26 October 2022

అత్యంత ప్రముఖ ఒట్టోమన్ ట్రావెల్ రైటర్ ఎవ్లియా సెలెబి 1611 - 1682 Most prominent Ottoman travel writer Evliya Celebi 1611 – 1682

 

మధ్య యుగాలలో మధ్యప్రాచ్యంలో విస్తారమైన భూభాగాల మీదుగా ప్రయాణం, వాణిజ్యం మరియు  మతపరమైన తీర్థయాత్ర అనేది జీవితంలో అవసరమైన భాగం. సిల్క్ రోడ్ మరియు దాని అనుభంద రహదారుల మీదుగా ముస్లిం వాణిజ్యం అభివృద్ధి చెందింది. వాణిజ్యం  మధ్యప్రాచ్యాన్ని, తూర్పున ఉన్న భారతదేశం మరియు చైనా వంటి భూభాగాలకు అనుసంధానించింది. మధ్యధరా సముద్రంలో షిప్పింగ్ మార్గాల ద్వారా యూరోపియన్లతో వాణిజ్యం మరియు సాంస్కృతిక పరస్పర చర్య కూడా జరిగింది.

మధ్యయుగపు ఇస్లామిక్ యాత్రికుల అనుభవాలను  వివరించే అనేక ట్రావెల్‌లాగ్‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది మధ్యయుగపు టర్కి యాత్రికుడు ఎవ్లియా సెలెబి రచించిన “సెయాహత్నామే” ("బుక్ ఆఫ్ ట్రావెల్") ప్రముఖమైనది.

ఎవ్లియా సెలెబి Evliya Celebi(ఒట్టోమన్ టర్కిష్: اوليا چلبى) (ఫ్రెంచ్‌లో తెహేలేబి/Tchelebi ఆంగ్లంలో చలాబి/చలాబి)17వ శతాబ్దపు అత్యంత ప్రముఖ ఒట్టోమన్ అన్వేషకుడు మరియు యాత్రికుడు. ఇతర దేశాల  భాష మరియు సంస్కృతి తెలుసుకోవాలనే మక్కువ తో  సెలెబి ఇస్తాంబుల్ నుండి తన ప్రయాణం మొదలు పెట్టి  ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు పొరుగు దేశాలలో తన వ్యాఖ్యానాన్ని రికార్డ్ చేస్తూ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణ జీవితంలో, సెలెబి యూరప్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాన్నివిస్తృతంగా  సందర్శించాడు. ఎవ్లియా సెలెబి తను రాసిన “సెయాహత్నామే” ("బుక్ ఆఫ్ ట్రావెల్") అని పిలువబడే ఒక ట్రావెలాగ్  కి ప్రసిద్ధి చెందాడు.

1611లో జన్మించిన డెర్విస్ మెహ్మద్ జిల్లీ, తన బాల్యాన్ని మతపరమైన భక్తితో  దివ్య ఖురాన్ నేర్చుకుంటూ గడిపాడు. డెర్విస్ మెహ్మద్ జిల్లీ కి  ఎవ్లియా సెలెబి Evliya Celebi అనే బిరుదు కలదు.  ఎవ్లియా సెలెబి అనగా  ""పెద్దమనిషి" లేదా "దేవుని మనిషి" అని అర్థం.

ఎవ్లియా సెలెబి 1611లో కాన్‌స్టాంటినోపుల్‌లో కుతాహ్యాకు చెందిన సంపన్న కుటుంబంలో జన్మించారు.సెలెబి ఒట్టోమన్ సుల్తాన్‌లకు ఆభరణాలను అమ్మే  వ్యాపారి యొక్క కుమారుడు. ఎవ్లియా సెలెబి ఇంపీరియల్ ఉలమా (పండితులు) నుండి విద్యను పొందారు.12 సంవత్సరాల వయస్సులో సెలెబి తెలివితేటలు మరియు భాషా నైపుణ్యాలు అతన్ని సుల్తాన్ మురాద్ IV యొక్క ఆస్థాన ఇమామ్‌కు శిష్యునిగా చేసాయి.

