20 April 2018

ప్రతి విజయవంతమైన విద్యార్ధి కాలేజీ లో నేర్చుకోవలసిన ఆరు ప్రధాన విషయాలు


విద్య మరియు కెరీయర్

ఒక విజయవంతమైన విద్యార్థి ఎలా కావలని  తెలుసుకోవాలనుకుంటున్నారాకళాశాల అనుభవం ప్రతి విద్యార్ధికి ప్రత్యేకంగా ఉంటుంది, కానీ అందరు కళాశాలలో ఒకే ద్యేయం తో ప్రవేశిస్తారు, అది ఒక డిగ్రీ పొందండం. కాబట్టి కళాశాలలో విజయవంతం కావడానికి, విద్యార్ధులు సాధారణంగా "కస్టపడి  అధ్యయనం చేయoడి ", "క్రమం తప్పకుండ  తరగతికి వెళ్లండి", "బాగా చదవండి " అనే సలహాలను సాధారణం గా పొందుతారు. కానీ ఒక విజయవంతమైన విద్యార్ధి అంటే కేవలం తరగతులకు హాజరు కావడం, పరీక్షలకు చదవడం, పలు వ్రాతపూర్వక ప్రాజెక్టులు పూర్తి చేయడం మరియు మంచి గ్రేడ్స్/మార్క్స్ సంపాదించడం కాదు. కళాశాలలో విజయవంతం అవడం  ఇంతకంటే చాలా క్లిష్టంగా ఉంటుంది.

క్రింద ప్రతి కళాశాల విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి మరియు కళాశాల అనుభవాన్ని అసాధారణంగా చేయటానికి ఏమి చేయాలనే దానిపై కొన్ని చిట్కాలు ఉన్నాయి

1.మంచి గ్రేడ్స్/మార్కులు గురించి జాగ్రత పడండి.
గ్రేడ్స్/మార్క్స్ ప్రేరణగా ఉండవచ్చు కానీ మీరు కాలేజీ కి అధ్యయనం చేయడం కోసం వచ్చారు, కేవలం గ్రేడ్స్/మార్క్స్ పొందటానికి కాదు. కాబట్టి మీరు క్రొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి మరియు వివిధ అభ్యాస వ్యూహాలను ప్రయత్నించండి. మీరు మీ ప్రొఫెసర్ యొక్క గ్రేడింగ్ (శ్రేణీకరణ) విధానాన్ని గురించి తెలుసుకోవాలి మరియు అసైన్మెంట్స్   లో మీరు మంచి గ్రేడ్స్ పొందాలనుకుంటే మీరు  వాటిని అనుసరించాలి. అంతే కాకుండా,ఇందుకు అవసరం అనుకంటే  ఆన్-లైన్  సహాయం కూడా పొందవచ్చు మరియు మీ డిసర్టేషన్ను పూర్తి చేయవచ్చు. విధంగా, మీ క్లాసు లో మీరు  విజయం సాధించచవచ్చు.

మీరు ఒక నిర్దిష్ట గ్రేడ్ సంపాదించటం కోసం  మీ ప్రొఫెసర్ తో వ్యక్తిగతంగా చర్చించవచ్చు. మీరు భవిష్యత్లో మీ గ్రేడ్స్/మార్క్స్  ఎలా మెరుగుపరచాలనే దానిపై కూడా సలహా పొందవచ్చు.

2.ఉద్యోగం సంపాదించడం
కాలేజీలో  ఉద్యోగం పొందడానికి అనేక కారణాలు  ఉండవచ్చు   ఉదాహరణకు, డబ్బు సంపాదించడానికి లేదా కెరీర్ అవకాశాలను మెరుగుపరచడం కోసం.  క్యాంపస్ లో ఉద్యోగ అవకాశాలు పేడ్ paid మరియు అన్-పేడ్ unpaid ఇంటర్న్షిప్పులు గా ఉంటాయి. ఈ ఇంటర్న్శిప్స్ వలన నిజమైన ఉద్యోగ అనుభవo వస్తుంది  మరియు మీ భవిష్యత్ కెరీర్ కోసం మిమ్మల్లి  మీరు సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. యజమానులు సమయం వృధా కాకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనే వ్యక్తిగా మిమ్మల్లి చూస్తారు తద్వారా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరవాత ఉద్యోగం పొందటానికి మంచి అవకాశాలు ఉంటాయి.
.
3.పరిచయాలు లేదా నెట్వర్కింగ్ Networking
కళాశాలలో ఉండగా, మీరు చాలామందిని కలుస్తారు, మీ సహవిద్యార్థులతో  మరియు  కొత్త వ్యక్తులతో స్నేహం చేసుకోవాలి. మీరు వారితో సన్నిహితంగా ఉండాలి. మీరు ఉద్యోగం కోసం ప్రయతిస్తున్నప్పుడు ఇది మీ కెరీర్ రంగంలో మీకు సహాయపడవచ్చు. మీరు కూడా ఎవరికైనా సహాయం చేయగలరు.

