15 July 2020

ఇస్లాంలో తహజ్జుద్ ప్రార్ధన : పవిత్ర ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రాముఖ్యత Tahajjud in Islam: It’s Significance in the Light of Holy Quran and Hadith


ఇస్లాంలో తహజ్జుద్ ప్రార్ధన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అరబిక్‌లో దీని అర్థం అప్రమత్తంగా ఉండటం”. ఇది రాత్రి సమయంలో నఫిల్ ప్రార్థన మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క అత్యంత ప్రియమైన ప్రార్థనలుగా పిలువబడుతుంది. ఇస్లాం ధర్మం మనకు అడుగడుగునా ప్రతిఫలమిచ్చే ఉత్తమ ధర్మం.

నఫ్ల్“Naflఅనేది అరబిక్ పదం, ఇది ఇహాపరంగా అదనంగా ఏదైనా పొందడంఅని సూచిస్తుంది. ఏదేమైనా, తహయ్యత్-ఉల్-వుదు Tahayiat-ul-wudu (వజూ తర్వాత రెండు రకాత్'లను ప్రార్ధించడం ), ఇజ్రాక్ (ఫజ్ర్ తరువాత, సూర్యుడు ఉదయించే వరకు తస్బీహ్ ద్వారా అల్లాహ్  స్తుతించడం, తరువాత రెండు లేదా నాలుగు రకాత్'లు ప్రార్ధించడం  వంటి అనేక ఫర్జ్ కాని(నఫిల్) ప్రార్థనలు ఉన్నాయి.  అలాగే చాష్ట్ (సూర్యుడు అస్తమించినప్పుడు కనీసం రెండు రకాత్'లను ప్రార్ధించడం ), మరియు తహజ్జుద్ (రాత్రి తరువాత భాగంలో ప్రార్థన) మరియు ఇతరులు. కానీ తహజ్జుద్ ప్రార్ధన  పవిత్ర ఖురాన్ మరియు హదీసులలో ప్రస్తావించబడిన విలువైన ప్రార్థనగా నొక్కి చెప్పబడింది.

ఇస్లాంలో తహజ్జుద్ ప్రార్ధన  నఫిల్  మరియు స్వచ్ఛంద ప్రార్థన మరియు దీనిని కియాములైల్ Qiyamulail అని కూడా పిలుస్తారు. అలాగే, ఈ ప్రార్థన ప్రవక్త (స)సున్నత్ లో ప్రముఖ భాగం.

ఇస్లాంలో తహజ్జుద్ ప్రార్థనల ప్రాముఖ్యత:
సర్వశక్తిమంతుడైన అల్లాహ్, అల్లాహ్ యొక్క దూతను (సల్లల్లాహు అలైహి వసల్లం) తహజ్జుద్ చేయమని ఆదేశిస్తాడు:
“రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ చెయ్యి. ఇది నీకు అదనపు నమాజ్. నీ ప్రభువు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానం లో ప్రతిష్టింపజేయటం అసంభవం ఏమి కాదు”.-దివ్య ఖురాన్ 17:79.

అల్లాహ్ ((SWT) ఈ రాత్రి ప్రార్థన చేయమని చెప్పాడు మరియు ఈ ఆయత్ లో, ముస్లింలందరినీ దీనిని ఆచరించమని ప్రోత్సహించాడు మరియు దాని ద్వారా ఈ లోకం లోను మరియు పై లోకం లోను గొప్ప విజయాన్ని సాధించగలరు.
మరొక ఆయత్ లో, అల్లాహ్ (SWT) తహజ్జుద్ ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు మరియు ఒకరు ఎలా నీతిమంతులు righteous అవుతారో మరియు అల్లాహ్ యొక్క సమృద్ధి మరియు దయను ఎలా సంపాదిస్తారో వివరిస్తుంది.
తహజ్జుద్ చేసేవారిని ప్రశంసించడానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటాడు:
తమ ప్రభువు సన్నిధి లో సాష్టాoగపడి (సజ్దా లోను) నిలబడి రాత్రులు గడిపే వారు.దివ్య ఖురాన్ 25:64