ఎవ్లియా సెలెబి దివ్య ఖురాన్‌ను పఠించగలడు మరియు 'ఉమర్ గుల్షాని' అనే ప్రసిద్ధ ఖల్వతి డెర్విష్ దగ్గిర విద్యార్థిగా గాత్ర మరియు వాయిద్య సంగీతాన్ని అభ్యసించారు. ఇల్మ్ అల్-ముసికి అనే సంగీత సిద్ధాంతంలో సెలెబి శిక్షణ కూడా పొందాడు. గాత్ర మరియు వాయిద్య సంగీతo లో సెలెబి నైపుణ్యాలకు సుల్తాన్ మురాద్ IV ఆస్థానం లో మంచి గుర్తింపు లబించినది.

యువకుడిగా, సెలెబి ప్రపంచాన్ని అన్వేషించే ఆసక్తిని కలిగి ఉన్నాడు. సెలెబి తన మొదటి రచనలలో విద్యావేత్తలు, వీధి ప్రదర్శనకారులు మరియు యువ ప్రేమికులతో నిండిన కాన్స్టాంటినోపుల్ యొక్క కాస్మోపాలిటన్ సందడిని వివరించాడు.

20వ పుట్టినరోజు రాత్రి, సెలెబి కి ఒక కల వచ్చింది, అందులో ముహమ్మద్ ప్రవక్త(స) తన వస్తువులను సర్దుకుని ప్రపంచాన్ని చూసేందుకు ప్రయాణానికి బయలుదేరమని సెలెబీకి సూచించాడు.

సెలెబి జర్నల్-రచన భవనాలు, మార్కెట్లు, ఆచారాలు మరియు సంస్కృతిపై నోట్స్ తీసుకోవడంతో కాన్స్టాంటినోపుల్‌లో ప్రారంభమైంది మరియు సేయాహత్నామ్ ("ట్రావెలాగ్") అనే పది-వాల్యూమ్‌ల రచించాడు.  సేయాహత్నామ్ ("ట్రావెలాగ్") ను సెలెబి మాతృభాష మరియు అధిక టర్కిష్ మిశ్రమంలో రాశాడు అందులో  సంగీత వాయిద్యాలపై రెండు అధ్యాయాలు కుడా ఉన్నాయి.

 ఎవ్లియా సెలెబి ప్రయాణాలు:

ఆసియా లో పర్యటనలు:

బాకులోని చమురు వ్యాపారుల గురించి సేలెబి వ్రాశాడు: చమురు వ్యాపారం నుండి వచ్చే ఆదాయాలు ఏటా నేరుగా సఫావిద్(ఇరాన్) షాకు అందజేయబడతాయి.

సర్కాసియా పర్యటన:

సెలెబి 1640లో సిర్కాసియాకు కూడా ప్రయాణించాడు. సెలెబి అక్కడి మహిళల అందం గురించి వ్యాఖ్యానించాడు మరియు ముస్లిం దేశం అయినప్పటికీ మసీదులు మరియు బజార్లు లేకపోవడం గురించి మాట్లాడాడు. సిర్కాసియన్ల ఆతిథ్యం గురించి మాట్లాడాడు మరియు సిర్కాసియన్ భాష క్లిష్టమైనదని, తానూ  రాయలేడని పేర్కొన్నాడు.

క్రిమియన్ ఖానేట్ సందర్శన:

సెలెబి ప్రారంభ ప్రయాణాలలో క్రిమియన్ ఖానేట్ సందర్శన ఒకటి.  క్రిమియన్ ఖానేట్ లో సెలెబి సందర్శించిన అనేక పట్టణాలు కోసాక్స్‌చే ప్రభావితమయ్యాయి మరియు అరబాత్‌లోని ఒట్టోమన్ కోట మాత్రమే సురక్షితమని అన్నాడు.

సెలెబి క్రిమియన్ ఖానేట్ లోని  బానిస వ్యాపారం చేసే మార్కెట్‌లను వివరించాడు: ఈ మార్కెట్‌ను చూడని వ్యక్తి ఈ ప్రపంచంలో దేనినీ చూడలేదు.ఇక్కడ ఒక తల్లి తన కొడుకు మరియు కుమార్తె నుండి వేరు చేయబడి, ఒక కొడుకు తన తండ్రి మరియు సోదరుడి నుండి వేరు చేయబడి, సహాయం కోసం ఏడుపు మరియు దుఃఖం మధ్య విక్రయించబడతారు.”అక్కడ సెలెబి స్వయంగా కొందరు బానిసలను కొన్నాడు,  కానీ నల్ల సముద్రం తీరంలో ఓడ ప్రమాదంలో బానిసలను  కోల్పోయాడు మరియు అతి కష్టం మీద సెలెబి ప్రాణాలతో బయటపడ్డాడు.

