11 August 2021

చౌదరి తయ్యబ్ హుస్సేన్-3 రాష్ట్రాల అసెంబ్లీలు,3రాష్ట్రాల మంత్రి గా, 2సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించి ప్రసిద్ధి చెందిన మేవత్ ప్రాంత నాయకుడు.. Leader of Mewat: Chaudhary Tayyab Husain who was elected to Assemblies in three different states and became minister as well

  
చౌదరి తయ్యబ్ హుస్సేన్ మియో/Meo కమ్యూనిటీకి నాయకత్వం వహించి మరియు 3రాష్ట్రాల అసెంబ్లీలు మరియు పార్లమెంటులో  మేవత్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ప్రసిద్ధి చెందారు. మియోస్/Meo’s రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు ఢిల్లీ సరిహద్దు గుర్గావ్. వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. చౌదరి తయ్యబ్ హుస్సేన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో లోతైన సంబంధాలు ఉన్న కెరీర్ రాజకీయవేత్త.

ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన చౌదరి తయ్యబ్ హుస్సేన్ మేవత్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రజా వేదికలలో వినిపించడం మరియు మియో/Meo కమ్యూనిటీ డిమాండ్లను చట్టసభలలో లేవనెత్తడమే కాకుండా పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు మరియు మియో కళాశాలలో ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించి మీయో ప్రజలను ముందు నుండి నడిపించాడు,

తయ్యబ్ హుస్సేన్ తండ్రి చౌదరి యాసిన్ ఖాన్, రెహ్నా గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు, కానీ కృషి మరియు దృఢ సంకల్పంతో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ మరియు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో అద్యయనం చేసి  స్వాతంత్య్రం రాకముందు లాహోర్‌లో లా ప్రాక్టిస్ చేసారు.

మీయో సముదాయం/Meos  నాయకుడిగా, చౌదరి యాసిన్ ఖాన్ బ్రెయిన్* మియో పాఠశాల ఏర్పాటు లో ప్రముఖ పాత్ర వహించారు. 'ప్రతి రెండు మైళ్ల దూరంలో పాఠశాల' ఏర్పాటు అనేది యాసిన్ ఖాన్ ఆశయం. చౌదరి యాసిన్ ఖాన్ యూనియనిస్ట్ పార్టీ సభ్యుడు మరియు అవిభక్త పంజాబ్ అసెంబ్లీలో సుదీర్ఘకాలం శాసనసభ్యుడు మరియు మియోస్ యొక్క ఏకగ్రీవ నాయకుడు.

స్వాతంత్ర్యం తరువాత, హింస మరియు భయం వాతావరణం ప్రబలినప్పుడు  చౌదరి యాసిన్ ఖాన్  గాంధీని మేవాత్ కు తీసుకువచ్చారు . గాంధి అక్కడి మియో సముదాయ ప్రజలను శాంతియుతంగా ఉండమని పిలుపునిచ్చారు. చౌదరి యాసిన్ ఖాన్ కాంగ్రెస్‌లో చేరారు మరియు 1950 ల ప్రారంభంలో పంజాబ్‌ శాసన  సభ లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తండ్రి చౌదరి యాసిన్ ఖాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు తయాబ్ హుస్సేన్ స్వాతంత్య్రానంతర భారతదేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట, తయాబ్ హుస్సేన్ అవిభక్త పంజాబ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తరువాత పంజాబ్ నుండి హర్యానా వేరుచేయబడినది.

ఆ తరువాత, తయ్యబ్ హుస్సేన్ రాజస్థాన్ మరియు హర్యానా అసెంబ్లీలకు కూడా ఎన్నికయ్యారు.. వాస్తవానికి చౌదరి తయాబ్ హుస్సేన్ మూడు రాష్ట్రాలలో(పంజాబ్, హర్యానా మరియు రాజస్తాన్) మంత్రిగా ఉన్నారు. ఇది ఒక ప్రత్యేక రికార్డు..