హదీసులలో తహజ్జుద్ యొక్క ప్రాముఖ్యత:
తహజ్జుద్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే అనేక హదీసులు ఉన్నాయి.
·       `అబ్దుల్లా ఇబ్న్ సలాం ఇలా అన్నారు:
 ప్రవక్త SAW మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు అతని చుట్టూ గుమిగూడారు మరియు నేను వారిలో ఒకడిని. నేను వారి ముఖం వైపు చూశాను మరియు అది అబద్దాల ముఖం కాదని అర్థం చేసుకున్నాను. ఆయన చెప్పిన మొదటి మాటలు: ఓ ప్రజలారా, సలాములు విస్తరించండి, ప్రజలకు ఆహారం ఇవ్వండి, బంధుత్వ సంబంధాలు పాటించండి మరియు ఇతరులు నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయంలో ప్రార్థించండి, మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.’ ”-అల్ తిర్మిజి

·       సల్మాన్ అల్-ఫార్సీ (ర) ప్రవక్త (స)ను ఉటంకిస్తూ ఇలా అన్నారు:
రాత్రి ప్రార్థన గమనించండి; ఇది మీ ముందు నీతిమంతుల అభ్యాసం మరియు అది మిమ్మల్ని మీ ప్రభువుకు దగ్గర చేస్తుంది మరియు ఇది చెడు పనులను  మరియు పాపాలను తొలగిస్తుంది మరియు శరీరం నుండి వ్యాధిని తిప్పికొడుతుంది. ”(అల్-తబరాని)

తహజ్జుద్ ప్రార్థన యొక్క మర్యాదలు:
ఒకరు నిద్రపోయే ముందు ఈ ప్రార్థన చేయగలిగినప్పటికీ, ఫజ్ర్ ప్రార్ధన సమయానికి ముందే తహజ్జుద్ ప్రార్థన చేయడం మంచిది. నిద్రపోయే ముందు, తహజుద్ ప్రార్థనలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉండాలి.

·       అబూ అడ్-దర్దా Abu Ad-Darda’ అల్లాహ్ యొక్క దూతను ఉటంకిస్తూ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
ఎవరైతే రాత్రి సమయంలో లేచి ప్రార్థన చేయాలనే ఉద్దేశ్యంతో నిద్రిస్తారో కాని, నిద్ర నుండి మేల్కోవటం లో విఫలమైతే, అతను ఉద్దేశించిన వాటిని అతను పొందుతాడు  మరియు అతని నిద్ర స్వచ్ఛందo(దయగల చర్య)  గా అతని కోసం అల్లాహ్ చే పరిగణిoచ బడుతుంది..
(అన్-నాసా మరియు ఇబ్న్ మజా)
ఏదేమైనా, మేల్కొన్న తర్వాత, ముఖాన్ని తుడుచుకొని  మిస్వాక్ (టూత్ బ్రష్) చేయాలి, మరియు ఆకాశం వైపు చూడాలి మరియు తరువాత అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి చెప్పినట్లుగా ప్రార్థన చేయాలి.

·       అబూ హుజైఫా (ర)ఇలా అన్నారు.:
"ప్రవక్త నిద్రించాలని అనుకున్నప్పుడల్లా," అల్లాహ్, మీ పేరుతో నేను చనిపోతాను మరియు నేను జీవిస్తున్నాను "అని పఠిస్తారు. వారు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, ఇలా అంటారు: " మనలను చనిపోయేలా చేసి తరువాత (సజీవంగా) మమ్మల్ని బ్రతికించిన అల్లాహ్ కోసం ప్రార్ధనలు." (-అల్-బుఖారీ)

తహజ్జుద్‌లోని రకాత్ ల  సంఖ్య:
తహజ్జుద్ ప్రార్థన కోసం నిర్దిష్ట సంఖ్యలో రకాత్లు వివరించబడలేదు అలాగే గరిష్ట పరిమితి లేదు. అయితే, కనీసం రెండు రకాత్‌లు చేయాలి.

