బ్రిటీష్
బానిసత్వం నుండి స్వేచ్ఛను గాంధీ పద్ధతుల ద్వారా మాత్రమే సాధించవచ్చని గట్టిగా
విశ్వసించిన బీబీ అమ్తుస్ సలాం 1907 లో పంజాబ్ లోని పాటియాలాలో రాజ్‌పుతానా కుటుంబంలో జన్మించారు.
బీబీ అమ్తుస్
సలాం సామాజిక కార్యకర్త మరియు గాంధేయవాది. భారత విభజన తరువాత భారతదేశానికి వచ్చిన
శరణార్థుల పునరావాసంలో మరియు మత హింసను
ఎదుర్కోవడంలో చురుకైన పాత్ర పోషించిన మోహన్‌దాస్ గాంధీ శిష్యురాలు.
ఆమె తండ్రి
కల్నల్ అబ్దుల్ హమీద్, తల్లి అమతుర్ రెహమాన్. అమ్తుస్ సలాం ఆరుగురు అన్నల
చెల్లెలు. చిన్నప్పటి నుంచీ ఆమె ఆరోగ్యం చాలా సున్నితమైనది. ఆమె పెద్ద సోదరుడు, స్వాతంత్ర్య
సమరయోధుడు మొహమ్మద్ అబ్దుర్ రషీద్ ఖాన్ ప్రేరణ పొందారు. తన సోదరుడి అడుగుజాడలను
అనుసరించి, దేశ ప్రజలకు సేవ చేయాలని ఆమె నిర్ణయించుకుంది.
అమాతుస్ సలాం
ఖాదీ ఉద్యమంలో పాల్గొని, తన సోదరుడితో పాటు భారత జాతీయ ఉద్యమ సమావేశాలకు హాజరయ్యారు.
ఆమె మహాత్మా గాంధీ యొక్క అహింస సిద్ధాంతం మరియు సేవగ్రామ్ ఆశ్రమం వైపు
ఆకర్షితురాలైంది. ఆమె సేవాగ్రామ్
ఆశ్రమంలో చేరాలని నిర్ణయించుకుంది, మరియు 1931 లో అక్కడికి
వెళ్ళింది. ఆమె ఆశ్రమంలో చేరి ఆశ్రమం యొక్క కఠినమైన సూత్రాలను అనుసరించింది. తన
నిస్వార్థ సేవతో ఆమె గాంధీ దంపతులకు చాలా సన్నిహితంగా మారింది.
గాంధీ దంపతులు అమ్తుస్
సలాంను తమ ప్రియమైన కుమార్తెగా భావించారు. 1934 లో గాంధీజీ సర్దార్
పటేల్‌కు ఉత్తరం రాస్తూ, సలాం యొక్క "హృదయం బంగారం, కానీ ఆమె శరీరం
ఇత్తడి" అనిపలికారు భారత జాతీయ ఉద్యమ సమయంలో, గాంధీ అనుమతితో
అనారోగ్యం ఉన్నప్పటికీ, ఆమె 1932 లో ఇతర మహిళలతో కలిసి జైలుకు వెళ్ళింది.
జైలు నుండి
విడుదలైన తరువాత, ఆమె సేవాగ్రామ్కు చేరుకుంది మరియు గాంధీ యొక్క వ్యక్తిగత
సహాయకురాలిగా బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్యం సాధించడంతో పాటు, హిందువులు మరియు
ముస్లింల మధ్య సామరస్యం, హరిజనుల మరియు మహిళల సంక్షేమం తన జీవిత ఆశయాలు అని ఆమె
అన్నారు.
