19 August 2021

ఇమాం హుస్సేన్(ర) బలిదానం నుండి సందేశం The message from the martyrdom of Hussain

 



 

 

ప్రవక్త యొక్క ప్రియమైన మనవడు సయ్యద్నా హుస్సేన్ ఇబ్న్ అలీ చూపిన అత్యుత్సాహం, సంతృప్తి, ధైర్యం మరియు న్యాయమైన కారణం కోసం చేసిన అతడు చేసిన బలిదానం చిరస్మరణియం..హుస్సేన్(ర) చేసిన త్యాగం, చూపిన ధైర్యం ఇస్లాం జీవన విధానికి నిదర్శనం.

చారిత్రక మూలాల ప్రకారం 60AH-600 AD లో యాజీద్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రవక్త మొహమ్మద్ (PBUH) యొక్క ప్రియమైన, సయ్యద్నా హుస్సేన్ ఇబ్న్ అలీ(ర) నిరంకుశ పాలకుడు యాజిద్ మరియు అతని పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారు మరియు ప్రవక్త ఇబ్రహీం PBUH మరియు ప్రవక్త ముహమ్మద్ PBUH అడుగుజాడలను అనుసరించి అతనికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. అన్యాయం, దౌర్జన్యం మరియు అణచివేతకు వ్యతిరేకంగా ముందుకు సాగారు.

నిరంకుశత్వం మరియు అసత్యానికి వ్యతిరేకంగా హుస్సేన్(ర) చూపిన వైఖరిని ఈ రోజు వరకు అన్ని వర్గాల మానవులు గుర్తుంచుకుంటారు, కర్బాలాలో హుస్సేన్(ర) మరియు అతని కుటుంబంలోని 72మంది సభ్యులు అమరవీరులుగా మారడానికి ఇదే కారణం. సత్యం మరియు న్యాయం కోసం హుస్సేన్ (ర)ఎల్లప్పుడూ స్ఫూర్తిగా మారాడు. కర్బాలాలో హుస్సేన్ (ర)చూపిన మార్గంలో ప్రజలు సంతోషంగా నడుస్తారు. కర్బాలాలో హుస్సేన్ (ర)త్యాగం ప్రజలకు నిజం, న్యాయం మరియు ధైర్యం గురించి లెక్కలేనన్ని పాఠాలు నేర్పింది. ఇది అన్యాయం మరియు అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టింది.ఇది ప్రవచనాత్మక సంప్రదాయం/సున్నత్  కూడా. కర్బలా అమరవీరుల సందేశం న్యాయమైన మరియు గొప్ప లక్ష్యం కోసం ధైర్యంగా పోరాడాలి అనే సందేశాన్ని ఇస్తుంది.

 

నిస్సందేహంగా, ప్రవక్త ఇబ్రహీం PBUH, ప్రవక్త ఇస్మాయిల్ PBUH మరియు హుస్సేన్ ఇబ్న్ అలీ(ర) చేసిన గొప్ప త్యాగాలు మానవ చరిత్రలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని మరియు విలువను కలిగి ఉంటాయి. ఈ త్యాగాలు అసమానం.  యాజిద్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడాలని హుస్సేన్(ర) తీసుకున్న నిర్ణయం ఇస్లామిక్ సంప్రదాయాలకు అనుగుణంగా ఉంది. హుస్సేన్(ర) యజీద్‌కు వ్యతిరేకంగా నిలబడి, నిరంకుశ పాలకుడికి విధేయత చూపకపోవడం అనేది ఒక ముస్లిం ఎప్పుడూ అబద్ధం చెప్పడు మరియు నిరంకుశత్వంన లొంగడు అనే విషయాన్నీ స్పష్టపరుస్తుంది. నిజాయితీపరులు మరియు నీతిమంతులు నిరంకుశులకు తలవంచడం కంటే చనిపోవడానికి ఇష్టపడతారు.

ప్రస్తుత కాలంలో, హుస్సేన్ ఇబ్న్ అలీ(ర) బోధనలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం, హుస్సేన్ (ర)బోధనలు ఒక నిర్దిష్ట వర్గం లేదా మతం వ్యక్తుల కోసం కాకుండా అందరు మానవుల కోసం ఉద్దేశించబడినవి..  హుస్సేన్(ర) బలిదానం మరియు త్యాగాల వెనుక ఉన్న తత్వాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటే, ప్రతి ఒక్కరూ హుస్సేన్‌(ర)ను తమలో ఒకరుగా భావిస్తారు.  ప్రతి ఒక్కరూ అతనితో గుర్తింపు పొందాలని కోరుకుంటారు. హుస్సేన్(ర), బోధనలు మరియు సందేశం గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయడం కూడా మనoదరి  బాధ్యత.

మనం నీతిమంతులుగా, విశ్వాసకులుగా మరియు న్యాయంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. సమాజ అభివృద్ధికి మరియు నిజం మరియు న్యాయం ఉన్న సమాజాన్ని స్థాపించడానికి కృషిచేయాలి.  

 


 

No comments:

Post a Comment