మూడు రాష్ట్రాల అసెంబ్లీలలో సభ్యుడిగా ఉండటమే కాకుండా తయ్యబ్ హుస్సేన్ రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తయ్యబ్ హుస్సేన్ కొంతకాలంగా విశాల్ హర్యానా పార్టీతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, ఎక్కువ కాలం కాంగ్రెస్‌తోనే ఉన్నారు. చౌదరి తయ్యబ్ హుస్సేన్  కు  విశేష రాజకీయ రాజకీయ అనుభవం కలదు..

అలీగఢ్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత  తయ్యబ్   హుస్సేన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రెండుసార్లు పనిచేశారు మరియు న్యూ ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు.

తయ్యబ్ హుసేన్ కేవలం 26సంవత్సరాల వయస్సులో  పంజాబ్‌లోని ప్రతాప్ సింగ్ కైరాన్ ప్రభుత్వంలో ఆరోగ్య మరియు పిడబ్ల్యుడి డిప్యూటీ మినిస్టర్‌గా పనిచేసారు.  1965 లో పంజాబ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అయ్యారు. 1966 లో, పంజాబ్ నుండి విడిపోయి నూతనంగా ఏర్పడిన రాష్ట్రం హర్యానా లో అసెంబ్లీ సభ్యుడయ్యారు.

తయ్యబ్ హుస్సేన్ తండ్రి, యాసిన్ ఖాన్ 1970 లో మరణించారు. నివాళి అర్పించడానికి నూహ్ వద్ద సుమారు లక్ష మంది ప్రజలు సమావేశమయ్యారు. అక్కడ, వారు తయ్యబ్ హుస్సేన్‌కు 36 'బిరదిరిస్'  యొక్క చౌదరి గా “ పగ్రి" ని ప్రదానం చేశారు, ఆ తర్వాత మేవాత్ ప్రాంతానికి చౌదరి (సోషల్ హెడ్) మరియు ప్రపంచవ్యాప్తంగా మియో కమ్యూనిటీ ప్రతినిధి అయ్యారు.

చౌదరి తయాబ్ హుస్సేన్ తండ్రి యాసిన్ ఖాన్ కి తగిన వారసుడు, సామాజిక, విద్యా మరియు రాజకీయ రంగాలలో మియోMEOసమాజానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు.

1971లో చౌదరి తయాబ్ హుస్సేన్ కాంగ్రెస్ టికెట్‌పై గుర్గావ్ స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత 1980 లో, ఫరీదాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1993 లో, రాజస్థాన్ నుండి మరోసారి ఎన్నికయ్యాడు.రాజస్థాన్‌లో కూడా చౌదరి తయాబ్ హుస్సేన్ మంత్రి అయ్యారు మరియు వ్యవసాయం, ఆరోగ్యం మరియు గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించారు. యాసిన్ మియో కళాశాల నూహ్, మేవాత్ /Mewat లో ఉంది. చౌదరి తయాబ్ హుస్సేన్ ప్రయత్నాల కారణంగా ఇది ఒక పెద్ద సంస్థగా మారింది.

హుస్సేన్ తన మరణం వరకు ఆల్ ఇండియా మేవాతి పంచాయితీ, మేవాత్  ఎడ్యుకేషన్ బోర్డ్ మరియు గవర్నింగ్ బాడీ మరియు యాసిన్ మియో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

చౌదరి తయ్యబ్ హుస్సేన్ 7 అక్టోబర్ 2008 న హర్యానాలోని గుర్గావ్‌లో మరణించారు.

చౌదరి తయ్యబ్ హుస్సేన్ కు ఇద్దరు కుమారులు-Ch. జాకీర్ హుస్సేన్ (MLA Nuh) మరియు Ch. తిజారా (రాజస్థాన్) స్థానం నుంచి పోటీ చేస్తున్న ఫజల్ హుస్సేన్ మరియు ఒక కుమార్తె జైదా ఖాన్ (ఎమ్మెల్యే కమాన్) కలరు.

 

 

 

 

 

No comments:

Post a Comment