7 March 2019

అమెరికా లో విస్తరిస్తున్న నల్లజాతియుల 'సహజ ధర్మం” ఇస్లాం (Islam, the ‘natural religion’ of Black folk, is growing in US)



'




వోడా ఫీజెల్ (Vonda Feazell) ఒక నల్ల జాతి క్రైస్తవ అమెరికన్ వనిత. వాషింగ్టన్ డి.సి.నివాసి. “చెడు అలవాట్లు, చెడు నడత,ఎక్కువ మంది మగ స్నేహితులు,  అనైతికత, పిల్లలు క్రమశిక్షణతో ప్రవర్తించక పోవటం, పేదరికం,ఆర్ధిక సమస్యలు,  జీవితంలో ఏది సరిగా ఉండక పోవడం”- ఇవి  ఆమె జీవితంలో భాగమైనవి. వీటి నుంచి  బయటపడటానికి మార్గం మరియు తన సమస్యలకు  పరిష్కారం ఆమెకు లబించుట లేదు. ఆమె దేవుని అందు ఆశ మరియు నమ్మకం కోల్పోయింది. ఏమి చేయాలో అర్ధం  కావుట లేదు!

ఇటువంటి పరిస్థితులలో చివరి మార్గంగా ఆమె పొరుగున ఉన్న ఒక ముస్లిం బ్రదర్/సహోదరుడు ఇచ్చిన సలహా మేరకు వాషింగ్టన్, D.C. లోని నేషన్ అఫ్  ఇస్లాం వారి    ముహమ్మద్ మస్జిద్/మాస్క్ (Mosque) నం 4 దర్శించినది. అప్పటినుండి ఆమె జీవితంలో మార్పు కనపడసాగినది. మొదటిసారి జీవిత ప్రయోజనం అర్ధమైనది. ఇది వరకు లేని భావన ఆమెలో కలిగినది. తను తప్పు చేస్తున్నాను అని ఆమె తెలుసుకోగలిగినది. జారత్వము తప్పు అని ఆమెకు అర్ధమైనది. తను చేసే ప్రతి పని పైనుంచి అల్లాహ్ చూస్తున్నాడనే భావన ఆమెలో కలిగినది. ఆ భావన ఇకనుంచి ఆమె తప్పులు చేయకుండా నిలువరించినది.  అంతకు ముందు ఎన్నడు ఇలా జరగలేదు. "

వోడా ఫీజెల్ (Vonda Feazell) త్వరలోనే తన బానిస యజమాని పెట్టిన పేరును మార్చుకొని వోండా X గా మారనది. ఆమె అమెరికా లో అత్యంత వేగవంతమైన స్థాయిలో ఇస్లాం స్వీకరిస్తున్న  నల్లజాతీయుల సంఖ్యలో చేరింది.
 
ఇటివల విడుదల చేసిన ప్యూ రీసెర్చ్ సెంటర్  అధ్యయనం ప్రకారం, (పలితాలు జనవరి 17 న విడుదల చెయ్యబడినవి), అమెరికన్ బ్లాక్ ముస్లింలలో సగం మంది (49 శాతం) “నవ ముస్లింలు అనగా కన్వర్త్స్converts. బ్లాక్-కాని ముస్లింలలో కేవలం 15 శాతం మాత్రమే “నవ ముస్లిమ్స్ converts. క్రైస్తవం లోకి మారిన  నల్ల జాతి వారు అనగా  కన్వర్త్స్converts కేవలం 6 శాతం మాత్రమే ఉన్నారు.

2017 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం, అమెరికా లోని మొత్తం ముస్లిం జనాభాలో నల్ల జాతీయుల జనాభా (హిస్పానిక్ సంతతి లేదా మిశ్రమ జాతితో సహా) 20 శాతం వరకు ఉంది. కొంతమంది ముస్లిమ్స్ ప్రకారం ఈ సంఖ్య తక్కువ ఎందుకనగా కొంతమంది బ్లాక్ ముస్లింలు ముస్లిం పేర్లను కలిగి లేరు లేదా ఇతర కారణాల వలన లేదా ఇష్టం లేనందున వలన సెన్సెస్ లో పాల్గొన లేదు.  

