3 March 2019

ఖలీఫా ఉమర్(ర) జీవితం నుండి మేనేజ్మెంట్ పాఠాలు




ఖలీఫా ఉమర్ చాలా ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యక్తి. ఆధునిక చరిత్ర లో ఉమర్ వంటి వ్యక్తులు కనిపించరు. అతను సమ న్యాయం స్థాపించినాడు. నిజం ఎప్పుడూ అతని  నాలుక పై ఉంటుంది మరియు అతని ఊహ ఎల్లప్పుడూ నిజమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ (స) "నా తర్వాత ఒక ప్రవక్త  అంటూ ఉంటే, ఆతను  ఉమర్ అయి ఉంటాడు." అని  అన్నారు (బుఖారి)


అతను  పర్షియా, షామ్ వరకు  (మధ్యధరా సముద్రం తూర్పు ప్రాంతం, యూఫ్రటిస్ నది యొక్క వెస్ట్, నార్త్  అరేబియన్ ఎడారి మరియు దక్షిణాన టారస్ పర్వతాలు) సామ్రాజ్యం విస్తరించాడు. ఉమర్ నేతృత్వంలో అరబ్బుసైన్యం  ఫ్రాన్స్ దక్షిణ భాగం, చైనా సరిహద్దు వరకు  చేరుకోవడంలో సఫలమైంది ఖలీఫా ఉమర్ చరిత్రలో గొప్ప రాజకీయ వేత్త గా,పరిపాలన దక్షుడిగా  పరిగణించబడుతున్నారు.

ఖలీఫా ఉమర్  తన పదవీకాలంలో అనేక ప్రణాళికలను ప్రారంభించారు. ఆయన ప్రజా ఖజానా, న్యాయస్థానాలు, న్యాయమూర్తుల నియామకం,  తపాలా సేవ, భూమి రెవెన్యూ శాఖ, ప్రజా విశ్రాంతి ప్రాంతాలు, హాస్టళ్లు మరియు వజూ కోసము  స్టేషన్లు, కొన్ని వర్తకాలు కోసం సంఘాల నియామకం, కోల్పోయిన ఒంటెలు, వారసత్వ గణన కోసం ఒక ఖచ్చితమైన వ్యవస్థ, పోలీసు శాఖ, వివిధ రాష్టాలలో వ్యూహాత్మక పాయింట్లు వద్ద సైనిక స్థావరాలు, మరియు  ఖలిఫత్ యొక్క  పనితీరును ఏకీకృతం, బలోపేతం చేయడం కోసం అనేక  వ్యూహాత్మక చర్యలు తీసుకొన్నారు.

మైఖేల్ హార్ట్ తన పుస్తకం లో  చరిత్రలో 100 లో   52 వ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గా ఉమర్ కు ర్యాంక్ ఇచ్చాడు. అతను "ఉమర్ యొక్క తెలివైన నాయకత్వం ఇస్లామిక్ భూభాగం యొక్క విస్తరణ కు బాధ్యత వహించినది " అని అన్నాడు మహాత్మా గాంధీ “భారతదేశంకి ఉమర్ వంటి నిజాయితీ మరియు మెరుగు అయిన  గొప్ప నాయకుడు నియంతగా  రావలి” అని వ్యాఖ్యానించారు. కేజ్రివాల్ అభిప్రాయం లో ప్రభుత్వ నిర్వహణ లో ఖలీఫా ఉమర్ తనకు రోల్-మోడల్ అని వ్యాఖ్యానించారు. ఉమర్ పరిపాలనా విధానం తో తానూ ఎంతో ప్రభావితుడును అయ్యానని కేజ్రివాల్   అన్నారు. ప్రజా సంక్షేమానికి తానూ ఉమర్ పరిపాలన విధానాలను అనుసరిస్తానని అని అయన అన్నారు.

