27 October 2022

నషీద్ -నూతన తరం ఇస్లామిక్ హలాల్ సంగీత పాటలు - ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నవి.

 



ఎడమ నుండి కుడికి  నషీద్ కళాకారులు: ఒమర్ ఈసా, మహర్ జైన్, సమీ యూసుఫ్ మరియు జైన్ భిఖా.

 

ఇస్లామిక్ విశ్వాసాలు, చరిత్ర మరియు ధార్మికత నషీద్‌లలో భాగాలు.  నషీద్ పాటలను ఉర్దూ, టర్కిష్, మలయ్ మరియు అరబిక్ భాషలలో ఆన్‌లైన్‌లో వినవచ్చు. నషీద్ గీతాలు/ట్రాక్‌లు ఉల్లాసంగా, ప్రేరణాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటాయి.

బ్రిటీష్-పాకిస్తానీ నషీద్ కళాకారుడు ఒమర్ ఈసా యొక్క 'అల్లా అండ్ హిస్ బిలవ్ద్ Allah and his Beloved ' మిలియన్ల మంది వీక్షణలను పొంది గత సంవత్సరం మ్యూజిక్ స్టోర్ iTunes UK చార్ట్‌లో మూడవ స్థానాన్ని పొందింది. ఒమర్ ఈసా తన ఆల్బమ్ “మై ముస్లిం ఫ్యామిలీ”తో iTunes ప్రపంచవ్యాప్త చార్ట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకోన్న  నాలుగు సంవత్సరాల లోపే ఈసా యొక్క ఈ సరికొత్త ఆల్బం విజయం పొందినది.

ఒమర్ ఈసా ఇలా అన్నారు, “ఒక మిత్రుడు నాకు నషీద్‌లను పరిచయం చేశాడు, అవి వోకల్  ఇస్లామిక్ పాటలు. నేను నా మొదటి నషీద్‌ను 2011 చివరలో పాడాను. ముస్లింలకు హలాల్ సంగీతాన్ని అందించడమే నా ప్రేరణ. ట్రాక్‌లు ఉల్లాసంగా, ప్రేరణాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నాయి.

ఒమర్ ఈసా అభిప్రాయం లో "సంగీతం ఏదైనా చేయగలదు, వాయిస్ కూడా చేయగలదు - నా వాయిస్ నా పరికరం". గత కొన్ని సంవత్సరాలుగా, ఒమర్ ఈసా అద్భుతమైన ప్రతిభావంతులైన సంగీతకారులతో విజయవంతంగా పోటీ పడగలిగాడు మరియు ప్రత్యామ్నాయ సంగీత బ్రాండ్‌ (హలాల్ సంగీతాన్ని) అందించాడు.

'ఛంట్స్ chants ' కు సమాన అరబిక్ పదం నషీద్ . ఇది గాత్ర సంగీతం.  నషీద్ అనగా నైతిక మరియు మతపరమైన పారాయణాలు, సంగీత వాయిద్యాలతో/లేకుండా వివిధ రాగాలలో పఠిస్తారు. నషీద్ లోని సాహిత్యం సాధారణంగా ఇస్లామిక్ విశ్వాసాలు, చరిత్ర మరియు మతాన్ని సూచిస్తాయి.

నషీద్‌లు సంవత్సరాలుగా రూపాంతరం చెందాయి. చాలా మంది ఆధునిక నషీద్ కళాకారులు నాన్-అరబ్స్ . వీరు  వివిధ భాషలలో పాడతారు. ఇంగ్లీష్, మలయ్, ఉర్దూ లేదా టర్కిష్ భాషలలో సులభంగా నషీద్ లను పడవచ్చు.. నషీద్ పాడే వారు తమ అద్వితీయ స్వర నైపుణ్యం మరియు భక్తి కవిత్వం యొక్క లిరిక్స్  తో ప్రజలను ఆకర్షించారు.

పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లింలు ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా ఉంటారు. ధార్మికంగా ఖురాన్ పఠనం ద్వారా మరియు సంగీతం స్థానంలో నషీద్‌లతో  ఎక్కువ నిమగ్నమై ఉంటారు.  నషీద్‌లకు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది  ఒక కారణం.

ఇస్లామిక్ సంగీత శైలిలో అతిపెద్ద పేర్లలో ఒకటి  స్వీడిష్ నషీద్ కళాకారుడు మహర్ జైన్.  ఈ తరంలోని  అనేక ఇతర నషీద్ కళాకారుల: సమీ యూసుఫ్, బ్రిటిష్ గాయకుడు మరియు వాయిద్యకారుడు. దక్షిణాఫ్రికా కు చెందిన జైన్ భిఖా,  యూసుఫ్ ఇస్లాం (గతంలో ఇతనిని క్యాట్ స్టీవెన్స్ అని పిలుస్తారు)ఇతను అంతర్జాతీయంగా ఇంగ్లీషులో ఇస్లామిక్ పాటలు పాడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.