4. విదేశాలలో చదువు
మనము నేడు  విశ్వవ్యాప్త ప్రపంచం లో జీవిస్తున్నాము కాబట్టి విదేశాలలో చదువు అనేది మీకు  కొత్త సంస్కృతులను తేలుసుకోవటానికి మరియు ఒక వ్యక్తిగా ఉన్నతి పొందటానికి సహాయపడే ఒక అనుభవం వంటిది. అంతేకాకుండా, మీరు  ఉద్యోగం పొందడానికి అవకాశాలను  మెరుగుపరుస్తుంది, ఎందుకంటే విదేశాలలో చదివిన అనుభవం మీ రేజ్యుం లో గొప్పగా కనిపిస్తుంది, మరి  ముఖ్యంగా మీకు  విదేశీ భాష వస్తే  మీదే విజయం. మీరు వివిధ సాంస్కృతిక నేపథ్యాలతో చాలామంది కొత్త వ్యక్తులను కలుసుకోగలుగుతారు, మరియు మీరు అదృష్టవంతులైతే, మీరు వారితో స్నేహంగా ఉంటారు లేదా మీ కలల భాగస్వామిని కనుగొంటారు.

5.తమ పై  తాము జాగ్రత్త తీసుకోవడం
మీరు స్వతంత్రంగా జీవించటం నేర్చుకోవాలి  అందుకు  మీ నిద్ర షెడ్యూల్స్ విషయం లో జాగ్రత పడాలి. మీరు  మంచి వ్యాయామ మరియు భోజన అలవాట్లు పెంపొందించుకోవాలి.  . మీరు ఆరోగ్యకరమైన  జీవనశైలి అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మీరు మానసికంగా మరియు భౌతికంగా సరి అయిన షేప్(ఆకృతి)లో ఉండవలసి ఉంటుంది: ఆరోగ్యంగా తినడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం చేయాలి. ఇందుకు  మీరు చక్కెర పానీయాలు మరియు జంక్ ఫుడ్ తప్పని సరిగా తీసుకోరాదు. కనీసం 8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి. నిద్ర లేమి వలన మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మరియు మీ చదువు లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనగా మీరు మీ తరగతుల్లో తక్కువ శ్రద్ధ మరియు ఆలోచన మరియు జ్ఞాపకశక్తి సమస్యలు ఎదుర్కొంటారు.

6.మీ ప్రోఫెసర్లతో మంచి సంభందాలు కలిగి ఉండండి.
ప్రశ్నలను అడుగుతూ మరియు సమాధానమిస్తూ మీరు క్లాస్ లో  చురుకుగా ఉండాలి.  మీరు తరగతుల తర్వాత మీ ప్రొఫెసర్ తో  మాట్లాడవచ్చు మరియు మీ అధ్యయనానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించవచ్చు , ఉదాహరణకు, కోర్సులు, పరిశోధనా పథకాలు, ఇంటర్న్షిప్ మొదలైనవి. మీ ప్రొఫెసర్లతో కమ్యూనికేట్ చేయడం మీ కెరీర్ గోల్స్ సాధించడంలో మీకు సహాయపడుతుంది, ఎందుకంటే మీరు  ప్రొఫెసర్ నుంచి ఉద్యోగం కోసం సిఫార్సు ఉత్తరం పొందవచ్చు. మీరు మీ సబ్జెక్టు అధ్యయనం చేస్తున్న విద్యార్థులను స్నేహితులు గా చేసుకోవాలి. విధంగా, మీరు మీ కెరీర్ మార్గంలో మీకు సహాయపడే వ్యక్తులతో కనెక్షన్లను పెంపోదించుకోవచ్చు.

No comments:

Post a Comment