 క్రింది మానేజ్మెంట్ పాఠాలను అతని పాలన మనం నుండి తెలుసుకోవచ్చు
ఆర్గనైజింగ్:
ఉమర్ చాలా మంచి ఆర్గనైజేర్. అతను మొత్తం సామ్రాజ్యం పాలించటానికి  ఒక ఏక కేంద్ర (యూనిటరీ) ప్రభుత్వం సృష్టించాడు. అతను ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ ను  నియమించాడు. నియమించబడిన వ్యక్తి సమర్ధత కలిగి ఉన్నాడు. ఆయన పాలన లో  రెవెన్యూ, సైనిక, భద్రతా, ఖజానా, కార్యాలయం మరియు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు  ఒక సమూహం నిర్వహించెది. అతను తన  కమాండర్ల లను నియంతలుగా నియమించలేదు, వారిని ప్రజలకు నాయకులు గా పంపాను  అని చెప్పినాడు. వారిని ప్రజలు ఉదాహరణ గా  అనుసరించాలని చెప్పినాడు. ముస్లింలకు(ప్రజలకు)  వారి హక్కులను ఇవ్వాలని మరియు వారిని  బయపెట్టవద్దని, అనవసరంగా పొగడ వద్దని,  దర్పం వలన గర్వం వస్తుందని , వారి పట్ల తలుపులు, మూయవద్దని, బలవంతులు బలహినులను హింసించ రాదనీ, వారి కంటే అధికులం అని ప్రవర్తించ రాదనీ   వారి పట్ల నిరంకుశo గా ఉండరాదని హెచ్చరించాడు.

కంట్రోలింగ్:
ఉమర్ మొత్తం రాజ్యం లో  చాలా మంచి నియంత్రణ కలిగి ఉన్నాడు. ఆయన నాయకత్వంలో, సామ్రాజ్యం ఒక అపూర్వమైన వృద్ది తో   విస్తరిoచబడినది. నిర్మించిన విస్తారమైన సామ్రాజ్యన్ని  కలిపి ఉంచే  రాజకీయ నిర్మాణం నిర్మించడం ప్రారంభించాడు. అతను అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టాడు మరియు దగ్గరి గా ప్రజా పరిపాలనా విధానం పర్యవేక్షించాడు. అతను కొత్తగా ఆక్రమించిన భూముల కోసం ఒక ఆధునిక పరిపాలన విధానం స్థాపించాడు. అన్ని ముస్లిం భూభాగాల జనాభా లెక్కలను ఆదేశించాడు.
ఉమర్ అధికారులకు  వ్యతిరేకంగా ఫిర్యాదుల పరిశోధన కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినాడు. ఈ శాఖ ఉమర్ నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్ కోర్టు గా ఉండేది. న్యాయ విచారణల్లో వ్యక్తిగతంగా పాల్గొనేవాడు. అతను ఇంటెలిజెన్స్ సర్వీస్ ద్వార అధికారులను  జవాబుదారీగా చేసినాడు.

లీడర్ షిప్ :
ఖలిఫా గానియమించ బడిన  తర్వాత ఉమర్ ప్రజలను ఉద్దేశించి  "మీకు  నాలో ఏ కుటిలత కనుగొన్న నన్ను దానిని సరిద్దికోనియండి” అని ప్రసంగించాడు మరియు అతను “ఓహ్ అల్లాహ్, నేను  వ్యక్తులతో మృదువుగా ప్రవర్తనించనియమని” ప్రార్దించాడు.   "ఒక నాయకుడు తన బలహీనతలను  గుర్తిస్తాడు మరియు వాటిని ఒప్పుకునెందుకు  భయపడ్డడు.” అతని ప్రాధాన్యత తన ప్రజల శ్రేయస్సు కాని  తన అహంగాదు. ముఖ్యంగా, అతను తన బాధ్యతలో  సహాయం కోసం అల్లాహ్ ను సహాయం కోరతాడు మరియు కేవలం తనపై  ఆధారపడడు.