క్రిమియాలో దాదాపు 400,000 మంది బానిసలు ఉన్నారని, అయితే కేవలం 187,000 మంది స్వేచ్ఛా ముస్లింలు మాత్రమే ఉన్నారని సెలెబి అంచనా వేసింది

కొసావో పర్యటన :

1660లో సెలెబి  కొసావోకు వెళ్లి ఆ ప్రాంతం యొక్క మధ్య భాగాన్ని అర్నావుడ్ Arnavud (آرناوود)గా పేర్కొన్నాడు మరియు వుచిత్ర్న్‌Vučitrn లో దాని నివాసులు అల్బేనియన్ లేదా టర్కిష్ మాట్లాడేవారని మరియు కొంతమంది బోస్నియన్ మాట్లాడేవారని పేర్కొనాడు. కొసొవో లోని బౌగోళిక పరిస్థితులను సవివరంగా వివరించాడు.

అల్బేనియా పర్యటన:

1662లో సెలెబి అల్బేనియా అంతటా, 3సార్లు విస్తృతంగా పర్యటించినాడు.  టిరానా, లేజా, ష్కోడ్రా మరియు బుషాట్, డెల్వినా, గ్జిరోకాస్ట్రా, టెపెలెనా, స్క్రాపర్, పర్మెట్, బెరట్, కనీనా, వ్లోరా, బష్టోవా, డ్యూరెస్, కవాజా, పెకిన్, ఎల్బాసన్, పోగ్రాడెక్, కవాజా ​​మరియు డ్యూర్రే (Tirana, Lezha, Shkodra and Bushat in 1662, Delvina, Gjirokastra, Tepelena, Skrapar, Përmet, Berat, Kanina, Vlora, Bashtova, Durrës, Kavaja, Peqin, Elbasan, Pogradec, Kavaja and Durrës) లను సందర్శించాడు

బోస్నియా యాత్ర:

సెలెబి మరొక పర్యటనలో బోస్నియాలోని నెరెత్వా నదిపై  ఒట్టోమన్ వాస్తుశిల్పి మిమర్ హేరుద్దీన్ నిర్మించిన ప్రసిద్ధ స్టారి మోస్ట్ వంతెనను దర్శించాడు. స్టారి మోస్ట్ లేదా మోస్టార్ బ్రిడ్జ్ నిర్మాణం సేలిబిని మంత్రముగ్దులను చేసింది, సెలెబి మాటలలో నేను, 16 దేశాల గుండా ప్రయాణించాను  కానీ నేను ఇంత ఎత్తైన వంతెనను ఎప్పుడూ చూడలేదు. అది ఆకాశమంత ఎత్తులో ఉంది.” అన్నాడు.

క్రొయేషియా యాత్ర:

ఒట్టోమన్ సామ్రాజ్యంలోని దక్షిణ స్లావిక్ ప్రాంతాలలో అనగా సెలెబి ఆధునిక క్రొయేషియాలోని ఉత్తర డాల్మాటియా, స్లావోనియాలోని కొన్ని ప్రాంతాలు, మెడిముర్జే మరియు బనిజాతో సహా వివిధ ప్రాంతాలను తన ప్రయాణాలలో సందర్శించాడు. అక్కడ సెలెబి అతను వివిధ రకాల హిస్టోరియోగ్రాఫిక్ మరియు ఎథ్నోగ్రాఫిక్ మూలాలను నమోదు చేశాడు

1663లో జర్మనీ గుండా మరియు హాలండ్‌లోకి ప్రయాణిస్తూ సిలెబి,  రోటర్‌డామ్ లో  స్థానిక అమెరికన్లను కలుసుకున్నాడని చెప్పబడింది. వారిద్వారా అమెరికా ఖండం లో స్థానిక అమెరికన్ల జీవన పరిస్థితులను తెలుసుకొన్నాడు.