·       సమురా ఇబ్న్ జుండుబ్ Samurah ibn Jundub (ర) ఇలా అన్నారు:
"అల్లాహ్ యొక్క దూత రాత్రిపూట, కొంచెం లేదా చాలా ఎక్కువ ప్రార్థన చేయమని మరియు ప్రార్థనలో చివరిది వితర్ ప్రార్థన చేయమని ఆదేశించారు."
(అట్-తబారాని  మరియు అల్-బజ్జా)

·       ఆయేషా  (ర) ఇలా అన్నారు:
"అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) అర్ధరాత్రి ప్రార్థన చేసినప్పుడు, అతను తన ప్రార్థనలను రెండు శీఘ్ర రకాట్లతో ప్రారంభిస్తారు."
(-ముస్లిం)

అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) తరచూ తహజ్జుద్ ప్రార్ధన లో  పొడవైన రకాట్లను పఠించేవారు.
·       అల్-ముగిరా (రా) కథనం:
అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) (ప్రార్థనలో) వారి పాదాలు లేదా కాళ్ళు ఉబ్బినంత వరకు నిలబడి ప్రార్థించేవారు. ఎందుకు అని అడిగితే  "నేను కృతజ్ఞతగల బానిస కాకూడదా" అని అనేవారు.(-బుఖారి)

తహజ్జుద్ ప్రార్ధన –బహుమతులు

Rewards gained by Tahajjud


మరొక హదీసు ఇస్లాంలో తహజ్జుద్ ప్రార్ధనను హైలైట్ చేసింది.
·       అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఉటంకిస్తూ అబూ హురైరా (ర) ఇలా అన్నారు:
"రాత్రి సమయంలో లేచి తన భార్యను మేల్కొపే  వ్యక్తిని అల్లాహ్ ఆశీర్వదిస్తాడు మరియు ఆమె లేవటానికి నిరాకరిస్తే, ఆమె ముఖం మీద అతను నీరు చల్లుతాడు. రాత్రి సమయంలో లేచి తన భర్తను మేల్కొల్పే స్త్రీని అల్లాహ్ ఆశీర్వదిస్తాడు మరియు అతను నిరాకరిస్తే ఆమె అతని ముఖం మీద నీరు చల్లుతుంది .
-అబూ దావూద్.

ప్రవక్త SAW ఇలా అన్నారు: తహజ్జుద్ చేసేటప్పుడు ఒకరికి నిద్రవస్తే నిద్రపోవాలి.
·       అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఉటంకిస్తూ `ఆయేషా (ర) 'వివరించిన హదీసులపై ఇది ఆధారపడింది:
"మీలో ఒకరు ప్రార్థన కోసం రాత్రి సమయంలో లేచినప్పుడు మరియు అతని ఖుర్ఆన్ పఠనం అస్తవ్యస్తంగా, సరిగా లేనప్పుడు  అతను పడుకోవాలి."(-ముస్లిం)

తహజ్జుద్ కోసం సిఫార్సు చేయబడిన ఉత్తమ సమయం:

తహజ్జుద్ రాత్రి ఏ భాగానైనా ప్రారంభ, మధ్య, లేదా రాత్రి చివరి భాగంలో చేయవచ్చు, కాని ఇది తప్పనిసరి `ఈషాప్రార్థన (రాత్రి ప్రార్థన) తర్వాత జరగాలి.
ఇవి తహజ్జుద్ ప్రార్ధన ముఖ్యమైన అంశాలు ఇవి. తహజ్జుద్ ప్రార్ధన ఆచరించి సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను సంతోషపెట్టడంలో  ఎప్పుడూ ఆలస్యం చేయ రాదు.

No comments:

Post a Comment