అతని  అద్భుతమైన నైపుణ్యo,  రాజకీయ జ్ఞానం, ప్రసంగం, నిఘా, న్యాయ   నిష్పక్షపాత  ప్రజల ద్వారా గుర్తించబడ్డాయి. ఉమర్ ప్రజలను ఎల్లప్పుడూ తన  ప్రవర్తన   ద్వారా మెప్పించును. అతను తన వ్యక్తిగత ఆస్తులను  కనీసం గా ఉంచి  సాధారణ ఆహార౦ను  భుజించును. అతను ఎల్లప్పుడూ జీతం తీసుకోవడానికి  తిరస్కరించాడు మరియు రాష్ట్ర ఖజానా ను  ఎప్పుడూ ముట్టుకోలేదు. అతను సమానత్వాన్ని నమ్మేవాడు మరియు ఎల్లప్పుడూ పేద ప్రజల పరిస్థితి గురించి ఆలోచించే వాడు. అతని  న్యాయ వ్యవహారాలు  ముస్లింలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి మరియు అతని  న్యాయ  భావన అసమానమైనది.

అతను మదీనా వీధుల్లో  రాత్రులoదు సంచరించేవాడు. అతను  సమస్యల గురించి ముఖ్యంగా పేద ప్రజలను  అడిగేవాడు. అతని దృష్టి లో ఒక వ్యక్తి కూడా ఆకలితో ఉండరాదు. "ప్రతి కడుపు నిండే  వరకు ఉమర్ కు  నిద్ర లేదు.” ఒకసారి ఉమర్ హరః  అనే ప్రదేశంలో అస్లాం అనే సేవకుడు తో నడుస్తున్నాడు. వారు ఒక చోట  అగ్నిని  చూశారు మరియు ఆ వైపు వెళ్లారు. అక్కడ ఒక ఆమెను ఆమె పిల్లలతో తో చూసారు.ఎందుకు అక్కడ ఉన్నారని ఉమర్ ఆ  మహిళను ప్రశ్నించారు. ఆమె చల్లని వాతావరణం మరియు ఆకలి తో ఉన్నానని జవాబు చెప్పింది. ఉమర్ ఆమె ఆహారo కొరకు రాళ్ళు మరిగించడం చూసాడు. పిల్లలకు  అన్నం ఆశ చూపటానికి రాళ్ళూ మరిగిస్తంది. అది గమనించిన ఉమర్ ట్రెజరీ (Baitul Maal) కు  వెనుదిరిగాడు మరియు బార్లీ, గోధుమ, బియ్యం, కొవ్వు, డబ్బు తో నిండిన సంచి తీసుకోని దానిని మోయుటకు  అస్లాం కు అనుమతి ఇవ్వక స్వయంగా మోస్తూ  ఆ మహిళా వద్దకు వెళ్ళినాడు. ఆ మహిళను తప్పుకోమని అడగి  అతను స్వయంగా ఆహార౦ వండి  పిల్లలకు భోజనం పెట్టి పిల్లలు నిద్ర పోయిన తరువాత  అప్పుడు మాత్రమే అతను వేను తిరిగినాడు. ఉమర్ తన నాయకత్వం లో, బాధ్యత, తాదాత్మ్యం, సానుభూతి, మర్యాద, నిడంబరత మరియు సహాయ  స్వభావం ను ప్రదర్శించారు. పై  సంఘటన ఒక గొప్ప నేతకు  అవసరమైన లక్షణాలను చూపిస్తుంది.

  హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్:
ఉమర్ ఒకసారి తన స్నేహితులతో కూర్చున్నాడు. వారి కోరిక ఏమిటని అతను తన స్నేహితులను అడిగారు. ఒక స్నేహితుడు లేచి  " నాకు బంగారు మరియు వెండి తో పూర్తిగా నిండిన  ఈ గది ఇవ్వాలని అల్లాహ్ కు దుఆ చేస్తానని, మరియు అల్లాహ్ నా కోరిక తీరిస్తే అప్పుడు నేను అల్లాహ్ కు ఈ గది దానం ఇస్తానని పలికాడు.  మరొకతను   లేచి అన్నాడు " నాకు వజ్రాలు తో నిండిన ఈ గది ఇవ్వాలని అల్లాహ్ కు  దుఆ చేస్తానని, మరియు అల్లాహ్ నా కోరిక తిరుస్తే నేను అల్లాహ్ కు ఆ గది దానం గా ఇస్తానని పలికినాడు.