1665-66లో వియన్నాను సందర్శించినప్పుడు, సెలెబి జర్మన్ మరియు పర్షియన్ భాషలలోని పదాల మధ్య కొన్ని సారూప్యతలను గుర్తించి ఇండో-యూరోపియన్ భాషలుగా పిలవబడే వాటి మధ్య సంబంధాన్ని ముందస్తుగా పరిశీలించారు.

సెలెబి క్రీట్‌ను సందర్శించారు మరియు అతని పుస్తకం IIలో చానియా పై టర్కీసుల్తాన్‌ విజయం గురించి వివరిస్తుంది; పుస్తకం VIIIలో సెలెబి కాండియా విజయయాత్రను  వివరించాడు

పార్థినాన్ పర్యటన:

1667లో సెలెబి పార్థినాన్ శిల్పాలపై తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు మరియు పార్థినాన్ భవనాన్ని " ఎల్లకాలం నిలబడే దుర్భేద్యమైన కోటలాగా" వర్ణించాడు.

సిరియా మరియు పాలస్తీనా పర్యటన:

17వ శతాబ్దంలో అనేక యూరోపియన్ మరియు కొందరు యూదుల సిరియా మరియు పాలస్తీనా ట్రావెలాగ్‌లకు విరుద్ధంగా ఇస్లామిక్ దృక్కోణం నుండి వివరణాత్మక యాత్రా కథనo  సెలెబి రాశారు.సెలెబి 1649లో ఒకసారి మరియు 1670-71లో ఒకసారి పాలస్తీనాను మొత్తం రెండుసార్లు సందర్శించారు. పాలస్తీనా లేదా "ల్యాండ్ ఆఫ్ పాలస్తీనా"కు సంబంధించి సెలెబి ఎవ్లియా ఇలా పేర్కొన్నాడు, "అన్ని చరిత్రలు ఈ దేశాన్ని పాలస్తీనా అని పిలుస్తాయి.

సెలెబి తన ప్రయాణాలలో  మంత్రగత్తెలు మరియు నావికులు, పాములను ఆడించేవారు మరియు యోధులను కలిసినట్లు చెబుతారు

సెలెబి ప్రతి యాత్రా కథనం అతను ఎదుర్కొన్న వివిధ భాషల  ఒక చక్కని పదబంధ పుస్తకం phrasebook తో ముగుస్తుంది. ఇందులో సంఖ్యల నుండి అక్కడి  వ్యక్తుల వ్యక్తిగత  జీవితం లోని అన్ని వివరాలు ఉన్నాయి.

ఎవ్లియా సెలెబి రచించిన “సేయాహత్నామ్” యొక్క అనేక వర్ణనలు అతిశయోక్తి పద్ధతిలో వ్రాయబడినప్పటికీ అది 17వ శతాబ్దపు ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క సంస్కృతి మరియు జీవనశైలికి ఉపయోగకరమైన మార్గదర్శకంగా ఉన్నాయి.మొదటి సంపుటం ఇస్తాంబుల్‌తో ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది, చివరి వాల్యూమ్ ఈజిప్ట్‌తో ఉంటుంది.

ఎవ్లియా తాను ప్రయాణించిన ప్రతి ప్రాంతంలోని భాషల నమూనాలను సేకరించినందుకు ప్రసిద్ది చెందాడు. సెయాహత్నామ్‌లో దాదాపు 30 టర్కిక్ మాండలికాలు మరియు భాషలు జాబితా చేయబడ్డాయి. సెలేబి జర్మన్ మరియు పెర్షియన్ నుండి అనేక పదాల మధ్య సారూప్యతలను పేర్కొన్నాడు,

దశాబ్దాల ప్రయాణం తర్వాత, ఎవ్లియా సెలెబి చివరికి కైరోలో స్థిరపడ్డారు. అక్కడ సెలెబి 1684లో మరణించాడు. ఎవ్లియా సెలెబి ఆ సమయంలో ఇస్తాంబుల్ లేదా కైరోలో ఉన్నాడా అనేది అస్పష్టంగా ఉంది.

కుటాహ్యాలోని ఎవ్లియా సెలెబి ఇల్లు, ఇప్పుడు మ్యూజియంగా ఉపయోగించబడుతుంది.