మత కలహాలు
చెలరేగినప్పుడు, ఆమె నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్, సింధ్ మరియు
నౌఖాలిలలో పర్యటించింది.1947 లో భారతదేశం అంతటా మత
అల్లర్లు జరిగినప్పుడు గాంధీ బెంగాల్‌లో పర్యటించి శాంతిని నెలకొల్ప
ప్రయత్నించారు.. ఆ పర్యటనలో గాంధీజీ తో పాటు పాల్గొన్న అమ్తుస్ సలాం గాంధీతో పాటు అక్కడ శాంతి
నెలకొల్పడానికి ఆ ప్రాంతాల
పరిస్థితిని సాధారణీకరించడానికి ఆమె నోఖాలి వద్ద 21 రోజులు సత్యాగ్రహాన్ని
నిర్వహించింది
మత సామరస్యం సాధించడానికి
అమ్టస్ సలాం విభజన సమయంలో పాటియాలాలో ఉండాలని అనుకున్నారు. ఆమె సోదరులు మరియు ఆమె
కుటుంబంలో ఎక్కువ మంది పాకిస్తాన్‌కు వలస వెళ్లడానికి ఎంచుకున్నప్పటికీ, ఆమె మాత్రం భారతదేశంలోనే
ఉండాలని నిర్ణయించుకున్నారు
ఆ సమయం లో ఉర్దూ ప్రెస్
మొహమ్మద్ అలీ జిన్నా ను క్వాయిడ్-ఎ-అజామ్ (గ్రేట్ లీడర్) అని సంబోధించెది. గాంధీజీ కూడా జిన్నా ను క్వాయిడ్-ఎ-అజామ్ (గ్రేట్ లీడర్) అని సంబోధించలన్న బీబీ అమ్తుస్ సలాం సూచనను గాంధిజీ అనుసరించారు అని మౌలానా ఆజాద్ తన ఇండియా విన్స్ ఫ్రీడమ్
గ్రంధం లో పేర్కొన్నాడు,
1947-48 సమయంలో ఆమె విభజన తరువాత
జరిగిన వేలాది పీడిత మహిళల సంక్షేమం మరియు
పునరావాస కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ
కార్యక్రమాలలో ఆమెకు కాంగ్రెస్ సభ్యురాలు లజ్జవతి హూజా మరియు అఖిల భారత మహిళా
కాంగ్రెస్ సహాయపడింది.
స్వాతంత్ర్యం తరువాత, ఆమె తనను తాను ప్రజా సేవకు అంకితం చేసింది. జాతీయ సమైక్యత
మరియు మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి ఆమె ‘హిందుస్తాన్’ అనే ఉర్దూ పత్రికను ప్రచురించింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1961 లో భారతదేశంలో పర్యటించినప్పుడు, ఆమె అతని వ్యక్తిగత
సహాయకురాలిగా ప్రయాణించింది.
ఆమె కస్తూర్బా
సేవా మందిరాన్ని స్థాపించి, రాజ్‌పురాలో స్థిరపడింది, అక్కడ బహవల్‌పూర్
నుండి వచ్చిన హిందూ వలసదారుల పునరావాసం కోసం పనిచేశారు. శరణార్థుల పునరావాసం కోసం
భారత ప్రభుత్వం రాజ్‌పురాలో టౌన్‌షిప్ నిర్మించడం ప్రారంభించినప్పుడు, శరణార్థి
శిబిరాల్లోని పిల్లల విద్యకొరకు పనిచేసిన
హిందూస్థానీ తాలిమి సంఘ్‌తో పాటు ఆమె కూడా అక్కడ విద్యా కార్యక్రమాలలో పాల్గొంది.
1962 లో చైనా మరియు 1965 లో పాకిస్తాన్‌తో భారతదేశం యుద్ధంలో ఉన్నప్పుడు, ఆమె మన సైనికులను
ప్రోత్సహించడానికి మరియు వారికి సేవ చేయడానికి ఆమె తన దత్తపుత్రుడు సునీల్ కుమార్‌తో
పాటు పనిచేసినది. 1980 లలో, అమ్తుస్ సలాం జైలు సంస్కరణలపై అఖిల భారత కమిటీలో
శాశ్వత ఆహ్వానితురాలుగా పనిచేశారు
గాంధేయ భావజాలాన్ని
అనుసరించి జీవితాంతం గడిపిన బీబీ అమ్తుస్ సలాం, అక్టోబర్ 29, 1985 న తుది శ్వాస విడిచారు.
.
.
.
No comments:
Post a Comment