ఈ రెండు చర్యలలో ఉమర్  స్నేహితులు  అల్లాహ్ మార్గంలో వారి సంపద ఖర్చు పెట్టుటానికి సిద్ధంగా ఉన్నారు  కానీ ఉమర్ ఒక అధ్బుతమైన నాయకుడు, అతను లేచి నాకు అబ్దుల్లా ఇబ్న్ మసూద్, మాజ్  బిన్ జబల్ మరియు ఉజిఫా  ఇబ్న్ యమన్ లాగా యవ్వనం ఇమ్మని  నేను అల్లాహ్ కు దుఆ చేస్తాను అన్నాడు. అల్లాహ్ నాకు అవకాశం ఇస్తే నేను అల్లాహ్ మార్గం   లో దానిని ఖర్చు పెడతాను అని పలికినాడు. అతను బంగారం, వెండి మరియు వజ్రాలు బదులు యవ్వనానికి  ప్రాధాన్యత ఇచ్చాడు.

ఎమోషనల్ ఇంటెలిజెన్స్:
ఒకసారి ఒక మనిషి ఉమర్ దగ్గిరకు వచ్చి  తన భార్య యొక్క గయ్యాళి తనం  గురించి  ఫిర్యాదు చేసాడు. అతను ఉమర్ కోసం బయట నిరీక్షిస్తుండగా ఉమర్ బార్య ఉమర్ ను తిట్టడం విన్నాడు. ఉమర్ ప్రశాంతం గా బదులు ఇవ్వక  ఆ తిట్లను భరించాడు. వచ్చిన ఆతను గొణుగుతూ ఉమర్ లాంటి నాయకునికే ఆ విధంగా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎమిటని ఆలోచిస్తూ  దూరంగా వెళ్ళడం  మొదలు పెట్టాడు.

ఆ సమయంలో, ఉమర్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ  మనిషి దూరంగా వెళ్ళడం చూసాడు. అతను ఆ వ్యక్తి ని పిలిచి మీకు ఏమి  కావాలని అడిగినాడు. అప్పుడు ఆమనిషి బదులిచ్చారు, " ఓ నాయకుడా, నేను నా భార్య యొక్క గయ్యాళి తనం గురించి  మీకు ఫిర్యాదు చేయడానికి వచ్చాను కానీ మీ పరిస్థితి చూసి  నమ్మిన నాయకుడి  పరిస్థితి ఇలా ఉంటే నా సంగతి ఏమిటని అలోచిoచూ చున్నాను అని పల్కినాడు.
ఉమర్ ఓ నా సోదరుడా , నేను ఎందుకు ఆమె గయ్యాళి తనం సహిస్తునానంటే   ఆమెకు నా  మీద  హక్కులు కలవు. ఆమె నా భోజనం తాయారు చేస్తుంది, , నా బట్టలు కడుగుతుంది, నా బిడ్డ కు పాలు ఇస్తుంది, మరియు నాకు  సౌకర్యం ఇస్తుంది ,నిషిద్ధ పనులు చేయకుండా నన్ను ఉంచుతుంది. కాబట్టి  నేను ఆమెను భరించుచున్నాను అనెను. అప్పుడు  ఆ వ్యక్తి ఉమర్ తో నా పరిస్థితి అంతే అని  చెప్పాడు. ఉమర్ ఆ వ్యక్తి తో నిగ్రహం పాటించు, జీవితం చాల చిన్నది అని పలికినాడు.-అద్ ధహబి అల్ కబీర్.
   