పరిశోధన ప్రకారం, బ్లాక్ ముస్లింలు, మొత్తం ఇతర అమెరికన్ నల్ల జాతీయుల మాదిరిగానే అధిక స్థాయిలో మతపరమైన నిబద్ధత కలిగి ఉంటారు. బ్లాక్ ముస్లింలు మరియు నల్లజాతీ క్రైస్తవులలో చాలా మందికి ధర్మం  చాలా ముఖ్యమైనది (వరుసగా 75 శాతం మరియు 84 శాతం). వీరు  బ్లాక్-కాని ముస్లింల (62 శాతం) కంటే ఎక్కువ మత నిబద్ధత కలిగి ఉన్నారు. ఇస్లాం ధర్మం యొక్క ఐదు రోజువారీ ప్రార్ధనలను (55 శాతం వర్సెస్ 39 శాతం) ఇతర ముస్లింల కంటే బ్లాక్ ముస్లింలు ఎక్కువగా పాటిస్తారు.

1900ల ప్రారంభంలో కొంతమంది అమెరికన్ ముస్లిం మతాధికారులు    శతాబ్దాల క్రితం ఆఫ్రికన్ మూలాలను కలిగి  అమెరికాలో బానిసలుగా విక్రయించబడిన   నల్ల జాతీయుల యొక్క సహజ ధర్మం ఇస్లాం అని వివరించారు. ఈ వాదనను సమర్ధించినది   1930 లో స్థాపించబడిన నేషన్ అఫ్ ఇస్లామ్  సంస్థ. ప్రస్తుతం దానికి లూయిస్ ఫరాఖాన్ నేతృత్వం వహిస్తున్నారు.  

నేడు, ప్రతి 100 బ్లాక్ ముస్లింలలో ఇద్దరూ నేషన్ అఫ్ ఇస్లామ్  తో  సంభంధం కలిగి ఉన్నారు. బ్లాక్ ముస్లింలలో చాలామంది సున్ని ముస్లింలు (52 శాతం) మరియు ఎ ఇతర  ఇస్లామిక్ శాఖతో సంభంధం లేనివారు (27 శాతం) గా ఉన్నారని "సర్వే పేర్కొన్నది.

ముహమ్మద్ ఆలీ, మాల్కోమ్ X మరియు ఇమామ్ W దీన్ మొహమ్మద్ వంటి ప్రముఖ అమెరికన్ ముస్లిం ప్రముఖులు, ఒకప్పుడు నేషన్ అఫ్ ఇస్లామ్  యొక్క సభ్యులుగా ఉన్నారు

 


2018 జనవరిలో, ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా ప్రకారం, 2017 లో U.S. లో నివసిస్తున్న అన్ని వయసుల ముస్లింలు సుమారు 3.45 మిలియన్ల మంది ఉన్నారని మరియు మొత్తం U.S. జనాభాలో 1.1 శాతం మంది ముస్లింలు ఉన్నారు అని చెప్పినది.

" ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక యు.ఎస్. ముస్లిం జనాభా అమెరికాలోని  లోని యూదు జనాభా కంటే వేగంగా పెరుగుతుందని సూచిస్తుంది. 2040 నాటికి, ముస్లింలు, క్రైస్తవుల తరువాత అమెరికా  యొక్క రెండవ అతి పెద్ద మత సమూహంగా మరియు 2050 నాటికి, US ముస్లిం జనాభా 8.1 మిలియన్లకు చేరుకుంటుంది, లేదా అమెరికా యొక్క మొత్తం జనాభాలో 2.1 శాతం ఉంటుంది అన్నది అనగా  ఇప్పటి జనాభా కు రెండు రెట్లు పెరుగుతుందని , "అని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక  పేర్కొంది.

" అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ముస్లింలు  దేశవ్యాప్తంగా సమానంగా పంపిణీ చేయబడలేదు. వాషింగ్టన్, D.C. వంటి కొన్ని మెట్రో ప్రాంతాలు, గణనీయమైన ముస్లిం సమాజాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా, న్యూజెర్సీ వంటి కొన్ని రాష్ట్రాలు తలసరి జాతీయ సగటు ను రెండు లేదా మూడు సార్లు మించి ముస్లింలను కలిగి ఉన్నాయి. చాలా తక్కువ ముస్లింలు కలిగిన  రాష్ట్రాలు మరియు కౌంటీలు కూడా ఉన్నాయి, "అని 2018 నాటి అంచనా ప్రకారం ప్యూ పరిశోధకులు అంటారు.
 