నషీద్ కళాకారులు ప్రపంచవ్యాప్త ముస్లిం ప్రేక్షకులను ఆకట్టుకుంటారు మరియు ఇస్లామిక్-ఆధారిత పండుగలు (మౌలిద్ వంటివి), సమావేశాలు, కచేరీలు మరియు ప్రదర్శనలలో ప్రదర్శనలు ఇస్తారు.

ఒక సంగీత అభిమాని   మాట్లాడుతూ, “నేను అతిఫ్ అస్లాం రాసిన అస్మా-ఉల్-హుస్నాని తరచుగా వింటాను. ఇది నషీద్ అని నాకు ఇప్పటి వరకు తెలియదు. అలసిపోయిన తర్వాత, నేను ఓదార్పు మరియు ప్రశాంతత కోసం నషీద్‌లు మరియు ఖవ్వాలి వైపు మొగ్గుతాను.

 “నషీద్‌లు సాధారణ పాటలకు భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి సంగీతం అవసరం లేదు. శ్రోతలు మరియు పారాయణం చేసేవారు ఉంటె చాలు.  ఎలాంటి నేపథ్య సంగీతం లేకుండా కూడా పూర్తి అనుభూతి చెందుతారు. వ్యక్తిగతంగా దీన్ని వింటున్నప్పుడు, ఉన్నత దైవిక శక్తితో కనెక్ట్ అవుతారు.

దక్షిణాసియాలో, నషీద్‌లు హమ్ద్ మరియు నాత్ రూపంలో బాగా ప్రాచుర్యం పొందాయి, ఇందులో అల్లాహ్ మరియు ప్రవక్త(స)ను స్తుతించే సాహిత్యం ఉంటుంది. నషీద్‌ శ్రోతలను ఆధ్యాత్మిక ప్రయాణంలోకి  తీసుకెళ్తున్న శబ్ద వైభవ అనుభూతిని ఇస్తుంది.

 నాకు సాహిత్యం అర్థం కాకపోయినా, నషీద్‌ నన్ను ప్రభావితం చేస్తుంది. ఇది నా హృదయాన్ని తేలిక చేస్తుంది. నాకు నిరాశ అనిపించినప్పుడల్లా అతిఫ్ అస్లాం 'ముస్తఫా జాన్ ఇ రెహ్మత్'ని లో వింటాను. ఇది వింటున్నప్పుడు, నాకు ఆశ ఇంకా  ఉన్నట్లు అనిపిస్తుంది, జీవితం ఇంకా చాలా ఉంది మరియు త్వరలోనే  అన్ని విషయాలు సాధారణ స్థితికి వస్తాయి అనే నమ్మకం కలుగు తుంది. శక్తిమంతమైన దైవిక శక్తిని వెతకాలనే ఆలోచన ఉంటుంది. అని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ విద్యార్థి అయిన వ్యోమ్ ప్రియ చెప్పారు.

అనేక సంవత్సరాలుగా, సంగీతం యొక్క ఆధ్యాత్మికరహిత  కంటెంట్‌కు ప్రత్యామ్నాయం కోసం తహతహలాడుతున్న ముస్లింల కొరకు, నషీద్‌లు సమకాలీన సంగీతo లో కొత్త ద్వారాలు తెరిచాయి.ఇవి  నషీద్ కళాకారులచే విజయవంతంగా ఉపయోగించ బడినది. 

సులభమైన ఇంటర్నెట్‌ యాక్సెస్ మరియు లభ్యత నషీద్ యొక్క గ్లోబల్ రీచ్‌ను పెంచింది. స్పోర్తిఫై, అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, పండోర Spotify, Amazon Music, Apple Music, Pandora వంటి బహుళ సంగీత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ఆగమనంతో, నషీద్ కళాకారుల కోసం మరిన్ని మార్గాలు తెరవబడుతున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు నషీద్ కళాకారులను ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడంలో సులభతరం చేస్తాయి, నషీద్  కళాకారుల కోసం విస్తృత అవకాశాలను తెరుస్తాయి.

 

NB: నషీద్ గురించి తెలుసుకోవాలంటే యు ట్యూబ్ లో nasheed అని టైపు చేసి నషీద్ వినండి.

 

 

No comments:

Post a Comment