ఉమర్ అస్లం అనే తన బానిస తో నడిచేటప్పుడు వారికి ఖులా బిన్తె సలాబ (Khaula binte Salaba) అనే మహిళ కలిసినది. ఆమె ఉమర్ ను ఆపి  సలహా ఇవ్వడం ప్రారంబించినది ´ నీవు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు,  మీరు మీ తండ్రి నుండి దెబ్బలు తినేవారు కానీ  ఇప్పుడు మీరు ఖలీఫా చేయబడ్డారు  కాబట్టి  వ్యక్తులతో, మృదువైన ప్రవర్తన కలిగి ఉండండి,వారి చర్మం వలవ కండి మరియు మన్నించoడి అని అన్నది. ఆమె వెళ్ళిన తరువాత బానిస అస్లాం  ఉమర్ ను అడిగాడు మీరు ఎందుకు నిశబ్ధం గా ఉన్నారు? ఉమర్ సమాధానమిస్తూ "ఆమె  గొంతు  సింహాసనంపై అల్లాహ్ వింటాడు మరియు రాత్రి అంతా ఆమె సలహా ఇచ్చిన నేను నిలబడి వింటాను” అని అన్నారు. ఉమర్ కు కోపం రాలేదు ప్రశాంతంగా ఆమె సలహా వింటూ తన భావోద్వేగాలను నియంత్రిoచటం  సమర్ధవంతంగా చూపారు.


మరొక సందర్భంలో ఒక ముస్లిం కాని వ్యక్తి చాలా దుస్థితిలో  ఉమర్ వద్దకు వచ్చెను. అతను ఈ నా దుస్థితికి  ఒక ముస్లిం చేసిన  అన్యాయం కారణం, ఆతను నన్ను దారుణంగా కొట్టాడు, మీరు దయుంచి అతని పై   అవసరమైన చర్య తీసుకోవాలని కోరినాడు. ఉమర్ చాలా కోపంతో బానిస తో వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకు రమ్మని ఆదేశించినాడు. బానిస వెళ్ళినప్పుడు, ఆ కొట్టిన వ్యక్తి అబ్దుర్ రహ్మాన్ బిన్ ఓఫ్ అని గ్రహించాడు. బానిస ఉమర్ చాల  కోపం గా ఉన్నాడు, మిమ్ములను శిక్షించే ప్రమాదం ఉంది, కాబట్టి మీ  బదులు  మీరు మాజ్  బిన్ జబల్ పంపoడి అది మీకు  మంచిదని చెప్పినాడు. తరువాత ఉమర్ కోపం గా ఉన్నానని గ్రహించి వజు చేసి రెండు రకాతుల నమాజ్ చెసీ ఆ తరువాత    నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం న్యాయబద్దంగాను వివేకంగాను ఉంది. ఈ సంఘటన కోపం నియత్రిచుటకు వజు  మరియు నమాజ్  చేయడం ఉపయోగ పడతాయని తెలుస్తున్నది.

ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్:
 ఉమర్  ఎల్లప్పుడూ చాలా నిరాడంబరంగా మరియు వినయం తో నిండి అల్లాహ్ పట్ల  పూర్తి విధేయత కలిగి ఉండే వాడు. అతనికి "రేపు నేను  నా ప్రభువుకు  ఏమి చెబుతాను?" అనే భయం ఉంది. అందుకే అతను పూర్వ జీవితం లో ఇస్లాం పట్ల చూపిన ద్వేష బావానికి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నిస్తూ తన జీవితాంతం గడిపారు.
ఉమర్ నరకపు  అగ్ని నుండి కాపాడబడటం  గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడు. అతని మంచి పనులు అన్ని, చెడుపనులు అన్ని అతనిని నరకం నుండి రక్షించవు.  అతనికి  స్వర్గం ప్రసాదించ బడినప్పటికి అల్లాహ్ పట్ల  పూర్తి  విధేయత కలిగి ఉంటాడు.

.
క్రైసిస్ మేనేజ్మెంట్:
ఖలీఫా ఉమర్ పాలనలో 638 CE సంవత్సరం అరేబియా అతిపెద్ద సంక్షోభాన్ని చూసింది. కరువు అరేబియా అంతటా వ్యాప్తి చెందినది మరియు సిరియా, పాలస్తీనా మరియు ఇరాక్ నుండి  ఆహార పదార్ధాలు  వచ్చెవి. ఒక సారి  మదీనా కు వచ్చిన ఆహార పదార్ధాలు అరేబియా లో తట్టు ప్రాంతానికి పంపబడినవి. ఆహారo కోసం  మరియు సహాయం కోసం మదీనా కు  వచ్చిన ప్రజల కోసం, ఉమర్  ప్రతి రాత్రి ఒక విందు నిర్వహించేవాడు. ఆ విందుల వద్ద 1,00,000 పైగా జనాభా హాజరు  అయ్యారని తెలుస్తుంది.