“సేయహత్నామ్” యొక్క 10 సంపుటాలు:

ఎవ్లియా సెలెబి తన సేయహత్నామ్ యొక్క 10 సంపుటాలలో, క్రింది ప్రయాణాలను వివరించాడు:

1. కాన్స్టాంటినోపుల్ మరియు పరిసర ప్రాంతాలు (1630)

2. అనటోలియా, కాకసస్, క్రీట్ మరియు అజర్‌బైజాన్ (1640)

3. సిరియా, పాలస్తీనా, అర్మేనియా మరియు రుమేలియా (1648)

4. కుర్దిస్తాన్, ఇరాక్ మరియు ఇరాన్ (1655)

5. రష్యా మరియు బాల్కన్స్ (1656)

6. నాల్గవ ఆస్ట్రో-టర్కిష్ యుద్ధం (1663/64) సమయంలో హంగేరిలో సైనిక ప్రచారాలు

7.రెండవసారి ఆస్ట్రియా, క్రిమియా మరియు కాకసస్ (1664)

8 గ్రీస్ మరియు రెండవసారి క్రిమియా మరియు రుమేలియా (1667–1670)

9.మక్కాకు హజ్ (1671)

10.ఈజిప్ట్ మరియు సూడాన్ (1672)

సెలెబి రచనలు 50 సంవత్సరాల తర్వాత కనుగొనబడ్డాయి మరియు వాటిని ఇస్తాంబుల్‌కు ప్రచురణకు  తీసుకువెళ్లారు. ప్రస్తుతం మొత్తం సేయాహత్ పేరు యొక్క ఆంగ్ల అనువాదం లేదు, అయినప్పటికీ వివిధ భాగాల అనువాదాలు ఉన్నాయి. పొడవైన సింగిల్ ఇంగ్లీష్ అనువాదం జోసెఫ్ వాన్ హామర్-పర్గ్‌స్టాల్ అనే ఆస్ట్రియన్ ఓరియంటలిస్ట్ ద్వారా 1834లో ప్రచురించబడింది: ఇది "ఎవ్లియా ఎఫెండి" పేరుతో కనుగొనబడింది.

సెలెబి రచనలు ఇప్పటికీ పూర్తిగా ఆంగ్లంలోకి అనువదించబడనప్పటికీ, 2010లో డాంకాఫ్ మరియు సూయోంగ్ కిమ్ యొక్క పది సంపుటాల ఎంపిక సారాంశాల అనువాదం “యాన్ ఒట్టోమన్ ట్రావెలర్: బుక్ ఆఫ్ ట్రావెల్స్ ఆఫ్ ఎవ్లియా సెలెబి

 An Ottoman Traveller: Selections from the Book of Travels of Evliya Celebi    గా ప్రచురితమై  ఉంది

కాని కొందరు చరిత్రకారుల ప్రకారం  సెలెబి యొక్క అనేక వివరణలు స్పష్టమైన కల్పితాలు. సేలిబి  రచనలలో  మధ్యయుగ అనంతర యూరోపియన్ మరియు మధ్యప్రాచ్య జీవితంలో ధృవీకరించబడని వివరాలు ఉన్నాయి. సేలెబి ఇతర సందేహాస్పద అనుభవాలలో 40,000 మంది తాతర్లు ఉత్తర ఐరోపాపై దాడి చేశారన్న కథనo  ఉంది, దీనికి చారిత్రక రుజువు లేదు.

లెగసి:

·       ఆధునిక స్కోప్జేSkopjeలోని ఒక  వీధికి  ఎవ్లిజా సెలెబిజా (ఎవ్లియా సెలెబి) అని నామకరణం జరిగింది.

·       సెలెబి ప్రస్తావన ఓర్హాన్ పాముక్ యొక్క 1985 నవల “ది వైట్ కాజిల్‌” లో కనిపిస్తుంది మరియు స్లోవాక్ రచయిత జురాజ్ సెర్వెనాక్ రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ కెప్టెన్ బాథోరీ” (డోబ్రోడ్రుస్త్వా కపిటానా బాథోరిహో) నవలల్లో కనిపించింది.

·       సెలెబి యొక్క సాహసాల గురించి టర్కిష్ లో పూర్తి నిడివి కల  పిల్లల యానిమేషన్ చిత్రం రుపొందబడినది.

·       UNESCO వార్షికోత్సవాల వేడుకల టైమ్‌టేబుల్‌లో సెలెబి పుట్టిన 400వ వార్షికోత్సవాన్ని చేర్చింది.

 

No comments:

Post a Comment