"
సత్యం  కోసం చూస్తున్న నల్ల జాతీయుల కోసం ఇస్లాం మతపరమైన ప్రామాణికతను కలిగి ఉందని" బరాక్ఇంక్(BARRACK INC.) యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐయాషా ప్రైమ్ చెప్పారు. బరాక్ ఇంక్ అనేది ఇస్లాంతో మహిళలకు మరియు యువతకు విద్య మరియు సాధికారత సాధించడానికి అంకితమైన ఒక సంస్థ. ఆమె వార్షిక రమదాన్ ప్రార్ధనలలో  తరచూ ధార్మిక ఉపన్యాసకురాలుగా/ప్రెజెంటర్గా ఉంటారు. రమదాన్ నెల లో  ఉపవాసం మరియు ప్రత్యేక ప్రార్ధనలు అనేవి ఇస్లామిక్ జీవితం లో ముఖ్యమైన భాగం గా ఉంటాయి. ఇస్లాం ధర్మం నల్లజాతి పురుషులు మరియు మహిళలకు సాధికారమిస్తుంది.  ఇది ఆచరణాత్మకతతో కూడిన  ఆశను అందిస్తుంది. ఇది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇస్తుందని "ఆమె అంటారు.

హకీం ముహమ్మద్ ఒక ముస్లిం, అతని తల్లి క్రైస్తవురాలు. అతని  హైస్కూల్ సమయంలో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పుడు అతను ఇస్లాం నుండి సోషలిజం లోకి మారాడు. కాని  పెట్టుబడిదారీ విదానం మరియు సోషలిజం రెండింటి కంటే సంపద అసమానతలను తొలగించడానికి  ఇస్లాం ఒక  ఉన్నతమైన మార్గo అనీ ఒక చర్చా శిబిరం లో తెలుసుకున్నాడు.  తిరిగి ముస్లిం  మార్గం వైపు మరలాడు.   

అతను వేసవి/సమ్మర్ సెలవులలో  ఇస్లాం గురించి మరింత చదవినాడు.  ఇస్లామిక్ ఆర్ధిక మరియు రాజకీయ ఆలోచన, ప్రవక్త  జీవిత చరిత్ర, ఇస్లామిక్ తాత్విక ఆలోచన పుస్తకాలు అద్యయనం చేసాడు. ఇస్లాం గురించి యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఉపన్యాసంను, హంజా యూసుఫ్ ఉపన్యాసాలను కూడా విన్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత, అతడు బోస్టన్ లో ఈశాన్య లా స్కూల్ లో రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు  తెల్ల జాతి వారి  ఆధిపత్యానికి సమాధానంగా ఇస్లాం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ బ్లాక్ దావా (Dawah) నెట్వర్క్ ప్రారంభించి యువతను ఆకట్టుకున్నాడు.

"ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగం లో నివసిస్తున్నాము. ఇస్లాం యొక్క విలువను యువత తెలుసుకోవాలని అనుకొంటున్నారు.  ఇస్లాం ధర్మం నల్లజాతి ప్రజలకు సరియైనది కాదనే  అఫ్రోసెస్ట్రిస్ట్(Afro-Centarist) ఆలోచనలకు వ్యతిరేకంగా  యువతకు చేరుకునే విధంగా బ్లాక్ దావా నెట్వర్క్ స్థాపించబడినది. అది  బ్లాక్ కంటెంట్ను సృష్టిస్తుంది మరియు నల్లజాతీయులకు సంబంధించినది” అని ఆయన అంటారు.