తరువాత 639 CE సంవత్సరంలో లో మరొక సంక్షోభం వచ్చింది. కరువు ముగిసిన తరువాత గొప్ప ప్లేగు సిరియా మరియు పాలస్తీనా అంతట వ్యాప్తి చెందినది. ప్లేగు  ఉన్నప్పుడు ఉమర్ గవర్నర్లు  చాలా మంది  ప్లేగు వలన మరణించారు  పరిపాలన తిరిగి నిర్వహించడానికి ఉమర్  సిరియా వెళ్ళాడు. ఉమర్ తన పాలనలో జరిగిన ప్రతి సంక్షోభం సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

స్వీయ నిర్వహణ:
ఉమర్ కు  వ్యాపారo  మరియు కొంత భూమి ఉండేది. అతని భాగస్వామి ఒక అన్సార్. ఉమర్ తన భాగస్వామి తో ఒక ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ”నేను ఒక రోజు పని కోసం  పోతున్నాను మరియు నీవు  మదీనా వెళ్లి   ప్రవక్త ముహమ్మద్ (స) ను అనుసరించు మరియు  రాత్రి తిరిగి వచ్చినప్పుడు జరిగినదంతా నాకు చెప్పు, మరుసటి రోజు నేను ప్రవక్త(స) ను అనుసరిస్తాను నీవు పని చూడు అని  అన్నాడు. ఈ ఒడంబడిక ఇద్దరు అధికంగా పని చేయడానికి దారితీసింది. ఈ సంఘటన ఉమర్ తన జీవితాన్ని ఎలా పని కి  న్యాయం చేయడం మరియు జ్ఞానం పొందడం ద్వారా మ్యానేజ్ చేసాడో చూపిస్తుంది.
.
టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్:
ఒకసారి ఉమర్ 4000 సైనికులతో  ఈజిప్ట్ ను  జయించమని  అమర్ బిన్ అలాస్ ను  పంపారు. అమర్ బిన్ అలాస్  మరింత ఎక్కువ మంది సైనికులు కావాలని ఉమర్ ను కోరారు. ఉమర్ అప్పుడు అతనికి అదనంగా మరో 4000 మంది సైనికులను పంపారు. వారిలో ఉమర్ సహచరులు నలుగురు ఉన్నారు, వారు ప్రతి ఒక్కరు వెయ్యి మంది తో సమానం. ఈ విధంగా   ఉమర్ తన సహచరులు   మంచి నాణ్యత కలవారు అనే అనుభూతి నొక్కిచెప్పారు.

నిజంగా ఖలీఫా  ఉమర్ యొక్క జీవితం ప్రతి మానవుడికి ఒక ఉదాహరణ మరియు ప్రేరణ గా ఉంది. అతను  ప్రపంచం లోని  ఉత్తముల్లో ఒకడు. ఉమర్ చాలా సులభమైన జీవితాన్ని గడిపాడు, అనేక సార్లు విదేశీయులకు  అతను  ఒక చెట్టు కింద విశ్రాంతి తిసుకొంటునో  లేదా ప్రజలతో  కలసి మసీదులో ప్రార్థనలు చేస్తూ కనిపించేవాడు. వారిలో  ఖలీఫా అయిన ఉమర్ ను గుర్తించడo   చాల కష్టం. ఉమర్ నిరంతరం దయగల , తెలివైన మరియు దైవభక్తిగల మానవుడు. చిన్న అన్యాయం, చిన్న అనుమానం, చిన్న అణచివేతను  ప్రదర్శించడానికి  భయపడి వ్యక్తి – అతను నిరంతరం ఈ ప్రశ్నకు సమాధానం వెదికేవారు? "నీ ప్రభువు కు రేపు ఏమి సమాధానం  చెబుతావు?


No comments:

Post a Comment