19 October 2023

"జంగిల్ లయన్ అబూ షెరీ

 

ముస్లిం చరిత్ర పుటల్లోంచి

మీరందరూ సహారా లయన్  ఉమర్ ముఖ్తార్ పేరు తప్పక వినే ఉంటారు. ఈ రోజు జంగిల్ లయన్/ అడవి సింహం/ఒమర్ ముఖ్తార్-II గా పిలువబడే బషీర్ బిన్ సలీమ్ హర్సీ ని పరిచయం చేస్తాను.. తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో బషీర్ బిన్ సలీమ్ హర్సీ నివసించారు. బషీర్ బిన్ సలీమ్ ఒమానీ అరబ్. బషీర్ బిన్ సలీం తన కాలంనాటి  గొప్ప కవి.

జర్మన్ సైన్యం తూర్పు ఆఫ్రికాను ఆక్రమించినప్పుడు, అక్కడ ముస్లింలు మరియు ప్రజలపై దౌర్జన్యాలు చేసి, ముస్లింలను బానిసలుగా చేసి, వారి వస్తువులను/ఆస్తులను  దోచుకుని, మసీదులను అపవిత్రం చేసి ప్రజలను ఊచకోత కోసినప్పుడు, టాంజానియాకు చెందిన బషీర్ బిన్ సలీం ఆఫ్రికన్ తెగలను ఏకం చేసి 1888లో క్రీ.శ. జర్మన్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించినాడు..

బషీర్ బిన్ సలీం 20 వేల మంది ఆఫ్రికన్ తెగల సైన్యానికి నాయకత్వం వహించారు మరియు ఆఫ్రికాలోని జర్మన్ సైన్యం ను అనేక యుద్ధాలలో ఓడించారు. అబూ షెరీ చాలా కాలం పాటు జర్మన్ సైన్యాన్ని ఇబ్బంది పెట్టాడు. జర్మన్ పోస్టులు చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి మరియు సాహిలో కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని కారణంగా మధ్య ఆఫ్రికాలో ఉన్న జర్మన్ దళాలు, బెర్లిన్ నుండి సహాయం కోరవలసి వచ్చింది. ఆ తరువాత, ముస్లింల నుండి ఆఫ్రికన్ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, జర్మన్ సైన్యం టాంజానియాలోని వివిధ తీరాలలో ఓడలు మరియు ఫిరంగుల ద్వారా వివిధ ప్రాంతాలలో భారీ కాల్పులు జరిపింది మరియు ముజాహిదీన్లను జర్మన్లపై దాడి చేయకుండా నిరోధించడానికి జర్మన్ సైన్యం వివిధ ప్రదేశాలను దిగ్బంధించింది.

జర్మన్లు ​​అబూ షరీ పట్ల నమ్మక ద్రోహం చేయాలని వివిధ ఆఫ్రికన్ తెగలను బలవంతం చేశారు. దీని కారణంగా తూర్పు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలు ముస్లింల అధికారం నుండి చేజారింది. అబూ షెరీ తన తెగను రక్షించుకోవడానికి అరబ్ సైన్యం నుండి సహాయం కోరాడు.

కానీ జర్మన్ సైన్యం దేశద్రోహుల ద్వారా వివిధ ఆఫ్రికన్ తెగలపై దాడి చేసింది. అబు షెర్రీ మరియు అతని సహచరులు కొందరు తమ ప్రాణాలతో తప్పించుకొన్నారు, అయితే తిరుగుబాటును కొనసాగించడానికి యావా మరియు మ్బుగా వంశాలను ఒప్పించడంలో అబు షెర్రీ మరోసారి విజయం సాధించాడు. దారుల్ ఇస్లాం మరియు మబుగై ప్రాంతాలపై మరో దాడికి నాయకత్వం వహించడంలో అబు షెర్రీ విజయం సాధించాడు.

జర్మన్ సైనిక శక్తి ముందు ఆఫ్రికన్ తెగలు  తెగ లొంగిపోయినాయి.  అబూ షరీ ఒంటరివాడు అయినాడు.. అబూ షెర్రీ పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, తోటి గిరిజనుడు అబూ షెర్రీ కి ద్రోహం చేశాడు మరియు జర్మన్ సైన్యం అబూ షెర్రీని అరెస్టు చేశారు.

ఆ తర్వాత 1889 సెప్టెంబర్ 15న సైనిక న్యాయస్థానం అబూ షెర్రీ కి మరణశిక్ష విధించింది. అబూ షెర్రీ ని 1889 డిసెంబరు 15న పంగనిలో ఉరితీసి అక్కడే ఖననం చేశారు.

 

No comments:

Post a Comment