రాపర్ మనీబ్యాగ్స్ యో  షాహదహ్ (ఇస్లాం ధర్మ విశ్వాసం) ను తీసుకున్నప్పుడు, హకీమ్ ముహమ్మద్ అతనికి ఒక లేఖ వ్రాసాడు."మీ వీడియో లో మీరు, ధృవీకరించినట్లు 'ముహమ్మద్ అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త మరియు సందేశహరుడు.' మన ప్రవక్త ముహమ్మద్(స), చెప్పినట్లు “తనకు ఉన్నది తన సోదరుడికి కూడా ఉండాలని విశ్వ సించె వాడే నిజమైన విశ్వాసి. "మీరు కూడా  బ్లాక్ దావా(Dawah) నెట్వర్క్ చేరoడి మరియు  మరియు దాని వేదిక ద్వారా ఇస్లాం ధర్మం లోకి దక్షిణ మెంఫిస్ లోని ఓటు హక్కు లేని బ్లాక్ కమ్యూనిటీలను  ఆహ్వానించడి.." అన్నాడు.


ఇస్లాం మతం ఎల్లప్పుడూ యువతకు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. యువ జాజ్ సంగీతకారులు, యువ కవులు మరియు  ఒక మిలియన్ పైగా సామాజిక మీడియా ఫాలోయిoగ్ ఉన్న రాప్ సంగీతకారులు  బెన్Xలను ఇస్లాం ఆకర్షించినది. నల్ల జాతి యువకులలో  ఇస్లాం అత్యంత ప్రజాదరణ పొందినది.  .


బెన్ X ఇస్లాం ధర్మం స్వికరించినాడు మరియు నేషన్ అఫ్ ఇస్లాం అధిపతి  లూయిస్ ఫరాఖాన్ ఇచ్చిన ఇస్లాం ధర్మ సందేశాన్ని విస్తృత వ్యాప్తి చేసినాడు. అతడు ఒక YouTube ప్రభావకుడు, YouTube వీడియోలను వాణిజ్యరీత్యా  రూపొందకుడు.కేవలం మూడు సంవత్సరాలలో అతను యువ, వృద్ద, నలుపు, తెలుపు, ముస్లిం, క్రైస్తవ మరియు ఏవిధమైన  మతసంబంధమైన అనుబంధం లేని వారిని ప్రభావితం చేసాడు.. YouTube లో కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు, అతను ఒక రచయిత, సంగీతకారుడు మరియు దేశవ్యాప్తoగా ఉపన్యాసాలు ఇచ్చే  ఇస్లామిక్ ధార్మిక వక్త(దాయి).


"ప్రజలకు కావలసిన విలువలను నేను పంచుతున్నాను. నేను సత్యం మాట్లాడుతున్నాను. నేను ఇస్లాం బోధన చేస్తున్నాను, "అని అతడు అంటాడు. "నేను యువకుడిని , నేను సంగీతాన్ని వినిపిస్తాను, నేను ఇస్లాం ధర్మం లో జీవిస్తున్నాను. నేను ఇస్లాం ఆచరణాత్మక ఫలితాలను చూపిస్తాను. ప్రతిరోజూ యువత ఎదుర్కొన్నే సమస్యలకు ఇస్లామిక్ సమాధానం చూపుతాను మరియు ఇస్లాం  ధర్మం ఎంత బాగుంది అని నేను వారికి చూపుతాను” అని అంటాడు."


నేషన్ అఫ్ ఇస్లాం  యొక్క అంతర్జాతీయ ప్రతినిధి అబ్దుల్ అక్బర్ ముహమ్మద్ ఇస్లాం ధర్మం బ్లాక్ ప్రజల DNA లో ఉందని అంటాడు. "ది రైజింగ్ టైడ్ ఆఫ్ కలర్" అనే పుస్తకంలో లోథ్రోప్ స్టోడ్దార్డ్ దాని గురించి వ్రాసాడు. దానిపై  అతను ఒక మొత్తం అధ్యాయం కేటాయించినాడు.

"ఇస్లాం అనేది దేవునికి సేవ చేయటానికి మరియు నల్లజాతీయులు మంచి జీవనశైలిని కలిగి ఉంటానికి వారు శాంతిని పొందటానికి ఒక మార్గం అని  అక్బర్ ముహమ్మద్ అంటారు.










1 comment:

  1. పెపంచకం లోని అందరు జనాభా మీ మతంలోకి మారిపోవాలి.అంతేనా. మా మతమే గొప్పది. అందరూ దాన్ని అంగీకరించాలి. ఈ ప్రమాదకరమైన భావనే ప్రపంచంలో ఉగ్రవాదానికి ఆరాచకానికి అంతిమంగా వినాశనానికి కారణమవుతుంది.

    ReplyDelete