆధునిక మూలాల నుంచి సేకరించిన విస్తారమైన సాహిత్యం దొరుకుతుంది. 
ఎమేరిక్ ప్రవక్త (స) కు సంభందించి,   ఇతర జీవిత చరిత్రలలో లబ్యం కాని బౌగోళిక, చారిత్రిక మరియు సాంస్కృతిక సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. ప్రవక్త (స) సమకాలిన అరేబియా చరిత్రను కూడా పొందుపరిచారు.

4. వెన్ ది మూన్ స్పిల్ట్:ఎ బయోగ్రఫీ అఫ్ ప్రోఫెట్ -ముహమ్మద్ షేక్ సఫీఎర్ రహ్మాన్ ముబారక్ పూరి
(When the Moon Split: A Biography of Prophet Muhammad  by ShaikhSafierRahmanMubarakpuri)

షేక్ ముబారక్ పూరి రచన ప్రాచీన విశ్వసనీయ మూలాల నుంచి సేకరించిన  సమాచారం ఆధారం గా వ్రాయబడినది. అందులో అద్భుతమైన సంఘటనలు వివరంగా ఉన్నాయి. అలాగే, నేటి ప్రమాణాల దృష్ట్యా  ప్రశ్నార్థకమైన కొన్ని సంఘటనలు దాచబడలేదు  లేదా తొలగించబడలేదు. ఒక విషయం అర్థం చేసుకోవడానికి  వివరణాత్మక వివరణ ఇవ్వబడుతుంది. పుస్తకం ఖచ్చితత్వం కోసం కృషి చేస్తుంది.

ముస్లింల ప్రకారం ప్రవక్త  (స) మీద వ్రాయబడిన జీవిత  చరిత్రలలో(సీరత్) ఇది అత్యతమ మైనది. ఈ పుస్తకం లో ప్రవక్త (స) జీవిత విశేషాలు అతని లక్ష్యం సోదాహరణం గా వివరించ బడినవి.అతని కాలం లో సంభవించిన మిరకిల్స్ ప్రస్థావన కలదు. వాటిని విమర్సనాత్మకం గా ప్రస్తావించ బడటం  జరిగింది.

5.  ది సీల్డ్ నేక్టర్-మైకల్ కుక్
(The Sealed Nectar:Muhammad by Michael Cook
ప్రవక్త(స) మీద వ్రాయబడిన ఈ చిన్న  పుస్తకం లో అతని సందేశాలను గమనించవచ్చు. ఒకే భగవంతుడు(ఎకేశ్వరోవాదం) అన్న భావనను  ముహమ్మద్ ప్రవక్త అరేబియా లో ఎలా ప్రచారం చేసారో అది విస్తరించిన పరిణామక్రమ  సులభమైన వివరణ ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.

6.ముహమ్మద్ ఏ బయోగ్రఫీ అఫ్ ది ప్రోఫెట్ – కరెన్ ఆర్మ్ స్ట్రాంగ్
(Muhammad: A Biography of the Prophet by Karen Armstrong)
ఈ పుస్తకం  బ్రిటిష్ నాన్ -ముస్లిం రచయిత కరెన్ ఆర్మ్ స్ట్రాంగ్  చే వ్రాయబడినది. ఆమె ప్రస్తుతం క్రైస్తవ ధర్మము  ను అనుసరించుట లేదు కాని  ఇస్లాం పట్ల ఆసక్తి తో  దానిని శోదిస్తున్నారు. ఇస్లాం పై ప్రామాణిక రచనలు చేసారు. మంచి చరిత్ర జ్ఞానం కలిగిన రచయిత్రి.

కరెన్ ఆర్మ్ స్ట్రాంగ్ తన పుస్తకం లో చారిత్రిక నేపద్యం లో వివిధ విషయాల అద్భుతమైన వివరణ  ఇస్తుంది మరియు ఇస్లాం పై  అవగహన కల్పించుటకు ప్రయత్నం చేసారు. ఇస్లామిక్ లా  మరియు సాంస్కృతిక అలవాట్ల మద్య తేడాను స్పష్ట పరిచారు.

ఆమె దృష్టిలో ప్రవక్త మహనీయుడు, సంఘ సంస్కర్త , దూర ద్రుష్టి  కలిగిన రాజనీతిజ్ఞుడు. అనితర సాద్యమైన అనేక కార్యాలను తన స్వయం కృషి తో నెరవేర్చిన మానవుడు. ముస్లింలు చదువుకోవటానికి ఇది కష్టంగా ఉండవచ్చు, కానీ ఒకవేళ రచయిత  ఒక ముస్లిం కాదని గుర్తించగలిగితే, పుస్తకాన్ని ఆస్వాదించవచ్చు. ఇస్లాం ధర్మం మరియు దాని సందేశాన్ని గౌరవనీయంగా  వర్ణించారు.

ప్రవక్త(s) జీవిత చరిత్ర, వారి సందేశం  అన్ని వర్గాల, అన్ని విశ్వాసాల  ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో వివరించారు. ఇది  చారిత్రిక నేపద్యం లో ప్రవక్త(s) జీవితాన్ని వివరించిన గొప్ప పుస్తకం.
.

















No comments:

Post a Comment