21 October 2021

రేష్మా నీలోఫర్ నహా: ప్రపంచంలో మొట్టమొదటి మహిళా రివర్ పైలట్ Reshma Nilofer Naha: World’s First Woman River Pilot

 



 

బలమైన పట్టుదల మరియు దృఢసంకల్పం రేష్మా నీలోఫర్ నహా   ను ప్రపంచంలోనే మొదటి మహిళా రివర్ పైలట్‌గా చేసింది.

చెన్నై కు చెందిన రేష్మ తన పాఠశాల విద్య అనంతరం చెన్నైలోని అకాడమీ ఆఫ్ మారిటైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (AMET) నుండి మెరైన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సును అభ్యసించింది. కోర్సు పూర్తయిన తర్వాత, రేష్మ ప్రయాణీకుల నౌకలు మరియు కంటైనర్ షిప్‌లలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించింది. రేష్మ దాదాపు ఆరున్నర సంవత్సరాలు కోపిటి KoPT (కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్) లో కష్టపడి పనిచేసి, కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది మరియు 2018 లో అదే పోర్టులో ఫుల్ టైం మారిటైమ్  పైలట్‌గా పోస్ట్ చేయబడింది.

 

రివర్ పైలట్‌గా తన పాత్రను వివరిస్తూ రేష్మా ఒక నౌకను సురక్షితంగా మార్గనిర్దేశం చేయడం మారిటైమ్ పైలట్ విధి . ఉద్యోగానికి విపరీతమైన శారీరక మరియు మానసిక బలం అవసరం” అని అన్నారు. రివర్ పైలట్‌గా తన ప్రయాణం అంత సులభం కాదని రేష్మా అన్నది. మెరైన్ పైలట్ ఉద్యోగం చాలా కీలకం అని ఆమె వివరించారు. రివర్ పైలట్ అనేక సవాళ్లను ఎదుకోనవలసి ఉంటుంది ఇందుకు మంచి ఫిజికల్ ఫిట్‌నెస్ ఆవశ్యకత అవసరమని రేష్మా అన్నారు.

 

”నారీ శక్తి పురస్కార్” గ్రహీత గా చాలా మంది నుండి ప్రశంసలు గెలుచుకుని, పూర్తి విధేయతతో రేష్మా తన విధులను నిర్వర్తిస్తున్నారు.   

 

No comments:

Post a Comment